కార్యకారణ నిర్ముక్తా, కామకేళి తరంగితా ।
కనత్-కనకతాటంకా, లీలావిగ్రహ ధారిణీ ॥ 161 ॥
కార్యకారణ నిర్ముక్తా :కార్యాకరణములు లేని శ్రీ మాత
కామకేళీ తరంగితా :కోరికల తరంగముల యందు విహరించునది.
కనత్కనక తాటంకా :మనోహరమగు ధ్వని చేయు బంగారు చెవి కమ్మలు కలది.
లీలావిగ్రహ ధారిణి :లీలకై అనాయాసముగా అద్భుత రూపములను ధరించునది.
అజాక్షయ వినిర్ముక్తా, ముగ్ధా క్షిప్రప్రసాదినీ ।
అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా ॥ 162 ॥
అజా :పుట్టుక లేనిది
క్షయ వినిర్ముక్తా :మాయాతీతమైనది
ముగ్ధా :12 – 16 సంవత్సరముల బాలికా రూపము కలిగినది
క్షిప్రప్రసాదినీ :వెంటనే అనుగ్రహించునది
అంతర్ముఖ సమారాధ్యా :అంతర్ దృష్టి గల యోగులచే ఆరాధింపబడునది
బహిర్ముఖ సుదుర్లభా :ప్రాపంచిక దృష్టి కలవారికి లభింపనిది.
త్రయీ, త్రివర్గ నిలయా, త్రిస్థా, త్రిపురమాలినీ ।
నిరామయా, నిరాలంబా, స్వాత్మారామా, సుధాసృతిః ॥ 163 ॥
త్రయీ :వేదస్వరూపిణి
త్రివర్గ నిలయా :ధర్మార్ధ కామములకు నిలయం అయినది
త్రిస్థా :మూడు విధములుగా ఉండునది
త్రిపురమాలినీ :త్రిపురములను మాలికగా ధరించినది
నిరామయా :ఏ బాధలూ లేనిది
నిరాలంబా :ఆలంబనము అవసరము లేనిది
స్వాత్మారామా :తన ఆత్మయందే ఆనందించునది
సుధాసృతి: అమృతమును కురిపించునది
సంసారపంక నిర్మగ్న సముద్ధరణ పండితా ।
యజ్ఞప్రియా, యజ్ఞకర్త్రీ, యజమాన స్వరూపిణీ ॥ 164 ॥
సంసారపంక నిర్మగ్న సముద్ధరణ పండితా :సంసారము అను ఊబిలో కూరుకొనిపోయిన జనులను ఉద్ధరించుటకు సామర్ధ్యము కలిగినది.
యఙ్ఞప్రియా :యఙ్ఞములయందు ప్రీతి కలిగినది
యఙ్ఞకర్త్రీ :యఙ్ఞము చేయునది
యజమాన స్వరూపిణి :యఙ్ఞము చేయువారి స్వరూపం తానై ఉన్నది.
ధర్మాధారా, ధనాధ్యక్షా, ధనధాన్య వివర్ధినీ ।
విప్రప్రియా, విప్రరూపా, విశ్వభ్రమణ కారిణీ ॥ 165 ॥
ధర్మాధారా : ధర్మమునకు ఆధారభూతమైనది
ధనాధ్యక్షా : సర్వసంపదలకు అధికారిణి
ధనధాన్యవివర్ధినీ : ధనము, ధాన్యము వర్ధిల్లచేయునది
విప్రప్రియా : వేదాధ్యయన సంపన్నులైన వారియందు ప్రీతి కలిగినది
విప్రరూప : వేదవిదులైనవారి యందు ఉండునది
విశ్వభ్రమణకారిణీ : విశ్వమును నడిపించునది
విశ్వగ్రాసా, విద్రుమాభా, వైష్ణవీ, విష్ణురూపిణీ ।
అయోని, ర్యోనినిలయా, కూటస్థా, కులరూపిణీ ॥ 166 ॥
విశ్వగ్రాసా : విశ్వమే ఆహారముగా కలిగినది
విద్రుమాభా : పగడము వలె ఎర్రనైన కంతి కలిగినది
వైష్ణవీ : వైష్ణవీ దేవి రూపమున అవతరించినది
విష్ణురూపిణీ : విష్ణురూపమున జగత్తును రక్షించునది
అయోని: పుట్టుక లేనిది
