లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -2 సర్వారుణాఽనవద్యాంగీ సర్వాభరణ భూషితా ।శివకామేశ్వరాంకస్థా, శివా, స్వాధీన వల్లభా ॥ 21 ॥ సర్వారుణా – సర్వము అరుణ వర్ణంగా భాసించునది.అనవద్యాంగీ – వంక పెట్టుటకు వీలులేని అవయవములు గలది.సర్వాభరణ భూషితా – సమస్తమైన నగల చేత అలంకరించబడింది.శివకామేశ్వరాంకస్థా – కామ స్వరూపుడు అగు శంకరుని యొక్క తొడయందున్నది.శివా – వ్యక్తమైన శివుని రూపము కలది.స్వాధీన వల్లభా – తనకు లోబడిన భర్త గలది. సుమేరు మధ్యశృంగస్థా, శ్రీమన్నగర నాయికా […]
శ్రీ లలితా సహస్రనామాలు – తెలుగులో అర్థం -1 Lalitha Sahasra namam meaning in telugu
శ్రీ లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం శ్రీ మాతా, శ్రీ మహారాజ్ఞీ, శ్రీమత్-సింహాసనేశ్వరీ ।చిదగ్ని కుండసంభూతా, దేవకార్యసముద్యతా ॥ 1 ॥శ్రీమాతా – మంగళకరమైన, శుభప్రదమైన తల్లి. శ్రీమహారాజ్ఞీ – శుభకరమైన గొప్పదైన రాణి. శ్రీమత్సింహాసనేశ్వరీ – శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించింది. చిదగ్ని కుండ సంభూతా – చైతన్యమనే అగ్ని కుండము నుండి చక్కగా ఆవిర్భావము చెందినది. దేవకార్య సముద్యతా – దేవతల యొక్క కార్యములకై ఆవిర్భవించినది. ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా ।రాగస్వరూప పాశాఢ్యా, […]
TTD Brahmothsavaalu
వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన| వేంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి|| సమస్త బ్రహ్మాండమంతా గాలించినా, వేంకటాద్రికి సమానమైన పవిత్ర స్థలం లేదు, వేంకటేశ్వరునితో సమానమైన దైవం లేదు. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన కలియుగ వైకుంఠం- తిరుమల తిరుపతి క్షేత్రంలో అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా, బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా స్వామి వారి సాలకట్ల (వార్షిక) బ్రహ్మోత్సవాలు చూడాలని కోరుకుంటారు. […]
GARBHARAKSHAMBIKA TEMPLE, TAMILNADU (గర్భరక్షాంబికా ఆలయం, తమిళనాడు)
దేవుడు అన్ని చోట్లా సర్వవ్యాప్తి అయి ఉన్నా, కొన్ని ప్రదేశాల్లో కొన్ని రూపాలలో విశేషించి ఆయన అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. వీటినే పుణ్యక్షేత్రాలు అని అంటారు. పుణ్యక్షేత్రాల్లో ఒక్కో క్షేత్రం ఒక్కో కారణానికి ప్రసిద్ధి చెందాయి. అలాంటి పుణ్యక్షేత్రాలలో ఒకటి గర్భరక్షాంబికా ఆలయం. ఇక్కడ అమ్మవారు స్త్రీలలో గర్భసంబంధిత లోపాలను తొలగించి సంతాన ప్రాప్తిని కటాక్షించే తల్లిగా వెలిసింది. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం చేసేందుకు సాక్షాత్తు జగన్మాత గర్భరక్షాంబిక అమ్మవారిగా భూమిపై అవతరించినట్లు స్థల పురాణం. ఈ […]
garbharakshambika stotram in telugu, శ్రీ గర్భరక్షాంబికా స్తోత్రం
Garbharakshambika stotram in Telugu శ్రీ గర్భరక్షాంబికా స్తోత్రం Garbharakshambika stotram in Telugu శ్రీ గర్భరక్షాంబికా స్తోత్రం శ్రీమాధవీ కాననస్థే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీమ్ || వాపీతటే వామభాగే వామదేవస్య దేవస్య దేవి స్థితా త్వమ్ |మాన్యా వరేణ్యా వదాన్యా పాహి గర్భస్థజంతూన్ తథా భక్తలోకాన్ || 1 || శ్రీమాధవీ కాననస్థే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీమ్ || శ్రీగర్భరక్షాపురే యా దివ్యసౌందర్యయుక్తా సుమాంగళ్యగాత్రీ |ధాత్రీ జనిత్రీ జనానాం దివ్యరూపాం […]
