స్తోత్రాలు » విష్ణు స్తోత్రాలు » శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 51-60 శ్లోకాలు
Sri Vishnu Sahasranama Stotram 51-60 Slokalu in Telugu devotional image

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 51-60 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం మహాభారతంలోని అనుశాసన పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన పవిత్రమైన దైవిక స్తోత్రం. ఇందులో శ్రీ మహావిష్ణువు యొక్క వెయ్యి దివ్య నామాలు ఉన్నాయి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం జపం చేయడం వలన పాప విమోచనం, ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు కుటుంబ శాంతి కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ దివ్య నామాలలో ప్రతి ఒక్కటి ప్రత్యేక ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉండి భక్తుని జీవితాన్ని సానుకూలంగా మారుస్తుంది.

ధర్మగుబ్ధర్మకృద్ధర్మీ సదసత్క్షరమక్షరం॥
అవిజ్ఞాతా సహస్త్రాంశుర్విధాతా కృతలక్షణః ॥ 51 ॥
ధర్మగుప్ – ధర్మమును రక్షించువాడు
ధర్మకృత్ – ధర్మాన్ని స్థాపించువాడు
ధర్మీ – ధర్మ స్వరూపుడు
సత్ – నిత్యుడై ఉన్నవాడు
అసత్ – పరిణామయుతమైన జగద్రూపమున గోచరించువాడు
క్షర: – వ్యయమగు విశ్వరూపమున తెలియబడువాడు
అక్షర: – క్షరమగు ప్రపంచమున అవినాశియై భాసిల్లువాడు
అవిజ్ఞాతా – ఎవరికీ పూర్తిగా గ్రహించలేనివాడు
సహస్రాంశు: – అనంత కిరణములు గలవాడు
విధాతా – సర్వమునకు ఆధారమైనవాడు
కృతలక్షణ: – వేదశాస్త్రములను వెలువరించినవాడు

