పురాణాలు » శ్రావణ మాస మాహాత్మ్యం » శ్రావణ మాస మహాత్మ్యం – పదకొండవ అధ్యాయం
Rotaka Vratam Audumbara Vratam Telugu

శ్రావణ మాస మహాత్మ్యం – పదకొండవ అధ్యాయం

పరమశివుడు చెప్పిన ఏడు వారాల వ్రతాల గురించి విన్న సనత్కుమారుడు, ఎంతో ఆనందంతో స్వామిని ఇలా అడిగాడు:ఓ జగద్రక్షకా! మీరు చెప్పిన వ్రతాల గురించి విన్నాను. అమృతం లాంటి మీ మాటలు ఎంత విన్నా నాకసలు తనివి తీరడం లేదు. మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే, ఈ పన్నెండు నెలల్లో శ్రావణ మాసానికి సాటివచ్చే మాసం మరొకటి లేదని నాకు అనిపిస్తోంది. కాబట్టి ఓ ప్రభూ, దయచేసి ఈ శ్రావణ మాసంలో వచ్చే తిథులకు ఉన్న మహిమను కూడా వినాలని ఉంది, దయచేసి చెప్పండి” అని ప్రార్థించాడు.

అందుకు కైలాసనాథుడు చిరునవ్వుతో ఇలా చెప్పడం ప్రారంభించాడు:ఓ మునీశ్వరా! నెలలన్నిటిలో కార్తీక మాసం శ్రేష్ఠమైనది, దానికంటే మాఘ మాసం ఉత్తమమైనది, దానికంటే వైశాఖ మాసం మరింత గొప్పది, ఇక మార్గశిర మాసం సాక్షాత్తూ విష్ణువుకు ఎంతో ప్రీతికరమైనది. నేను జగత్ స్వరూపుడను కాబట్టి ఈ నాలుగు నెలలూ నాకూ చాలా ఇష్టమైనవే. కానీ నాయనా… పన్నెండు నెలల్లోకెల్లా శ్రావణ మాసం మాత్రం సాక్షాత్తూ నా (శివ) స్వరూపమే! ఈ మాసంలో ఉండే తిథులన్నీ ఏదో ఒక పుణ్య వ్రతంతో కూడుకున్నవే. అయినా సరే, వాటిలో మనిషికి అత్యంత శ్రేయస్సును ఇచ్చే కొన్ని ప్రధానమైన తిథుల గురించి చెబుతాను శ్రద్ధగా విను.

పాడ్యమి తిథి – రోటక వ్రతం: శ్రావణ మాసంలో సోమవారం నాడు గనక పాడ్యమితిథి వస్తే… ఆ నెలలో మొత్తం ఐదు సోమవారాలు వస్తాయి. ఆ పాడ్యమి సోమవారం నాడు భక్తులు రోటక వ్రతం చేయాలి. ఆ రోజు మొదలుపెట్టి మూడు నెలల పదిహేను రోజుల పాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలిగి కోరిన కోరికలన్నీ నెరవేరతాయి.

ఆ వ్రత విధానం చెబుతాను విను. పాడ్యమి సోమవారం నాడు ఉదయాన్నే, ‘ఓ జగద్గురువా! ఇది మొదలు నేను రోటక వ్రతాన్ని ఆచరిస్తాను, నా మీద దయ చూపించు స్వామీఅని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోవాలి. ప్రతిరోజూ నాకు మారేడు దళాలు, తులసి ఆకులు, నల్ల కలువలు, పద్మాలు, ఎర్ర కలువలు, సంపంగి, జాజి, గోరింట, జిల్లేడు పూలతో పాటు.. ఆయా రుతువుల్లో దొరికే శుభప్రదమైన పూలతో నన్ను పూజించాలి.

ఈ వ్రతంలో ముఖ్యంగా, ఒక మనిషి తినడానికి సరిపడేంత పరిమాణంలో ఐదు రొట్టెలను (రోటకాలను) తయారుచేయాలి. అందులో ఒక రొట్టెను దేవుడికి నైవేద్యంగా పెట్టాలి, రెండు రొట్టెలను బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి, మిగిలిన రెండు రొట్టెలను తాను ప్రసాదంగా స్వీకరించాలి. ఆ తర్వాత దేవుడికి అర్ఘ్యం వదిలి.. అరటి, కొబ్బరి, నిమ్మ, ఖర్జూర, నారింజ, జామ లాంటి రకరకాల పండ్లను నైవేద్యంగా సమర్పించాలి.

