శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 41-50 శ్లోకాలు
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం మహాభారతంలోని అనుశాసన పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన పవిత్రమైన దైవిక స్తోత్రం. ఇందులో శ్రీ మహావిష్ణువు యొక్క వెయ్యి దివ్య నామాలు ఉన్నాయి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం జపం చేయడం వలన పాప విమోచనం, ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు కుటుంబ శాంతి కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ దివ్య నామాలలో ప్రతి ఒక్కటి ప్రత్యేక ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉండి భక్తుని జీవితాన్ని సానుకూలంగా మారుస్తుంది.
ఉద్భవః, క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః ।
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ॥ 41 ॥
ఉధ్భవ: – సృష్టికి మూలకారణమైనవాడు
క్షోభణ: – సృష్టికాలమందు కల్లోలము కల్గించువాడు
దేవ: – దివ్యస్వరూపుడు
శ్రీ గర్భ: – సకల ఐశ్వర్యములు తనయందే గలవాడు
పరమేశ్వర: – సర్వేశ్వరుడు
కరణమ్ – జగదుత్పత్తికి సాధనము అయినవాడు
కారణమ్ – జగత్తునకు కారణమైనవాడు
కర్తా – సమస్త కార్యములకు కర్తయైనవాడు
వికర్తా – రూపాంతరం కలిగించువాడు
గహన: – గ్రహించ శక్యముగానివాడు
గుహ: – వ్యక్తము కానివాడు
వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః ।
పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః ॥ 42 ॥
వ్యవసాయ: – మానవాళి అభ్యున్నతికి తానే కృషిచేయువాడు
వ్యవస్థాన: – సర్వవ్యవహారములను యధావిధిగ నడుపువాడు
సంస్థాన: – జీవులకు గమ్యస్థానమైనవాడు
స్థానద: – వారివారి కర్మానుసారముగా స్థానముల నందించువాడు
ధ్రువ: – అవినాశియై, స్థిరమైనవాడు
పరర్ధిః – అపారమైన ఐశ్వర్యం కలవాడు
పరమస్పష్ట: – అత్యంత స్పష్టమైన, స్వయంప్రకాశ స్వరూపుడు
తుష్ట: – సంతృప్తుడు
పుష్ట: – పోషించువాడు
శుభేక్షణ: – శుభప్రదమైన దృష్టిగలవాడు
రామో విరామో విరజో మార్గోనేయో నయోఽనయః ।
వీరః శక్తిమతాం శ్రేష్ఠో ధర్మోధర్మ విదుత్తమః ॥ 43 ॥
రామ: – హృదయాలను రంజింపజేయువాడు
విరామ: – సకలజీవులకు విశ్రాంతి స్థానమైనవాడు
విరజ: – విషయ వాంఛలు లేనివాడు
మార్గ: – మోక్షమునకు మార్గము తానైనవాడు
నేయ: – ఆత్మజ్ఞానము ద్వారా జీవులను నడిపించువాడు
నయ: – జీవులను నడిపించి పరమపదస్థితికి గొనిపోవువాడు
అనయ: – తనను నడుపువాడు మరొకడు లేనివాడు
వీర: – పరాక్రమశాలి
శక్తిమతాం శ్రేష్ఠ: – శక్తిమంతులలో శ్రేష్ఠుడైనవాడు
ధర్మ: – ధర్మ స్వరూపుడు
ధర్మ విదుత్తమ: – ధర్మాన్ని సంపూర్ణంగా తెలిసిన ఉత్తముడు
వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ।
హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః ॥ 44 ॥
వైకుంఠ: – వైకుంఠనాథుడు
పురుష: – సమస్తంలో విస్తరించిన పరమాత్మ
ప్రాణ: – ప్రాణరూపమున చేష్ట కల్గించువాడు
ప్రాణద: – ప్రాణమును ప్రసాదించువాడు
ప్రణవ: – ఓంకార స్వరూపుడు
పృథు: – ప్రపంచరూపమున విస్తరించినవాడు
హిరణ్యగర్భ: – బ్రహ్మదేవుని పుట్టుకకు కారణమైనవాడు
శత్రుఘ్న: – శత్రువులను సంహరించువాడు
వ్యాప్త: – సర్వత్ర వ్యాపించియున్నవాడు
వాయు: – వాయురూపమున సకలమును పోషించువాడు
అథోక్షజ: ఇంద్రియాలకు అతీతమైనవాడు
ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రః సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ 45 ॥
ఋతు: – కాలరూపమైన ఋతువులై భాసించువాడు
సుదర్శన: – శుభదృష్టి కలవాడు
కాల: – కాల స్వరూపుడు
పరమేష్ఠీ – సర్వోన్నతుడు
పరిగ్రహ: – గ్రహించువాడు
ఉగ్ర: – భయంకర శక్తి కలవాడు
సంవత్సర: – సంవత్సర స్వరూపుడు
దక్ష: – కర్మలను సమర్థతతో నిర్వర్తించువాడు
విశ్రామ: – జీవులకు పరమ విశ్రాంతి స్థానము అయినవాడు
విశ్వదక్షిణ: – అందరికీ కృప, దానం చేయువాడు
విస్తారః స్థావర స్థాణుః ప్రమాణం బీజమవ్యయమ్ ।
అర్థోఽనర్థో మహాకోశో మహాభోగో మహాధనః ॥ 46 ॥
విస్తార: – సమస్తంలో విస్తరించినవాడు
స్థావర: – స్థిరంగా ఉన్న సర్వ వస్తువులలో నివసించువాడు
స్థాణుః –స్థిరస్వరూపుడు
ప్రమాణం – సకలమునకు ప్రమాణమైనవాడు
బీజమవ్యయం – క్షయము కాని బీజము
అర్థ: – అందరిచే కోరబడినవాడు
అనర్థ: – తాను ఏదియును కోరనివాడు
మహాకోశ: – అన్నమయాది పంచకోశములచే ఆవరించినవాడు
మహాభోగ: – ఆనంద స్వరూపమైన భోగము కలవాడు
మహాధన: – గొప్ప ఐశ్వర్యము కలవాడు
అనిర్విణ్ణః స్థవిష్ఠోభూద్ధర్మయూపో మహామఖః ।
నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః, క్షామః సమీహనః ॥ 47 ॥
అనిర్విణ్ణ: – వేదన లేనివాడు
స్థవిష్ఠ: – విరాడ్రూపమై భాసించువాడు
అభూ: – పుట్టుక లేనివాడు
ధర్మయూప: – ధర్మములన్ని తనయందే ఉన్నవాడు
మహామఖ: – యజ్ఞస్వరూపుడు
నక్షత్రనేమి: – నక్షత్రచక్రాన్ని నియంత్రించువాడు
నక్షత్రీ – నక్షత్రాల అధిపతి
క్షమ: – సహనశీలుడు
క్షామ: – నశించనివాడు
సమీహన: – సర్వ భూతహితమును కోరువాడు
యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాంగతిః ।
సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్ ॥ 48 ॥
యజ్ఞ: – యజ్ఞ స్వరూపుడు
ఇజ్య: – యజ్ఞములచే ఆరాధించుబడువాడు
మహేజ్య: – గొప్పగా పూజింపదగినవాడు
క్రతు: – యజ్ఞ స్వరూపుడు
సత్రమ్ – నియమిత ధర్మ స్వరూపుడు
సతాంగతి: – సజ్జనులకు గమ్యస్థానం
సర్వదర్శీ – సకలమును దర్శించువాడు
విముక్తాత్మా – బంధనాల నుండి విముక్తుడైన స్వరూపుడు
సర్వజ్ఞ: – సర్వము తెలిసినవాడు
జ్ఞానముత్తమమ్ – ఉత్తమమైన జ్ఞాన స్వరూపుడు
సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ ।
మనోహరో జితక్రోధో వీర బాహుర్విదారణః ॥ 49 ॥
సువ్రత: – చక్కని వ్రతదీక్ష కలవాడు
సుముఖ: – మంగళకరమైన, అందమైన ముఖం కలవాడు
సూక్ష్మ: – సూక్ష్మ స్వరూపుడు
సుఘోష: – మధురమైన నాదం కలవాడు
సుఖద: – సుఖమును అనుగ్రహించువాడు
సుహృత్ – హితకారి
మనోహర: – మనస్సులను హరించువాడు
జితక్రోధ: – కోపాన్ని జయించినవాడు
వీరబాహు: – బలవంతమైన భుజాలు కలవాడు
విదారణ: – దుష్టులను చీల్చి చెండాడువాడు
స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్। ।
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ॥ 50 ॥
స్వాపన: – మాయనిద్ర కలిగించువాడు
స్వవశ: – సర్వ స్వతంత్రమైనవాడు
వ్యాపీ – సర్వత్ర వ్యాపించియున్నవాడు
నైకాత్మా – అనేక రూపములలో ఉన్నవాడు
నైక కర్మకృత్ – అనేక కార్యములు చేయువాడు
వత్సర: – సర్వులకు వాసమైనవాడు
వత్సల: – భక్తులపై అపరిమిత వాత్సల్యము కలవాడు
వత్సీ – తండ్రి వంటివాడు
రత్నగర్భ: – రత్నాలను తనలో దాచుకున్నవాడు
ధనేశ్వర: – ధనములకు ప్రభువు
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.


