google.com, pub-2532166691306495, DIRECT, f08c47fec0942fa0

bhagavad gita telugu

భగవద్గీత 18 వ అధ్యాయం – మోక్షసన్యాస యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 18 వ అధ్యాయం – మోక్షసన్యాస యోగము అర్జునుడు కృష్ణుడితో ఇలా పలికాడు. “కృష్ణా ! సన్యాసం, త్యాగం వీటి స్వరూపాలను విడి విడిగా తెలుసుకోదలచాను. శ్రీ భగవానుడు అర్జునుడితో “ఫలాన్ని ఆశించి చేసే కర్మలను విడిచి పెట్టడమే సన్యాసమని, కొంతమంది పండితులు చెబుతారు. సమస్త కర్మల ఫలితాలనూ వదిలి పెట్టడమే త్యాగమని కొందరి అభిప్రాయం. దోషంలేని కర్మ అంటూ ఏదీ వుండదు కనుక కర్మలను విడిచి పెట్టాలని కొందరు బుద్ధిమంతులు చెబుతారు. […]

భగవద్గీత 18 వ అధ్యాయం – మోక్షసన్యాస యోగము Read More »

భగవద్గీత 17 వ అధ్యాయం – శ్రద్దాత్రయ విభాగ యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 17 వ అధ్యాయము – శ్రద్దాత్రయ విభాగ యోగము అర్జునుడు ఇలా పలికాడు. “కృష్ణా! శాస్త్ర విధులను విడిచిపెట్టినప్పటికీ, పూజాదులు చేసే వాళ్ళ ప్రవృత్తి ఎలాంటిది? సాత్వికమా? రాజసమా? తామసమా? శ్రీ భగవానుడు ఇలా పలికాడు. “ప్రాణుల సహజ సిద్దమైన శ్రద్ద- సాత్త్వికమని, రాజసమని, తామసమని మూడు విధాలు. దాన్ని వివరిస్తాను విను. అర్జునా! మనవులందరికి వారి వారి స్వభావాన్ని బట్టి శ్రద్ద కలుగుతుంది. శ్రద్ద లేనివాడంటూ లేడు. ఎవడికి ఎలాంటి శ్రద్ద

భగవద్గీత 17 వ అధ్యాయం – శ్రద్దాత్రయ విభాగ యోగము Read More »

భగవద్గీత 13 వ అధ్యాయం – క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 13  వ అధ్యాయం – క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము అర్జునుడు… ప్రకృతి, పురుషుడు, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, జ్ఞానం, జ్ఞేయం వీటన్నిటి గురించి తెలుసుకోవాలని నా అభిలాష అని పలికాడు.  కృష్ణ భగవానుడు అర్జునుడితో “కౌంతేయా! ఈ శరీరమే క్షేత్రమనీ, దీనిని తెలుసుకుంటున్న వాడే క్షేత్రజ్ఞుడనీ, క్షేత్ర క్షేత్రజ్ఞుల తత్వం తెలిసినవాళ్లు చెబుతారు. క్షేత్రాలన్నీటిలోనూ వున్న క్షేత్రజ్ఞుణ్ణి నేనే అని తెలుసుకో. క్షేత్రానీకీ క్షేత్రజ్ఞుడికి సంబంధించిన జ్ఞానమే సరియైన జ్ఞానమని నా వుద్దేశం.  ఋషులు ఎన్నో

భగవద్గీత 13 వ అధ్యాయం – క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము Read More »

భగవద్గీత 12 వ అధ్యాయం – భక్తి యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 12  వ అధ్యాయం – భక్తి యోగము అర్జునుడు ఇలా పలికాడు. “ఇలా నిరంతరం మనస్సు నీ మీదే నిలిపి, నిన్ను భజించే భక్తులు ఉత్తములా? ఇంద్రియాలకు గోచరించని ఆత్మస్వరూపాన్ని ఆరాధించే వాళ్ళు ఉత్తములా?” దానికి సమాధానంగా భగవానుడు “నా మీదనే నిత్యం మనస్సు నిలిపి నిత్య నిష్టతో, పరమ శ్రద్దతో నన్ను ఉపాసించే వాళ్లే ఉత్తమ యోగులని నా వుద్దేశ్యం. ఇంద్రియాలన్నీటికి బాగా వశపరచుకొని సర్వత్ర సమభావం కలిగి, సమస్త భూతాలకు

భగవద్గీత 12 వ అధ్యాయం – భక్తి యోగము Read More »

భగవద్గీత 11 వ అధ్యాయం – విశ్వరూప సందర్శన యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 11  వ అధ్యాయం –విశ్వరూప సందర్శన యోగము అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా పలికాడు. “నా మీద దయ తలచి అతి రహస్యమూ, ఆత్మజ్ఞాన సంబంధమూ అయిన విషయాన్ని ఉపదేశించావు. దానితో నా అజ్ఞానమంతా అంతరించింది. కృష్ణా! సమస్త భూతాల చావుపుట్టుకల గురించి, అఖండమైన నీ మహత్యం గురించి, నీ నుంచి వివరంగా విన్నాను.  నిన్ను గురించి నీవు చెప్పినదంతా నిజమే. ఈశ్వర సంబంధమైన నీ విశ్వరూపాన్ని సందర్శించాలని నా అభిలాష. విశ్వరూపాన్ని సందర్శించడం