గభస్తినేమిః సత్త్వస్థః సింహో భూత మహేశ్వరః ।
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ॥ 52 ॥
గభస్తినేమి: – సూర్యచక్రాధిపతి
సత్వస్థ: – సత్త్వగుణంలో నిలిచినవాడు
సింహ: – సింహమువలె పరాక్రమశాలియైనవాడు
భూతమహేశ్వర: – సర్వ భూతములకు ప్రభువైనవాడు
ఆదిదేవ: – తొలి దేవుడు
మహాదేవ: – మహాశక్తి స్వరూపుడు
దేవేశ: – దేవతల అధిపతి
దేవభృద్గురు: – దేవతల గురువు
ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః ।
శరీర భూతభృద్ భోక్తా కపీంద్రో భూరిదక్షిణః ॥ 53 ॥
ఉత్తర: – అందరికంటెను అధికుడై, ఉత్తముడైనవాడు
గోపతి: – గోవులను పాలించువాడు
గోప్తా – సర్వులను సంరక్షించువాడు
జ్ఞానగమ్య: – జ్ఞానము చేతనే పొందగలవాడు
పురాతన: – సృష్టికి పూర్వమే వున్నవాడు
శరీరభూతభృత్ – సమస్త శరీరాలలోని భూతాలను పోషించువాడు
భోక్తా – అనుభవించువాడు
కపీంద్ర: – వానరులకు ప్రభువైనవాడు
భూరిదక్షిణ: – యజ్ఞ సమయములలో విశేషముగా దక్షిణ లిచ్చువాడు
సోమపోఽమృతపః సోమః పురుజిత్ పురుసత్తమః ।
వినయో జయః సత్యసంధో దాశార్హః సాత్వతాం పతిః ॥ 54 ॥
సోమప: – సోమరసాన్ని పానము చేయువాడు
అమృతప: – అమృతాన్ని పానము చేయువాడు
సోమ: – చంద్రరూపమున ఓషధులను పోషించువాడు
పురుజిత్ – అనేకమందిని ఎదురించి, జయించగల్గినవాడు
పురుసత్తమ: – పురుషులలో శ్రేష్ఠుడు
వినయ: – దుష్టులను దండించి, వినయము కల్గించువాడు
జయ: – సర్వులను జయించి వశపరుచుకొనువాడు
సత్యసంధ: – సత్యసంకల్పములు, సత్యవాక్కులు గలవాడు
దాశార్హ: – యాదవ వంశంలో జన్మించినవాడు
సాత్వతాంపతి: – సాత్వతులకు అధిపతి
జీవో వినయితా సాక్షీ ముకుందోఽమిత విక్రమః ।
అంభోనిధిరనంతాత్మా మహోదధి శయోంతకః ॥ 55 ॥
జీవ: – సమస్త జీవుల్లో ఆత్మ స్వరూపుడు
వినయితా సాక్షీ – వినయాన్ని కలిగించువాడు
ముకుంద: – మోక్షాన్ని ప్రసాదించువాడు
అమిత విక్రమ: – అమితమైన పరాక్రమము గలవాడు
అంభోనిధి: – సమస్త భూతాలు తనయందే ఇమిడి యున్నవాడు
అనంతాత్మా – అనంతమైన ఆత్మస్వరూపుడు
మహోదధిశయ: – క్షీరసముద్రంలో శయనించువాడు
అంతక: – ప్రళయకాలమున సర్వమును అంతము చేయువాడు
అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।
ఆనందోఽనందనోనందః సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥
అజ: – పుట్టుకలేనివాడు
మహార్హ: – విశేష పూజకు అర్హుడైనవాడు
స్వాభావ్య: – నిరంతరము స్వరూపజ్ఞానముతో విరాజిల్లువాడు
జితమిత్ర: – శత్రువులను జయించినవాడు
ప్రమోదన: – సదా ఆనందమునందుండువాడు
ఆనంద: – ఆనందమే తన స్వరూపముగా గలవాడు
నందన: – సర్వులకు ఆనందము నొసగువాడు
నంద: – విషయ సంబంధమైన సుఖమునకు దూరుడు
సత్యధర్మా – సత్య, ధర్మ స్వరూపుడు
త్రివిక్రమ: – మూడడుగులచే ముల్లోకములు వ్యాపించినవాడు
మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః ।
త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాంతకృత్ ॥ 57 ॥
మహర్షి: కపిలాచార్య: – వేదవిదుడైన కపిలమునిగా అవతరించినవాడు
కృతజ్ఞ: – సృష్టి, సృష్టికర్త రెండును తానైనవాడు
మేదినీపతి: – భూదేవికి భర్తయైనవాడు
త్రిపద: – మూడు పాదములతో సమస్తము కొలిచినవాడు
త్రిదశాధ్యక్ష: – జీవులనుభవించు జాగ్రుత, స్వప్న, సుషుప్త్యవస్థలకు సాక్షియైనవాడు
మహాశృంగ: – మహత్తర శృంగం (కొమ్ము) కలవాడు
కృతాంతకృత్ – మరణాన్ని జయించువాడు
మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ ।
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్ర గదాధరః ॥ 58 ॥
మహావరాహ: – మహావరాహ అవతార స్వరూపుడు
గోవింద: – గోవులను, ఇంద్రియాలను, భూమిని రక్షించువాడు
సుషేణ: – శక్తివంతమైన సేనను కలవాడు
కనకాంగదీ – బంగారు కంకణాలు ధరించినవాడు
గుహ్య: – హృదయగుహలో దర్శించదగినవాడు
గభీర: – జ్ఞానము, ఐశ్వర్యము, బలము, వీర్యము మొదలగువానిచే గంభీరముగా నుండువాడు
గహన: – సులభముగా గ్రహించుటకు వీలుకానివాడు
గుప్త: – గుప్తంగా ఉన్నవాడు
చక్రగదాధర: – చక్రం, గదను ధరించినవాడు
వేధాః స్వాంగోఽజితః కృష్ణో దృఢః సంకర్షణోఽచ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ 59 ॥
వేధా: – సృష్టి చేయువాడు
స్వాంగ: – తన అంగాలే సర్వసృష్టిగా ఉన్నవాడు
అజిత: – ఎవ్వరూ జయించలేనివాడు
కృష్ణ: – నీలమేఘ శ్యాముడు
దృఢ: – చలించని స్వభావము కలవాడు
సంకర్షణోచ్యుత: – విశ్వమంతయు ప్రళయకాలములో కదిలిపోయినను తాను ఏ విధమైన పరిణామము చెందనివాడు
వరుణ: – తన కిరణములను ఉపసంహరించుకొను సాయంకాల సూర్యుడు
వారుణ: – వరుణుని కుమారులైన వశిష్ఠుడు, అగస్త్యులుగా వ్యక్తమైనవాడు
వృక్ష: – భక్తులకు అనుగ్రహఛాయ నందించువాడు
పుష్కరాక్ష: – కమలంలాంటి కళ్ళు కలవాడు
మహామనా: – గొప్ప మనస్సు కలవాడు
భగవాన్ భగహాఽఽనందీ వనమాలీ హలాయుధః ।
ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః ॥ 60 ॥
భగవాన్ – సృష్టి, లయం, బంధం, మోక్షం, జ్ఞానం, అజ్ఞానం అన్నింటినీ తెలిసినవాడు
భగహా – ప్రళయ సమయమున తన విభూతులను పోగొట్టువాడు
ఆనందీ – ఆనందము నొసంగువాడు
వనమాలీ – వైజయంతిమాలను ధరించినవాడు
హలాయుధ: – నాగలి ఆయుధముగా కలవాడు
ఆదిత్య: – అదితి యొక్క కుమారుడు
జ్యోతిరాదిత్య: – పరమ జ్యోతి స్వరూపుడు
సహిష్ణు: – సహనశీలి
గతిసత్తమ: – సర్వులకు గతియై ఉన్నవాడు

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

 శ్రీ విష్ణు సహస్ర నామ శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 1-10 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 11-20 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 21-30 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 31-40 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 41-50 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 51-60 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 61-70 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 71-80 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 81-90 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 91-100 శ్లోకాలు

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 101-108 శ్లోకాలు

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top