మూక పంచశతి పాదారవిందశతకం 61-70 శ్లోకాలు
మూక పంచశతి పాదారవింద శతకం శ్లోకాలు అనేది మూక కవి రచించిన ప్రసిద్ధ భక్తి స్తోత్రంలో ఒక పవిత్ర భాగం. ఇందులో కామాక్షి దేవి పాదారవిందాల మహిమను అద్భుతంగా వర్ణించారు. ఈ శతకం భక్తి, సమర్పణ భావాన్ని పెంచుతూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తుంది.
ఈ శతకాన్ని భక్తితో పఠించడం ద్వారా మనసుకు ప్రశాంతత, జ్ఞానం, ఐశ్వర్యం మరియు దైవ అనుగ్రహం లభిస్తాయని విశ్వాసం. మూక కవి దైవ కృపతో మౌనస్థితి నుండి కవిత్వాన్ని పొందిన నేపథ్యం ఈ స్తోత్రానికి ప్రత్యేకతను ఇస్తుంది. పాదారవింద ధ్యానం ద్వారా భక్తుడు సంపూర్ణ సమర్పణ భావాన్ని పొందుతూ మోక్ష మార్గంలో ముందుకు సాగుతాడు.
జనోఽయం సంతప్తో జనని భవచండాంశుకిరణైః
అలబ్ధ్వైకం శీతం కణమపి పరజ్ఞానపయసః ।
తమోమార్గే పాంథస్తవ ఝటితి కామాక్షి శిశిరాం
పదాంభోజచ్ఛాయాం పరమశివజాయే మృగయతే ॥61॥
జగన్మాతా! నేను ఈ సంసార భ్రమణములో పడి, సంసారమనే సూర్యునియొక్క వేడి కిరణముల ధాటికి తాళలేక, జ్ఞానము అనే ఒక నీటి చుక్క కూడా దొరకక అలమటించుచున్నాను. బాటసారినైన నాకు, నీ పాదముల నీడను ప్రసాదించి సాంత్వనము కలుగచేయవమ్మా!
జయత్యంబ శ్రీమన్నఖకిరణ చీనాంశుకమయం
వితానం బిభ్రాణే సురముకుటసంఘట్టమసృణే ।
నిజారుణ్యక్షౌమాస్తరణవతి కామాక్షి సులభా
బుధైః సంవిన్నారీ తవ చరణమాణిక్యభవనే ॥62॥
తల్లీ! కామాక్షీ! నీ పాదపద్మములు మణి మాణిక్యములు కూర్చబడిన భవనము. ఆ భవనములో జ్ఞానులకు, యోగులకు సులభమైన ఒక తల్లి స్థితురాలై ఉన్నది. ఆ మండపము ఎలా ఉందో తెలుసా! దేవతల కిరీటములు పీఠముగా, రక్తవర్ణపు వస్త్రముపై, నఖకాంతులు పందిరిగా కలిగి ఆ తల్లి కూర్చుని ఉన్నది.
ప్రతీమః కామాక్షి స్ఫురితతరుణాదిత్యకిరణ-
శ్రియో మూలద్రవ్యం తవ చరణమద్రీంద్రతనయే ।
సురేంద్రాశామాపూరయతి యదసౌ ధ్వాంతమఖిలం
ధునీతే దిగ్భాగానపి చ మహసా పాటలయతే ॥ 63॥
అమ్మా! అప్పుడే ఉదయిస్తున్న భానుని కిరణములు, నీ పాదములపై పడి ప్రకాశించుచున్నవి. ఓ హిమవత్పుత్రీ! అన్ని వైపులా వ్యాప్తమైన అంధకారమును పారద్రోలి, నీ పాదములు దిక్కులన్నిటినీ ఎర్రని కాంతిప్రకాశముతో నింపివేస్తాయి. ఆ కాంతిని నేను దర్శించగలుగుతున్నాను.
మహాభాష్యవ్యాఖ్యాపటు శయనమారోపయతి వా
స్మరవ్యాపారేర్ష్యా పిశుననిటిలం కారయతి వా ।
ద్విరేఫాణామధ్యాసయతి సతతం వాధివసతిం
ప్రణమ్రాన్కామాక్ష్యాః పదనలినమాహాత్మ్యగరిమా ॥64॥
అమ్మా! నీ పాదస్మరణ మాహాత్మ్యం ఎటువంటిదంటే, తనను శరణన్నవారిని విష్ణువు పాన్పు అయిన ఆదిశేషునివంటి వాక్పటిమను, ఈశ్వరుని తేజస్సును, బ్రహ్మత్వమును కలుగచేసి, త్రిమూర్తుల ఆశీస్సులను అందచేస్తుంది.