భగవద్గీత 11 వ అధ్యాయం – విశ్వరూప సందర్శన యోగము Read More »

భగవద్గీత 8 వ అధ్యాయం –అక్షర పరబ్రహ్మ యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 8 వ అధ్యాయం –అక్షర పరబ్రహ్మ యోగము అర్జునుడు ఇలా పలికాడు. “పురుషోత్తమా! బ్రహ్మమంటే ఏమిటి? ఆధ్యాత్మమంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? అధిభూతమూ, అధిదైవమూ అనేవి ఏవి?  ఈ శరీరంలో ఆధీయజ్ఞుడు దేవడు ఎలా వుంటాడు? మనో నిగ్రహం కలవాళ్ళు మరణ సమయంలో నిన్నెలా తెలుసుకోగలుగుతారు. అర్జునుని మాటలు విని శ్రీ కృష్ణ భగవానుడు “సర్వోత్తమం, శాశ్వతమూ అయిన పరమాత్మనే బ్రహ్మ. యజ్ఞ రూపమైన కార్యమే కర్మ. ఈ శరీరంలాంటి నశించే

భగవద్గీత 8 వ అధ్యాయం –అక్షర పరబ్రహ్మ యోగము Read More »

భగవద్గీత 7 వ అధ్యాయం –జ్ఞాన విజ్ఞాన యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 7 వ అధ్యాయం  -జ్ఞాన విజ్ఞాన యోగము అర్జునా ! బ్రహ్మజ్ఞానాన్ని గురించి నేను నీకు సంపూర్ణంగా చెబుతాను. దీనిని గ్రహిస్తే ఈ లోకంలో నీవు మళ్ళీ తెలుసుకోదగిందేమి వుండదు. ఎన్నో వేలమందిలో, ఏ ఒక్కడో, యోగసిద్ది కోసం ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించి సాధకులైన వాళ్ళలో కూడా, నన్ను నిజంగా తెలుసుకున్న వాడు ఏ ఒక్కడో వుంటాడు. నా మాయాశక్తి ఎనిమిది విధాలుగా విభజించబడినది. అవి భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం,

భగవద్గీత 7 వ అధ్యాయం –జ్ఞాన విజ్ఞాన యోగము Read More »

భగవద్గీత 6 వ అధ్యాయం – ఆత్మ సంయమ యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 6 వ అధ్యాయం – ఆత్మ సంయమ యోగము కర్మఫలాపేక్ష లేకుండా కర్తవ్యాలను ఆచరించే వాడే నిజమైన సన్యాసి, యోగి అవుతాడు. అంతే కానీ అగ్నిహోత్రాది కర్మ మానివేసినంత మాత్రాన కాదు. సన్యాసమూ, కర్మ యోగమూ ఒకటే అని తెలుసుకో. ధ్యానయోగాన్ని సాధించదలచిన మునికి నిష్కామకర్మయోగమే మార్గం. యోగసిద్ది పొందిన వాడికి కర్మ త్యాగమే సాధనం. తన మనస్సే తనకు బంధువూ, శత్రువూ కూడా కనుక మానవుడు తనను తానే ఉద్దరించుకోవాలి. తన

భగవద్గీత 6 వ అధ్యాయం – ఆత్మ సంయమ యోగము Read More »

భగవద్గీత 4 వ అధ్యాయం -జ్ఞాన యోగం

భగవద్గీత తెలుగులో అర్థం 4 వ అధ్యాయం -జ్ఞాన యోగం ఇంకా శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. “వినాశనం లేని ఈ యోగం, పూర్వం నేను సూర్యుడికి ఉపదేశించాను. సూర్యుడు మనువుకూ, మనువు ఇక్ష్వాకుడికి బోధించారు. ఇలా సంప్రదాయ పరంపరగా ఇచ్చిన కర్మయోగాన్ని, రాజర్షులు తెలుసుకున్నారు. అయితే, అది ఈ లోకంలో క్రమేపీ కాలగర్భంలో కలిసిపోతుంది. నాకు భక్తుడవూ, స్నేహితుడవూ కావడం వల్ల పురాతనమైన ఈ యోగాన్ని నీకిప్పుడు మళ్ళీ వివరించాను. ఇది ఉత్తమం, రహస్యమూ అయిన జ్ఞానం

భగవద్గీత 4 వ అధ్యాయం -జ్ఞాన యోగం Read More »

భగవద్గీత 3 వ అధ్యాయం – కర్మ యోగం

భగవద్గీత తెలుగులో అర్థం 3 వ అధ్యాయం – కర్మ యోగం అప్పుడు అర్జునుడు “జనార్ధన ! కర్మకంటే జ్ఞానమే మేలని నీ వుద్దేశమా. అలాంటప్పుడు ఘోరమైన ఈ యుద్దకర్మ కు నన్నెందుకు వురికొల్పుతున్నావు. అటు యిటూ కాని మాటలతో, నా మనసుకు మరింత కలత కలగజేస్తున్నావు. అలా కాకుండా, నాకు మేలు చేకూర్చే మార్గం ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్పు” అన్నాడు.  అప్పుడు శ్రీకృష్ణభగవానుడు “అర్జునా! గతంలో నేను చెప్పిన రెండు మార్గాలూ లోకంలో వున్నాయి.

భగవద్గీత 3 వ అధ్యాయం – కర్మ యోగం Read More »

Scroll to Top