అరిటాకులో భోజనం వడ్డించే విధానం
“అన్నం పరబ్రహ్మ స్వరూపం” అంటారు. భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతంలో అరిటాకుపై భోజనం చేయడానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అరిటాకులో వడ్డించడం, భోజనం చేయడం కూడా ఒక కళ. ఆహార పదార్థాలను పద్ధతి ప్రకారం అమర్చడాన్ని “పరిమార్చడం” అని అంటారు. మరి అరిటాకులో భోజనం వడ్డించే విధానం ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా అరిటాకును శుభ్రంగా కడగాలి. మనం కుడిచేత్తో అన్నం కలుపుకొని తింటాం కాబట్టి, అరిటాకు వెడల్పుగా ఉండే పెద్ద అంచు భోజనం చేసే వ్యక్తి వైపు రావాలి. చిన్న అంచు ఎడమవైపు ఉండేలా వేయాలి. అరిటాకు లోపలి భాగం పైవైపున ఉండేలా పరచాలి. ఇలా వేయడం వలన భోజనం మధ్యలో మంచినీళ్లు తీసుకునేటప్పుడు ఎడమ నుండి కుడికి జరిగే శరీర కదలికలు సౌకర్యంగా ఉండి, గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా ఉంటాయని భావిస్తారు.
వడ్డింపు క్రమం ఇలా ఉంటుంది:
ముందుగా ఎడమవైపు పైభాగంలో ఉప్పు వేయాలి.
కుడివైపు కింద భాగంలో లడ్డు, పాయసం, జాంగ్రీ వంటి తీపి పదార్థాలను వడ్డించాలి.
ఎడమవైపున ఊరగాయ, రోటీ పచ్చడి (రాజా కూరగాయలతో చేసే పచ్చడి) వేయాలి.
కుడివైపున వేపుళ్లు, పొడి కూరలు ముందుగా వేయాలి.
తర్వాత ముద్దగా ఉండే కూరలు, ఇగుర్లు వంటి వాటిని వేయాలి.
వాటికి ఎడమవైపున ముందుగా పులుసు, సాంబార్, తరువాత పెరుగు వడ్డించాలి.
వడలు, గారెలు, అప్పడాలు వంటి వంటకాలను ఎడమవైపు కింది భాగంలో వేయాలి.
చిత్రాన్నం (పులిహోర, దడోస వంటి వంటకాలు) తరువాత వడ్డించాలి.
కుడివైపున పప్పును వడ్డించాలి.
చివరగా అన్నం వడ్డించాలి.
పూరి వంటి పదార్థాలను అన్నం పక్కన వేయాలి.
అరటిపండు వంటి ఫలాలను భోజనం చివర్లో తీసుకుంటారు కాబట్టి ఎడమవైపున ఉంచాలి.
చివరగా నెయ్యి వడ్డించిన తరువాత “పరిమార్చడం” పూర్తయిందని అర్థం. అప్పుడు భోజనం ప్రారంభించవచ్చు.
ప్రాంతాన్ని బట్టి భాష, ఆచారాలు, సందర్భాలను అనుసరించి ఈ వడ్డించే విధానంలో కొన్ని మార్పులు ఉండవచ్చు. అయితే ఇది ప్రాథమికంగా అనుసరించే సంప్రదాయ పద్ధతి.
మరిన్ని ఆచారాల గురించి తెలుసుకోండి
ఆచారాలు
ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులు, మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. 🙏
ఈ సమాచారాన్ని video రూపంలో ఇక్కడ చూడండి. 👇👇👇

