స్తోత్రాలు » విష్ణు స్తోత్రాలు » శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 11-20 శ్లోకాలు
Sri Vishnu Sahasranama Stotram 11-20 Slokas Telugu devotional image of Lord Vishnu

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 11-20 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం మహాభారతంలోని అనుశాసన పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన పవిత్రమైన దైవిక స్తోత్రం. ఇందులో శ్రీ మహావిష్ణువు యొక్క వెయ్యి దివ్య నామాలు ఉన్నాయి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం జపం చేయడం వలన పాప విమోచనం, ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు కుటుంబ శాంతి కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ దివ్య నామాలలో ప్రతి ఒక్కటి ప్రత్యేక ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉండి భక్తుని జీవితాన్ని సానుకూలంగా మారుస్తుంది.

అజస్సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః ।
వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః ॥ 11
అజః – జన్మము లేనివాడు
సర్వేశ్వరః – సమస్తానికి అధిపతి
సిద్ధః – సంపూర్ణుడు
సిద్ధిః – సాధన ఫలితాన్ని ఇచ్చే వాడు
సర్వాదిః – అన్నింటికీ ఆది
అచ్యుతః – ఎప్పటికీ క్షీణించని వాడు
వృషాకపిః – ధర్మాన్ని కాపాడే వాడు
అమేయాత్మా – కొలవలేని స్వరూపం కలవాడు
సర్వ యోగ వినిసృతః – అన్ని బంధనాల నుండి విముక్తుడు

వసుర్వసుమనాః సత్యః సమాత్మా సమ్మితస్సమః ।
అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః ॥ 12
వసుః – సమస్త జీవుల్లో నివసించే వాడు
వసుమనాః – పవిత్రమైన మనస్సు కలవాడు
సత్యః – సత్య స్వరూపుడు
సమాత్మా – అందరిలో సమానంగా ఉన్న వాడు
సమ్మితః – సమస్తం తెలిసిన వాడు
సమః – అన్నింటియందు సమభావముగలవాడు
అమోఘః – ఎప్పుడూ వ్యర్థం కాని వాడు
పుణ్డరీకాక్షః – కమలంలా అందమైన కళ్లున్న వాడు
వృషకర్మా – ధర్మానికి అనుగుణంగా కార్యాలు చేసే వాడు
వృషాకృతిః – ధర్మ స్వరూపుడు

రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశ్రవాః ।
అమృతః శాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాః ॥ 13
రుద్రః – దుష్టులను సంహరించే వాడు
బహుశిరాః – అనేకములైన శిరములు గలవాడు
బభ్రుః – జగత్తును భరించి కాపాడే వాడు
విశ్వయోనిః – సమస్త సృష్టికి మూలమైన వాడు
శుచిశ్రవాః – పవిత్రమైన కీర్తి కలవాడు
అమృతః – మరణం లేనివాడు
శాశ్వత స్థాణుః – మార్పులేని స్వరూపుడు
వరారోహః – అత్యంత శ్రేష్ఠమైన రూపం కలవాడు
మహాతపాః – గొప్ప తపస్సు కలవాడు

సర్వగః సర్వ విద్భానుర్విష్వక్సేనో జనార్దనః ।
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ॥ 14
సర్వగః – అన్నిచోట్ల వ్యాపించి ఉన్న వాడు
సర్వవిత్ – సమస్తము తెలిసినవాడు;
భానుః – సూర్యునిలా ప్రకాశించువాడు
విష్వక్సేనః – దైవసైన్యాలకు నాయకుడు
జనార్దనః – దుష్టులను శిక్షించువాడు
వేదః – వేదస్వరూపుడు
వేదవిత్ – వేదాలను పూర్తిగా తెలిసిన వాడు
అవ్యఞ్గః – లోపం లేని వాడు
వేదాఞ్గః – వేదాలు అంగాలుగా ఉన్న శాస్త్రాలకు మూలమైన వాడు
వేదవిత్ కవిః  – వేదజ్ఞాని

లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః ।
చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజః ॥ 15
లోకాధ్యక్షః – లోకములకు స్వామి
సురాధ్యక్షః – దేవతలకు ప్రభువు
ధర్మాధ్యక్షః – ధర్మాన్ని నియంత్రించే వాడు
కృతాకృతః – జరిగినవి, జరగనివి అన్నింటికీ కారణమైన వాడు
చతురాత్మా – నాలుగు రూపాలలో ఉన్న వాడు
చతుర్వ్యూహః – నాలుగేసి వ్యూహములతో నొప్పువాడు
చతుర్దంష్ట్రః – నాలుగు కోరపండ్లు కలవాడు (శ్రీనృసింహస్వామి)
చతుర్భుజః – నాలుగు చేతులు కలిగిన వాడు

