భగవద్గీత తెలుగులో అర్థం 17 వ అధ్యాయము – శ్రద్దాత్రయ విభాగ యోగము అర్జునుడు ఇలా పలికాడు. “కృష్ణా! శాస్త్ర విధులను విడిచిపెట్టినప్పటికీ, పూజాదులు చేసే వాళ్ళ ప్రవృత్తి ఎలాంటిది? సాత్వికమా? రాజసమా? తామసమా? శ్రీ భగవానుడు ఇలా పలికాడు. “ప్రాణుల సహజ సిద్దమైన శ్రద్ద- సాత్త్వికమని, రాజసమని, తామసమని మూడు విధాలు. దాన్ని వివరిస్తాను విను. అర్జునా! మనవులందరికి వారి వారి స్వభావాన్ని బట్టి శ్రద్ద కలుగుతుంది. శ్రద్ద లేనివాడంటూ లేడు. ఎవడికి ఎలాంటి శ్రద్ద […]
Tag: bhagavad gita summary in telugu
భగవద్గీత 14 వ అధ్యాయం – గుణత్రయ విభాగయోగము
భగవద్గీత తెలుగులో అర్థం 14 వ అధ్యాయం – గుణత్రయ విభాగయోగము జ్ఞానాలన్నిటిలోకి ఉత్తమం, ఉత్కృష్టం అయిన జ్ఞానాన్ని నీకు మళ్లీ చెబుతాను విను. ఈ జ్ఞానం తెలుసుకున్న మునులంతా సంసార వ్యధల నుంచీ, బాధల నుంచీ తప్పించుకుని మోక్షం పొందారు. ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి స్వరూపం పొందినవాళ్లు సృష్టి సమయంలో పుట్టరు. ప్రళయ కాలంలో చావరు. అర్జునా! మూలప్రకృతి నాకు గర్భాదానస్థానం. అందులో నేను సృష్టి బీజాన్ని వుంచుతున్నందువల్ల సమస్త ప్రాణులు పుడుతున్నాయి. అన్ని జాతులలోనూ […]
భగవద్గీత 13 వ అధ్యాయం – క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము
భగవద్గీత తెలుగులో అర్థం 13 వ అధ్యాయం – క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము అర్జునుడు… ప్రకృతి, పురుషుడు, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, జ్ఞానం, జ్ఞేయం వీటన్నిటి గురించి తెలుసుకోవాలని నా అభిలాష అని పలికాడు. కృష్ణ భగవానుడు అర్జునుడితో “కౌంతేయా! ఈ శరీరమే క్షేత్రమనీ, దీనిని తెలుసుకుంటున్న వాడే క్షేత్రజ్ఞుడనీ, క్షేత్ర క్షేత్రజ్ఞుల తత్వం తెలిసినవాళ్లు చెబుతారు. క్షేత్రాలన్నీటిలోనూ వున్న క్షేత్రజ్ఞుణ్ణి నేనే అని తెలుసుకో. క్షేత్రానీకీ క్షేత్రజ్ఞుడికి సంబంధించిన జ్ఞానమే సరియైన జ్ఞానమని నా వుద్దేశం. ఋషులు ఎన్నో […]
భగవద్గీత 12 వ అధ్యాయం – భక్తి యోగము
భగవద్గీత తెలుగులో అర్థం 12 వ అధ్యాయం – భక్తి యోగము అర్జునుడు ఇలా పలికాడు. “ఇలా నిరంతరం మనస్సు నీ మీదే నిలిపి, నిన్ను భజించే భక్తులు ఉత్తములా? ఇంద్రియాలకు గోచరించని ఆత్మస్వరూపాన్ని ఆరాధించే వాళ్ళు ఉత్తములా?” దానికి సమాధానంగా భగవానుడు “నా మీదనే నిత్యం మనస్సు నిలిపి నిత్య నిష్టతో, పరమ శ్రద్దతో నన్ను ఉపాసించే వాళ్లే ఉత్తమ యోగులని నా వుద్దేశ్యం. ఇంద్రియాలన్నీటికి బాగా వశపరచుకొని సర్వత్ర సమభావం కలిగి, సమస్త భూతాలకు […]
భగవద్గీత 7 వ అధ్యాయం –జ్ఞాన విజ్ఞాన యోగము
