శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 101-108 శ్లోకాలు
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం మహాభారతంలోని అనుశాసన పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన పవిత్రమైన దైవిక స్తోత్రం. ఇందులో శ్రీ మహావిష్ణువు యొక్క వెయ్యి దివ్య నామాలు ఉన్నాయి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం జపం చేయడం వలన పాప విమోచనం, ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు కుటుంబ శాంతి కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ దివ్య నామాలలో ప్రతి ఒక్కటి ప్రత్యేక ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉండి భక్తుని జీవితాన్ని సానుకూలంగా మారుస్తుంది.
అనాదిర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః ।
జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః ॥ 101 ॥
అనాది: – ఆదిలేనివాడు
భూర్భువ: – సర్వభూతములకు ఆధారమైన భూమికి కూడా భూ: ఆధారమైనవాడు
లక్ష్మీ: – లక్ష్మీ స్వరూపుడు
సువీర: – అనేక విధములైన సుందర పోకడలు గలవాడు
రుచిరాంగద: – మంగళమైన బాహువులు గలవాడు
జనన: – సర్వ ప్రాణులను సృజించినవాడు
జన జన్మాది: – జన్మించు ప్రాణుల జన్మకు ఆధారమైనవాడు
భీమ: – అధర్మపరుల హృదయములో భీతిని కలిగించు భయరూపుడు
భీమ పరాక్రమ: – విరోధులకు భయంకరమై గోచరించువాడు
ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః ।
ఊర్ధ్వగః సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ 102 ॥
ఆధార నిలయ: – సృష్టికి ఆధారమైన పృధ్వి, జలము, తేజము, వాయువు, ఆకాశము అను పంచ మహాభూతములకు ఆధారమైనవాడు
అధాతా – తానే ఆధారమైనవాడు
పుష్టహాస: – మొగ్గ పువ్వుగా వికసించునట్లు ప్రపంచరూపమున వికసించువాడు
ప్రజాగర: – సదా మేల్కొనియుండువాడు
ఊర్ధ్వగ: – సర్వుల కన్నా పైనుండువాడు
సత్పధాచార: – సత్పురుషుల మార్గములో చరించువాడు
ప్రాణద: – ప్రాణ ప్రదాత యైనవాడు
ప్రణవ: – ప్రణవ స్వరూపుడైనవాడు
పణ: – సర్వ కార్యములను నిర్వహించువాడు
ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః ।
తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః ॥ 103 ॥
ప్రమాణ: – స్వయముగానే జ్ఞానస్వరూపుడై యున్నవాడు
ప్రాణ నిలయ: – సమస్త జీవుల అంతిమ విరామ స్థానమైనవాడు
ప్రాణభృత్ – ప్రాణములను పోషించువాడు
ప్రాణజీవన: – ప్రాణ వాయువుల ద్వారా ప్రాణులను జీవింపజేయువాడు
తత్త్వం – సత్యస్వరూపమైనందున భగవానుడు తత్త్వం అని తెలియబడిన వాడు
తత్త్వవిత్ – సత్యవిదుడైన భగవానుడు తత్త్వవిత్ అని స్తుతించబడువాడు
ఏకాత్మా – ఏకమై, అద్వితీయమైన పరమాత్మ
జన్మమృత్యు జరాతిగ: – పుట్టుట, ఉండుట, పెరుగుట, మార్పుచెందుట, కృశించుట నశించుట వంటి వికారములకు లోనుగానివాడు
భూర్భువః స్వస్తరుస్తారః సవితా ప్రపితామహః ।
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః ॥ 104 ॥
భూర్భువ: స్వస్తరు: – భూ: భువ: స్వ: అను వ్యాహృతి రూపములు 3 గలవాడు
తార: – సంసార సాగరమును దాటించువాడు
సవితా – తండ్రి వంటివాడైన భగవానుడు
ప్రపితామహః – బ్రహ్మదేవునికి కూడా తండ్రియైనవాడు
యజ్ఞ: – యజ్ఞ స్వరూపుడు
యజ్ఞపతి: – యజ్ఞము నందు అధిష్టాన దేవత తానైన భగవానుడు
