శ్రీ నారాయణీయం – గురువాయూరప్ప దివ్య మంగళ స్వరూపం

నారాయణీయం

నారాయణీయం గ్రంథాన్ని 16వ శతాబ్దంలో కేరళకు చెందిన ప్రముఖ సంస్కృత పండితుడు, కవి అయిన మేల్పత్తూరు నారాయణ భట్టతిరి (Melpathur Narayana Bhattathiri) రచించారు. ఇది వేదవ్యాసుడు రచించిన మహాభాగవత పురాణంలోని 18,000 శ్లోకాల సారాంశాన్ని, కేవలం 1036 శ్లోకాలతో 100 దశకాలుగా (ప్రతి దశకంలో దాదాపు 10 శ్లోకాలు ఉండేలా) సంక్షిప్తీకరించిన అద్భుతమైన భక్తి కావ్యము.

నారాయణీయం పుట్టుకకు దారితీసిన పూర్వ కథ:

నారాయణ భట్టతిరి తన గురువైన అచ్యుత పిషారడి వద్ద సకల శాస్త్రాలను అభ్యసించారు. కొంతకాలానికి ఆ గురువుగారు వాతరోగం (కీళ్లనొప్పులు/పక్షవాతం వంటి దీర్ఘకాలిక వ్యాధి) బారిన పడ్డారు. గురువుగారి యాతనను చూడలేక భట్టతిరి తన భక్తి, యోగబలంతో గురు దక్షిణగా ఆ వ్యాధిని తనపైకి మార్చుకున్నారు. దాంతో గురువుగారు సంపూర్ణ ఆరోగ్యవంతులు కాగా, భట్టతిరి స్వయంగా ఆ తీవ్రమైన వాతరోగంతో బాధపడాల్సి వచ్చింది.

భట్టతిరి అనుభవిస్తున్న దుర్భరమైన రోగబాధను చూసి చలించిపోయిన మలయాళ కవి ఎచ్చాచాన్ అనే పండితుడు, మీన్ తొటూ కూట్టుక” (చేపలతో ప్రారంభించండి) అని సలహా ఇస్తారు. పైకి ఇది శాకాహార బ్రాహ్మణులకు విచిత్రంగా అనిపించినా, దాని అంతరార్థం మహాభాగవతంలోని ప్రథమ ఘట్టాలైన విష్ణుమూర్తి మత్స్యావతారం (చేప) మొదలుకొని దశావతారాల క్రమంలో భగవత్‌లీలలను వర్ణిస్తూ భాగవతాన్ని ప్రారంభించమని అర్థం.

ఆ సలహాను స్వీకరించిన భట్టతిరి కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గురువాయూరు చేరుకున్నారు. అక్కడ గురువాయూరప్ప (శ్రీకృష్ణుడు) సన్నిధిలో రోజూ ఒక దశకం (సుమారు 10 శ్లోకాలు) చొప్పున శ్రీకృష్ణుడి లీలలను కీర్తిస్తూ స్తుతించడం ప్రారంభించారు. ప్రతి దశకం చివరి శ్లోకంలో తన రోగ రుగ్మతలను తొలగించి ఆయురారోగ్యాలు ప్రసాదించమని స్వామిని వేడుకునేవారు.

సాక్షాత్కారం మరియు సంపూర్ణ ఆరోగ్యం:

అలా సరిగ్గా 100 రోజులు పాటు రోజుకొక దశకం చొప్పున 100 దశకాలను (1036 శ్లోకాలను) పూర్తి చేశారు. ఈ కావ్య రచన సాగుతున్నంత కాలం శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఆయనకు అగోచరంగా లేదా ప్రత్యక్షంగా మార్గదర్శనం చేశాడని ప్రతీతి. నూటవ రోజున చివరి దశకం (“ఆయురారోగ్య సౌఖ్యమ్”) పూర్తి చేసేసరికి భట్టతిరి వ్యాధి పూర్తిగా నయమై, సంపూర్ణ దివ్య ఆరోగ్యాన్ని పొందారు. ఆ రోజు ఆయన ఎదురుగా సాక్షాత్కరించిన వేణుగోపాల స్వామి రూపాన్ని కళ్లకు కట్టినట్లు వర్ణించారు.

మహావిష్ణువును కీర్తిస్తూ రచించడం వల్ల మరియు రచయిత పేరు నారాయణ భట్టతిరి కావడం వల్ల ఈ అద్భుత కావ్యానికి నారాయణీయం అనే పేరు సార్థకమైంది. నాటి నుండి భౌతిక, మానసిక వ్యాధులు నివారణ కావడానికి మరియు భక్తి జ్ఞానాలు సిద్ధింపజేసుకోవడానికి భక్తులు ఈ నారాయణీయ పారాయణ చేయడం ఆచారంగా వస్తోంది.

ప్రథమదశకం – భగవతః స్వరూపం తథా మాహాత్మ్యం

రెండవ దశకం – భగవతః స్వరూపమాధుర్యం తథా

తృతీయ దశకం – ఉత్తమభక్తస్య గుణాః (భక్తస్వరూప వర్ణనం)

చతుర్థ దశకం – యోగాభ్యాసం మరియు యోగసిద్ధి

పంచమ దశకం – విరాట్ పురుషుని ఆవిర్భావం

షష్ఠ దశకం – విరాట్ స్వరూప వర్ణన

సప్తమ దశకం – బ్రహ్మదేవుని జననం, తపస్సు మరియు వైకుంఠ దర్శనం

అష్టమ దశకం – ప్రళయ వర్ణన

నవమ దశకం – బ్రహ్మదేవుని తపస్సు మరియు లోకసృష్టి

దశమ దశకం – సృష్టిలోని వైవిధ్యం

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top