శ్రీకృష్ణుడు బాల గోపాల రూపంలో దర్శనమిస్తూ గోపీకృత బాలరక్షా స్తోత్రం దైవిక రక్షణను ప్రసాదిస్తున్న దృశ్యం

శ్రీ గోపీకృత బాలరక్షా స్తోత్రం

“మీ పిల్లలు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారా? కారణం లేకుండా ఏడుస్తున్నారా? రాత్రి పూట నిద్రలో ఉలిక్కిపడి లేస్తున్నారా? అయితే బహుశా వారికి చెడు దృష్టి లేదా బాలగ్రహ దోషాలు తగిలి ఉండవచ్చు. భయపడకండి! పూతన అనే రాక్షసిని చిన్నికృష్ణుడు వధించిన తర్వాత, కృష్ణుడికి రాక్షసుల నుండి ఎలాంటి అపాయం జరగకూడదని గోపికలందరూ గోమాత తోకను కృష్ణుడి ఒంటికి స్పృశించి యశోదమ్మ, గోపికలు పఠించిన అత్యంత శక్తివంతమైన కవచం ఒకటుంది. అదే ‘బాలరక్షా స్తోత్రం’.

“శ్రీమద్భాగవతం దశమ స్కంధంలో ఉన్న ఈ గోపీకృత బాలరక్షా స్తోత్రాన్ని విన్నా, పిల్లల దగ్గర పఠించినా ఎటువంటి దుష్ట శక్తులు వారి దరిచేరవు. అయితే, ఈ స్తోత్రాన్ని కేవలం చదవడం మాత్రమే కాదు, పిల్లల దగ్గర చదివేటప్పుడు ఒక చిన్న వస్తువు మీ దగ్గర ఉంచుకుంటే దాని ఫలితం వంద రెట్లు పెరుగుతుంది.

అవ్యాదజోఽoఘ్రి మణిమాంస్తవ జాన్వథోరూ
యజ్ఞోఽచ్యుతః కటితటం జఠరం హయాస్యః
|
హృత్ కేశవస్త్వదుర ఈశ ఇనస్తు కంఠం
విష్ణుర్భుజం ముఖమురుక్రమ ఈశ్వరః కమ్
|| 1 ||

అర్థం: “ఓ చిన్నికృష్ణా! అజుడు నీ పాదాలను, మణిమాన్ అనే దేవుడు నీ మోకాళ్లను, యజ్ఞపురుషుడు నీ తొడలను, అచ్యుతుడు నీ నడుమును, హయగ్రీవుడు నీ కడుపును, కేశవుడు నీ హృదయాన్ని, ఈశుడు నీ వక్షస్థలాన్ని, సూర్యుడు నీ కంఠాన్ని, విష్ణువు నీ రెండు భుజాలను, ఉరుక్రముడు నీ ముఖాన్ని, అలాగే ఈశ్వరుడు నీ శిరస్సును ఎల్లప్పుడూ రక్షించుగాక!”

చక్ర్యగ్రతః సహగదో హరిరస్తు పశ్చాత్
త్వత్పార్శ్వయోర్ధనురసీ మధుహాజనశ్చ
|
కోణేషు శంఖః ఉరుగాయ ఉపర్యుపేంద్రః
తార్క్ష్యః క్షితౌ హలధరః పురుషః సమంతాత్
|| 2 ||

అర్థం: చక్రధారి అయిన శ్రీహరి నీ ముందు భాగాన్ని, గదాధారి అయిన హరి నీ వెనుక భాగాన్ని రక్షించుగాక. ధనుస్సును ధరించిన మధుసూదనుడు, ఖడ్గం ధరించిన అజుడు నీ రెండు పక్కలా ఉండి కాపాడుగాక. శంఖాన్ని పట్టుకున్న ఉరుగాయుడు నాలుగు మూలలా, ఉపేంద్రుడు నీ పై భాగాన, గరుత్మంతుడు కింది భాగాన, హలాయుధుడు, పరమపురుషుడు అన్ని వైపులా ఉండి నిన్ను రక్షించుగాక!”

ఇంద్రియాణి హృషీకేశః ప్రాణాన్ నారాయణోఽవతు |
శ్వేతద్వీపపతిశ్చిత్తం మనో యోగీశ్వరోఽవతు || 3 ||

అర్థం: హృషీకేశుడు నీ ఇంద్రియాలను, నారాయణుడు నీ ప్రాణాలను కాపాడుగాక. శ్వేతద్వీపనాథుడు నీ చిత్తాన్ని, యోగీశ్వరుడు నీ మనస్సును ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచుగాక!

పృశ్నిగర్భశ్చ తే బుద్ధిమాత్మానం భగవాన్ హరిః |
క్రీడంతం పాతు గోవిందః శయానం పాతు మాధవః || 4 ||

అర్థం: పృశ్నిగర్భుడు నీ బుద్ధిని, భగవానుడైన శ్రీహరి నీ ఆత్మను రక్షించుగాక! నువ్వు ఆడుకునేటప్పుడు గోవిందుడు, నిద్రపోయేటప్పుడు మాధవుడు నీకు తోడుగా ఉండి నిన్ను రక్షించుగాక!

వ్రజంతమవ్యాద్వైకుంఠ ఆసీనం త్వాం శ్రియః పతిః |
భుంజానం యజ్ఞభుక్ పాతు సర్వగ్రహభయంకరః || 5 ||

అర్థం: ఓ కృష్ణా! నువ్వు నడిచేటప్పుడు వైకుంఠుడు, కూర్చున్నప్పుడు శ్రీపతి, భోజనం చేసేటప్పుడు సకల గ్రహాలను భయపెట్టే యజ్ఞభోక్త నిన్ను సదా రక్షించుగాక!

డాకిన్యో యాతుధాన్యశ్చ కుష్మాండా యేఽర్భకగ్రహాః |
భూతప్రేతపిశాచాశ్చ యక్షరక్షోవినాయకాః || 6 ||

కోటరా రేవతీ జ్యేష్ఠా పూతనా మాతృకాదయః |
ఉన్మాదా యే హ్యపస్మారా దేహప్రాణేంద్రియద్రుహః || 7 ||

అర్థం: డాకినులు, యాతుధానులు, కూష్మాండాలు, పిల్లలను పీడించే బాలగ్రహాలు, భూత ప్రేత పిశాచాలు, యక్ష రాక్షస వినాయకులు… కోటర, రేవతి, జ్యేష్ఠ, పూతన, మాతృకలు మొదలైన దుష్టశక్తులు, పిచ్చి పుట్టించేవి, మూర్ఛ రోగాలు తెచ్చేవి, దేహానికి, ప్రాణాలకు హాని చేసేవి, కలలో కనిపించే భయంకరమైన ఉత్పాతాలు… ఇవన్నీ కూడా శ్రీ మహా విష్ణువు యొక్క నామస్మరణం వినగానే భయంతో కాలి బూడిదై నశించిపోవుగాక!

స్వప్నదృష్టా మహోత్పాతా వృద్ధబాలగ్రహాశ్చ యే |
సర్వే నశ్యంతు తే విష్ణోర్నామగ్రహణభీరవః || 8 ||

అర్థం: కలలో కనిపించే భయంకరమైన పీడకలలు, వృద్ధులను, చిన్నపిల్లలను పీడించే దుష్ట గ్రహాలు ఏవైతే ఉన్నాయో… అవన్నీ కూడా శ్రీ మహా విష్ణువు యొక్క పవిత్రమైన నామాన్ని ఉచ్ఛరించగానే లేదా వినగానే భయంతో పూర్తిగా నశించిపోవుగాక.

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

 ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top