స్తోత్రాలు » విష్ణు స్తోత్రాలు » శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 1-10 శ్లోకాలు
Sri Vishnu Sahasranama Stotram 1-10 Slokas Telugu devotional image of Lord Vishnu

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 1-10 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం మహాభారతంలోని అనుశాసన పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన పవిత్రమైన దైవిక స్తోత్రం. ఇందులో శ్రీ మహావిష్ణువు యొక్క వెయ్యి దివ్య నామాలు ఉన్నాయి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం జపం చేయడం వలన పాప విమోచనం, ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు కుటుంబ శాంతి కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ దివ్య నామాలలో ప్రతి ఒక్కటి ప్రత్యేక ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉండి భక్తుని జీవితాన్ని సానుకూలంగా మారుస్తుంది.

 విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః ।
భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః ॥ 1
విశ్వం – విశ్వము అంతా తానే ఐన వాడు
విష్ణుః – అంతటనూ వ్యాపించి యున్నవాడు
వషట్కారః – వేద మంత్ర స్వరూపి
భూతభవ్యభవత్ ప్రభుః – భూత, వర్తమాన, భవిష్యత్ కాలములకు ప్రభువు
భూతకృత్ – సకల భూతములను సృష్టించువాడు
భూతభృత్ – అన్ని జీవులను పోషించే వాడు
భావః – సృష్టికి కారణమైన పరమతత్త్వం
భూతాత్మా – సమస్త జీవుల్లో నివసించే ఆత్మ
భూతభావనః – అన్ని జీవులను అభివృద్ధి పరచి కాపాడే వాడు

పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః ।
అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రజ్ఞోఽక్షర ఏవ చ ॥ 2 ॥
పూతాత్మా – పవిత్రమైన స్వరూపం కలవాడు
పరమాత్మా – తాను సర్వులకు ఆత్మయై తనకు మరొక ఆత్మ లేనివాడు
ముక్తానాం పరమాగతిః – ముక్తులైన వారికి పరమాశ్రయమైన వాడు
అవ్యయః – ఎప్పటికీ నశించని వాడు
పురుషః – జగత్తులో నివసించే పరమాత్మ
సాక్షీ – సర్వమును ప్రత్యక్షముగా చూచువాడు
క్షేత్రజ్ఞః – జీవుల అంతరంగాన్ని తెలిసిన వాడు
అక్షరః – నశించని వాడు

యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః ।
నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః ॥ 3 ॥
యోగః – యోగస్వరూపుడు
యోగవిదాం నేతా – యోగులకు మార్గదర్శకుడు
ప్రధాన పురుషేశ్వరః – ప్రకృతి, పురుషుడిపై అధిపతి
నారసింహ వపుః – నరసింహ అవతార రూపం కలవాడు
శ్రీమాన్ – లక్ష్మీదేవిని తన వక్షస్థలమున ధరించినవాడు
కేశవః – అందమైన కేశాలు కలవాడు, కేశి అను రాక్షసుని సంహరించినవాడు
పురుషోత్తమః – పురుషులలో ఉత్తముడు

సర్వః శర్వః శివః స్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః ।
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ॥ 4 ॥
సర్వః – సర్వము తానెయైన వాడు
శర్వః – దుష్టులను సంహరించే వాడు
శివః – మంగళకరుడు
స్థాణుః – స్థిరమైన వాడు
భూతాదిః – సృష్టికి మూలమైన వాడు
నిధిరవ్యయః – తరుగని పెన్నిధి
సంభవః – తనకు తానుగానే అవతరించువాడు
భావనః – సమస్త జీవులను పోషించి అభివృద్ధి పరచే వాడు
భర్తా – జగత్తును పోషించి కాపాడే వాడు
ప్రభవః – సమస్త సృష్టికి మూలకారణం
ప్రభుః – సర్వాధిపతి
ఈశ్వరః – సర్వులనూ పాలించి పోషించువాడు

స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః ।
అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః ॥ 5
స్వయంభూః – స్వయంగా ఉద్భవించిన వాడు
శంభుః – శుభాన్ని కలిగించే వాడు
ఆదిత్యః సూర్యునిలా ప్రకాశించే వాడు
పుష్కరాక్షః – తామరపూవు వంటి కన్నులు గల వాడు
మహాస్వనః – వేదనాదంలా ప్రతిధ్వనించే వాడు
అనాదినిధనః – ఆది అంతం లేని వాడు
ధాతా – సృష్టిని నిర్మించి నిలబెట్టే వాడు
విధాతా – కర్మఫలములను అందించువాడు
ధాతురుత్తమః – సృష్టికర్తలలో శ్రేష్ఠుడు

అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః ।
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః ॥ 6
అప్రమేయః – కొలవలేని వాడు
హృషీకేశః – ఇంద్రియములకు అధిపతి
పద్మనాభః – నాభియందు పద్మము గలవాడు
అమరప్రభుః – దేవతలకు ప్రభువు
విశ్వకర్మా – విశ్వమును సృష్టించిన వాడు
మనుః – మానవులకు మార్గదర్శకుడు
త్వష్టా – సృష్టిలోని రూపాలను నిర్మించే వాడు
స్థవిష్ఠః – అత్యంత విస్తారమైన వాడు
స్థవిరః – సనాతనుడు
ధ్రువః – స్థిరమైన వాడు

అగ్రాహ్యః శాశ్వతో కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ।
ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరమ్ ॥ 7
అగ్రాహ్యః – ఇంద్రియాలతో గ్రహించలేని వాడు
శాశ్వతః – ఎల్లప్పుడు ఉండేవాడు
కృష్ణః – నీలవర్ణ స్వరూపుడు
లోహితాక్షః – ఎర్రటి కాంతి కలిగిన కళ్లున్న వాడు
ప్రతర్దనః – ప్రళయకాలమున సర్వ భూతాలను నాశనము చేయువాడు
ప్రభూతః – అపారమైన సంపద మరియు శక్తి కలవాడు
త్రికకుద్ధామః – మూడు లోకాలలో వ్యాపించి ఉన్న వాడు
పవిత్రం – పరమ పావన స్వరూపుడు
మంగళం పరం – పరమ మంగళకరుడు

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః ।
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ॥ 8
ఈశానః – సర్వలోకాలపై అధిపతి
ప్రాణదః – ప్రాణములను ప్రసాదించువాడు
ప్రాణః – ప్రాణ స్వరూపుడు
జ్యేష్ఠః – అందరిలో పెద్దవాడు
శ్రేష్ఠః – అత్యుత్తముడు
ప్రజాపతిః – సకల ప్రజలకు ప్రభువు
హిరణ్యగర్భః – బ్రహ్మాండ గర్భంగా ఉన్న వాడు
భూగర్భః – భూమిలో వ్యాపించి ఉన్న వాడు
మాధవః – శ్రీమహాలక్ష్మికి భర్త 
మధుసూధనః – మధు అనే రాక్షసుడిని సంహరించిన వాడు

ఈశ్వరో విక్రమీధన్వీ మేధావీ విక్రమః క్రమః ।
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్॥ 9
ఈశ్వరః – సర్వలోకాలకు పరిపాలకుడు
విక్రమీ – మహా పరాక్రమం కలవాడు
ధన్వీ – శార్ఙ్గము అను ధనుసును ధరించినవాడు
మేధావీ – అసాధారణ, అపరిమిత మేధ గలవాడు
విక్రమః – గొప్ప కార్యాలు చేసే వాడు
క్రమః – క్రమంగా సృష్టిని నడిపించే వాడు
అనుత్తమః -తనకన్నా ఉన్నతుడు లేని వాడు
దురాధర్షః – ఎవరూ ఎదుర్కోలేని వాడు
కృతజ్ఞః – భక్తుల భక్తిని అంగీకరించే వాడు
కృతిః – సమస్త కార్యాలకు కారణమైన వాడు
ఆత్మవాన్ – పరిపూర్ణ స్వరూపుడు

సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః ।
అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః ॥ 10
సురేశః – దేవతల అధిపతి
శరణం – ఆశ్రయం ఇచ్చే వాడు
శర్మ – సచ్చిదానంద స్వరూపుడు
విశ్వరేతాః – సృష్టికి మూలమైన వాడు
ప్రజాభవః – సమస్త జీవుల పుట్టుకకు కారణమైన వాడు
అహః – కాలరూపుడు
సంవత్సరః – కాలచక్రాన్ని నడిపించే వాడు
వ్యాళః – బలమైన శక్తి కలవాడు
ప్రత్యయః – విశ్వసింపదగినవాడు
సర్వదర్శనః – అన్నింటిని చూసే వాడు

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top