మూకపంచశతీ ఆర్యా శతకం తెలుగులో అర్థం 21-30
మూకపంచశతీ మందస్మిత శతకం శ్రీ కామాక్షీ అమ్మవారి దివ్య మందహాస మహిమను వర్ణించే అపూర్వమైన స్తోత్రరత్నం. మహాకవి మూకకవి రచించిన ఈ శతకంలోని ప్రతి శ్లోకం అమ్మవారి కరుణ, సౌందర్యం, అనుగ్రహాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. ఈ వ్యాసంలో ప్రతి శ్లోకానికి సులభమైన తెలుగులో మూకపంచశతీ అనేది శ్రీ కామాక్షీ పరమేశ్వరి మహిమను గానం చేసే అత్యంత ప్రసిద్ధి చెందిన దేవీ స్తోత్ర గ్రంథాలలో ఒకటి. దీనిని శ్రీ మూకకవి (మూకశంకరుడు) రచించినట్లు ఆధ్యాత్మిక సంప్రదాయం చెబుతుంది. అమ్మవారి అనుగ్రహంతో మాటలేని మూకుడు మహాకవిగా మారి, తన హృదయంలో ఉప్పొంగిన భక్తిని ఐదు శతకాల రూపంలో వ్యక్తపరిచాడు. ఈ అయిదు శతకాలలో ఆర్యా శతకం కూడా ఒక విశిష్టమైన భాగం.
ఈ పోస్ట్‌లో మూకపంచశతీ ఆర్యా శతకంలోని ప్రతి శ్లోకాన్ని మూలపాఠంతో పాటు సులభమైన తెలుగులో అర్థం అందిస్తున్నాము. విద్యార్థులు, భక్తులు మరియు స్తోత్రాలపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ వివరణ ఉపయోగకరంగా ఉండాలని మా ఆకాంక్ష. శ్రీ కామాక్షీ అమ్మవారి దివ్య కృప అందరిపై ఎల్లప్పుడూ ప్రసరించాలని ప్రార్థిస్తూ ఈ పవిత్ర యాత్రను ప్రారంభిద్దాం.
పురతః కదా న కరవై పురవైరివిమర్దపులకితాంగలతామ్ ।
పునతీం కాంచీదేశం పుష్పాయుధ వీర్య సరసపరిపాటీమ్ ॥21॥
మన్మధుని వీరత్వము అమ్మ ప్రసాదించినదే. అటువంటి అమ్మ యొక్క సన్నని దేహము ఈశ్వరుని ఆలింగనంలో ఆనందములో మునిగి తేలుతుంది. కాంచీపురమును చల్లగా చూస్తున్న ఆ తల్లి నాకు ఎప్పుడు ప్రత్యక్షమవుతుందో కదా?
పుణ్యా కాఽపి పురంధ్రీ పుంఖిత కందర్పసంపదా వపుషా ।
పులినచరీ కంపాయాః పురమథనం పులకని చులితం కురుతే ॥22॥
మన్మథుడు చేసుకున్న పూర్వజన్మముల పుణ్యఫలితంగా, జగన్మాత అతనికి సుందర శరీరాన్ని సంక్రమింపజేసింది. అటువంటి తల్లి కంపానదీ తీరములోని ఇసుకతిన్నెలపై విహరిస్తున్నది. ఆ పతివ్రతా శిరోమణి దర్శన మాత్రముననే ఈశ్వరుడు పులకాంకిత శరీరుడవుతున్నాడు.
తనిమాద్వైతవలగ్నం తరుణారుణ సంప్రదాయతనులేఖమ్ ।
తటసీమని కంపాయాః తరుణిమసర్వస్వం ఆద్యమద్రాక్షమ్ ॥23॥
కంపానదీ తీరములో, పూర్వజ, సనాతనురాలు, నిత్య యౌవని, ఎరుపు వర్ణము కలది, సన్నని కటిప్రదేశముతో సంచరిస్తున్న మాతను నేను తిలకించాను.
