google.com, pub-2532166691306495, DIRECT, f08c47fec0942fa0

భారతీయ సంప్రదాయ నమస్తే అంజలి ముద్రలో ఇద్దరు వ్యక్తులు

నమస్తే వెనుక ఉన్న శాస్త్రీయ కారణం

నమస్తే వెనుక ఉన్న శాస్త్రీయ కారణం

అందరికీ నమస్కారం. సాధారణంగా మనకు పెద్దవారు కనిపించినప్పుడు నమస్కారం చేస్తుంటాం. హిందూ సంప్రదాయంలో ఇది ఒక గొప్ప అలవాటు. దీనిలోని ప్రధాన ఉద్దేశ్యం అహంకారాన్ని తగ్గించి ఎదుటివారిని గౌరవించడం.

మనము రెండు చేతులను హృదయానికి దగ్గరగా జోడించడాన్ని యోగశాస్త్రంలో అంజలి ముద్ర అని అంటారు. వేలి చివరల్లో పంచభూత శక్తులకు సంబంధించిన పాయింట్లు ఉంటాయని విశ్వసిస్తారు. చేతులను జోడించి స్వల్ప ఒత్తిడి ఇవ్వడం వల్ల ఈ ప్రెషర్ పాయింట్లు ఉత్తేజితమవుతాయి. ఇవి మన కళ్ళు, చెవులు, మెదడుతో అనుసంధానమై ఉంటాయని భావిస్తారు. అందువల్ల రెండు చేతులు జోడించి నమస్కరించడం ద్వారా మనం చూసిన వ్యక్తులు, విన్న మాటలు, జరిగిన సంభాషణలు ఎక్కువకాలం గుర్తు ఉండటానికి సహాయపడుతుందని అంటారు.

హిందూ ఆచారాల ప్రకారం నమస్తేకు ఆధ్యాత్మిక అర్థం కూడా ఉంది. ప్రతి మనిషిలోనూ దైవత్వం ఒకటే అని హిందువులు నమ్ముతారు. “నమః” అంటే “నేను మీలోని దైవత్వానికి నమస్కరిస్తున్నాను” అని అర్థం.

కాబట్టి భారతీయ సంప్రదాయం ప్రకారం రెండు చేతులతో నమస్కరించడం శాస్త్రీయంగానూ, ఆధ్యాత్మికంగానూ ఒక గొప్ప ప్రక్రియ.

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top