కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా ।
మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ ॥ 101 ॥
కాళరాత్ర్యాది శక్త్వౌఘవృతా – కాళరాత్రి మొదలైన పన్నెండు మంది శక్తి దేవతలచే పరివేష్టింపబడి యుండునది.
స్నిగ్థౌదన ప్రియా – నేతితో తడిపిన అన్నములో ప్రీతి కలది.
మహావీరేంద్ర వరదా – శ్రేష్ఠులైన ఉపాసకులకు అవసరమైన వన్నీ సమకూర్చునది.
రాకిణ్యంబా స్వరూపిణీ – రాకిణీ దేవతా స్వరూపిణి.
మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా ।
వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా ॥ 102 ॥
మణిపూరాబ్జనిలయా – మణిపూర పద్మములో వసించునది.
వదన త్రయ సంయుతా – మూడు ముఖములతో కూడి యుండునది.
వజ్రాదికాయుధోపేతా – వజ్రం మొదలైన ఆయుధములను ధరించి ఉండునది.
డామర్యాదిభిరావృతా – డామరము, ఆదిభి మొదలైన శక్తి దేవతలచే పరివేష్టింపబడి యుండునది.
రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా ।
సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ ॥ 103 ॥
రక్తవర్ణా – ఎర్రని రక్త వర్ణంలో ఉండునది.
మాంసనిష్ఠా – మాంస ధాతువును ఆశ్రయించి ఉండునది.
గుడాన్న ప్రీతమానసా – గుడాన్నములో ప్రీతి కలది.
సమస్త భక్త సుఖదా – అన్ని రకముల భక్తులకు అవసరమైన సుఖసంతోషాలను ప్రసాదించునది.
లాకిన్యంబా స్వరూపిణీ – లాకినీ దేవతా స్వరూపముగా నున్నది.
స్వాధిష్ఠానాంబు జగతా, చతుర్వక్త్ర మనోహరా ।
శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణా,ఽతిగర్వితా ॥ 104 ॥
స్వాధిష్ఠానాంబుజగతా – స్వాధిష్ఠాన పద్మములో వసించునది.
చతుర్వక్త్ర మనోహరా – నాలుగు వదనములతో అందముగా నుండునది.
శూలాద్యాయుధ సంపన్నా – శూలము మొదలైన ఆయుధములు ధరించి యుండునది.
పీతవర్ణా – పసుపు పచ్చని రంగులో ఉండునది.
అతిగర్వితా – మిక్కిలి గర్వంతో నుండునది.
మేధోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా ।
దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ ॥ 105 ॥
మేధోనిష్ఠా – మేధస్సు ధాతువును ఆశ్రయించి యుండునది.
మధుప్రీతా – మధువులో ప్రీతి కలిగినది.
బందిన్యాది సమన్వితా – బందినీ మొదలైన పరివార దేవతలచే పరివేష్టింపబడి ఉండునది.
దధ్యన్నాసక్త హృదయా – పెరుగు అన్నం ఇష్టపడునది.
కాకినీ రూపధారిణీ – కాకినీ పేరుగల దేవతగా రూపమును ధరించి ఉండునది.
మూలా ధారాంబుజారూఢా, పంచవక్త్రా,ఽస్థిసంస్థితా ।
అంకుశాది ప్రహరణా, వరదాది నిషేవితా ॥ 106 ॥
మూలాధారాంబుజారూఢా – మూలాధార పద్మములో అధివసించునది.
పంచ వక్త్రా – ఐదు ముఖములతో నుండునది.
అస్థి సంస్థితా – ఎముకలను ఆశ్రయించి ఉండునది.
అంకుశాది ప్రహరణా – అంకుశం మొదలైన ఆయుధములను ధరించి ఉండునది.
వరదాది నిషేవితా – వరదా మొదలైన నలుగురు పరివార దేవతలచే సేవింపబడునది.
ముద్గౌదనాసక్త చిత్తా, సాకిన్యంబాస్వరూపిణీ ।
ఆజ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా ॥ 107 ॥
ముద్గౌదనాసక్త చిత్తా – పులగములో ప్రీతి కలది.
సాకిన్యంబా స్వరూపిణీ – సాకినీ దేవతా స్వరూపముగా నుండునది.
ఆజ్ఞా చక్రాబ్జనిలయా – ఆజ్ఞాచక్ర పద్మంలో వసించునది.
శుక్లవర్ణా – తెలుపురంగులో ఉండునది.
షడాననా – ఆరు ముఖములు కలది.
మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా ।
హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ ॥ 108 ॥
మజ్జా సంస్థా – మజ్జా ధాతువును ఆశ్రయించి ఉండునది.
హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా – హంసవతీ, క్షమావతీ ముఖ్య శక్తులతో కూడి ఉండునది.
హరిద్రాన్నైక రసికా – పచ్చని అన్నములో మిక్కిలి ప్రీతి కలది.
హాకినీ రూపధారిణీ – హాకినీ దేవతా రూపమును ధరించి ఉండునది.
సహస్రదళ పద్మస్థా, సర్వవర్ణోప శోభితా ।
సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖీ ॥ 109 ॥
సహస్రదళ పద్మస్థా – సహస్రార కమలములో ఉండునది.
సర్వవర్ణోప శోభితా – అన్ని అక్షరాలు, అన్ని మంత్రాలు, వర్ణపటంలోని అన్ని రంగులతో శోభిల్లునది.
సర్వాయుధ ధరా – అనంతమైన అన్ని రకముల ఆయుధములను ధరించి ఉండునది.
శుక్ల సంస్థితా – శుక్ల ధాతువును చక్కగా ఆశ్రయించి ఉండునది.
సర్వతోముఖీ – సర్వతోముఖమైన ఏర్పాట్లతో నుండునది.
సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ ।
స్వాహా, స్వధా,ఽమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా ॥ 110 ॥
సర్వౌదన ప్రీత చిత్తా – అన్ని రకముల ఆహారమును ప్రీతితో స్వీకరించునది.
యాకిన్యంబా స్వరూపిణీ – యాకినీ దేవతా స్వరూపములో ఉండునది.
స్వాహా – చక్కగా ఆహ్వానించునది.
స్వధా – శరీర ధారణ ప్రక్రియకు సంబంధించిన స్వాగత వచనము.
అమతిః – మతి లేదా బుద్ధి వికసించడానికి ముందు ఉన్న స్థితిని సూచించు శక్తి.
మేధా – ఒక బుద్ధి విశేషం.
శ్రుతిః – చెవులతో సంబంధము కలిగినది.
స్మృతిః – మరల మరల గుర్తుకు తెచ్చుకొను లక్షణము.
అనుత్తమా – తనను మించిన ఉత్తమ దేవత ఇంకొకరు లేనిది.
పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।
పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ॥ 111 ॥
పుణ్యకీర్తి – మంచి లేదా పవిత్రమైన యశస్సు కలది.
పుణ్యలభ్యా – సదుద్దేశంతో చేసే పవిత్ర సత్కార్యాల వలన పొందబడునది.
పుణ్య శ్రవణ కీర్తనా – పుణ్యప్రథమైన వాక్కులను వినుటకు, కీర్తనము చేయుటకు అవకాశము కలుగజేయునది.
పులోమజార్చితా – పులోముని కూతురైన శచీదేవిచే ఆరాధింపబడింది.
బంధమోచనీ – అన్ని రకాల బంధనాల నుండి విముక్తి కలుగజేయునది.
బంధురాలకా – అందమైన చిక్కనైన ముంగురులు కలది.
విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।
సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥
విమర్శరూపిణీ – జ్ఞాన విశ్లేషణకు సంబంధించిన బిందుస్వరూపము కలది.
విద్యా – జ్ఞాన రూపిణి.
వియదాది జగత్ప్రసూ – ఆకాశము మొదలైన పంచభూతాలతో కూడిన జగత్తును సృజించునది.
సర్వవ్యాధి ప్రశమనీ – అన్ని విధములైన వ్యాధులకు ఉపశమనము కలుగజేయునది.
సర్వమృత్యు నివారిణీ – సకల మృత్యుభయాలను పోగొట్టునది.
అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।
కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥
అగ్రగణ్యా – దేవతలందరిలో ముందుగా గణింపబడేది.
అచింత్యరూపా – చింతన ద్వారా తెలుసుకొనుటకు అలవికానిది.
కలికల్మష నాశినీ – కలియుగ మలినములను పోగొట్టునది.
కాత్యాయనీ – కతుని ఆశ్రమంలో పుట్టి పెరిగింది.
కాలహంత్రీ – కాలమును హరించునది.
కమలాక్ష నిషేవితా – విష్ణుమూర్తిచే నిశ్శేషంగా సేవింపబడునది.
తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా ।
మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114 ॥
తాంబూల పూరితముఖీ – తాంబూలము చేత నిండి పండిన నోరు కలది.
దాడిమీ కుసుమప్రభా – దానిమ్మపువ్వు ప్రభతో విరాజిల్లునది.
మృగాక్షీ – ఆడలేడి కన్నులకు ఉండే లక్షణాలుగల కళ్ళు కలది.
మోహినీ – మోహమును కలుగజేయునది.
ముఖ్యా – ముఖ్యురాలు.
మృడానీ – మృడుని పత్ని.