 

భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః ।
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ॥ 16 ॥
భ్రాజిష్ణుః – స్వయంప్రకాశ స్వరూపుడు
భోజనం – జీవుల పోషణకు మూలమైన వాడు
భోక్తా – యజ్ఞ ఫలాలను స్వీకరించే వాడు
సహిష్ణుః – సహనశీలి, సమస్తాన్ని ఓర్పుతో భరించే వాడు;
జగదాదిజః – జగత్తుకు ఆదికారణమైన వాడు
అనఘః – పాపరహితుడు
విజయః – ఎప్పుడూ విజయాన్ని పొందిన వాడు
జేతా – జయించువాడు
విశ్వయోనిః – సర్వసృష్టికి మూలం
పునర్వసుః – మళ్లీ మళ్లీ సృష్టిని పోషించే వాడు

ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితః ।
అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః ॥ 17 ॥
ఉపేంద్రః – ఇంద్రునకు తమ్ముడై (వామనుడై) అవతరించినవాడు
వామనః – బ్రాహ్మణ బాలక రూపంలో వచ్చిన వాడు
ప్రాంశుః – విస్తారంగా పెరిగిన వాడు
అమోఘః – ఎప్పుడూ వ్యర్థం కాని వాడు
శుచిః – పవిత్రమైన వాడు,
ఊర్జితః – అపారమైన శక్తి కలవాడు
అతీంద్రః – ఇంద్రునికంటే గొప్పవాడు
సంగ్రహః – జగత్తును తనలోనే నిలుపుకొని రక్షించే వాడు
సర్గః – సృష్టి చేయువాడు
ధృతాత్మా – స్థిరమైన చిత్తం కలవాడు
నియమః – నియమాలను స్థాపించే వాడు
యమః – నియంత్రించే వాడు

వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః ।
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ॥ 18 ॥
వేద్యః – వేదాల ద్వారా తెలిసికొనబడువాడు
వైద్యః – భవరోగాన్ని కూడా తొలగించే వైద్యుడు
సదాయోగీ – ఎల్లప్పుడూ యోగస్థితిలో ఉన్న వాడు
వీరహా – దుష్ట వీరులను సంహరించే వాడు
మాధవః – లక్ష్మీదేవి భర్త
మధుః – ఆనందాన్ని ప్రసాదించే వాడు
అతీంద్రియః – ఇంద్రియాలకు అతీతుడు
మహామాయః – తన మాయాశక్తితో జగత్తును నడిపించేవాడు
మహోత్సాహః – అపార ఉత్సాహం, శక్తి కలవాడు
మహాబలః – అపారమైన బలం కలవాడు

మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః ।
అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాద్రిధృక్ ॥ 19 ॥
మహాబుద్ధిః – అపారమైన జ్ఞానం కలవాడు
మహావీర్యః – అపారమైన పరాక్రమం, శౌర్యం కలవాడు
మహాశక్తిః – అనంతమైన శక్తి కలవాడు
మహాద్యుతిః – మహా తేజస్సుతో ప్రకాశించే వాడు
అనిర్దేశ్యవపుః – వర్ణించలేని దివ్య రూపం కలవాడు
శ్రీమాన్ – ఐశ్వర్యంతో నిండిన వాడు
అమేయాత్మా – కొలవలేని, అపారమైన స్వరూపం కలవాడు
మహాద్రిధృక్ – చిన్నికృష్ణునిగా గోవర్ధన గిరిని ఎత్తినవాడు

మహేశ్వాసో మహీభర్తా శ్రీనివాసః సతాంగతిః ।
అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాం పతిః ॥ 20 ॥
మహేశ్వాసః – మహా ధనుస్సు ధరించిన వాడు
మహీభర్తా – భూమిని పోషించి కాపాడే వాడు
శ్రీనివాసః – సిరికి నిలయమైనవాడు
సతాంగతిః – సత్పురుషులకు, ముముక్షువులకు పరమగతియైనవాడు
అనిరుద్ధః – ఎవరూ అడ్డుకోలేని వాడు
సురానందః – దేవతలకు ఆనందము కలిగించే వాడు
గోవిందః – గోవులను, భూమిని, జీవులను కాపాడే వాడు
గోవిదాం పతిః – జ్ఞానులకు, వేదాలను తెలిసిన వారికి అధిపతి



ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top