పౌష్టికకర్మవిపాకం పౌష్పశరం సవిధసీమ్ని కంపాయాః ।
అద్రాక్షం ఆత్తయౌవనమభ్యుదయం కంచిదర్ధశశిమౌలైః ॥24॥
కామదేవుడైన మన్మథుడు, అనేక పుష్టికరమైన కర్మలను చేసి, వాటి ఫలితముగా, తల్లియొక్క యౌవనదశను పోలిన రూపాన్ని పొందాడు. అటువంటి స్త్రీ చంద్రశేఖరుడైన ఈశ్వరునికి భాగ్యదేవతగా లభించింది. అటువంటి సుందర స్త్రీ మూర్తి నాకు కంపానదీ తీరములో దర్శనమిచ్చింది.
సంశ్రితకాంచీదేశే సరసిజదౌర్భాగ్య జాగ్రదుత్తంసే ।
సంవిన్మయే విలీయే సారస్వతపురుషకార సామ్రాజ్యే ॥25॥
చంద్రుని తన కిరీటములో మాత ధరించినపుడు కమల పుష్పములు కృంగిపోయాయి. జ్ఞానస్వరూపిణీ, సమస్త సారస్వత అధికారిణి అయిన అమ్మలో నేను ఎప్పుడు లీనమవుతానో?
మోదితమధుకరవిశిఖం స్వాదిమ సముదాయసారకోదండమ్ ।
ఆదృతకాంచీఖేలనం ఆదిమం ఆరుణ్యభేదమాకలయే ॥26॥
చేత చెరకు విల్లును, దానికి కావలసిన పుష్పబాణములను ధరించి, కాంచీపురము నందు క్రీడించుటకు ఇష్టపడే మాతను మనసులో ధ్యానిస్తున్నాను.
ఉరరీకృతకాంచిపురీం ఉపనిషదరవింద కుహరమధుధారామ్ ।
ఉన్నమ్రస్తనకలశీం ఉత్సవ లహరీముపాస్మహే శంభోః ॥27॥
కాంచీపుర నివాసియైన జగన్మాత తన ఉన్నతమైన హృదయ భాగముతో ఈశ్వరునకు ఆనందమును కలిగించుచున్నది. సహస్రారములోని ఉపనిషత్తులనే పద్మములనుండి తేనెను కురిపించే దేవిని ప్రార్ధిస్తున్నాను.
ఏణశిశుదీర్ఘలోచనం ఏనఃపరిపంథి సంతతం భజతామ్ ।
ఏకామ్రనాథజీవితం ఏవంపదదూరమేకమవలంబే ॥28॥
జగదంబ నేత్రములు జింకపిల్ల కనులవలే అతి సుందరమైనవి. తనను ఆరాధించే వారిని ఆ కనులు బ్రోచి రక్షిస్తాయి. ఈశ్వరునికే శక్తిప్రదాతయైన మాత నాకు శక్తిని ప్రసాదించుగాక.
స్మయమానముఖం కాంచీభయమానం కమపి దేవతాభేదమ్ ।
దయమానం వీక్ష్య ముహుర్వయమానందం అమృతాంబుధౌ మగ్నాః ॥29॥
దయారస దృక్కులతో, ముఖమున చెరగని చిరునవ్వుతో, సహస్రారములో పతితో క్రీడించి తిరిగి కాంచీపురమునకు విచ్చేసే మాత నన్ను ఆనంద సాగరములో ముంచివేసింది.
కుతుకజుషి కాంచిదేశే కుముదతపోరాశిపాకశేఖరితే ।
కురుతే మనోవిహారం కులగిరిపరిబృఢ కులైకమణిదీపే ॥30॥
పర్వతరాజైన హిమవంతుని ఇంట జనించి, ఆయన వంశమును ఉద్ధరించి, కలువపూవులరేడైన చంద్రరేఖను శిరసున ధరించి, కాంచీపురములో విహరిస్తున్న తల్లి ఒడిలో నేను శిశువుగా ఇమిడిపోతాను.
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.