మిత్రరూపిణీ – మిత్రుడని పిలువబడే సూర్యుని రూపముగా ఉంది.
నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ ।
మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ ॥ 115 ॥
నిత్యతృప్తా – నిత్యసంతుష్టి స్వభావము కలది.
భక్తనిధిః – భక్తులకు నిధి వంటిది.
నియంత్రీ – సర్వమును నియమించునది.
నిఖిలేశ్వరీ – సమస్తమునకు ఈశ్వరి.
మైత్ర్యాది వాసనాలభ్యా – మైత్రి మొదలైన వాసనా చతుష్టయము గలవారిచే పొందబడునది.
మహాప్రళయ సాక్షిణీ – మహాప్రళయ స్థితియందు సాక్షి భూతురాలుగా ఉండునది.
పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ ।
మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ ॥ 116 ॥
పరాశక్తిః – అన్ని శక్తులకు అతీతంగా ఉండి, వాటన్నిటికీ నేపథ్యంలో వర్తించే శక్తి.
పరానిష్ఠా – సర్వాంతర్యామిని సర్వమునందు చూడగలుగు నిష్ఠను సూచించునది.
ప్రజ్ఞాన ఘనరూపిణీ – ఘనరూపం దాల్చిన ప్రజ్ఞానం.
మాధ్వీపానాలసా – మధుసంబంధిత పానము వలన అలసత్వము చెందినది.
మత్తా – నిత్యము పరవశత్వములో ఉండునది.
మాతృకావర్ణ రూపిణీ – అన్ని రంగులకు తల్లివంటి రంగు యొక్క రూపంలో ఉండునది.
మహాకైలాస నిలయా, మృణాల మృదుదోర్లతా ।
మహనీయా, దయామూర్తీ, ర్మహాసామ్రాజ్యశాలినీ ॥ 117 ॥
మహాకైలాస నిలయా – గొప్పదైన కైలాసం నిలయముగా గలది.
మృణాల మృదుదోర్లతా – తామరతూడులవంటి మృదువైన బాహువులు గలది.
మహనీయా – గొప్పగా ఆరాధింపబడునది.
దయామూర్తిః – మూర్తీభవించిన దయాలక్షణము గలది.
మహాసామ్రాజ్య శాలినీ – పరబ్రహ్మకు చెందిన ఈ విశ్వసామ్రాజ్యమునకు అధినాయకురాలు.
ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥
ఆత్మవిద్యా – ఆత్మకు సంబంధించిన విద్యా స్వరూపురాలు.
మహావిద్యా – గొప్పదైన విద్యా స్వరూపురాలు.
శ్రీవిద్యా – శ్రీ విద్యా స్వరూపిణి.
కామసేవితా – కాముని చేత సేవింపబడునది.
శ్రీ షోడశాక్షరీ విద్యా – సకల మంగళప్రదమైన పదహారు అక్షరాల మంత్రమునకు సంబంధించిన విద్యాస్వరూపిణి.
త్రికూటా – మూడు కూటములుగా ఉన్న మంత్ర స్వరూపిణి.
కామకోటికా – కామమునకు పై అంచునగలదాని స్వరూపిణి.
కటాక్షకింకరీ భూత కమలా కోటిసేవితా ।
శిరఃస్థితా, చంద్రనిభా, ఫాలస్థేంద్ర ధనుఃప్రభా ॥ 119 ॥
కటాక్షకింకరీ భూత కమలాకోటిసేవితా – అనుగ్రహ వీక్షణ మాత్రముచే భృత్యులుగా చేయబడిన శ్రీసతుల సమూహముచేత సేవింపబడునది.
శిరఃస్థితా – తలమీద పెట్టుకోవలసినది.
చంద్రనిభా – చంద్రుని కాంతితో సమానమైన కాంతిని కూడి యుండినది.
ఫాలస్థా – ఫాల భాగమునందు ఉండునది.
ఇంద్రధనుః ప్రభా – ఇంద్రధనుస్సు లోని రంగుల కాంతులతో సమానమగు కాంతులతో వెలుగొందునది.
హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా ।
దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ ॥ 120 ॥
హృదయస్థా – హృదయమునందు ఉండునది.
రవిప్రఖ్యా – సూర్యునితో సమానమైన కాంతితో వెలుగొందునది.
త్రికోణాంతర దీపికా – మూడు బిందువులతో ఏర్పడు త్రిభుజము యొక్క మధ్యమున వెలుగుచుండునది.
దాక్షాయణీ – దక్షుని కుమార్తె.
దైత్యహంత్రీ – రాక్షసులను సంహరించింది.
దక్షయజ్ఞ వినాశినీ – దక్షయజ్ఞమును నాశము చేసినది.