స్తోత్రాలు » విష్ణు స్తోత్రాలు » శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 91-100 శ్లోకాలు
Sri Vishnu Sahasranama Stotram 91-100 Slokalu Telugu image

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 91-100 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం మహాభారతంలోని అనుశాసన పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన పవిత్రమైన దైవిక స్తోత్రం. ఇందులో శ్రీ మహావిష్ణువు యొక్క వెయ్యి దివ్య నామాలు ఉన్నాయి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం జపం చేయడం వలన పాప విమోచనం, ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు కుటుంబ శాంతి కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ దివ్య నామాలలో ప్రతి ఒక్కటి ప్రత్యేక ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉండి భక్తుని జీవితాన్ని సానుకూలంగా మారుస్తుంది.

భారభృత్ కథితో యోగీ యోగీశః సర్వకామదః ।
ఆశ్రమః శ్రమణః క్షామః సుపర్ణో వాయువాహనః ॥ 91

భారభృత్ – భారమును మోయువాడు
కథిత: – వేదములచేత సర్వోత్తముడుగా కీర్తించబడినవాడు
యోగీ – ఆత్మజ్ఞానము నందే సదా ఓలలాడు వాడు
యోగీశ: – యోగులకు ప్రభువు
సర్వ కామద: – సకల కోరికలను తీర్చువాడు
ఆశ్రమ: – జీవులకు విశ్రాంతి స్థానమైనవాడు
శ్రమణ: – భక్తిహీనులను, వివేకరహితులను శ్రమ పెట్టువాడు
క్షామ: – సర్వ జీవులను క్షీణింపజేయువాడు
సుపర్ణ: – రమణీయ పత్రములు కలిగిన వృక్షము తానైనవాడు
వాయువాహన: – వాయు చలనమునకు కారణభూతుడైనవాడు

ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః ।
అపరాజితః సర్వసహో నియంతాఽనియమోఽయమః ॥ 92

ధనుర్ధర: – ధనస్సును ధరించినవాడు
ధనుర్వేద: – ధనుర్వేదము తెలిసినవాడు
దండ: – దండించువాడు
దమయితా – శిక్షించువాడు
దమ: – శిక్షానుభవము ద్వారా ఏర్పడు పవిత్రత తానైనవాడు
అపరాజిత: – పరాజయము తెలియనివాడు
సర్వసహ: – సమస్త శత్రువులను సహించువాడు
నియంతా – అందరినీ తమతమ కార్యములందు నియమించువాడు
అనియమ: – నియమము లేనివాడు
ఆయమ: – మృత్యుభీతి లేనివాడు

సత్త్వవాన్ సాత్త్వికః సత్యః సత్యధర్మపరాయణః ।
అభిప్రాయః ప్రియార్హోఽర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః ॥ 93

సత్త్వావాన్ – సత్త్వము గలవాడు
సాత్త్విక: – సత్త్వగుణ ప్రధానుడైనవాడు
సత్య: – సత్పురుషుల విషయములో మంచిగా ప్రవర్తించువాడు
సత్యధర్మ పరాయణ: – సత్య విషయమునందును, ధర్మ విషయమునందును దీక్షాపరుడైనవాడు
అభిప్రాయ: – అభిలషించు వారిచేత అభిప్రాయపడువాడు
ప్రియార్హ: – భక్తుల ప్రేమకు పాత్రుడైనవాడు
అర్హ: – అర్పింపబడుటకు అర్హుడైనవాడు
ప్రియకృత్ – తన నాశ్రయించినవారికి ప్రియము నొసగూర్చువాడు
ప్రీతివర్ధన: – భక్తులలో భవవంతునిపై ప్రీతిని వృద్ధి చేయువాడు

విహాయసగతిర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః ।
రవిర్విరోచనః సూర్యః సవితా రవిలోచనః ॥ 94

విహాయన గతి: – ఆకాశము ఆశ్రయముగ గలదియైన విష్ణుపదము తానైనవాడు
జ్యోతి: – తన ప్రకాశము చేత సర్వమును ప్రకాశింపచేయువాడు
సురుచి: – అందమైన ప్రకాశము గలవాడు
హుతభుక్ – యజ్ఞములందు ఆవాహన చేయబడిన దేవతల రూపమున హవిస్సులను స్వీకరించువాడు
విభు: – సర్వ లోకములకు ప్రభువైనవాడు
రవి: – తన విభూతియైన సూర్యుని ద్వారా భూమినుండి సర్వరసములను గ్రహించువాడు
విలోచన: – వివిధ రూపముల ద్వారా ప్రకాశించువాడు
సూర్య: – ప్రాణులకు ప్రాణశక్తిని ప్రసాదించువాడు
సవితా: – సమస్త జగత్తును ఉత్పన్నము చేయువాడు
రవిలోచన: – సూర్యుడు నేత్రములుగా కలవాడు

అనంతో హుతభుగ్భోక్తా సుఖదో నైకజోఽగ్రజః ।
అనిర్విణ్ణః సదామర్షీ లోకధిష్ఠానమద్భుతః ॥ 95

