స్తోత్రాలకు తెలుగులో అర్థం » విష్ణు స్తోత్రాలు » కృష్ణ స్తోత్రాలు » జయదేవ అష్టపది ప్రబంధః – 17 | గీత గోవిందం తెలుగులో అర్థం
జయదేవ అష్టపది ప్రబంధః - 17 గీత గోవిందం తెలుగులో అర్థం.

జయదేవ అష్టపది ప్రబంధః – 17 | గీత గోవిందం తెలుగులో అర్థం

జయదేవ అష్టపది భారతీయ భక్తి సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దివ్య కవితా సంపద. దీనిని 12వ శతాబ్దానికి చెందిన మహాకవి జయదేవుడు సంస్కృతంలో రచించారు. ఈ అష్టపదులు ఆయన అమర గ్రంథమైన గీత గోవిందంలో భాగంగా ఉన్నాయి.

“అష్టపది” అంటే ఎనిమిది పాదాలతో కూడిన గీతం. మొత్తం 24 అష్టపదులు గీత గోవిందంలో ఉన్నాయి. ప్రతి అష్టపది శ్రీకృష్ణుడు మరియు శ్రీరాధాదేవి మధ్యనున్న దివ్య ప్రేమ, విరహం, కలయిక, భక్తి, శరణాగతి వంటి ఆధ్యాత్మిక భావాలను అద్భుతమైన కవిత్వంతో చిత్రిస్తుంది.

జయదేవుని కవిత్వంలో శృంగారరసం కేవలం భౌతిక ప్రేమను సూచించదు. అది జీవాత్మ పరమాత్మను చేరుకోవాలనే ఆత్మీయ తపనకు ప్రతీక. రాధా జీవాత్మకు, శ్రీకృష్ణుడు పరమాత్మకు ప్రతిరూపంగా భావించబడతారు. అందువల్ల గీత గోవిందం భక్తి, సంగీతం, నృత్యం మరియు సాహిత్య రంగాల్లో అపూర్వమైన స్థానం సంపాదించింది.

ఈ అష్టపదులను భారతదేశంలోని అనేక దేవాలయాల్లో, ముఖ్యంగా శ్రీకృష్ణ ఆలయాలలో, భక్తితో ఆలపిస్తారు. ఒడిస్సీ, భరతనాట్యం, కూచిపూడి, కథక్ వంటి భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాలలో కూడా వీటికి విశిష్టమైన ప్రాధాన్యం ఉంది.

ఈ శ్రేణిలో ప్రతి అష్టపదిని సంస్కృత శ్లోకంతో పాటు పదచ్ఛేదం, పదార్థం, తాత్పర్యం మరియు సులభమైన తెలుగు వివరణతో తెలుసుకుందాం. జయదేవ మహాకవి ఆవిష్కరించిన రాధాకృష్ణుల దివ్య ప్రేమ రహస్యాన్ని, భక్తి తత్వాన్ని మరియు గీత గోవిందం యొక్క ఆధ్యాత్మిక సౌందర్యాన్ని కలిసి ఆస్వాదిద్దాం.

అష్టమః సర్గః – విలక్ష్య లక్ష్మీపతిః

అథ కథమపి యామినీం వినీయ
స్మర శర జర్జరితాఽపి సా ప్రభాతే ।
అనునయ వచనం వదంత మగ్రే
ప్రణతమపి ప్రియమాహ సాభ్యసూయమ్‌ ॥1॥

॥ ప్రబంధః – 17 ॥
(లక్ష్మీపతి రత్నావళీ)
(భైరవి – ఆది)

జయదేవ అష్టపది ప్రబంధః - 17 గీత గోవిందం తెలుగులో అర్థం.

భైరవీ రాగ యతి తాళాభ్యాం గీయతే ।
రజని జనిత గురు జాగర రాగ కషాయిత మలస నివేశం ।
వహతి నయనమనురాగమివ స్ఫుటముదిత రసాభినివేశమ్‌ ॥

(హరిహరి) యాహి మాధవ! యాహి కేశవ! మా వద కైతవ వాదం ।
తా మనుసర సరసీరుహలోచన! యా తవ హరతి విషాదమ్‌ ॥ (ధ్రువమ్‌) ॥

కజ్జల మలిన విలోచన చుంబన విరచిత నీలిమ రూపం ।
దశన వసనమరుణం తవ కృష్ణ! తనోతి తనోరనురూపమ్‌ ॥