వివేకాంభస్స్రోతః స్నపనపరిపాటీశిశిరితే
సమీభూతే శాస్త్రస్మరణహలసంకర్షణవశాత్ ।
సతాం చేతఃక్షేత్రే వపతి తవ కామాక్షి చరణూ
మహాసంవిత్సస్యప్రకరవరబీజం గిరిసుతే ॥65॥
ఓ కామాక్షీ! నీ పాద స్మరణము అనే జలప్రవాహము నా మనసనే క్షేత్రమును పూర్తిగా తడిపి, వివేక జ్ఞానమనే నాగలితో దున్ని, మంత్ర బీజములను నాటి, కామ – క్రోథ – లోభ – మోహ – మద – మాత్సర్యాలు అనే కలుపు మొక్కలను ఏరివేస్తుంది.
దధానో మందారస్తబకపరిపాటీం నఖరుచా
వహందీప్తాం శోణాంగులిపటల చాంపేయకలికామ్ ।
అశోకోల్లాసం నః ప్రచురయతు కామాక్షి చరణూ
వికాసీ వాసంతః సమయ ఇవ తే శర్వదయితే ॥66॥
మాతా! శివపత్నీ! మందార పుష్పముల వంటి నీ నఖముల కాంతి, ప్రకాశముతో కూడిన రక్తవర్ణపు నీ పాదముల వేళ్ళు, వసంత ఋతువులోని సంపెంగ మొగ్గలను, అశోక పుష్పములను తలపింపజేయుచున్నవి.
నఖాంశుప్రాచుర్య ప్రసృమర మరాలాలిధవలః
స్ఫురన్మంజీరోద్యన్ మరకతమహశ్శైవలయుతః ।
భవత్యాః కామాక్షి స్ఫుటచరణపాటల్యకపటో
నదః శోణాభిఖ్యో నగపతితనూజే విజయతే ॥67॥
అమ్మా! నీ పాదనఖముల కాంతి ప్రసరించటం వలన నీవు నాటిన బీజములు అంకురించినవి. పైరు ఏపుగా పెరిగినది. ఆకుపచ్చ మణులతో కూర్చబడిన నీ పాదముల అందియలు ఆ పొలములో నాచువలే ఉన్నవి. ఎర్రని కొత్త నీటితో నిండిన శోణానది నా హృదయములో పరవళ్ళు త్రొక్కుగాక.
ధునానం పంకౌఘం పరమసులభం కంటకకులైః
వికాసవ్యాసంగం విదధదపరాధీనమనిశమ్ ।
నఖేందుజ్యోత్స్నాభిః విశదరుచి కామాక్షి నితరాం
అసామాన్యం మన్యే సరసిజమిదం తే పదయుగమ్ ॥68॥
అమ్మా! ఏపుగా పండిన పంట ఇల్లు చేరటం ఎలా? తెల్లని కాంతి కలిగిన నఖములు కల నీ పాద పద్మములు అనవసరముగా పేరుకున్న మకిలిని, కీటకములనే దుష్టులను దూరముగా తరిమివేసి, నీ కరుణ అనే పంటను నా హృదయమనే గృహమునకు చేరుస్తాయి.
కరీంద్రాయ ద్రుహ్యత్యలసగతి లీలాసు విమలైః
పయోజైర్మాత్సర్యం ప్రకటయతి కామం కలయతే ।
పదాంభోజద్వంద్వం తవ తదపి కామాక్షి హృదయం
మునీనాం శాంతానాం కథమనిశమస్మై స్పృహయతే ॥69॥
అమ్మా! అతి నెమ్మదిగా నడుస్తున్న నీ పాదములను చూసి, ఏనుగులు చిన్నబుచ్చుకుంటున్నాయి. సున్నితమైన నీ పాదములను చూసి పద్మములు ఓర్వలేకపోతున్నాయి. తపోసంపన్నులైన మునులు నీ పాదములను ఆశ్రయిస్తూనే ఉన్నారు.
నిరస్తా శోణిమ్నా చరణకిరణానాం తవ శివే
సమింధానా సంధ్యారుచిరచల రాజన్యతనయే ।
అసామర్థ్యాదేనం పరిభవితుమేతత్సమరుచాం
సరోజానాం జానే ముకులయతి శోభాం ప్రతిదినమ్ ॥70॥
అమ్మా! నీ చరణకాంతుల ఎర్రని ప్రకాశము, సంధ్యాకాంతులను పరిహసిస్తున్నది. నీ పాదముల కాంతిని అవి ఏమీ చేయలేక, సంధ్యాకాంతులు తమతో సమమైన కాంతిగల పద్మములు ముకుళించేలా చేస్తున్నాయి.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.
🕉️ మూక పంచశతి పాదారవిందశతకం తెలుగులో అర్థం
మూక పంచశతి పాదారవిందశతకం 1-10 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 11-20 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 21-30 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 31-40 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 41-50 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 51-60 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 61-70 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 71-80 శ్లోకాలు