అనంత: – అంతము లేనివాడు
హుతభుక్ – హోమద్రవ్యము నారిగించువాడు
భోక్తా – భోగ్యవస్తువైన ప్రకృతిని అనుభవించువాడు
సుఖద: – భక్తులకు ఆత్మసుఖము నొసంగువాడు
నైకజ: – అనేక రూపములలో అవతరించువాడు
అగ్రజ: – సృష్ట్యారంభమునకు ముందే ఆవిర్భవించినవాడు
అనిర్వణ్ణ: – నిరాశ నెరుగనివాడు
సదామర్షీ – సజ్జనుల దోషములను క్షమించువాడు
లోకాధిష్టానం – ప్రపంచమంతటికి ఆధారభూతుడు
అధ్బుత: – ఆశ్చర్య స్వరూపుడు

సనాత్సనాతనతమః కపిలః కపిరవ్యయః ।
స్వస్తిదః స్వస్తికృత్స్వస్తిః స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ॥ 96

సనాత్ – ఆది లేనివాడు
సనాతన సమ: – సృష్టికర్త యైన బ్రహ్మకు పూర్వము కూడా యున్నవాడు
కపిల: – ఋషులలో కపిలుడు తానైనవాడు
కపి: – సూర్యరూపుడు
అవ్యయ: – ప్రళయకాలము నందు సమస్తము తనలో లీనమగుటకు విశ్రామ స్థానమైనవాడు
స్వస్తిద: – సర్వశ్రేయములను చేకూర్చువాడు
స్వస్తికృత్ – శుభమును కూర్చువాడు
స్వస్తి – సర్వ మంగళ స్వరూపుడు
స్వస్తిభుక్ – శుభమును అనుభవించువాడు
స్వస్తిదక్షిణ: – స్మరణ మాత్రముననే సర్వ శుభములు సమకూర్చువాడు

అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః ।
శబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీకరః ॥ 97

అరౌద్ర: – రౌద్రము లేనివాడు
కుండలీ – మకర కుండలములు ధరించినవాడు
చక్రీ – సుదర్శనమను చక్రమును ధరించినవాడు
విక్రమీ – గొప్ప శూరుడైన భగవానుడు
ఊర్జిత శాసన: – ఉల్లంఘించుటకు వీలులేని శాసనములు కలవాడు
శబ్దాతిగ: – వాక్కుకు అందనివాడు
శబ్దసహ: – సమస్త వేదములు తెలియబడినవాడు
శిశిర: – శిశిర ఋతువువలె చల్లబరుచువాడు
శర్వరీకర: – రాత్రిని కలుగజేయువాడు

అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాంవరః ।
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ॥ 98

అక్రూర: – క్రూరత్వము లేనివాడు
పేశల: – మనోవాక్కాయ కర్మలచే రమణీయముగ నుండువాడై పేశల: అని స్తుతించబడును
దక్ష: – సమర్థుడైనవాడు
దక్షిణ: – భక్తులను ఔదార్యముతో బ్రోచువాడు
క్షమిణాం వర: – సహనశీలు లైన వారిలందరిలో శ్రేష్ఠుడు
విద్వత్తమ: – సర్వజ్ఞత్తము కలిగియుండి, అందరిలో ఉత్తమమైనవాడు
వీతభయ: – భయము లేనివాడు
పుణ్యశ్రవణ కీర్తన: – తనను గూర్చి శ్రవణము గాని, కీర్తన గాని పుణ్యము కలుగజేయును

ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుఃస్వప్ననాశనః ।
వీరహా రక్షణః సంతో జీవనః పర్యవస్థితః ॥ 99

ఉత్తారణ: – సంసార సముద్రమును దాటించువాడు
దుష్కృతిహా – సాధకులలో యున్న చెడువాసనలను అంతరింప చేయువాడు
ప్రాణ: – ప్రాణులకు పవిత్రతను చేకూర్చు పుణ్య స్వరూపుడు
దుస్వప్న నాశన: – చెడు స్వప్నములను నాశనము చేయువాడు
వీరహా – భక్తులు మనస్సులు వివిధ మార్గములలో ప్రయాణించకుండ క్రమము చేయువాడు
రక్షణ: – రక్షించువాడైనందున భగవానుడు రక్షణ: అని స్తవనీయుడయ్యెను
సంత: – పవిత్ర స్వరూపుడు
జీవన: – సర్వ జీవులయందు ప్రాణశక్తి తానైనవాడు
పర్యవస్థిత: – అన్నివైపుల అందరిలో వ్యాపించి యున్నవాడు

అనంతరూపోఽనంత శ్రీర్జితమన్యుర్భయాపహః ।
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ॥ 100

అనంతరూప: – అనంతమైన రూపములు గలవాడు
అనంత శ్రీ: – అంతము లేని శక్తివంతుడైనవాడు
జితమన్యు: – క్రోధము ఎఱగని వాడు
భయాపహ: – భయమును పోగొట్టువాడు
చతురశ్ర: – జీవులకు కర్మఫలములను న్యాయముగా పంచువాడు
గభీరాత్మా – గ్రహింప శక్యము గాని స్వరూపము గలవాడు
విదిశ: – అధికారులైన వారికి ఫలము ననుగ్రహించుటలో ప్రత్యేకత కలిగియున్నవాడు
వ్యాదిశ: – వారి వారి అర్హతలను గమనించి బ్రహ్మాదులను సైతము నియమించి, ఆజ్ఞాపించువాడు
దిశ: – వేదముద్వారా మానవుల కర్మఫలములను తెలియజేయువాడు

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

 శ్రీ విష్ణు సహస్ర నామ శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 1-10 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 11-20 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 21-30 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 31-40 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 41-50 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 51-60 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 61-70 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 71-80 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 81-90 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 91-100 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 101-108 శ్లోకాలు

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top