Uncategorized » శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 21-30 శ్లోకాలు
Sri Vishnu Sahasranama Stotram 21-30 Slokas Telugu devotional image of Lord Vishnu

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 21-30 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం మహాభారతంలోని అనుశాసన పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన పవిత్రమైన దైవిక స్తోత్రం. ఇందులో శ్రీ మహావిష్ణువు యొక్క వెయ్యి దివ్య నామాలు ఉన్నాయి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం జపం చేయడం వలన పాప విమోచనం, ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు కుటుంబ శాంతి కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ దివ్య నామాలలో ప్రతి ఒక్కటి ప్రత్యేక ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉండి భక్తుని జీవితాన్ని సానుకూలంగా మారుస్తుంది.

మరీచిర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః ।
హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః ॥ 21 ॥
మరీచిః – తేజోమయుడు
దమనః – దుష్టులను శాసించే వాడు
హంసః – పరమాత్మ స్వరూపుడు
సుపర్ణః – గరుడుని రూపంలో ఉన్న వాడు 
భుజగోత్తమః – ఆదిశేషునకు ప్రభువు, శేషశాయి
హిరణ్యనాభః – బంగారు కాంతితో ప్రకాశించే నాభి కలవాడు
సుతపాః – గొప్ప తపస్సు చేసిన వాడు
పద్మనాభః – నాభి నుండి పద్మం పుట్టిన వాడు
ప్రజాపతిః – సకలజీవులకును ప్రభువు;

అమృత్యుః సర్వదృక్ సింహః సంధాతా సంధిమాన్ స్థిరః ।
అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ 22 ॥
అమృత్యుః – మరణం లేనివాడు
సర్వదృక్ – సమస్తాన్ని తెలిసిన సాక్షి
సింహః – సింహంలా పరాక్రమశాలి
సంధాతా – జగత్తును సమన్వయంతో నడిపించే వాడు
సంధిమాన్ – సమగ్రంగా అన్నింటిని అనుసంధానించే వాడు
స్థిరః – స్థిరమైన వాడు
అజః – పుట్టుకలేనివాడు
దుర్మర్షణః – ఎవరూ జయించలేనివాడు
శాస్తా – ధర్మాన్ని బోధించే గురువు
విశ్రుతాత్మా – తన మహిమతో ప్రసిద్ధి పొందిన వాడు
సురారిహా – దేవతల శతృవులను హరించువాడు

గురుర్గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమః ।
నిమిషోఽనిమిషః స్రగ్వీ వాచస్పతిరుదారధీః ॥ 23 ॥
గురుః – జ్ఞానాన్ని బోధించే గురువు;
గురుతమః – గురువులలో శ్రేష్ఠుడు
ధామ – సకల జీవులు చేరవలసిన పరమోత్కృష్ట స్థానము
సత్యః – సత్య స్వరూపుడు
సత్యపరాక్రమః – నిజమైన పరాక్రమం గలవాడు
నిమిషః – యోగనిద్రలో నున్నవాడు;
అనిమిషః – ఎల్లప్పుడూ జగత్తును గమనించే సాక్షి
స్రగ్వీ – వైజయంతీ మాలను ధరించినవాడు
వాచస్పతిః – వాక్కునకు అధిపతి
ఉదారధీః – ఉదారమగు బుద్ధి కలవాడు

అగ్రణీగ్రామణీః శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ ॥ 24 ॥
అగ్రణీః – భక్తులకు ఉత్తమగతికి మార్గము చూపువాడు
గ్రామణిః – లోకాలకు నాయకుడు
శ్రీమాన్ – ఐశ్వర్యసంపన్నుడు
న్యాయః – ధర్మస్వరూపుడు
నేతా – సర్వలోకాలను నడిపించే వాడు
సమీరణః – గాలిలా అన్నింటిలో వ్యాపించి ఉన్న వాడు
సహస్రమూర్ధా – వేల తలలు కలవాడు (విశ్వరూపుడు)
విశ్వాత్మా – సమస్త జగత్తులో వ్యాపించి ఉన్న ఆత్మ
సహస్రాక్షః – వేయి (లెక్కపెట్టలేని) కన్నులు గలవాడు
సహస్రపాత్ – వేయి పాదములు గలవాడు, అన్ని చోట్ల వ్యాపించి ఉన్న వాడు

ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః ।
అహః సంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః ॥ 25 ॥
ఆవర్తనః – సృష్టి చక్రమును నడిపించే వాడు
నివృత్తాత్మా -సంసార బంధములకు అతీతుడు
సంవృతః – తన మాయతో జగత్తును ఆవరించిన వాడు
సంప్రమర్దనః – దుష్టులను నాశనం చేసే వాడు
అహః – కాలరూపుడు
సంవర్తకః – ప్రళయాన్ని కలిగించే వాడు
వహ్నిః – అగ్ని స్వరూపుడు
అనిలః – గాలి స్వరూపుడు
ధరణీధరః – భూమిని ధరించి కాపాడే వాడు

సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తా సత్కృతః సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥ 26 ॥
సుప్రసాదః – అనంతమైన దయగలవాడు
ప్రసన్నాత్మా – ఎల్లప్పుడూ ప్రశాంతమైన స్వభావం కలవాడు
విశ్వధృక్  – సమస్త విశ్వాన్ని ధరిస్తూ నిలబెట్టే వాడు
విశ్వభుక్ – విశ్వాన్ని అనుభవించే వాడు
విభుః – అన్నిచోట్ల వ్యాపించి ఉన్న వాడు
సత్కర్తా – సత్కార్యాలను చేసే వాడు
సత్కృతః – సజ్జనులచే సత్కరించబడే వాడు
సాధుః – శాంత స్వభావుడు
జహ్నుః – జగత్తును తనలో లీనమయ్యేలా చేసే వాడు
నారాయణః – సకలాత్మలకు ఆధారమైనవాడు
నరః – నరరూపంలో అవతరించే వాడు

అసంఖ్యేయోఽప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్ఛుచిః ।
సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధి సాధనః ॥ 27 ॥
అసంఖ్యేయః – లెక్కించలేనంత నామాలు, మహిమలు కలవాడు
అప్రమేయాత్మా – కొలవలేని స్వరూపం కలవాడు
విశిష్టః – ప్రత్యేకమైన, అత్యుత్తమ స్వరూపుడు
శిష్టకృత్ – సజ్జనులను కాపాడే వాడు
శుచిః – పవిత్రమైన వాడు
సిద్ధార్థః – సకలార్ధములు సిద్ధించినవాడు
సిద్ధసంకల్పః – సిద్ధించిన సంకల్పము కలవాడు
సిద్ధిదః – సిద్ధులను, విజయాలను ప్రసాదించే వాడు
సిద్ధిసాధనః – సిద్ధిని పొందుటకు సాధనమైనవాడు

వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః ।
వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శ్రుతిసాగరః ॥ 28 ॥
వృషాహీ – ధర్మాన్ని స్థాపించే వాడు
వృషభః – ధర్మ స్వరూపుడు; శ్రేష్ఠుడు
విష్ణుః – అన్నిచోట్ల వ్యాపించి ఉన్న వాడు
వృషపర్వా – ధర్మానికి ఆధారమైన మార్గాలను కలిగిన వాడు
వృషోదరః – ధర్మాన్ని తనలో నిలుపుకున్న వాడు
వర్ధనః – వర్ధిల్ల జేయువాడు
వర్ధమానః – ఎల్లప్పుడూ వృద్ధి చెందే వాడు
వివిక్తః – మాయకు అతీతంగా ఉన్న వాడు
శ్రుతిసాగరః – వేదములకు సాగరము వంటివాడు

సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః ।
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ॥ 29 ॥

సుభుజః – శుభమైన, బలమైన భుజాలు కలవాడు
దుర్ధరః – ఎవ్వరూ జయించలేని వాడు
వాగ్మీ – మధురంగా, జ్ఞానంతో మాట్లాడే వాడు
మహేంద్రః – దేవేంద్రునికంటే గొప్పవాడు
వసుదః – సంపదలను ప్రసాదించే వాడు
వసుః – సంపద స్వరూపుడు
నైకరూపః – అనేక రూపాలలో అవతరించే వాడు
బృహద్రూపః – విశాలమైన విశ్వరూపం కలవాడు
శిపివిష్టః – సూర్య కాంతిలో వ్యాపించి ఉన్న వాడు
ప్రకాశనః – జగత్తును ప్రకాశింపజేసే వాడు


ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః ।
ఋద్ధః స్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః ॥ 30 ॥
ఓజః
– అపార శక్తి కలవాడు
తేజః – అపార తేజస్సు కలవాడు
ద్యుతిధరః – ప్రకాశాన్ని ధరించిన వాడు
ప్రకాశాత్మా – ప్రకాశ స్వరూపుడు
ప్రతాపనః – శత్రువులను దహించే శక్తి కలవాడు
ఋద్ధః – సంపూర్ణ ఐశ్వర్యంతో నిండిన వాడు
స్పష్టాక్షరః – స్పష్టమైన వేదమంత్ర స్వరూపుడు
మంత్రః – మంత్రరూపంలో ఉన్న పరమాత్మ
చంద్రాంశుః – చంద్రుని కిరణాల వంటి శాంత స్వభావం కలవాడు
భాస్కరద్యుతిః – సూర్యుని వంటి తేజస్సు గలవాడు

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top