స్తోత్రాలకు తెలుగులో అర్థం » విష్ణు స్తోత్రాలు » శ్రీ విష్ణు సహస్రనామ ఫలశ్రుతి తెలుగులో అర్థం 11-20 శ్లోకాలు
విష్ణు సహస్రనామ ఫలశ్రుతి 11-20 శ్లోకాల తెలుగులో అర్థం

శ్రీ విష్ణు సహస్రనామ ఫలశ్రుతి తెలుగులో అర్థం 11-20 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఎంతో పవిత్రమైనది, శక్తివంతమైనది. ఉత్తర పీఠిక లేదా ఫలశ్రుతి లోని శ్లోకాలను, వాటి సంపూర్ణ అర్థాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈ ఫలశ్రుతి పఠించడం లేదా వినడం వల్ల సకల రోగాలు, భయాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని సాక్షాత్తు వ్యాస మహర్షి మహాభారతంలో వివరించారు. ప్రశాంతమైన మనసుతో, ఈ శక్తివంతమైన ఫలశ్రుతి అర్థాన్ని వినండి.

న వాసుదేవ భక్తానామశుభం విద్యతే క్వచిత్ ।
జన్మమృత్యుజరావ్యాధిభయం నైవోపజాయతే ॥ 11

తాత్పర్యం: శ్రీ మహావిష్ణువు భక్తులకు ఎక్కడా, ఎప్పుడూ ఏ విధమైన కీడు జరగదు. వారికి పుట్టుక, మరణం, ముసలితనం, రోగాల పట్ల ఎటువంటి భయం ఉండదు.

ఇమం స్తవమధీయానః శ్రద్ధాభక్తిసమన్వితః ।
యుజ్యేతాత్మ సుఖక్షాంతి శ్రీధృతి స్మృతి కీర్తిభిః ॥ 12

శ్రద్ధా భక్తులతో ఈ స్తోత్రాన్ని పఠించేవారు మానసిక ప్రశాంతతను, ఓర్పును, సంపదను, ధైర్యాన్ని, మంచి జ్ఞాపకశక్తిని, గొప్ప కీర్తిని పొందుతారు.

న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభామతిః ।
భవంతి కృతపుణ్యానాం భక్తానాం పురుషోత్తమే ॥ 13

పుణ్యాత్ములైన ఆ పురుషోత్తముని భక్తుల మనస్సులో కోపం, అసూయ, దురాశ, ఎలాంటి చెడు తలంపులు చోటు చేసుకోవు.

ద్యౌః స-చంద్రార్క నక్షత్రా ఖం దిశో భూర్మహోదధిః ।
వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః ॥ 14

సూర్య, చంద్ర, నక్షత్రాలతో కూడిన ఆకాశం, అంతరిక్షం, దిక్కులు, భూమి, మహాసముద్రాలు… ఇవన్నీ మహాత్ముడైన ఆ వాసుదేవుని అపారమైన శక్తి చేతనే భరించబడుతున్నాయి.

ససురాసురగంధర్వం సయక్షోరగరాక్షసమ్ ।
జగద్వశే వర్తతేదం కృష్ణస్య స చరాచరం। ॥ 15

దేవతలు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, పాములు, కదిలేవి, కదలనివి అయిన సమస్త చరాచర సృష్టి అంతా ఆ శ్రీకృష్ణుని ఆధీనంలోనే నడుస్తోంది.

ఇంద్రియాణి మనోబుద్ధిః సత్త్వం తేజో బలం ధృతిః ।
వాసుదేవాత్మకాన్యాహుః, క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవ చ ॥ 16

మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, సత్వగుణం, తేజస్సు, బలం, ధైర్యం, ఈ శరీరం, శరీరంలో ఉండే ఆత్మ – ఇవన్నీ వాసుదేవుని స్వరూపాలే అని పెద్దలు చెబుతారు.

సర్వాగమానామాచారః ప్రథమం పరికల్పతే ।
ఆచారప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః ॥ 17

అన్ని శాస్త్రాలలోనూ సదాచారమే మొదటిదిగా చెప్పబడింది. ఆ సదాచారం నుండే ధర్మం పుడుతుంది. ఆ ధర్మానికి ప్రభువు

 శ్రీ మహావిష్ణువే.

ఋషయః పితరో దేవా మహాభూతాని ధాతవః ।
జంగమాజంగమం చేదం జగన్నారాయణోద్భవమ్ ॥ 18

మహర్షులు, పితృదేవతలు, దేవతలు, పంచభూతాలు, ధాతువులు, కదిలేవి, కదలనివి అయిన ఈ సమస్త జగత్తు నారాయణుని నుండే ఉద్భవించాయి.

యోగోజ్ఞానం తథా సాంఖ్యం విద్యాః శిల్పాదికర్మ చ ।
వేదాః శాస్త్రాణి విజ్ఞానమేతత్సర్వం జనార్దనాత్ ॥ 19

యోగం, జ్ఞానం, సాంఖ్య యోగం, సకల విద్యలు, శిల్పకళాది కర్మలు, వేదాలు, శాస్త్రాలు, విజ్ఞానం – ఇవన్నీ జనార్దనుని నుండే ఉద్భవించాయి

ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః ।
త్రీంలోకాన్వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుzగవ్యయః ॥ 20

విష్ణువు ఒక్కడే అయినా, అనంత రూపాలతో సమస్త ప్రాణులలో వ్యాపించి ఉన్నాడు. ఆ నాశనము లేని విశ్వరూపుడు మూడు లోకాలను వ్యాపించి ఉండి, సర్వ విశ్వాన్ని పాలిస్తున్నాడు.

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

శ్రీ విష్ణు సహస్రనామ ఫలశ్రుతి తెలుగులో అర్థం 1-10 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్రనామ ఫలశ్రుతి తెలుగులో అర్థం 11-20 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్రనామ ఫలశ్రుతి తెలుగులో అర్థం 21-30 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్రనామ ఫలశ్రుతి తెలుగులో అర్థం 31-33 శ్లోకాలు

 ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top