శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 61-70 శ్లోకాలు
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం మహాభారతంలోని అనుశాసన పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన పవిత్రమైన దైవిక స్తోత్రం. ఇందులో శ్రీ మహావిష్ణువు యొక్క వెయ్యి దివ్య నామాలు ఉన్నాయి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం జపం చేయడం వలన పాప విమోచనం, ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు కుటుంబ శాంతి కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ దివ్య నామాలలో ప్రతి ఒక్కటి ప్రత్యేక ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉండి భక్తుని జీవితాన్ని సానుకూలంగా మారుస్తుంది.
సుధన్వా ఖండపరశుర్దారుణో ద్రవిణప్రదః ।
దివఃస్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయోనిజః ॥ 61 ॥
సుధన్వా – శ్రేష్ఠమైన ధనుస్సు కలవాడు
ఖండ పరశు: – శత్రువులను ఖండించునట్టి గొడ్డలిని ధరించినవాడు
దారుణ: – దుష్టులైన వారికి భయమును కలిగించువాడు
ద్రవిణప్రద: – సంపదలను ఇచ్చువాడు
దివ: స్పృక్ – దివిని అంటియున్నవాడు
సర్వదృగ్య్వాస: – సమస్తమైన జ్ఞానములను వ్యాపింపచేయు వ్యాసుడు
వాచస్పతిః – వాక్కుకు అధిపతి
అయోనిజః –స్వయంభువు
త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిషక్ ।
సన్యాసకృచ్ఛమః శాంతో నిష్ఠా శాంతిః పరాయణం। 62 ॥
త్రిసామా – మూడు సామ మంత్రములచే స్తుతించబడువాడు
సామగ: – సామవేదాన్ని గానం చేయువాడు
సామ – సామవేద స్వరూపుడు
నిర్వాణమ్ – మోక్ష స్వరూపుడు
భేషజం – భవరోగమును నివారించు దివ్యౌషధము
భిషక్ – భవరోగమును నిర్మూలించు వైద్యుడు
సంన్యాసకృత్ – సన్యాస వ్యవస్థను ఏర్పరచినవాడు
శమ: – శాంత స్వరూపమైనవాడు
శాంత: – శాంతి స్వరూపుడు
నిష్ఠా – ప్రళయ కాలమున సర్వజీవులకు లయస్థానమైనవాడు
శాంతి: – శాంతి స్వరూపుడు
పరాయణమ్ – పరమ గమ్యం
శుభాంగః శాంతిదః స్రష్టా కుముదః కువలేశయః ।
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥
శుభాంగ: – మనోహరమైన రూపము గలవాడు
శాంతిద: – శాంతిని ప్రసాదించువాడు
స్రష్టా – సృష్టికర్త
కుముద: – భూమిని ఆనందింపజేయువాడు
కువలేశయ: – భూమిని చుట్టియున్న సముద్రమునందు శయనించువాడు
గోహిత: – గోవులకు, భూమికి, ఇంద్రియాలకు హితం చేసే వాడు
గోపతి: – గోవుల అధిపతి / ఇంద్రియాల అధిపతి
గోప్తా – జగత్తును రక్షించువాడు
వృషభాక్ష: – ధర్మాన్ని చూపు దృష్టి కలవాడు
వృషప్రియ: – ధర్మమే ప్రియముగా గలవాడు
అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।
శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాంవరః ॥ 64 ॥
అనివర్తీ – ధర్మ మార్గమున ఎన్నడూ వెనుకకు తగ్గనివాడు
నివృత్తాత్మా – లోకాసక్తి లేనివాడు/ విరక్త స్వరూపుడు
సంక్షేప్తా – జగత్తును ప్రళయకాలమున సూక్షము గావించువాడు
క్షేమకృత్ – క్షేమాన్ని కలిగించువాడు
శివ: – మంగళకరుడు
శ్రీవత్సవక్షా – వక్షస్థలంపై శ్రీవత్స చిహ్నం కలవాడు
శ్రీవాస: – శ్రీదేవి నివాసమైనవాడు
శ్రీపతి: – లక్ష్మీదేవికి భర్తయైనవాడు
శ్రీమతాంవరా: – శ్రీమంతులైన వారిలో శ్రేష్ఠుడు
శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।
శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ॥ 65 ॥
శ్రీద: – ఐశ్వర్యాన్ని ప్రసాదించువాడు
శ్రీశ: – శ్రీ దేవికి నాథుడైనవాడు
శ్రీనివాస: – శ్రీదేవి నివాసమైనవాడు
శ్రీనిధి: – సంపదల నిలయం
శ్రీవిభావన: – సిరులను పంచువాడు
శ్రీధర: – శ్రీదేవిని వక్షస్థలమున ధరించినవాడు
శ్రీకర: – శుభముల నొసగువాడు
శ్రేయ: – శ్రేష్ఠమైన మంగళ ఫలాన్ని ఇచ్చువాడు
శ్రీమాన్ – సర్వ విధములైన ఐశ్వర్యములు గలవాడు
లోకత్రయాశ్రయ: – ముల్లోకములకు ఆశ్రయమైనవాడు
