కార్యకారణ నిర్ముక్తా, కామకేళి తరంగితా । కనత్-కనకతాటంకా, లీలావిగ్రహ ధారిణీ ॥ 161 ॥ కార్యకారణ నిర్ముక్తా :కార్యాకరణములు లేని శ్రీ మాత కామకేళీ తరంగితా :కోరికల తరంగముల యందు విహరించునది. కనత్కనక తాటంకా :మనోహరమగు ధ్వని చేయు బంగారు చెవి కమ్మలు కలది. లీలావిగ్రహ ధారిణి :లీలకై అనాయాసముగా అద్భుత రూపములను ధరించునది. అజాక్షయ వినిర్ముక్తా, ముగ్ధా క్షిప్రప్రసాదినీ । అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా ॥ 162 ॥ అజా :పుట్టుక లేనిది క్షయ […]
Tag: lalitha sahasra nama sthotram word by word meaning
లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -8 Lalitha Sahasra namam meaning in telugu
చిత్కళా,ఽనందకలికా, ప్రేమరూపా, ప్రియంకరీ । నామపారాయణ ప్రీతా, నందివిద్యా, నటేశ్వరీ ॥ 141 ॥ చిత్కళానందకలికా : ఙ్ఞానము, ఆనందము అను జ్యోతిస్వరూపిణి ప్రేమరూపా : ప్రేమమూర్తి ప్రియంకరీ : కోరికలు సిద్ధింపచేయునది నామపారాయణ ప్రీతా : తన నామములను పారాయణచేయు వారియందు ప్రీతి కలిగినది నందివిద్యా : అమ్మవారికి సంబంధించిన ఒక మంత్ర విశేషము నటేశ్వరీ : నటరాజు యొక్క శక్తి మిథ్యా జగదధిష్ఠానా ముక్తిదా, ముక్తిరూపిణీ । లాస్యప్రియా, లయకరీ, లజ్జా, రంభాది వందితా […]
లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -7 Lalitha Sahasra namam meaning in telugu
దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ । గురుమూర్తి, ర్గుణనిధి, ర్గోమాతా, గుహజన్మభూః ॥ 121 ॥ దరాందోళిత దీర్ఘాక్షీ – కొంచెముగా చలించు ఆకర్ణాంత విశాలమైన కన్నులు గలది. దరహాసోజ్జ్వలన్ముఖీ – మందహాసము చేత ప్రకాశించు ముఖము కలది. గురుమూర్తిః – గురువు యొక్క రూపముగా నున్నది. గుణనిధిః – గుణములకు గని వంటిది. గోమాతా – గోవులకు తల్లి వంటిది. గుహజన్మభూః – కుమారస్వామి తల్లి. దేవేశీ, దండనీతిస్థా, దహరాకాశ రూపిణీ । ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల […]
లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -5 Lalitha Sahasra namam meaning in telugu
పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా । మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ పరా – పరాస్థితిలోని వాగ్రూపము. ప్రత్యక్చితీరూపా – స్వస్వరూపము యొక్క జ్ఞానమే స్వరూపముగా గలది. పశ్యంతీ – రెండవస్థితిగా వ్యక్తం కాబోయే వాక్కు పరదేవతా – పశ్యంతీ వాక్కు యొక్క సూక్ష్మరూపము. మధ్యమా – పశ్యంతీ, వైఖరీ వాక్కులకు మధ్య వుండు స్థితికి సంబంధించిన వాక్కు. వైఖరీరూపా – స్పష్టముగా వ్యక్తమైన వాక్కు. భక్తమానస హంసికా – భక్తుల […]
లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -4 Lalitha Sahasra namam meaning in telugu
పంచప్రేతాసనాసీనా, పంచబ్రహ్మ స్వరూపిణీ । చిన్మయీ, పరమానందా, విజ్ఞాన ఘనరూపిణీ ॥ 61 ॥ పంచప్రేతాసనాసీనా – పంచప్రేతలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులను ఆసనముగా కలిగి ఆసీనులైనది. పంచబ్రహ్మ స్వరూపిణీ – పంచబ్రహ్మలైన సద్యోజాత, అఘోర, వామదేవ, తత్పురుష, ఈశాన స్వరూపమైనది. చిన్మయీ – జ్ఞానముతో నిండినది. పరమానందా – బ్రహ్మానంద స్వరూపము లేక నిరపేక్షకానంద రూపము. విజ్ఞానఘన రూపిణీ – విజ్ఞానము, స్థిరత్వము పొందిన రూపము గలది. ధ్యానధ్యాతృ ధ్యేయరూపా, ధర్మాధర్మ వివర్జితా […]
లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -3 Lalitha Sahasra namam meaning in telugu
భవానీ, భావనాగమ్యా, భవారణ్య కుఠారికా । భద్రప్రియా, భద్రమూర్తి, ర్భక్తసౌభాగ్య దాయినీ ॥ 41 ॥ భవానీ – భవుని భార్య. భావనాగమ్యా – భావన చేత పొంద శక్యము గానిది. భవారణ్య కుఠారికా – సంసారమనే అడవికి గండ్రగొడ్డలి వంటిది. భద్రప్రియా – శుభములు, శ్రేష్ఠములు అయిన వాటి యందు ఇష్టము కలిగినది. భద్రమూర్తిః – శుభమైన లేదా మంగళకరమైన స్వరూపము గలది. భక్త సౌభాగ్యదాయినీ – భక్తులకు సౌభాగ్యమును ఇచ్చునది. భక్తిప్రియా, భక్తిగమ్యా, భక్తివశ్యా, […]
లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -2 Lalitha Sahasra namam meaning in telugu
సర్వారుణాఽనవద్యాంగీ సర్వాభరణ భూషితా । శివకామేశ్వరాంకస్థా, శివా, స్వాధీన వల్లభా ॥ 21 ॥ సర్వారుణా – సర్వము అరుణ వర్ణంగా భాసించునది. అనవద్యాంగీ – వంక పెట్టుటకు వీలులేని అవయవములు గలది. సర్వాభరణ భూషితా – సమస్తమైన నగల చేత అలంకరించబడింది. శివకామేశ్వరాంకస్థా – కామ స్వరూపుడు అగు శంకరుని యొక్క తొడయందున్నది. శివా – వ్యక్తమైన శివుని రూపము కలది. స్వాధీన వల్లభా – తనకు లోబడిన భర్త గలది. సుమేరు మధ్యశృంగస్థా, శ్రీమన్నగర […]
శ్రీ లలితా సహస్రనామాలు – తెలుగులో అర్థం -1 Lalitha Sahasra namam meaning in telugu
శ్రీ మాతా, శ్రీ మహారాజ్ఞీ, శ్రీమత్-సింహాసనేశ్వరీ । చిదగ్ని కుండసంభూతా, దేవకార్యసముద్యతా ॥ 1 ॥ శ్రీమాతా : మంగళకరమైన, శుభప్రదమైన తల్లి. శ్రీమహారాజ్ఞీ : శుభకరమైన గొప్పదైన రాణి. శ్రీమత్సింహాసనేశ్వరీ : శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించింది. చిదగ్ని కుండ సంభూతా : చైతన్యమనే అగ్ని కుండము నుండి చక్కగా ఆవిర్భావము చెందినది. దేవకార్య సముద్యతా : దేవతల యొక్క కార్యములకై ఆవిర్భవించినది. ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా । రాగస్వరూప పాశాఢ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా ॥ […]