స్తోత్రాలకు తెలుగులో అర్థం » దేవీ స్తోత్రాలు » కామాక్షి స్తోత్రాలు » మూకపంచశతీ ఆర్యా శతకం తెలుగులో అర్థం 51-60
ఆర్యా శతకం 51-60 శ్లోకాల అర్థం

మూకపంచశతీ ఆర్యా శతకం తెలుగులో అర్థం 51-60

మూకపంచశతీ మందస్మిత శతకం శ్రీ కామాక్షీ అమ్మవారి దివ్య మందహాస మహిమను వర్ణించే అపూర్వమైన స్తోత్రరత్నం. మహాకవి మూకకవి రచించిన ఈ శతకంలోని ప్రతి శ్లోకం అమ్మవారి కరుణ, సౌందర్యం, అనుగ్రహాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. ఈ వ్యాసంలో ప్రతి శ్లోకానికి సులభమైన తెలుగులో మూకపంచశతీ అనేది శ్రీ కామాక్షీ పరమేశ్వరి మహిమను గానం చేసే అత్యంత ప్రసిద్ధి చెందిన దేవీ స్తోత్ర గ్రంథాలలో ఒకటి. దీనిని శ్రీ మూకకవి (మూకశంకరుడు) రచించినట్లు ఆధ్యాత్మిక సంప్రదాయం చెబుతుంది. అమ్మవారి అనుగ్రహంతో మాటలేని మూకుడు మహాకవిగా మారి, తన హృదయంలో ఉప్పొంగిన భక్తిని ఐదు శతకాల రూపంలో వ్యక్తపరిచాడు. ఈ అయిదు శతకాలలో ఆర్యా శతకం కూడా ఒక విశిష్టమైన భాగం.

ఈ పోస్ట్‌లో మూకపంచశతీ ఆర్యా శతకంలోని ప్రతి శ్లోకాన్ని మూలపాఠంతో పాటు సులభమైన తెలుగులో అర్థం అందిస్తున్నాము. విద్యార్థులు, భక్తులు మరియు స్తోత్రాలపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ వివరణ ఉపయోగకరంగా ఉండాలని మా ఆకాంక్ష. శ్రీ కామాక్షీ అమ్మవారి దివ్య కృప అందరిపై ఎల్లప్పుడూ ప్రసరించాలని ప్రార్థిస్తూ ఈ పవిత్ర యాత్రను ప్రారంభిద్దాం.

అధికాంచి కేలిలోలైః అఖిలాగమ యంత్రతంత్రమయైః।
అతిశీతం మమ మానసం అసమశరద్రోహి జీవనోపాయైః॥51॥
సర్వ వేదముల యందు, ఆగమములయందు, ప్రకటించబడిన యంత్ర మంత్ర తంత్ర సాధనల వలన కాంచీపురమందు క్రీడించే జగన్మాతచేత, నా మనసులోని తాపము తొలగిపోయి, ఎంతో చల్లబడింది।

నందతి మమ హృది కాచన మందిరయంతా నిరంతరం కాంచీమ్।
ఇందురవిమండలకుచా బిందువియన్నాదపరిణతా తరుణీ॥52॥
కాంచీపురమును వీడకుండా తన నివాస స్థానముగా చేసుకున్న ఒక స్త్రీ మూర్తి, సూర్య చంద్రులను జగత్పోషకములైన పోషణా స్థానములుగా చేసుకొని, నాద బిందు స్వరూపముగా, ఆకాశ రూపముగా వెలుగుచున్న దేవిని నా హృదయ సీమలో ఆరాధిస్తున్నాను।

శంపాలతాసవర్ణం సంపాదయితుం భవజ్వరచికిత్సామ్।
లింపామి మనసి కించన కంపాతటరోహి సిద్ధభైషజ్యమ్॥53॥
కంపానదీ తీరమున కొలువైన కాంచీపురములో, ఔషధ పూరితమైన ఒక తీగ ఉన్నది. ఆ తీగవంటి దేవిని నా శారీరక, సాంసారిక, ప్రాపంచిక జ్వర సంబంధమైన వ్యాధులను నివారించుటకు, మనసులో ధ్యానిస్తాను।