స్వక్షః స్వంగః శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః ।
విజితాత్మాఽవిధేయాత్మా సత్కీర్తిచ్ఛిన్నసంశయః ॥ 66 ॥
స్వక్ష: – చక్కని కన్నులు కలవాడు
స్వంగ: – చక్కని అంగములు కలవాడు
శతానంద: – అపారమైన ఆనందాన్ని ప్రసాదించువాడు
నంది: – పరమానంద స్వరూపుడు
జ్యోతిర్గణేశ్వర: – జ్యోతిర్గణములకు ప్రభువు
విజితాత్మ – మనస్సును జయించువాడు
అవిధేయాత్మా – ఎవరికీ లోబడని స్వతంత్ర స్వరూపుడు
సత్కీర్తి: – సత్యమైన యశస్సు గలవాడు
ఛిన్నసంశయ: – సందేహాలను తొలగించువాడు
ఉదీర్ణః సర్వతశ్చక్షురనీశః శాశ్వతస్థిరః ।
భూశయో భూషణో భూతిర్విశోకః శోకనాశనః ॥ 67 ॥
ఉదీర్ణ: – ఉన్నతమైనవాడు
సర్వతశ్చక్షు: – అంతటను నేత్రములు గలవాడు
అనీశ: – ఎవరికీ అధీనము కానివాడు
శాశ్వతస్థిర: – నిత్యమైన, స్థిరమైన స్వరూపుడు
భూశయ: – భూమిపై శయనించువాడు
భూషణ: – తానే ఆభరణము, అలంకారము అయినవాడు
భూతి: – సర్వ ఐశ్వర్యములకు నిలయమైనవాడు
విశోక: – శోకరహితుడు
శోకనాశన: – శోకములను నశింపచేయువాడు
అర్చిష్మానర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః ।
అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥
అర్చిష్మాన్ – తేజోరూపుడు
అర్చిత: – సమస్త లోకములచే పూజింపబడువాడు
కుంభ: సమస్తాన్ని తనలో ధరించువాడు
విశుద్ధాత్మా – పరిశుద్ధమైన ఆత్మ స్వరూపుడు
విశోధనః – పవిత్రపరచువాడు / శుద్ధి కలిగించువాడు
అనిరుద్ధః – శత్రువులచే అడ్డగింపబడనివాడు
అప్రతిరథ: – సమానుడులేని యోధుడు
ప్రద్యుమ్న: – ప్రకాశవంతుడైనవాడు
అమిత విక్రమ: – అపార పరాక్రమం కలవాడు
కాలనేమినిహా వీరః శౌరిః శూరజనేశ్వరః ।
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 69 ॥
కాలనేమినిహా – కాలనేమి అను రాక్షసుని సంహరించినవాడు
వీర: – వీరత్వము గలవాడు
శౌరి: – శూరవంశంలో జన్మించినవాడు
శూరజనేశ్వరః – శూరులలో శ్రేష్ఠుడు
త్రిలోకాత్మా – త్రిలోకములకు ఆత్మయైనవాడు
త్రిలోకేశ: – మూడు లోకములకు ప్రభువు
కేశవ: – సుందర కేశాలు కలవాడు
కేశిహా: – కేశి అనే అసురుని సంహరించువాడు
హరి: – పాపాలను తొలగించువాడు / రక్షకుడు
కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః ।
అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనంతో ధనంజయః ॥ 70 ॥
కామదేవ: – కోరికలను ప్రసాదించువాడు
కామపాల: – సద్కామాలను నిలబెట్టువాడు
కామీ – భక్తులను ప్రేమించువాడు
కాంత: – ఆకర్షణీయుడైనవాడు
కృతాగమ: – ఆగమ శాస్త్రాలను స్థాపించినవాడు
అనిర్దేశ్యవపు: – నిర్వచించలేని రూపం కలవాడు
విష్ణు: – సర్వవ్యాపకుడు
వీర: – పరాక్రమశాలి
అనంత: – అంతులేని స్వరూపుడు
ధనంజయ: – సంపదలను జయించువాడు
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
శ్రీ విష్ణు సహస్ర నామ శ్లోకాలు
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 1-10 శ్లోకాలు
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 11-20 శ్లోకాలు
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 21-30 శ్లోకాలు
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 31-40 శ్లోకాలు
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 41-50 శ్లోకాలు
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 51-60 శ్లోకాలు
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 61-70 శ్లోకాలు
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 71-80 శ్లోకాలు
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 81-90 శ్లోకాలు
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 91-100 శ్లోకాలు
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 101-108 శ్లోకాలు
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.






