శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 31-40 శ్లోకాలు
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం మహాభారతంలోని అనుశాసన పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన పవిత్రమైన దైవిక స్తోత్రం. ఇందులో శ్రీ మహావిష్ణువు యొక్క వెయ్యి దివ్య నామాలు ఉన్నాయి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం జపం చేయడం వలన పాప విమోచనం, ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు కుటుంబ శాంతి కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ దివ్య నామాలలో ప్రతి ఒక్కటి ప్రత్యేక ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉండి భక్తుని జీవితాన్ని సానుకూలంగా మారుస్తుంది.
అమృతాంశూద్భవో భానుః శశబిందుః సురేశ్వరః ।
ఔషధం జగతః సేతుః సత్యధర్మపరాక్రమః ॥ 31 ॥
అమృతాంశూద్భవః – అమృత కిరణ్మయుడగు చంద్రుని జననమునకు కారణము
భానుః – ప్రకాశించువాడు
శశబిందుః – కుందేలు మచ్చ ఉన్న చంద్రుని స్వరూపుడు
సురేశ్వరః – దేవతలకు ప్రభువు
ఔషధం – సమస్త జగత్తుకు ఔషధమువంటి వాడు
జగతస్సేతుః – ప్రపంచమునకు, జీవునకు వంతెన వంటివాడు
సత్యధర్మపరాక్రమః – సదా నిజమైన ధర్మగుణము, పరాక్రమము కలిగినవాడు
భూతభవ్యభవన్నాథః పవనః పావనోఽనలః ।
కామహా కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః ॥ 32 ॥
భూతభవ్యభవన్నాథః – మూడు కాలములకును అధిపతి
పవనః – ప్రాణవాయువులా సంచరించువాడు
పావనః – అంతటినీ పవిత్రము చేయువాడు
అనలః – అగ్ని స్వరూపుడు
కామహా – కోరికలనునాశనము చేయవాడు
కామకృత్ – భక్తుల అభీష్టములను నెరవేర్చువాడు
కాంతః – సమ్మోహన రూపుడు
కామః – ప్రేమ స్వరూపుడు
కామప్రదః – కోరినవి ఇచ్చేవాడు
ప్రభుః – సమస్తానికి అధిపతి
యుగాది కృద్యుగావర్తో నైకమాయో మహాశనః ।
అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్ ॥ 33 ॥
యుగాదికృత్ – యుగమును ఆరంభించువాడు
యుగావర్తః – కాలచక్ర నియంత్రకుడు
నైకమాయః – అనేక మాయారూపాలను కలవాడు
మహాశనః – కల్పాంతమున సమస్తమును భక్షించువాడు
అదృశ్యః – ఇంద్రియ, మనోబుద్ధులకు కానరానివాడు
వ్యక్తరూపః- స్పష్టమైన రూపము కలవాడు
అవ్యక్తరూపః – తెలియరానివాడు
సహస్రజిత్ – సహస్ర శత్రువులను జయించువాడు
అనంతజిత్ – అంతులేని విజయములు కలిగినవాడు
ఇష్టోఽవిశిష్టః శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః ।
క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః ॥ 34 ॥
ఇష్ట: – భక్తులకు ప్రియమైనవాడు
అవిశిష్ట: – భేదం లేనివాడు
శిష్టేష్ట: – శిష్టులకు ఇష్టుడైనవాడు
శిఖండీ – కిరీటధారి
నహుష: – తన మాయచేత జీవులను సంసారమునందు బంధించువాడు
వృష: – ధర్మస్వరూపుడైనవాడు
క్రోధహా – క్రోధమును నశింపచేయువాడు
క్రోధకృత్ – ధర్మరక్షణ కోసం కోపాన్ని కలుగజేయువాడు
కర్తా – సృష్టికర్త
విశ్వబాహు: – సమస్త దిక్కులలో విస్తరించిన భుజములు కలవాడు
మహీధర: – భూమిని ధరించినవాడు
అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః ।
అపాంనిధిరధిష్ఠానమప్రమత్తః ప్రతిష్ఠితః ॥ 35 ॥
అచ్యుత: – స్థిరస్వరూపుడు
