వైశాఖ పురాణం 30వ అధ్యాయము
వైశాఖ పురాణం 30వ అధ్యాయము నారద మహర్షి రాజర్షియగు అంబరీష మహారాజుకు వైశాఖ మాస విశిష్టతను వివరిస్తూ ఇలా అన్నారు. శ్రుతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుతో వైశాఖ మాసపు ముగింపు రోజులను గురించి ఎంతో అద్భుతంగా వివరించారు. వైశాఖ శుక్లపక్షంలో వచ్చే చివరి మూడు తిథులు అంటే త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమలను కలిపి ‘పుష్కరిణి’ అని పిలుస్తారు. ఈ మూడు రోజులు సర్వ పాపాలను హరించి, సకల శుభాలను కలిగిస్తాయి. ఒకవేళ నెలంతా వైశాఖ వ్రతాన్ని ఆచరించలేకపోయిన […]