భగవద్గీత తెలుగులో అర్థం 7 వ అధ్యాయం -జ్ఞాన విజ్ఞాన యోగము అర్జునా ! బ్రహ్మజ్ఞానాన్ని గురించి నేను నీకు సంపూర్ణంగా చెబుతాను. దీనిని గ్రహిస్తే ఈ లోకంలో నీవు మళ్ళీ తెలుసుకోదగిందేమి వుండదు. ఎన్నో వేలమందిలో, ఏ ఒక్కడో, యోగసిద్ది కోసం ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించి సాధకులైన వాళ్ళలో కూడా, నన్ను నిజంగా తెలుసుకున్న వాడు ఏ ఒక్కడో వుంటాడు. నా మాయాశక్తి ఎనిమిది విధాలుగా విభజించబడినది. అవి భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, […]
భగవద్గీత 6 వ అధ్యాయం – ఆత్మ సంయమ యోగము
భగవద్గీత తెలుగులో అర్థం 6 వ అధ్యాయం – ఆత్మ సంయమ యోగము కర్మఫలాపేక్ష లేకుండా కర్తవ్యాలను ఆచరించే వాడే నిజమైన సన్యాసి, యోగి అవుతాడు. అంతే కానీ అగ్నిహోత్రాది కర్మ మానివేసినంత మాత్రాన కాదు. సన్యాసమూ, కర్మ యోగమూ ఒకటే అని తెలుసుకో. ధ్యానయోగాన్ని సాధించదలచిన మునికి నిష్కామకర్మయోగమే మార్గం. యోగసిద్ది పొందిన వాడికి కర్మ త్యాగమే సాధనం. తన మనస్సే తనకు బంధువూ, శత్రువూ కూడా కనుక మానవుడు తనను తానే ఉద్దరించుకోవాలి. తన […]
భగవద్గీత 3 వ అధ్యాయం – కర్మ యోగం
భగవద్గీత తెలుగులో అర్థం 3 వ అధ్యాయం – కర్మ యోగం అప్పుడు అర్జునుడు “జనార్ధన ! కర్మకంటే జ్ఞానమే మేలని నీ వుద్దేశమా. అలాంటప్పుడు ఘోరమైన ఈ యుద్దకర్మ కు నన్నెందుకు వురికొల్పుతున్నావు. అటు యిటూ కాని మాటలతో, నా మనసుకు మరింత కలత కలగజేస్తున్నావు. అలా కాకుండా, నాకు మేలు చేకూర్చే మార్గం ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్పు” అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణభగవానుడు “అర్జునా! గతంలో నేను చెప్పిన రెండు మార్గాలూ లోకంలో వున్నాయి. […]
2 వ అధ్యాయం – సాంఖ్య యోగం
భగవద్గీత తెలుగులో అర్థం 2 వ అధ్యాయం – సాంఖ్య యోగం అర్జునుడు కన్నీరు కారుస్తుండగా, శ్రీ కృష్ణ పరమాత్మ “అర్జునా! ఈ సంక్లిష్ట సమయంలో ఆర్యధర్మ విరుద్దమూ, అపకీర్తిదాయకమూ, నరకప్రాప్తి హేతువు అయిన ఈ పాడుబుద్ది నీకెందుకు పుట్టింది? అధైర్యం పనికిరాదు. నీచమైన మనోదౌర్బల్యం విడిచిపెట్టు. యుద్దం ప్రారంభించు” అన్నాడు. అప్పుడు అర్జునుడు “మధుసూధనా! పూజార్హులైన భీష్మ ద్రోణాదులను, బాణాలతో నేనెలా కొట్టగలను. మహానుభావులైన గురువులను చంపడం శ్రేయస్కరం కాదు. వారిని సంహరించి, రక్తసిక్తాలైన రాజ్యభోగాలు […]
1 వ అధ్యాయం – అర్జున విషాద యోగము
భగవద్గీత తెలుగులో అర్థం ప్రపంచంలో ఉన్నవన్నీ ఇందులో ఉన్నాయి. ఇందులో లేనిది ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. -భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. మహాభారతంలో శ్రీమద్భగవద్గీతకు ప్రత్యేక స్థానం ఉంది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. మహాభారత యుద్ధం జరగకూడదని శ్రీ కృష్ణ పరమాత్ముడు అనేక విధాలుగా ప్రయత్నించినప్పటికీ యుద్ధం అనివార్యమైంది. పాండవవీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు. సొంతవారు నాచే చంపబడుతున్నారు అన్న మొహం అర్జునుణ్ణి ఆవహించి విషాదాన్ని కలుగజేయగా, యుద్ధం […]