యోనినిలయా : సమస్త సృష్టి కి జన్మస్థానము
కూటస్థా : మూలకారణ శక్తి
కులరూపిణీ : కుండలినీ రూపిణి
వీరగోష్ఠీప్రియా, వీరా, నైష్కర్మ్యా, నాదరూపిణీ ।
విజ్ఞాన కలనా, కల్యా విదగ్ధా, బైందవాసనా ॥ 167 ॥
వీరగోష్ఠీప్రియా: వీరభక్తులు చేయు తీవ్రసాధన యందు ప్రీతి కలిగినది
వీరా : వీరత్వము కలిగినది
నైష్కర్మ్యా : కర్మబంధము లేనిది
నాదరూపిణీ : ఓంకారస్వరూపిణి
విఙ్ఞాన కలనా : విఙ్ఞాన స్వరూపిణి
కల్యా : మూలకారణము
విదగ్ధా : గొప్ప సామర్ధ్యము కలిగినది
బైందవాసనా : బిందువు ఆసనముగా కలిగినది
తత్త్వాధికా, తత్త్వమయీ, తత్త్వమర్థ స్వరూపిణీ ।
సామగానప్రియా, సౌమ్యా, సదాశివ కుటుంబినీ ॥ 168 ॥
తత్త్వాధికా : సమస్త తత్వములకు అధికారిణి
తత్త్వమయీ : తత్వస్వరూపిణి
తత్త్వమర్ధ స్వరూపిణీ : తత్ = అనగా నిర్గుణ నిరాకర స్వరూపము , త్వం = ప్రత్యగాత్మ, తత్+త్వం స్వరూపముగ ఉన్నది
సామగానప్రియా :సామగానమునందు ప్రీతి కలిగినది
సౌమ్యా : సౌమ్య స్వభావము కలిగినది
సదాశివకుటుంబినీ : సదాశివుని అర్ధాంగి
సవ్యాపసవ్య మార్గస్థా, సర్వాపద్వి నివారిణీ ।
స్వస్థా, స్వభావమధురా, ధీరా, ధీర సమర్చితా ॥ 169 ॥
సవ్యాపసవ్య మార్గస్థా : వామ, దక్షిణ మార్గములలో పూజింపబడునది
సర్వాపద్వినివారిణీ : అన్ని ఆపదలను నివారించునది
స్వస్థా : మార్పులేకుండా ఉండునది
స్వభావమధురా :సహజమైన మధురస్వభావము కలది
ధీరా : ధైర్యము కలది
ధీరసమర్చితా : ధీరస్వభావము కలవారిచే ఆరాధింపబడునది
చైతన్యార్ఘ్య సమారాధ్యా, చైతన్య కుసుమప్రియా ।
సదోదితా, సదాతుష్టా, తరుణాదిత్య పాటలా ॥ 170 ॥
చైతన్యార్ఘ్య సమారాధ్యా :ఙ్ఞానులచే పూజింపబడునది
చైతన్య కుసుమప్రియా : ఙ్ఞానము అనే పుష్పముల యందు ప్రీతి కలిగినది
సదోదితా : సత్యస్వరూపిణి
సదాతుష్టా : ఎల్లప్పుడూ సంతోషముతో ఉండునది
తరుణాదిత్యపాటలా :ఉదయసూర్యుని వంటి కాంతి కలిగినది
దక్షిణా, దక్షిణారాధ్యా, దరస్మేర ముఖాంబుజా ।
కౌళినీ కేవలా,ఽనర్ఘ్యా కైవల్య పదదాయినీ ॥ 171 ॥
దక్షిణా : దాక్షిణ్యము కలిగినది
దక్షిణారాధ్యా : దక్షిణాచారముచే పూజింపబడుచున్నది
దరస్మేరముఖాంబుజా : చిరునవ్వుతో కూడిన ముఖపద్మము కలిగినది
కౌళినీ : కౌళమార్గమున ఉపాసించబడుచున్నది
కేవలా : సమస్తమునకు తాను ఒక్కటియే మూలమైనది
అనర్ఘ్య కైవల్యపదదాయినీ :అత్యుత్తమమైన మోక్షము ప్రసాదించునది
స్తోత్రప్రియా, స్తుతిమతీ, శ్రుతిసంస్తుత వైభవా ।
మనస్వినీ, మానవతీ, మహేశీ, మంగళాకృతిః ॥ 172 ॥
స్తోత్రప్రియా : స్తోత్రములు అనిన ఇష్టము కలిగినది
