స్తోత్రాలకు తెలుగులో అర్థం » విష్ణు స్తోత్రాలు » శ్రీ విష్ణు సహస్రనామ ఫలశ్రుతి తెలుగులో అర్థం 21-30 శ్లోకాలు
విష్ణు సహస్రనామ ఫలశ్రుతి 21-30 శ్లోకాల తెలుగులో అర్థం

శ్రీ విష్ణు సహస్రనామ ఫలశ్రుతి తెలుగులో అర్థం 21-30 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఎంతో పవిత్రమైనది, శక్తివంతమైనది. ఉత్తర పీఠిక లేదా ఫలశ్రుతి లోని శ్లోకాలను, వాటి సంపూర్ణ అర్థాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈ ఫలశ్రుతి పఠించడం లేదా వినడం వల్ల సకల రోగాలు, భయాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని సాక్షాత్తు వ్యాస మహర్షి మహాభారతంలో వివరించారు. ప్రశాంతమైన మనసుతో, ఈ శక్తివంతమైన ఫలశ్రుతి అర్థాన్ని వినండి.

ఇమం స్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితమ్ ।
పఠేద్య ఇచ్చేత్పురుషః శ్రేయః ప్రాప్తుం సుఖాని చ ॥ 21

వేదవ్యాసునిచే కీర్తించబడిన ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, సుఖాలను, అత్యున్నతమైన శ్రేయస్సును కోరుకునే ఏ మానవుడైనా నిత్యం పఠించాలి.

విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయం।
భజంతి యే పుష్కరాక్షం న తే యాంతి పరాభవమ్ ॥ 22

విశ్వనాథుడు, పుట్టుక లేనివాడు, లోక ప్రభువు, నాశనం లేనివాడు, పద్మాల వంటి కన్నులు కలవాడు అయిన ఆ శ్రీహరిని ఎవరైతే పూజిస్తారో వారు ఎన్నటికీ పరాజయం పాలుకారు.

న తే యాంతి పరాభవం ఓం నమ ఇతి ।

అర్జున ఉవాచ

పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ ।
భక్తానా మనురక్తానాం త్రాతా భవ జనార్దన ॥ 23

పద్మ పత్రాల వంటి విశాలమైన కన్నులు కలవాడా! పద్మనాభా! దేవదేవా! జనార్దనా! నీ పట్ల అపారమైన ప్రేమ, భక్తి కలిగిన నీ భక్తులను ఎల్లప్పుడూ రక్షించు స్వామీ!

శ్రీభగవానువాచ

యో మాం నామసహస్రేణ స్తోతుమిచ్ఛతి పాండవ ।
సోఽహమేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః ॥ 24

ఓ అర్జునా! ఎవరైతే నన్ను ఈ వెయ్యి నామాలతో స్తుతించాలని కోరుకుంటారో, వారు ఏకాగ్రతతో ఒక్క నామాన్ని జపించినా నన్ను సంపూర్ణంగా స్తుతించినట్లే, ఇందులో ఎటువంటి సందేహం లేదు.

స్తుత ఏవ న సంశయ ఓం నమ ఇతి ।

వ్యాస ఉవాచ

వాసనాద్వాసుదేవస్య వాసితం భువనత్రయమ్ ।
సర్వభూతనివాసోఽసి వాసుదేవ నమోఽస్తు తే ॥ 25

ఓ వాసుదేవా! ఈ ముల్లోకాలు నీ చేతనే నివాసయోగ్యంగా చేయబడ్డాయి. సమస్త ప్రాణులలో నివసించేవాడవు నీవే. నీకు నమస్కారములు.

శ్రీవాసుదేవ నమోస్తుత ఓం నమ ఇతి ।

పార్వత్యువాచ

కేనోపాయేన లఘునా విష్ణోర్నామసహస్రకమ్ ।
పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో ॥ 26

ఓ ప్రభో! పండితులు నిత్యం పఠించే ఈ విష్ణు సహస్రనామాలను అత్యంత సులభంగా ఠించే ఉపాయం ఏదైనా ఉంటే నేను

వినాలని కోరుకుంటున్నాను.

ఈశ్వర ఉవాచ

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ।
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ॥ 27

ఓ అందమైన ముఖం కలదానా (పార్వతీ)! “శ్రీరామ రామ రామ” అని రామ నామాన్ని జపించడం వల్ల నా మనస్సు సంతోషిస్తోంది. ఆ ఒక్క రామ నామం విష్ణువు యొక్క వెయ్యి నామాలతో (విష్ణు సహస్రనామంతో) సమానం.

శ్రీరామ నామ వరానన ఓం నమ ఇతి ।

బ్రహ్మోవాచ

నమోఽస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరుబాహవే ।
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీ యుగధారిణే నమః ॥ 28

అనంతమైనవాడు, వేలకొలది రూపాలు, పాదాలు, కన్నులు, తలలు, తొడలు, చేతులు కలవాడు. శాశ్వతుడు, వేలకొలది కోటి యుగాలను ధరించేవాడు అయిన ఆ సహస్రనామ పురుషుడికి (శ్రీహరికి) నమస్కారములు.

శ్రీ సహస్రకోటీ యుగధారిణే నమ ఓం నమ ఇతి ।

సంజయ ఉవాచ

యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః ।
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ ॥ 29

యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటాడో, ధనుర్ధారి అయిన అర్జునుడు ఎక్కడ ఉంటాడో… అక్కడ ఖచ్చితంగా సిరిసంపదలు, విజయం, సాధారణమైన శక్తి, స్థిరమైన నీతి ఉంటాయని నా ప్రగాఢ విశ్వాసం

శ్రీ భగవాన్ ఉవాచ

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే ।
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం। ॥ 30

(భగవద్గీత శ్లోకం) ఏ ఇతర ఆలోచనలు లేకుండా (అనన్య భక్తితో) నన్నే ఎల్లప్పుడూ ధ్యానిస్తూ, ఆరాధించే భక్తుల యొక్క యోగక్షేమాలను నేనే స్వయంగా వహిస్తాను.

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

శ్రీ విష్ణు సహస్రనామ ఫలశ్రుతి తెలుగులో అర్థం 1-10 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్రనామ ఫలశ్రుతి తెలుగులో అర్థం 11-20 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్రనామ ఫలశ్రుతి తెలుగులో అర్థం 21-30 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్రనామ ఫలశ్రుతి తెలుగులో అర్థం 31-33 శ్లోకాలు

ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top