యజ్వా – యజ్ఞము నందు యజమాని
యజ్ఞాంగ: – యజ్ఞము లోని అంగములన్నియు తానే అయినవాడు
యజ్ఞవాహన: – ఫలహేతువులైన యజ్ఞములు వాహనములుగా కలవాడు
యజ్ఞభృద్ యజ్ఞకృద్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః ।
యజ్ఞాంతకృద్ యజ్ఞగుహ్యమన్నమన్నాద ఏవ చ ॥ 105 ॥
యజ్ఞభృత్ – యజ్ఞములను సంరక్షించువాడు
యజ్ఞకృత్ – యజ్ఞములను నిర్వహించువాడు
యజ్ఞీ – యజ్ఞములందు ప్రధానముగా ఆరాధించుబడువాడు
యజ్ఞభుక్ – యజ్ఞఫలమును అనుభవించువాడు
యజ్ఞసాధన: – తనను పొందుటకు యజ్ఞములు సాధనములుగా గలవాడు
యజ్ఞాంతకృత్ – యజ్ఞఫలము నిచ్చువాడు
యజ్ఞగుహ్యమ్ – గోప్యమైన యజ్ఞము తానైనవాడు
అన్నం – ఆహారము తానైనవాడు
అన్నాద: – అన్నము భక్షించువాడు
ఆత్మయోనిః స్వయంజాతో వైఖానః సామగాయనః ।
దేవకీనందనః స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ 106 ॥
ఆత్మయోని: – తన ఆవిర్భావమునకు తానే కారణమైనవాడు
స్వయంజాత: – మరొకరి ప్రమేయము లేకనే తనకు తానుగ ఆవిర్భవించువాడు
వైఖాన: – ప్రాపంచిక దు:ఖమును నివారించువాడు
సామగాయన: – సామగానము చేయువాడు
దేవకీనందన: – దేవకీ పుత్రుడైన శ్రీ కృష్ణుడు
స్రష్టా – సృష్టికర్త
క్షితీశ: – భూమికి నాధుడైనవాడు
పాపనాశన: – పాపములను నశింపజేయువాడు
శంఖభృన్నందకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః ।
రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః ॥ 107 ॥
శంఖభృత్ – పాంచజన్యమను శంఖమును ధరించినవాడు
నందకీ – నందకమను ఖడ్గమును ధరించినవాడు
చక్రీ – సుదర్శనమును చక్రమును ధరించినవాడు
శారంగ ధన్వా – శారంగము అనెడి ధనుస్సు కలవాడు
గదాధర: – కౌమోదకి యనెడి గదను ధరించినవాడు
రథాంగపాణి: – చక్రము చేతియందు గలవాడు
అక్షోభ్య: – కలవరము లేనివాడు
సర్వ ప్రహరణాయుధ: – సర్వవిధ ఆయుధములు కలవాడు
శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి ।
వనమాలీ గదీ శార్ఙ్గీ శంఖీ చక్రీ చ నందకీ ।
శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోఽభిరక్షతు ॥ 108 ॥
శ్రీ వాసుదేవోఽభిరక్షతు ఓం నమ ఇతి ।
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
శ్రీ విష్ణు సహస్ర నామ శ్లోకాలు
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 1-10 శ్లోకాలు
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 11-20 శ్లోకాలు
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 21-30 శ్లోకాలు
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 31-40 శ్లోకాలు
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 41-50 శ్లోకాలు
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 51-60 శ్లోకాలు
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 61-70 శ్లోకాలు
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 71-80 శ్లోకాలు
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 81-90 శ్లోకాలు
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 91-100 శ్లోకాలు
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 101-108 శ్లోకాలు
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.






