మూకపంచశతీ ఆర్యా శతకం తెలుగులో అర్థం 41-50
మూకపంచశతీ మందస్మిత శతకం శ్రీ కామాక్షీ అమ్మవారి దివ్య మందహాస మహిమను వర్ణించే అపూర్వమైన స్తోత్రరత్నం. మహాకవి మూకకవి రచించిన ఈ శతకంలోని ప్రతి శ్లోకం అమ్మవారి కరుణ, సౌందర్యం, అనుగ్రహాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. ఈ వ్యాసంలో ప్రతి శ్లోకానికి సులభమైన తెలుగులో మూకపంచశతీ అనేది శ్రీ కామాక్షీ పరమేశ్వరి మహిమను గానం చేసే అత్యంత ప్రసిద్ధి చెందిన దేవీ స్తోత్ర గ్రంథాలలో ఒకటి. దీనిని శ్రీ మూకకవి (మూకశంకరుడు) రచించినట్లు ఆధ్యాత్మిక సంప్రదాయం చెబుతుంది. అమ్మవారి అనుగ్రహంతో మాటలేని మూకుడు మహాకవిగా మారి, తన హృదయంలో ఉప్పొంగిన భక్తిని ఐదు శతకాల రూపంలో వ్యక్తపరిచాడు. ఈ అయిదు శతకాలలో ఆర్యా శతకం కూడా ఒక విశిష్టమైన భాగం.
ఈ పోస్ట్‌లో మూకపంచశతీ ఆర్యా శతకంలోని ప్రతి శ్లోకాన్ని మూలపాఠంతో పాటు సులభమైన తెలుగులో అర్థం అందిస్తున్నాము. విద్యార్థులు, భక్తులు మరియు స్తోత్రాలపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ వివరణ ఉపయోగకరంగా ఉండాలని మా ఆకాంక్ష. శ్రీ కామాక్షీ అమ్మవారి దివ్య కృప అందరిపై ఎల్లప్పుడూ ప్రసరించాలని ప్రార్థిస్తూ ఈ పవిత్ర యాత్రను ప్రారంభిద్దాం.
బాధాకరీం భవాబ్ధేః రాధారాద్యంబుజేషు విచరంతీమ్ ।
ఆధారీకృతకాంచీ బోధామృతవీచిమేవ విమృశామః ॥41॥
అమ్మా! ఈ సంసార సాగరమునకు నీవు ఎంతో బాధ కలిగిస్తావు. మూలాధార చక్రమునుండి సహస్రార చక్రమువరకు ఉన్న షట్చక్రములలో నీవు విహరిస్తుంటావు. కాంచీపురము వేదికగా సమస్త విశ్వమును అనుగ్రహిస్తున్న నిన్ను నిరంతరం స్మరిస్తాను.
కలయామ్యంతః శశధరకలయాఽంకితమౌలిమ్ అమలచిద్వలయామ్ ।
అలయామాగమపీఠీనిలయాం వలయాంకసుందరీమంబామ్ ॥42॥
నీ సిగ పదహారవ చంద్రకళ చేత అలంకరించబడినది. జ్ఞానమే నీ స్వరూపము. సర్వ ఆగమములను పీఠముగా చేసుకొని బిందు స్వరూపుడైన ఈశ్వరుని ఆశ్రయించి ఉన్న కుండలిని స్వరూపమైన నిన్ను ఆరాధిస్తాను.
శర్వాదిపరమసాధక గుర్వానీతాయ కామపీఠజుషే ।
సర్వాకృతయే శోణిమగర్వాయాస్మై సమర్ప్యతే హృదయమ్ ॥43॥
సదాశివ సమారంభం గురువులందరూ కూడా శ్రీ విద్యవైన నిన్ను సర్వవ్యాప్తం చేశారు. ఎర్రని ఎరుపుతో కాంచీపురమునందు విలసిల్లి భక్తులను పాలిస్తున్న నీకు నా హృదయ పుష్పమును సమర్పిస్తున్నాను.
సమయా సాంధ్యమయూఖైః సమయా బుద్ధయా సదైవ శీలితయా ।
ఉమయా కాంచీరతయా న మయా లభ్యతే కిం ను తాదాత్మ్యమ్ ॥44॥
అమ్మా! నీ దయ నాపై ప్రసరించినట్లయితే సంధ్యా కాంతిరూపిణి, ఓంకార రూపిణి, ఉమాదేవి, కాంచీపురమునందు ఈశ్వరునితో కలిసి క్రీడించే తల్లివైన నీలో ఐక్యం కాలేకపోతానా!