సౌందర్యలహరి 91-100 శ్లోకాలకు అర్థం
సౌందర్యలహరి 91-100 శ్లోకాలకు అర్థం 91. శ్లోకం పదన్యాస క్రీడాపరిచయ మివారబ్ధు మనసఃస్ఖలంతస్తే ఖేలం భవన కలహంసా న జహతి ।అతస్తేషాం శిక్షాం సుభగ మణిమంజీర రణిత-చ్ఛలాదాచక్షాణం చరణకమలం చారుచరితే ॥ 91 ॥ తాత్పర్యం: ఓ చారుచరితా! అందమైన నీ పాద విన్యాస, క్రీడాభ్యాసమును, తామునూ పొందగోరినవైన నీ పెంపుడు రాజహంసలు తొట్రుపాటు చెందుచూ, నీ విలాస గమనమును వీడలేకున్నవి. అందువలన నీ పాదపద్మము – కెంపులు మొదలగు రత్నములు తాపిన అందియల చిరుసవ్వడులనెడి నెపముతో […]
సౌందర్యలహరి 81-90 శ్లోకాలకు అర్థం
సౌందర్యలహరి 81-90 శ్లోకాలకు అర్థం 81. శ్లోకం గురుత్వం విస్తారం క్షితిధరపతిః పార్వతి నిజా-న్నితంబాదాచ్ఛిద్య త్వయి హరణ రూపేణ నిదధే ।అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతీంనితంబప్రాగ్భారః స్థగయతి లఘుత్వం నయతి చ ॥ 81 ॥ తాత్పర్యం: అమ్మా పార్వతీ! పర్వతరాజగు నీ తండ్రి హిమవంతుడు బరువు, విశాలత్వములను తన కొండ నడుమయందు గల చదునైన ప్రదేశము నుండి వేరు చేసి, నీకు “స్త్రీ ధనము” రూపముగా సమర్పించెను. అందువలననే – నీ పిరుదుల యొక్క గొప్పదనము […]
సౌందర్యలహరి 71-80 శ్లోకాలకు అర్థం
సౌందర్యలహరి 71-80 శ్లోకాలకు అర్థం 71. శ్లోకం నఖానా ముద్ద్యోతైర్నవ నలినరాగం విహసతాంకరాణాం తే కాంతిం కథయ కథయామః కథముమే ।కయాచిద్వా సామ్యం భజతు కలయా హంత కమలంయది క్రీడల్లక్ష్మీ చరణ తలలాక్షారస ఛణమ్ ॥ 71 ॥ తాత్పర్యం: తల్లీ ! ఉమాదేవీ ! అప్పుడే వికసించు తామరపూవు యొక్క ఎర్రని కాంతులను సైతం పరిహసించు గోళ్ళ కాంతులతో శోభిల్లు – నీ యొక్క హస్త ప్రభావైభవమును ఏ విధముగా వర్ణించగలము? క్రీడించు లక్ష్మీదేవి పాద […]
సౌందర్యలహరి 61-70 శ్లోకాలకు అర్థం
సౌందర్యలహరి 61-70 శ్లోకాలకు అర్థం 61. శ్లోకం అసౌ నాసావంశస్తుహిమగిరి వంశ ధ్వజపటిత్వదీయో నేదీయః ఫలతు ఫలమస్మాక ముచితమ్ ।వహన్నంతర్ముక్తాః శిశిరతర నిశ్వాస గలితంసమృద్ధ్యా యత్తాసాం బహిరపి చ ముక్తామణిధరః ॥ 61 ॥ తాత్పర్యం: హిమగిరి వంశధ్వజమునకు పతాకము వంటి ఓ హైమవతీ ! నీ నాసిక అను వెదురు దండము మాకు తగిన విధముగా కోరిన వాటిని ప్రాప్తింపచేయుగాక! ఆ నీ నాసావంశదండము లోపల ముత్యములను ధరించుచున్నదని చెప్పవచ్చును. కారణమేమనగా – నీ నాసాదండము […]
సౌందర్యలహరి 51-60 శ్లోకాలకు అర్థం
సౌందర్యలహరి 51-60 శ్లోకాలకు అర్థం 51. శ్లోకం శివే శృంగారార్ద్రా తదితరజనే కుత్సనపరాసరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతీ ।హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజయినీసఖీషు స్మేరా తే మయి జననీ దృష్టిః సకరుణా ॥ 51 ॥ తాత్పర్యం: తల్లీ! జగజ్జననీ! నీ యొక్క చూపు –నీ పతి అయిన శివునియందు శృంగార రసమును,శివేతర జనులయందు అయిష్ట, పరాణ్ముఖత్వములతో బీభత్సరసమును, గంగ యెడల రోషముతో రౌద్రరసమును, శివుని చరిత్రను వినుచున్నపుడు గాని, శివుని మూడవ నేత్ర వైశిష్టమును చూచునపుడు […]