స్తోత్రాలకు తెలుగులో అర్థం » విష్ణు స్తోత్రాలు » శ్రీ విష్ణు సహస్రనామ ఫలశ్రుతి తెలుగులో అర్థం 31-33 శ్లోకాలు
విష్ణు సహస్రనామ ఫలశ్రుతి 31-33 శ్లోకాల తెలుగులో అర్థం

శ్రీ విష్ణు సహస్రనామ ఫలశ్రుతి తెలుగులో అర్థం 31-33 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఎంతో పవిత్రమైనది, శక్తివంతమైనది. ఉత్తర పీఠిక లేదా ఫలశ్రుతి లోని శ్లోకాలను, వాటి సంపూర్ణ అర్థాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈ ఫలశ్రుతి పఠించడం లేదా వినడం వల్ల సకల రోగాలు, భయాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని సాక్షాత్తు వ్యాస మహర్షి మహాభారతంలో వివరించారు. ప్రశాంతమైన మనసుతో, ఈ శక్తివంతమైన ఫలశ్రుతి అర్థాన్ని వినండి.

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం। ।
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ॥ 31

(భగవద్గీత శ్లోకం) సత్పురుషులను రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి, ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి నేను ప్రతి యుగంలోనూ వతరిస్తాను.

ఆర్తాః విషణ్ణాః శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః ।
సంకీర్త్య నారాయణశబ్దమాత్రం విముక్తదుఃఖాః సుఖినో భవంతి ॥ 32

దుఃఖంలో ఉన్నవారు, విషాదంలో ఉన్నవారు, బలహీనులు, భయపడినవారు, భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నవారు… కేవలం “నారాయణ” అనే శబ్దాన్ని పలికినంత మాత్రాన కష్టాల నుండి విముక్తులై సకల సుఖాలను పొందుతారు.

కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ ।
కరోమి యద్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ॥ 33

నా శరీరం చేత కానీ, వాక్కు చేత కానీ, మనస్సు చేత కానీ, ఇంద్రియాల చేత కానీ, నా బుద్ధి చేత కానీ, ఆత్మ చేత కానీ లేదా నా స్వభావం వల్ల కానీ నేను ఏమేమి పనులు చేస్తున్నానో… వాటన్నింటినీ పరమాత్మ అయిన ఆ శ్రీమన్నారాయణునికే సమర్పిస్తున్నాను.

యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోఽస్తు తే ।

విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ
న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమః ॥

ఓ దేవా! ఈ స్తోత్రం చదివేటప్పుడు నా ఉచ్ఛారణలో ఏవైనా అక్షరాలు గానీ, పదాలు గానీ లోపించి ఉంటే వాటన్నింటినీ క్షమించు. ఓ పురుషోత్తమా! విసర్గలలో, బిందువులలో, మాత్రలలో అక్షరాలు తక్కువైనా, ఎక్కువైనా దయతో నన్ను క్షమించు. నీకు నమస్కారములు.

ఇతి శ్రీ మహాభారతే శతసాహస్రికాయాం సంహితాయాం
 వైయాసిక్యామనుశాసన పర్వాంతర్గత ఆనుశాసనిక
ర్వణి, మోక్షధర్మే భీష్మ యుధిష్ఠిర సంవాదే శ్రీ విష్ణోర్దివ్య
సహస్రనామ స్తోత్రం నామైకోన పంచ శతాధిక శతతమోధ్యాయః ॥

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం సమాప్తమ్ ॥
ఓం తత్సత్ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు ॥

“లక్ష శ్లోకాలతో కూడినది, వేదవ్యాస మహర్షి చేత రచింపబడినది అయిన శ్రీ మహాభారతంలోని ‘అనుశాసన పర్వం’లో ఉన్న ‘ఆనుశాసనిక పర్వం’లో… మోక్ష ధర్మాలను వివరిస్తూ భీష్ముడు మరియు ధర్మరాజుల మధ్య జరిగిన సంభాషణలో చెప్పబడిన ఈ ‘శ్రీ విష్ణు దివ్య సహస్రనామ స్తోత్రం’ అనే 149వ అధ్యాయం ఇక్కడితో ముగిసినది.”

సర్వే జనాః సుఖినో భవంతు. ఓం నమో నారాయణాయ!

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

శ్రీ విష్ణు సహస్రనామ ఫలశ్రుతి తెలుగులో అర్థం 1-10 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్రనామ ఫలశ్రుతి తెలుగులో అర్థం 11-20 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్రనామ ఫలశ్రుతి తెలుగులో అర్థం 21-30 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్రనామ ఫలశ్రుతి తెలుగులో అర్థం 31-33 శ్లోకాలు

ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top