జంతోస్తవ పదపూజన సంతోషతరంగితస్య కామాక్షి ।
వంధో యది భవతి పునః సింధోరంభస్సు బంభ్రమీతి శిలా ॥45॥
జగన్మాతా! ఏ భక్తుడైతే నిరంతరము నీ పాదపూజలో నిమగ్నమై ఉంటాడో, వానిని ఈ సంసారము బాధించగలదా. నీ పాదముల ధ్యానమే సాధకుని సంసార బాధల నుండి విముక్తుని చేసి నీటిపై రాతి బండలను తేలేలా చేస్తుంది.
కుండలి కుమారి కుటిలే చండి చరాచరసవిత్రి చాముండే ।
గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి ॥46॥
మూలాధార చక్రములో కుండలినీ స్వరూపముగా, వక్ర గమనముతో, చరాచర జగత్తును ప్రసవిస్తూ, త్రిగుణ స్వరూపిణివై, హ్రీంకార రూపిణివై, వేదములచే గుప్త విద్యగా పేర్కొనబడిన గురుస్వరూపిణియైన మాతృదేవతకు నమస్కరిస్తున్నాను.
అభిదాకృతిః భిదాకృతిః అచిదాకృతిరపి చిదాకృతిర్మాతః ।
అనహంతా త్వమహంతా భ్రమయసి కామాక్షి శాశ్వతీ విశ్వమ్ ॥47॥
జీవులలో భేదము, అభేదము, చైతన్యము, జడత్వము—ఇలాంటి ద్వంద్వ భ్రమలను విశ్వములో కలిగించి అందరినీ నీ మాయలో ముంచి తేల్చేది నీవే.
శివ శివ పశ్యంతి సమం శ్రీకామాక్షీకటాక్షితాః పురుషాః ।
విపినం భవనమమిత్రం మిత్రం లోష్టం చ యువతిబింబోష్ఠమ్ ॥48॥
తల్లీ! నీ క్రీగంటి చూపులు ప్రసరించినవారు సమదృష్టి కలవారు అవుతారు. అరణ్యమూ, గృహమూ, మిత్రుడూ, శత్రువూ, మట్టి బొమ్మైనా, సుందరి పెదవులైనా సమానంగా దర్శిస్తారు.
కామపరిపంథికామిని కామేశ్వరి కామపీఠమధ్యగతే ।
కామదుఘా భవ కమలే కామకలే కామకోటి కామాక్షి ॥49॥
కామదేవుని సంహరించిన ఈశ్వరునిచే కామించబడిన కాంచీపుర కామకోటి పీఠముపై వెలసిన కామాక్షీ! భక్తుల కోరికలను నెరవేర్చే కామధేనువుగా నీవు ఉండుము.
మధ్యేహృదయం మధ్యేనిటిలం మధ్యేశిరోఽపి వాస్తవ్యామ్ ।
చండకరశక్రకార్ముక చంద్రసమాభాం నమామి కామాక్షీమ్ ॥50॥
అమ్మా! హృదయములో రవితేజస్విని, భ్రూమధ్యములో ఇంద్రధనుసు సమానప్రభ, బ్రహ్మరంధ్రంలో చంద్రకాంతి రూపిణిగా వెలుగొందే కామాక్షీ దేవికి నా నమస్కారము.
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
మూక పంచశతీ ఆర్యా శతకం – 1-10 శ్లోకాలు
మూక పంచశతీ ఆర్యా శతకం – 11-20 శ్లోకాలు
మూక పంచశతీ ఆర్యా శతకం – 21-30 శ్లోకాలు
మూక పంచశతీ ఆర్యా శతకం – 31-40 శ్లోకాలు
మూక పంచశతీ ఆర్యా శతకం – 41-50 శ్లోకాలు
మూక పంచశతీ ఆర్యా శతకం – 51-60 శ్లోకాలు
మూక పంచశతీ ఆర్యా శతకం – 61-70 శ్లోకాలు
మూక పంచశతీ ఆర్యా శతకం – 71-80 శ్లోకాలు
మూక పంచశతీ ఆర్యా శతకం – 81-90 శ్లోకాలు
మూక పంచశతీ ఆర్యా శతకం – 91-100 శ్లోకాలు
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.





