స్తోత్రాలు » విష్ణు స్తోత్రాలు » శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 71-80 శ్లోకాలు
Sri Vishnu Sahasranama Stotram 71-80 Slokalu Telugu image

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 71-80 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం మహాభారతంలోని అనుశాసన పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన పవిత్రమైన దైవిక స్తోత్రం. ఇందులో శ్రీ మహావిష్ణువు యొక్క వెయ్యి దివ్య నామాలు ఉన్నాయి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం జపం చేయడం వలన పాప విమోచనం, ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు కుటుంబ శాంతి కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ దివ్య నామాలలో ప్రతి ఒక్కటి ప్రత్యేక ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉండి భక్తుని జీవితాన్ని సానుకూలంగా మారుస్తుంది.

బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః ।
బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71
బ్రహ్మణ్య: – ధర్మాన్ని కాపాడువాడు
బ్రహ్మకృత్ – బ్రహ్మను సృష్టించువాడు
బ్రహ్మా – సృష్టికర్త స్వరూపుడు
బ్రహ్మ – పరబ్రహ్మ స్వరూపుడు
బ్రహ్మవివర్ధన: – బ్రహ్మజ్ఞానాన్ని విస్తరించువాడు
బ్రహ్మవిత్ – బ్రహ్మమును తెలిసినవాడు
బ్రాహ్మణ: – బ్రహ్మజ్ఞాని / వేదజ్ఞాని
బ్రహ్మీ – బ్రహ్మతో ఏకత్వం పొందినవాడు
బ్రహ్మజ్ఞ: – పరబ్రహ్మ జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలిసినవాడు
బ్రాహ్మణప్రియ: – బ్రహ్మజ్ఞానులైన వారిని ప్రేమించువాడు

మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః ।
మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః ॥ 72
మహాక్రమ: – గొప్ప పద్ధతి గలవాడు
మహాకర్మా – గొప్ప కార్యాలను చేయువాడు
మహాతేజా: – గొప్ప తేజస్సు గలవాడు
మహోరగ: – మహా సర్ప స్వరూపుడు
మహాక్రతు: – మహాయజ్ఞ స్వరూపుడు
మహాయజ్వా – మహాయజ్ఞాన్ని నిర్వహించువాడు
మహాయజ్ఞ: – యజ్ఞ స్వరూపుడైన వాడు
మహాహవి: – యజ్ఞంలో అర్పించబడే హవిస్సు స్వరూపుడు

స్తవ్యః స్తవప్రియః స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః ।
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73
స్తవ్య: – సర్వులచే స్తుతించబడువాడు
స్తవప్రియ: – స్తోత్రములయందు ప్రీతి కలవాడు
స్తోత్రం – స్తోత్రము కూడా తానే అయినవాడు
స్తుతి: – స్తవనక్రియ కూడా తానే అయినవాడు
స్తోతా – స్తుతించు ప్రాణి కూడా తానే అయినవాడు
రణప్రియ: – యుద్ధమునందు ప్రీతి కలవాడు
పూర్ణ: – సర్వము తనయందే గలవాడు
పూరయితా – తన నాశ్రయించిన భక్తులను శుభములతో నింపువాడు
పుణ్య: – పుణ్య స్వరూపుడు
అనామయ: – ఏవిధమైన భౌతిక, మానసిక వ్యాధులు దరిచేరనివాడు

మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః ।
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥ 74

మనోజవ: – మనసు వలె అమిత వేగము కలవాడు
తీర్థకర: – సకల విద్యలను రచించినవాడు
వసురేతా: – బంగారము వంటి వీర్యము గలవాడు
వసుప్రద: – ధనమును ఇచ్చువాడు
వసుప్రద: – మోక్షప్రదాత
వాసుదేవ: – వాసుదేవునకు కుమారుడు
వసు: – సర్వులకు శరణ్యమైనవాడు
వసుమనా: – సర్వత్ర సమమగు మనస్సు గలవాడు
హవి: – తానే హవిస్వరూపుడైనవాడు

సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః ।
శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసః సుయామునః ॥ 75
 సద్గతి: – సజ్జనులకు పరమగతియైన వాడు
సత్కృతి: – జగత్కళ్యాణమైన ఉత్తమ కార్యము
సత్తా – సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమైన అనుభవ స్వరూపము
సద్భూతి: – పరమోత్కృష్టమైన మేధా స్వరూపుడు
సత్పరాయణ: – సజ్జనులకు పరమగతి అయినవాడు
శూరసేన: – శూరత్వము గల సైనికులు గలవాడు
యదుశ్రేష్ఠ: – యాదవులలో గొప్పవాడు
సన్నివాస: – సజ్జనులకు నిలయమైనవాడు
సుయామున: – యమునా తీర వాసులగు గోపకులచే పరివేష్ఠింప బడినవాడు

భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః
దర్పహా దర్పదో దృప్తో దుర్ధరోఽథాపరాజితః ॥ 76

భూతవాస: – సర్వ భూతములకు నిలయమైనవాడు
వాసుదేవ: – తన మాయాశక్తిచే సర్వము ఆవరించియున్నవాడు వసుదేవుని కుమారుడు
సర్వాసు నిలయ: – సమస్త జీవులకు, ప్రాణులకు నిలయమైనవాడు
అనల: – అపరిమిత శక్తి, సంపద గలవాడు
దర్పహా – దుష్టచిత్తుల గర్వమణుచు వాడు
దర్పద: – ధర్మమార్గమున చరించువారికి దర్పము నొసంగువాడు
దృప్త: – సదా ఆత్మానందామృత రసపాన చిత్తుడు
దుర్థర: – ధ్యానించుటకు, బంధించుటకు సులభసాధ్యము కానివాడు
అపరాజిత: – అపజయము పొందనివాడు

విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్
అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తిః శతాననః ॥ 77

విశ్వమూర్తి: – విశ్వమే తన మూర్తిగా గలవాడు
మహామూర్తి: – గొప్ప మూర్తి గలవాడు
దీప్తమూర్తి: – సంపూర్ణ జ్ఞానముతో ప్రకాశించువాడు
అమూర్తివాన్ – కర్మాధీనమైన దేహమే లేనివాడు
అనేకమూర్తి: – అనేక మూర్తులు ధరించినవాడు
అవ్యక్త: – అగోచరుడు
శతమూర్తి: – అనేక మూర్తులు ధరించినవాడు
శతానన: – అనంత ముఖములు గలవాడు

ఏకో నైకః స్తవః కః కిం యత్తత్ పదమనుత్తమమ్
లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ॥ 78

ఏక: – ఒక్కడే అయినవాడు
నైక: – అనేక రూపములు గలవాడు
సవ: – సోమయాగ రూపమున ఉండువాడు ఏకముగా, అనేకముగా తానే యుండుటచేత తాను పూర్ణరూపుడు
క: – సుఖ స్వరూపుడు
కిమ్ – అతడెవరు? అని విచారణ చేయదగినవాడు
యత్ – దేనినుండి సర్వభూతములు ఆవిర్భవించుచున్నవో ఆ బ్రహ్మము
తత్ – ఏది అయితే వ్యాపించిఉన్నదో అది అయినవాడు
పదం-అనుత్తమం – ముముక్షువులు కోరు ఉత్తమస్థితి తాను అయినవాడు
లోకబంధు: – లోకమునకు బంధువైనవాడు
లోకనాధ: – లోకములకు ప్రభువు
మాధవ: – మౌన, ధ్యాన, యోగాదుల వలన గ్రహించుటకు శక్యమైనవాడు
భక్తవత్సల: – భక్తుల యందు వాత్సల్యము గలవాడు

సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ
వీరహా విషమః శూన్యో ఘృతాశీరచలశ్చలః ॥ 79

సువర్ణవర్ణ: – బంగారు వంటి వర్ణము గలవాడు
హేమాంగ: – బంగారు వన్నెగల అవయువములు గలవాడు
వరంగ: – గొప్పవైన అవయువములు గలవాడు
చందనాంగదీ – ఆహ్లాదకరమైన చందనముతోను కేయూరములతోను అలంకృతమైనవాడు
వీరహా – వీరులను వధించినవాడు
విషమ: – సాటిలేనివాడు
శూన్య: – శూన్యము తానైనవాడు
ఘృతాశీ: – సమస్త కోరికలనుండి విడువడినవాడు
అచల: – కదలిక లేనివాడు
చల: – కదులువాడు

అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృత్
సుమేధా మేధజో ధన్యః సత్యమేధా ధరాధరః ॥ 80

అమానీ – నిగర్వి, నిరహంకారుడు
మానద: – భక్తులకు గౌరవము ఇచ్చువాడు
మాన్య: – పూజింపదగిన వాడైన భగవానుడు
లోకస్వామీ – పదునాలుగు భువనములకు ప్రభువు
త్రిలోకథృక్ – ముల్లోకములకు ఆధారమైన భగవానుడు
సుమేధా: – చక్కని ప్రజ్ఞ గలవాడు
మేధజ: – యజ్ఞము నుండి ఆవిర్భవించినవాడు
ధన్య: – కృతార్థుడైనట్టివాడు
సత్యమేధ: – సత్య జ్ఞానము కలవాడు
ధరాధర: – భూమిని ధరించి యున్నవాడు

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

 శ్రీ విష్ణు సహస్ర నామ శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 1-10 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 11-20 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 21-30 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 31-40 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 41-50 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 51-60 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 61-70 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 71-80 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 81-90 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 91-100 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 101-108 శ్లోకాలు

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top