స్తుతిమతీ : స్తుతించుట అనిన ఇష్టము కలిగినది
శ్రుతిసంస్తుత వైభవా : వేదములచేత స్తుతింపబడెడి వైభవము కలిగినది
మనస్వినీ : మనస్సు కలిగినది
మానవతీ : అభిమానము కలిగినది
మహేశీ : మహేశ్వర శక్తి
మంగాళాకృతి: మంగళప్రదమైన రూపము కలిగినది
విశ్వమాతా, జగద్ధాత్రీ, విశాలాక్షీ, విరాగిణీ।
ప్రగల్భా, పరమోదారా, పరామోదా, మనోమయీ ॥ 173 ॥
విశ్వమాతా : విశ్వమునకు తల్లి
జగద్ధాత్రీ : జగత్తును రక్షించునది
విశాలాక్షీ : విశాలమైన కన్నులు కలది
విరాగిణీ : దేనితోనూ అనుబంధము లేనిది
ప్రగల్భా : సర్వసమర్థురాలు
పరమోదారా : మిక్కిలి ఉదారస్వభావము కలిగినది
పరామోదా : పరమానందము కలిగినది
మనోమయీ : మనస్సే రూపముగా కలిగినది
వ్యోమకేశీ, విమానస్థా, వజ్రిణీ, వామకేశ్వరీ ।
పంచయజ్ఞప్రియా, పంచప్రేత మంచాధిశాయినీ ॥ 174 ॥
వ్యోమకెశీ : అంతరిక్షమే కేశముగా కలది
విమానస్థా : విమానము (సహస్రారము) నందు ఉండునది
వజ్రిణీ : వజ్రము ఆయుధముగా కలిగినది
వామకేశ్వరీ : వామకేశ్వరుని శక్తి
పంచయఙ్ఞ ప్రియా : నిత్యము చేయు పంచయఙ్ఞములచే ప్రీతి చెందునది
పంచప్రేత మంచాధిశాయినీ :పంచప్రేతములచే ఏర్పడిన మంచముపై కూర్చుని ఉండునది.
పంచమీ, పంచభూతేశీ, పంచ సంఖ్యోపచారిణీ ।
శాశ్వతీ, శాశ్వతైశ్వర్యా, శర్మదా, శంభుమోహినీ ॥ 175 ॥
పంచమీ : పంచకృత్యపరాయణి
పంచభూతేశీ : పంచభూతములను ఆఙ్ఞాపించునది
పంచసంఖ్యోపచారిణీ :శ్రీవిద్యోపాసకులచే 5 విధములుగా ఆరాధింపబడునది
శాశ్వతీ : శాశ్వతముగా ఉండునది
శాశ్వతైశ్వర్యా : శాశ్వతమైన ఐశ్వర్యము కలది
శర్మదా : ఓర్పును ఇచ్చునది
శంభుమోహినీ : ఈశ్వరుని మోహింపజేయునది
ధరా, ధరసుతా, ధన్యా, ధర్మిణీ, ధర్మవర్ధినీ ।
లోకాతీతా, గుణాతీతా, సర్వాతీతా, శమాత్మికా ॥ 176 ॥
ధరా : ధరించునది
ధరసుతా : సమస్త జీవులను తన సంతానముగా కలిగినది
ధన్యా : పవిత్రమైనది
ధర్మిణీ : ధర్మస్వరూపిణి
ధర్మవర్ధినీ : ధర్మమును వర్ధిల్ల చేయునది
లోకాతీతా : లోకమునకు అతీతమైనది
గుణాతీతా :గుణములకు అతీతమైనది
సర్వాతీతా : అన్నిటికీ అతీతురాలు
శమాత్మికా : క్షమాగుణము కలిగినది
బంధూక కుసుమ ప్రఖ్యా, బాలా, లీలావినోదినీ ।
సుమంగళీ, సుఖకరీ, సువేషాడ్యా, సువాసినీ ॥ 177 ॥
బంధూక కుసుమ ప్రఖ్యా : బంధూక పుష్పం (మంకెన్న పువ్వు) వంటి ప్రకాశం కలిగినది
బాలా :12 సంవత్సరముల లోపు బాలిక
లీలావినోదినీ :బ్రహ్మాండములను సృష్టించుట అను లీల యందు వినోదమును కలిగినది
సుమంగళీ :మంగళకరమైన రూపము కలిగినది
సుఖకరీ :సుఖమును కలిగించునది
సువేషాఢ్యా :మంచి వేషము కలిగినది
సువాసినీ :సుమంగళి.