వపురనుహరతి తవ స్మర సంగర ఖర నఖర క్షత రేఖం ।
మరకత శకల కలిత కల ధౌత లిపేరివ రతి జయ లేఖమ్‌ ॥

చరణ కమల గళదలక్త సిక్తమిదం తవ హృదయముదారం ।
దర్శయతీవ బహిర్మదనద్రుమ నవ కిసలయ పరివారమ్‌ ॥

దశన పదం భవదధర గతం మమ జనయతి చేతసి ఖేదం ।
కథయతి కథమధునాఽపి మయా సహ తవ వపురే తదభేదమ్‌ ॥

బహిరివ మలినతరం తవ కృష్ణ! మనోఽపి భవిష్యతి నూనం ।
కథమథ వంచయసే జనమనుగత మసమశర జ్వర దూనమ్‌ ॥

భ్రమతి భవానబలా కబళాయ వనేషు కిమత్ర విచిత్రం ।
ప్రథయతి పూతనికైవ వధూ వధ నిర్దయ బాల చరిత్రమ్‌ ॥

శ్రీ జయదేవ భణిత రతి వంచిత ఖండిత యువతి విలాపం ।
శృణుత సుధా మధురం విబుధా విబుధాలయతోఽపి దురాపమ్‌ ॥

తవేదం పశ్యంత్యాః ప్రసరదనురాగం బహిరివ
ప్రియా పాదాలక్త చ్ఛురిత మరుణద్యోతి హృదయం ।
మమాద్య ప్రఖ్యాత ప్రణయ భర భంగేన కితవ
త్వదాలోకః శోకాదపి కిమపి లజ్జాం జనయతి ॥2॥

అంతర్మోహన మౌళి ఘూర్ణన చలన్మందార విభ్రంశన
స్తంభాకర్షణ దృప్తి హర్షణ మహా మంత్రః కురంగీ దృశాం ।
దృప్యద్దానవ దూయమాన దివిషద్దుర్వార దుఃఖాపదాం
భ్రంశః కంస రిపోర్వ్యపోహయతు వః శ్రేయాంసి వంశీ రవః ॥3॥

ఇతి శ్రీజయదేవకృతౌ గీతగోవిందే
విలక్ష్య లక్ష్మీపతిర్నామ అష్టమస్సర్గః॥

భావము:

ఈ విధంగా రాత్రంతా మన్మథ బాణాలతో అత్యంత వేదనాగ్రస్తురాలైన రాధ కన్నీరుమున్నీరై విలపిస్తూ ఉండగా, తెల్లవారగానే శ్రీకృష్ణుడు ఆమె ఎదుట మనోహరాకారంతో సాక్షాత్కరించాడు.
వినయంగా మాట్లాడుతూ, తన అపరాధాన్ని మన్నించమని ప్రాధేయ పడుతూ, తన ఎదుట నిలబడివున్న శ్రీకృష్ణుని లక్షణాలనుబట్టి, పరస్త్రీ సంగమంచేసి వచ్చాడని కోపించి మిక్కిలి అసూయతో “మాధవా! నీవు కపట నాటకాలాడవద్దు. నీ విరహాన్ని చల్లార్చే ఆ యువతి వెంటే వెళ్ళు. నీ ఎర్రబడిన కనురెప్పల్లో అలసట, అనురాగం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ భామయొక్కకాటుక కళ్ళను నీవు ముద్దు పెట్టుకోవడంవల్ల నల్లబడిన నీ అధరాలు నీ నల్లని రూపానికి అతికినట్లు సరిపోయింది. రాసక్రీడల్లో అలసిన నీ శరీర లక్షణాలు, నాకు అమిత బాధను కలిగిస్తున్నాయి. నీ శరీరం నీ మనస్సు లాగే మలినమైపోయింది. నిన్ను ఇలా చూస్తుంటే మన ప్రేమ భగ్నమైపోతోంది. నిన్ను ఆశ్రయిస్తున్న వారిని ఇలాగ వంచిస్తున్నావు. నీ చిన్నతనంలోనే నీవు పూతనను చంపిన దుర్మార్గపు చరిత్ర కలిగినవాడవు.” అని ఈ విధంగా రాధిక కృష్ణుని ఆక్షేపిస్తూ ఉంది.

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

 ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top