స్తోత్రాలు » విష్ణు స్తోత్రాలు » శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 81-90 శ్లోకాలు
Sri Vishnu Sahasranama 81-90 Slokalu Telugu devotional poster

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 81-90 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం మహాభారతంలోని అనుశాసన పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన పవిత్రమైన దైవిక స్తోత్రం. ఇందులో శ్రీ మహావిష్ణువు యొక్క వెయ్యి దివ్య నామాలు ఉన్నాయి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం జపం చేయడం వలన పాప విమోచనం, ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు కుటుంబ శాంతి కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ దివ్య నామాలలో ప్రతి ఒక్కటి ప్రత్యేక ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉండి భక్తుని జీవితాన్ని సానుకూలంగా మారుస్తుంది.

తేజోఽవృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాంవరః ।
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః ॥ 81

తేజోవృష: – సూర్యతేజముతో నీటిని వర్షించువాడు
ద్యుతిధర: – కాంతివంతమైన శరీరమును ధరించినవాడు
సర్వ శస్త్ర భృతాంవర: – శస్త్రములను ధరించినవారిలో శ్రేష్ఠుడైనవాడు
ప్రగ్రహ: – ఇంద్రియములనెడి అశ్వములను తన అనుగ్రహము అనెడి పగ్గముతో కట్టివేయువాడు
నిగ్రహ: – సమస్తమును నిగ్రహించువాడు
వ్యగ్ర: – భక్తులను తృప్తి పరుచుటలో సదా నిమగ్నమై ఉండువాడు
నైకశృంగ: – అనేక కొమ్ములు గలవాడు, భగవానుడు
గదాగ్రజ: – గదుడను వానికి అన్న

చతుర్మూర్తి శ్చతుర్బాహు శ్చతుర్వ్యూహ శ్చతుర్గతిః ।
చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ ॥ 82

చతుర్మూర్తి: – నాలుగు రూపములు గలవాడు
చతుర్బాహు: – నాలుగు బాహువులు గలవాడు
చతుర్వ్యూహ: – శరీర, వేద, ఛందో మహద్రూపుడైన పురుషుడు ఈ నలుగురు పురుషులు వ్యూహములుగా కలవాడు
చతుర్గతి: – నాలుగు విధములైన వారికి ఆశ్రయ స్థానము
చతురాత్మా – చతురమనగా సామర్ధ్యము
చతుర్భావ: – చతుర్విద పురుషార్థములకు మూలమైనవాడు
చతుర్వేదవిత్ – నాలుగు వేదములను తెలిసినవాడు
ఏకపాత్ – జగత్తంతయు ఒక పాదముగా గలవాడు

సమావర్తోఽనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః ।
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ॥ 83

సమావర్త: – సంసార చక్రమును సమర్థతతో త్రిప్పువాడు
అనివృత్తాత్మా – అంతయు తానైయున్నందున దేనినుండియు విడివడినవాడు
దుర్జయ: – జయింప శక్యము గానివాడు
దురతిక్రమ: – అతిక్రమింపరాని విధమును సాసించువాడు
దుర్లభ: – తేలికగా లభించనివాడు
దుర్గమ: – మిక్కిలి కష్టముతో మాత్రమే పొందబడినవాడు
దుర్గ: – సులభముగా లభించనివాడు
దురావాస: – యోగులకు కూడా మనస్సున నిలుపుకొనుటకు కష్టతరమైనవాడు
దురారిహా: – దుర్మార్గులను వధించువాడు

శుభాంగో లోకసారంగః సుతంతుస్తంతువర్ధనః ।
ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ॥ 84

శుభాంగ: – దివ్యములైన, సుందరములైన అవయువములు గలవాడు
లోకసారంగ: – లోకములోని సారమును గ్రహించువాడు
సుతంతు: – జగద్రూపమున అందమైన తంతువువలె విస్తరించినవాడు
తంతువర్థన: – వృద్ధి పరచువాడు, నాశనము చేయువాడు
ఇంద్రకర్మా – ఇంద్రుని కర్మవంటి శుభప్రధమైన కర్మ నాచరించువాడు
మహాకర్మా – గొప్ప కార్యములు చేయువాడు
కృతకర్మా – ఆచరించదగిన కార్యములన్నియు ఆచరించినవాడు
కృతాగమ: – వేదముల నందించువాడు

ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః ।
అర్కో వాజసనః శృంగీ జయంతః సర్వవిజ్జయీ ॥ 85

ఉద్భవ: – ఉత్క్రష్టమైన జన్మ గలవాడు
సుందర: – మిక్కిలి సౌందర్యవంతుడు
సుంద: – కరుణా స్వరూపుడు
రత్నగర్భ: – రత్నమువలె సుందరమైన నాభి గలవాడు
సులోచన: – అందమైన నేత్రములు కలిగిన భగవానుడు
అర్క: – శ్రేష్టులైన బ్రహ్మాదుల చేతను అర్చించబడువాడు
వాజసన: – అర్థించు వారలకు ఆహారము నొసంగువాడని భావము
శృంగీ – శృంగము గలవాడు
జయంత: – సర్వ విధములైన విజయములకు ఆధారభూతుడు
సర్వవిజ్జయీ – సర్వవిద్ అనగా సర్వము తెలిసినవాడు

