శ్రీ కామాక్షీ దేవిని స్తుతించే మూకపంచశతీ ఆర్యా శతకం 1-10 శ్లోకాల తెలుగులో అర్థంతో కూడిన భక్తి చిత్రం

మూకపంచశతీ ఆర్యా శతకం తెలుగులో అర్థం 1-10

మూకపంచశతీ అనేది శ్రీ కామాక్షీ పరమేశ్వరి మహిమను గానం చేసే అత్యంత ప్రసిద్ధి చెందిన దేవీ స్తోత్ర గ్రంథాలలో ఒకటి. దీనిని శ్రీ మూకకవి (మూకశంకరుడు) రచించినట్లు ఆధ్యాత్మిక సంప్రదాయం చెబుతుంది.మూకపంచశతీ ఆర్యా శతకం తెలుగులో అర్థం 1-10 శ్లోకాలు. అమ్మవారి అనుగ్రహంతో మాటలేని మూకుడు మహాకవిగా మారి, తన హృదయంలో ఉప్పొంగిన భక్తిని ఐదు శతకాల రూపంలో వ్యక్తపరిచాడు. ఈ అయిదు శతకాలలో ఆర్యా శతకం కూడా ఒక విశిష్టమైన భాగం.

ఈ పోస్ట్‌లో మూకపంచశతీ ఆర్యా శతకంలోని ప్రతి శ్లోకాన్ని మూలపాఠంతో పాటు సులభమైన తెలుగులో అర్థం అందిస్తున్నాము. విద్యార్థులు, భక్తులు మరియు స్తోత్రాలపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ వివరణ ఉపయోగకరంగా ఉండాలని మా ఆకాంక్ష. శ్రీ కామాక్షీ అమ్మవారి దివ్య కృప అందరిపై ఎల్లప్పుడూ ప్రసరించాలని ప్రార్థిస్తూ ఈ పవిత్ర యాత్రను ప్రారంభిద్దాం.

కారణపరచిద్రూపా కాంచీపురసీమ్ని కామపీఠగతా ।
కాచన విహరతి కరుణా కాశ్మీరస్తబక కోమలాంగలతా ॥1॥
పరమ పవిత్రమైన కాంచీపురములో కామపీఠముపై, కారణరూపిణిగా, అన్ని కారణములకు అతీతమైనదిగా, కుంకుమ పూవుల గుత్తులు కలిగిన తీగవంటి శరీరము కలిగి, దయాసముద్రురాలైన, వర్ణించనలవికాని ఒక మహాశక్తి సంచరించుచున్నది.

కంచన కాంచీనిలయం కరధృతకోదండబాణసృణిపాశమ్ ।
కఠినస్తనభరనమ్రం కైవల్యానందకందం అవలంబే ॥2॥
ఆ శక్తి కాంచీ నగరము నుదుటి తిలకము వంటిది. ఆమె తన నాలుగు చేతులలో పాశము, విల్లు, బాణములు అంకుశము మొదలైన ఆయుధములను ధరించి ఉన్నది. తన మాతృస్థానముల బరువుచే వంగి ఉండి, సకల జగత్తుకు మోక్షమును ప్రసాదిస్తున్న మాతను ప్రార్ధిస్తున్నాను.

 చింతితఫలపరిపోషణచింతామణిరేవ కాంచినిలయా మే ।
చిరతర సుచరితసులభా చిత్తం శిశిరయతు చిత్సుఖాధారా ॥3॥
కాంచీపురములో వెలసి ఉన్న ఆ చింతామణి, నేను కోరిన కోరికలన్నీ సిద్ధింపచేస్తున్నది. అత్యంత పుణ్యాత్ములకు  మాత్రమే  ఆ తల్లి సులభముగా వశురాలవుతుంది. తన అమృతమయమైన ధారలతో, ఆమె నా బాధతో నిండిపోయిన మనసుకు శాంతిని ప్రసాదిస్తుంది.

కుటిలకచం కఠినకుచం కుందస్మితకాంతి కుంకుమచ్ఛాయమ్ ।
కురుతే విహృతిం కాంచ్యాం కులపర్వత సార్వభౌమసర్వస్వమ్ ॥4॥
వంకీలు కలిగిన కేశపాశములు, కఠినములైన మాతృస్థానములు, మల్లెపువ్వులా తెల్లని కాంతిగల చిరునవ్వు, కుంకుమవంటి ఎరుపు వర్ణము కలిగిన దేహకాంతి కలిగి, పర్వతరాజైన హిమవంతుని గారాబుపట్టి- కాంచీపురమునందు సంచరించు చున్నది.