అనుమితకుచకాఠిన్యాం అధివక్షఃపీఠం అంగజన్మరిపోః।
ఆనందదాం భజే తాం ఆనంగబ్రహ్మతత్వబోధసిరామ్॥54॥
కామదేవుని బూడిద చేసి, ఆ బూడిదను తన వక్షస్థలముపై అలముకున్నవాడు ఈశ్వరుడు. ఆ బూడిదను తొలగించి, తన స్తన చిహ్నములను ముద్రించినది దేవి. సుషుమ్నా నాడిలో నిరంతరం చరిస్తూ, భక్తులను కరుణించే శ్రీ విద్యను నిరంతరం స్మరిస్తాను।

ఐక్షిషి పాశాంకుశధరహస్తాంతం విస్మయార్హవృత్తాంతమ్।
అధికాంచి నిగమవాచాం సిద్ధాంతం శూలపాణిశుద్ధాంతమ్॥55॥
సమస్త వేదముల సారమై, ఒక చేతిలో పాశమును, మరొక చేతిలో అంకుశమును ధరించిన విస్మయపరచే రూపము కలిగి, శివుని దేవేరియైన మాత నాకు కాంచీపురములో దర్శనమిచ్చింది।

ఆహితవిలాసభంగీం ఆబ్రహ్మస్తంబశిల్పకల్పనయా।
ఆశ్రితకాంచీం అతులామాద్యాం విస్ఫూర్తిమాద్రియే విద్యామ్॥56॥
ఆ జగన్మాత పూర్వజ. అందరికంటే ముందు ఉన్నది. గడ్డి పరక మొదలు, సృష్టికర్తయైన బ్రహ్మవరకు సృష్టించింది ఆమెయే. ఈ విశ్వములో మొదటి చైతన్యము మాతదే. అటువంటి కాంచీపురములో వెలసిన మాతను నిరంతరం ప్రార్థిస్తాను।

మూకోఽపి జటిలదుర్గతిశోకోఽపి స్మరతి యః క్షణం భవతీమ్।
ఏకో భవతి స జంతుః లోకోత్తరకీర్తిరేవ కామాక్షి॥57॥
మూగవాడైనా, భరించలేని కష్టములపాలై దుఃఖభరితుడైనా, అమ్మా అని ఒక్కసారి నిన్ను మనసారా పిలిస్తే, వెంటనే కష్టములన్నీ తొలగిపోయి, అత్యంత గొప్ప వాడిగా మారిపోతాడు।

పంచదశవర్ణరూపం కంచన కాంచీవిహారధౌరేయమ్।
పంచశరీయం శంభోః వంచనవైదగ్ధ్యమూలమవలంబే॥58॥
జగన్మాత మంత్ర శరీరము కలది. పంచదశి మంత్ర స్వరూపిణి. పంచ బాణములను చేత ధరించి ఈశ్వరుని వశము చేసుకునే తల్లి నాకు ఆలంబనమగుగాక।

పరిణతిమతీం చతుర్ధా పదవీం సుధియాం సమేత్య సౌషుమ్నీమ్।
పంచాశదర్ణకల్పితమదశిల్పాం త్వాం నమామి కామాక్షి॥59॥
జ్ఞానుల సుషుమ్నా నాడిలో 50 వర్ణరూపంగా ప్రకాశించే కామాక్షీ దేవికి నా నమస్కారాలు।

ఆదిక్షన్మమ గురురాడాదిక్షాంతా క్షరాత్మికాం విద్యామ్।
స్వాదిష్ఠచాపదండాం నేదిష్ఠామేవ కామపీఠగతామ్॥60॥
పంచాశత్ వర్ణరూపిణి, చెరకు ధనుస్సు ధరించి కామకోటి పీఠముపై వెలసిన తల్లి స్వరూపాన్ని నా గురుదేవులు నాకు ఉపదేశించారు।

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

 ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top