సువర్ణబిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః ।
మహాహృదో మహాగర్తో మహాభూతో మహానిధిః ॥ 86

సువర్ణబిందు: – బంగారము వంటి అవయువములు గలవాడు
అక్షోభ్య: – క్షోభ తెలియనివాడు
సర్వవాగీశ్వరేశ్వర: – వాక్పతులైన బ్రహ్మాదులకు కూడ ప్రభువైన భగవానుడు
మహాహ్రద: – గొప్ప జలాశయము
మహాగర్త : – అగాధమైన లోయ వంటివాడు
మహాభూత: – పంచభూతములకు అతీతమైనవాడు
మహానిధి: – సమస్త భూతములు తనయందు ఉన్నవాడు

కుముదః కుందరః కుందః పర్జన్యః పావనోఽనిలః ।
అమృతాశోఽమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః ॥ 87

కుముద: – కు అనగా భూమి అట్టి భూమి యొక్క భారమును తొలగించి మోదమును కూర్చువాడు
కుందర: – భూమిని చీల్చుకుపోయినవాడు
కుంద: – భూమిని దానమిచ్చినవాడు
పర్జన్య: – మేఘము వర్షించి భూమిని చల్లబరుచునట్లు జీవుల తాపత్రయములను తొలగించి, వారి మనస్సులను శాంతింపచేయువాడు భగవానుడు
పావన: – పవిత్రీకరించువాడు
అనిల: – ప్రేరణ చేయువాడు, సదా జాగరూకుడు
అమృతాశ: – అమృతము నొసంగువాడు
అమృతవపు: – అమృతస్వరూపుడు శాశ్వతుడు
సర్వజ్ఞ: – సర్వము తెలిసినవాడు
సర్వతోముఖ: – ఏకకాలమున సర్వమును వీక్షించగలవాడు

సులభః సువ్రతః సిద్ధః శత్రుజిచ్ఛత్రుతాపనః ।
న్యగ్రోధోఽదుంబరోఽశ్వత్థశ్చాణూరాంధ్ర నిషూదనః ॥ 88

సులభ: – భక్తితో తనను స్మరించువారికి సులభముగా లభ్యమగువాడు
సువ్రత: – మంచి వ్రతము గలవాడు
సిద్ధ: – సత్వస్వరూపుడై, పూర్ణరూపుడై భగవానుడు సిద్ధ: అని తెలియబడువాడు
శత్రుజిత్ – శత్రువులను జయించువాడు
శత్రుతాపన: – దేవతల విరోదులైన వారిని, సజ్జనులకు విరోధులైన వారిని తపింప చేయువాడు
న్యగ్రోధ: – సర్వ భూతములను తన మాయచే ఆవరించి ఉన్నవాడు
ఉదుంబర: – అన్నముచేత విశ్వమును పోషించువాడు
అశ్వత్ధ: – అశాశ్వతమైన సంసార వృక్ష స్వరూపుడు
చాణూరాంధ్ర నిషూదన: – చాణూరుడను మల్లయోధుని వధించినవాడు

సహస్రార్చిః సప్తజిహ్వః సప్తైధాః సప్తవాహనః ।
అమూర్తిరనఘోఽచింత్యో భయకృద్భయనాశనః ॥ 89

సహస్రార్చి: – అనంతకిరణములు కలవాడు
సప్తజిహ్వ: – ఏడు నాలుకలుగల అగ్నిస్వరూపుడు
సప్తైథా: – ఏడు దీప్తులు కలవాడు
సప్తవాహన: – ఏడు గుఱ్ఱములు వాహనములుగా కలవాడు
అమూర్తి: – రూపము లేనివాడు
అనఘ: – పాపరహితుడు
అచింత్య: – చింతించుటకు వీలుకానివాడు
భయకృత్ – దుర్జనులకు భీతిని కలిగించువాడు
భయనాశన: – భయమును నశింపచేయువాడు

అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ ।
అధృతః స్వధృతః స్వాస్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ 90

అణు: – సూక్షాతి సూక్షమైనవాడు
బృహుత్ – మిక్కిలి పెద్దది అయిన బ్రహ్మము స్వరూపము
కృశ: – సన్ననివాడై, అస్థూలమైనవాడు
స్థూల: – స్థూల స్వరూపము కలిగియున్నవాడు
గుణభృత్ – సత్వరజోస్తమో గుణములకు ఆధారమైనవాడు
నిర్గుణ: – గుణములు తనలో లేనివాడు
మహాన్ – దేశకాలాదుల నధిగమించి యున్నవాడు
అధృత: – సర్వము తానే ధరించియుండి, తనను ధరించునది మరియొకటి లేనివాడు
స్వధృత: – తనకు తానే ఆధారమైనవాడైన భగవానుడు
స్వాస్య: – విశ్వశ్రేయమునకై వేదములను వెలువరించినవాడు
ప్రాగ్వంశ: – ప్రాచీనమైన వంశము కలవాడు
వంశవర్థన: – తన వంశమును వృద్ధినొందించువాడు

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

 శ్రీ విష్ణు సహస్ర నామ శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 1-10 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 11-20 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 21-30 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 31-40 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 41-50 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 51-60 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 61-70 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 71-80 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 81-90 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 91-100 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 101-108 శ్లోకాలు

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top