ప్రధిత: – ప్రసిద్ధుడైన వాడు
ప్రాణ: – ప్రాణస్వరూపుడు
ప్రాణద: – ప్రాణాలను ప్రసాదించువాడు
వాసవానుజ: – ఇంద్రునకు తమ్ముడు
అపాంనిధి: – సముద్ర స్వరూపుడు
అధిష్టానం – సమస్తానికి ఆధారం
అప్రమత్త: – ఎప్పుడూ అప్రమత్తుడైన వాడు
ప్రతిష్ఠిత: – స్థిరంగా స్థాపించబడిన వాడు
స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః ।
వాసుదేవో బృహద్భానురాదిదేవః పురంధరః ॥ 36 ॥
స్కంద: – వేగంగా సంచరించువాడు
స్కందధర: – లోకాలను ధరించువాడు
ధుర్య: – బాధ్యతలను నిర్వహించగల శ్రేష్ఠుడు
వరద: – వరాలు ప్రసాదించువాడు
వాయువాహన: – వాయువును నియంత్రించువాడు
వాసుదేవ: – సర్వవ్యాపకుడు
బృహద్భాను: – గొప్ప ప్రకాశాన్ని కలవాడు
ఆదిదేవ: – సృష్టి కార్యమును ప్రారంభించినవాడు
పురంధర: – రాక్షసుల పురములను నశింపచేసినవాడు
అశోకస్తారణస్తారః శూరః శౌరిర్జనేశ్వరః ।
అనుకూలః శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః ॥ 37 ॥
అశోక: – శోకాన్ని తొలగించువాడు
తారణ: – సంసార సాగరమును దాటించువాడు
తార: – రక్షించువాడు
శూర: – పరాక్రమము గలవాడు
శౌరి: – శూరవంశంలో జన్మించినవాడు (శ్రీకృష్ణుడు)
జనేశ్వర: – జనులకు ప్రభువు
అనుకూల: – భక్తులకు అనుకూలంగా ఉండేవాడు
శతావర్త: – అనేక అవతారాలు తీసుకునేవాడు
పద్మీ – పద్మమును చేతియందు ధరించినవాడు
పద్మనిభేక్షణ: – పద్మమువంటి నేత్రములు కలవాడు
పద్మనాభోఽరవిందాక్షః పద్మగర్భః శరీరభృత్ ।
మహర్ధిరృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః ॥ 38 ॥
పద్మనాభ: – నాభిలో నుండి పద్మం ఉద్భవించినవాడు
అరవిందాక్ష: – కమలరేకులవంటి కన్నులు గలవాడు
పద్మగర్భ: – పద్మగర్భమున నివసించువాడు
శరీరభృత్ – ప్రాణుల శరీరములను పోషించువాడు
మహార్ది: – అపారమైన సంపద, ఐశ్వర్యం కలవాడు
ఋద్ధ: – సంపూర్ణతను పొందినవాడు
వృద్ధాత్మా – ప్రాచీనమైన ఆత్మ స్వరూపుడు
మహాక్ష: – గొప్ప నేత్రములు గలవాడు
గరుడధ్వజ: – గరుడుడిని పతాకంగా కలవాడు
అతులః శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః ।
సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః ॥ 39 ॥
అతుల: – సాటిలేనివాడు
శరభ: – శక్తివంతమైన దివ్య శక్తి స్వరూపుడు
భీమ: – శత్రువులకు భయంకరుడైన వాడు
సమయజ్ఞ: – సర్వులను సమభావముతో భావించువాడు
హవిర్హరి: – యజ్ఞములలో హవిస్సును స్వీకరించువాడు
సర్వలక్షణ లక్షణ్య: – సమస్త శుభలక్షణాలకూ ఆదర్శ స్వరూపుడు
లక్ష్మీవాన్ – సదా లక్ష్మీదేవి తన వక్షస్థలమందు కలిగినవాడు
సమితింజయ: – యుద్ధమున జయించినవాడు
విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరః సహః ।
మహీధరో మహాభాగో వేగవానమితాశనః ॥ 40 ॥
విక్షర: – నాశములేనివాడు
రోహిత: – మత్స్యరూపమును ధరించినవాడు
మార్గ: – మోక్షానికి దారి చూపువాడు
హేతు: – సృష్టికి కారణము అయినవాడు
దామోదర: – పొట్టకు తాడుతో కట్టబడిన వాడు
సహ: – సహనశీలుడు
మహీధర: – భూమిని ధరించినవాడు
మహాభాగ: – భాగ్యవంతుడు
వేగవాన్ – అమితమైన వేగము కలవాడు
అమితాశన: – లయకాలంలో సమస్తాన్ని స్వీకరించువాడు
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.