పంచశరశాస్త్రబోధన పరమాచార్యేణ దృష్టిపాతేన ।
కాంచీసీమ్ని కుమారీ కాచన మోహయతి కామజేతారమ్ ॥5॥
అమ్మ క్రీగంటి చూపులు, కాముని దహించిన ఈశ్వరునే మోహింపచేయగలిగాయంటే, ఆ చూపులు, కామ శాస్త్రమును బోధించుటలో ప్రవీణులైన గురువులవంటివే కదా.

పరయా కాంచీపురయా పర్వతపర్యాయపీనకుచభరయా ।
పరతంత్రా వయమనయా పంకజసబ్రహ్మచారిలోచనయా ॥6॥
పర్వతములను పోలి, సర్వజగత్తుకు పోషణకారకములైన మాతృస్థానములతో, పద్మములవంటి కన్నులతో కాంచీపురములో వెలసిన మాతకు నేను దాసానుదాసుడను.

ఐశ్వర్యమిందుమౌలేః ఐకాత్మ్యప్రకృతి కాంచిమధ్యగతమ్ ।
ఐందవకిశోరశేఖరం ఐదంపర్యం చకాస్తి నిగమానామ్ ॥7॥
ఈశ్వరునికే ఐశ్వర్యప్రదాత, అద్వైతజ్ఞానమును ప్రసాదించునది, సర్వ వేదముల సారమైనది, చంద్రరేఖను శిరసున ధరించినది అయిన తల్లి- కాంచీపుర మధ్యములో వెలుగుచున్నది.

శ్రితకంపసీమానం శిథిలిత పరమశివ ధైర్యమహిమానమ్ ।
కలయే పటలిమానం కంచన కంచుకిత భువనభూమానమ్ ॥8॥
కంపానదీ తీరములో స్థితురాలైనది, నిగ్రహవంతుడైన- పరమశివుని నిగ్రహమునే చలింపచేసినది, మన్మథుని పునర్జీవితుని చేసినది, సమస్త భువనములను వస్త్రముగా ధరించినది, ఎరుపు వర్ణముతో ప్రకాశించు మాతను మనసులో ధ్యానిస్తున్నాను.

ఆదృతకాంచీనిలయాం ఆద్యామారూఢ యౌవనాటోపామ్ ।
ఆగమవతంస కలికాం ఆనందాద్వైతకందలీం వందే ॥9॥
కాంచీపురమును చల్లగా చూసి కాపాడే ఆదిశక్తి, నిత్య యౌవనవతి, ఉపనిషత్తుల సారము, అద్వైతానందరూపిణి అయిన మాతకు నమస్కరిస్తున్నాను.

తుంగాభిరామకుచభర శృంగారితమాశ్రయా  మి కాంచిగతమ్ ।
గంగాధరపరతంత్రం శృంగారాద్వైత తంత్ర సిద్ధాంతమ్ ॥10॥
మహోన్నతములు, శృంగారభరితములు అయిన మాతృస్థానములు కలిగినది, శృంగార విద్య, తంత్ర శాస్త్రములలో ప్రవీణురాలు, గంగను ధరించినవానికి వశవర్తి అయిన జగన్మాతను స్మరిస్తున్నాను. 

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

మూక పంచశతీ ఆర్యా శతకం – 1-10 శ్లోకాలు 

మూక పంచశతీ ఆర్యా శతకం – 11-20 శ్లోకాలు

మూక పంచశతీ ఆర్యా శతకం – 21-30 శ్లోకాలు

మూక పంచశతీ ఆర్యా శతకం – 31-40 శ్లోకాలు

మూక పంచశతీ ఆర్యా శతకం – 41-50 శ్లోకాలు

మూక పంచశతీ ఆర్యా శతకం – 51-60 శ్లోకాలు

మూక పంచశతీ ఆర్యా శతకం – 61-70 శ్లోకాలు

మూక పంచశతీ ఆర్యా శతకం – 71-80 శ్లోకాలు

మూక పంచశతీ ఆర్యా శతకం – 81-90 శ్లోకాలు

మూక పంచశతీ ఆర్యా శతకం – 91-100 శ్లోకాలు

 

 ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ పోస్ట్‌లో అందించిన మూకపంచశతీ ఆర్యా శతకం తెలుగులో అర్థం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాము. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ పవిత్రమైన స్తోత్ర జ్ఞానాన్ని పంచుకోండి. అలాగే మూకపంచశతీలోని ఇతర శతకాలైన స్తుతి శతకం, కటాక్ష శతకం, మందస్మిత శతకం మరియు పాదారవింద శతకాల తెలుగులో అర్థాలను కూడా మా వెబ్‌సైట్‌లో చదవవచ్చు.

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top