సువాసిన్యర్చనప్రీతా, శోభనా, శుద్ధ మానసా ।
బిందు తర్పణ సంతుష్టా, పూర్వజా, త్రిపురాంబికా ॥ 178 ॥
సువాసిన్యర్చన ప్రీతా : సువాసినులు చేయు అర్చన యందు ప్రీతి కలిగినది
శోభనా :శోభ కలిగినది
శుద్ధమానసా : మంచి మనస్సు కలిగినది
బిందుతర్పణ సంతుష్టా : అమృత బిందు తర్పణముచే సంతృప్తి పొందినది
పూర్వజా : అనాదిగా ఉన్నది
త్రిపురాంబికా :త్రిపురములందు ఉండు అమ్మ
దశముద్రా సమారాధ్యా, త్రిపురా శ్రీవశంకరీ ।
జ్ఞానముద్రా, జ్ఞానగమ్యా, జ్ఞానజ్ఞేయ స్వరూపిణీ ॥ 179 ॥
దశముద్రా సమారాధ్యా : 10 రకముల ముద్రలచే ఆరాధింపబడునది
త్రిపురా : త్రిపురసుందరి
శ్రీవశంకరీ : సంపదలను వశము చేయునది
ఙ్ఞానముద్రా : బొటనవ్రేలును చూపుడు వ్రేలితో కలిపి మిగిలిన 3 వ్రేళ్ళను నిటారుగా ఉంచుట, జ్ఞానముద్రా స్వరూపిణి
ఙ్ఞానగమ్యా : ఙ్ఞానముచే చేరదగినది
ఙ్ఞానఙ్ఞేయ స్వరూపిణీ : ఙ్ఞానముచే తెలియబడు స్వరూపము కలిగినది
యోనిముద్రా, త్రిఖండేశీ, త్రిగుణాంబా, త్రికోణగా ।
అనఘాద్భుత చారిత్రా, వాంఛితార్థ ప్రదాయినీ ॥ 180 ॥
యోనిముద్రా : యోగముద్రలలో ఒకటి
త్రిఖండేశీ :3 ఖండములకు అధికారిణి
త్రిగుణా : 3 గుణములు కలిగినది
అంబా : అమ్మ
త్రికోణగా : త్రికోణమునందు ఉండునది
అనఘాద్భుత చారిత్రా : పవిత్రమైన అద్భుత చరిత్ర కలిగినది
వాంఛితార్ధ ప్రదాయినీ : కోరిన కోర్కెలు ఇచ్చునది.
అభ్యాసాతి శయజ్ఞాతా, షడధ్వాతీత రూపిణీ ।
అవ్యాజ కరుణామూర్తి, రజ్ఞానధ్వాంత దీపికా ॥ 181 ॥
అభ్యాసాతియ ఙ్ఞాతా : అభ్యాసము చేసిన కొలది బోధపడునది
షడధ్వాతీత రూపిణీ :6 మార్గములకు అతీతమైన రూపము కలిగినది
అవ్యాజ కరుణా మూర్తి :ప్రతిఫలాపేక్షలేని కరుణ కలిగినది
రఙ్ఞానధ్వాంత దీపికా : అఙ్ఞానమను అంధకారమునకు దీపము వంటిది
ఆబాలగోప విదితా, సర్వానుల్లంఘ్య శాసనా ।
శ్రీ చక్రరాజనిలయా, శ్రీమత్త్రిపుర సుందరీ ॥ 182 ॥
ఆబాలగోపవిదితా :సర్వజనులచే తెలిసినది
సర్వానుల్లంఘ్య శాసనా : ఎవరునూ అతిక్రమించుటకు వీలులేని శాసనము కలిగినది
శ్రీచక్రరాజ నిలయా : శ్రీ చక్రము నివాసముగా కలిగినది
శ్రీమత్ త్రిపురసుందరీ : త్రిపురాసురులనే ముగ్గురు రాక్షసులను (తారకాక్ష, విద్యున్మాలి, కమలాక్ష ) సంహరించిన పరమశివుని భార్య ‘త్రిపుర సుందరి’
శ్రీ శివా, శివశక్త్యైక్య రూపిణీ, లలితాంబికా ।
ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః ॥ 183 ॥
శ్రీశివా : శుభములను కల్గినది
శివశక్తైక్య రూపిణీ : శివశక్తులు ఏకమైన రూపము కలిగినది
లలితాంబికా : లలితానామమున ప్రసిద్ధమైన జగన్మాత
॥ ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే, ఉత్తరఖండే, శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే, శ్రీలలితారహస్యనామ శ్రీ లలితా రహస్యనామ సాహస్రస్తోత్ర కథనం నామ ద్వితీయోఽధ్యాయః ॥
సింధూరారుణ విగ్రహాం త్రిణయనాం మాణిక్య మౌళిస్ఫుర-
త్తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహామ్ ।
పాణిభ్యా మలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం
సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్పరామంబికామ్ ॥