శ్రావణ మాస విశిష్టతను సూచించే పవిత్ర శివలింగం, బిల్వదళాలు, అభిషేకం, చంద్రుడు మరియు భక్తి వాతావరణంతో కూడిన దివ్య చిత్రం

ఏడు సముద్రాల అవతల వరకు ఉన్న విశాలమైన భూమిని దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, భక్తిగా ఈ వ్రతం చేసినా అంతే పుణ్యం వస్తుంది. విశేషంగా డబ్బు కావాలనుకునే వాడు ఈ వ్రతాన్ని ఐదు సంవత్సరాలు చేస్తే గొప్ప ధనవంతుడు అవుతాడు. ఉద్యాపన సమయంలో ఒక బంగారపు రొట్టెను, ఒక వెండి రొట్టెను చేయించి దానమివ్వాలి.

విదియ తిథి – ఔదుంబర (మేడి చెట్టు) వ్రతం: ఓ సనత్కుమారా! ఇక శ్రావణ శుద్ధ విదియ నాడు చేయాల్సిన శుభప్రదమైన, పాపాలను పోగొట్టే ఔదుంబర వ్రతం గురించి చెబుతాను. ఈ వ్రతం చేసిన మనిషికి విశేషమైన లక్ష్మీ కటాక్షం, సంతాన భాగ్యం కలుగుతాయి.

విదియ తిథి నాడు ఉదయాన్నే స్నానం చేసి పరిశుద్ధుడై వ్రత సంకల్పం చేసుకోవాలి. ఎదురుగా నిజమైన మేడి చెట్టు ఉంటే దానికి పూజ చేయాలి, ఒకవేళ అది లేకపోతే గోడ మీద దాని బొమ్మను గీసి పూజించాలి. ఆ వృక్ష దేవుడినిఉదుంబర, హేమపుష్పక, జంతుఫల, రక్తాండకాలిఅనే నాలుగు పేర్లతో పూజించాలి. అలాగే దానికి అధిదేవతలైన శివుడిని, శుక్రుడిని కూడా పూజించాలి.

దీనికి ముఖ్యంగా ముప్పై మూడు మేడి పండ్లను తీసుకురావాలి. వాటిని మూడు భాగాలు చేసి… పదకొండు పండ్లను దేవుడికి నైవేద్యంగా పెట్టాలి, పదకొండు పండ్లను బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి, మిగిలిన పదకొండు పండ్లను తాను తినాలి. ఆ రోజు అస్సలు అన్నం తినకూడదు. ఆ రాత్రి శివుడిని, శుక్రుడిని పూజించి రాత్రంతా జాగరణ చేయాలి. ఈ విధంగా పదకొండు సంవత్సరాలు వ్రతం చేసి, ఆ తర్వాత ఉద్యాపన చేయాలి. ఉద్యాపన రోజున బంగారంతో ఒక మేడి చెట్టు బొమ్మను చేయించి పూజించి, బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి.

ఈ వ్రతం చేయడం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాన్ని చెబుతాను విను. మేడి చెట్టు ఎన్నో పండ్లను ఇస్తూ అన్ని కర్మలకూ ఎలా ఉపయోగపడుతుందో, ఈ వ్రతం చేసినవాడు కూడా వంశాన్ని వృద్ధి చేస్తూ ఎంతోమంది పిల్లలను పొందుతాడు. మేడి చెట్టు బంగారం లాంటి పూలతో ఎలా ప్రకాశిస్తుందో, ఈ వ్రతం చేసినవాళ్ళు కూడా లక్ష్మీ కటాక్షంతో అలా సంపన్నులై విలసిల్లుతారు.

సనత్కుమారా! ఇంతవరకు ఎవరికీ తెలియని ఎంతో రహస్యమైన ఈ వ్రతాల గురించి నువ్వు యోగ్యుడివి కాబట్టే నీకు మాత్రమే చెప్పాను. ఏమాత్రం సందేహించకుండా భక్తితో ఈ వ్రతాలను ఆచరించు” అని ఈశ్వరుడు సనత్కుమారుడికి వివరించాడు.

ఇక్కడితో స్కాంద పురాణాంతర్గత శ్రావణ మాస మహాత్మ్యంలో పాడ్యమి రోటక వ్రతం, విదియ ఔదుంబర వ్రత కథలను తెలిపే పదకొండవ అధ్యాయం పూర్తయింది.

📥 ఈ అధ్యాయానికి సంబంధించిన తెలుగు PDF

ఈ అధ్యాయానికి సంబంధించిన పూర్తి తెలుగు PDFను డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా?

మా Bharatiya Samskruthi YouTube Channelలో చాలా తక్కువ మొత్తంతో Membershipలో చేరి, ఈ అధ్యాయంతో పాటు రాబోయే శ్రావణ మాస మహాత్మ్యం అన్ని అధ్యాయాల PDFలను,ఇతర స్తోత్రాల తెలుగు అర్థం pdf లను  సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

🙏 ఈరోజే Memberగా చేరి అన్ని PDFలను పొందండి.

ఓం నమః శివాయ! 🕉️

 

శ్రావణ మాస మహాత్మ్యం

మొదటి అధ్యాయం: శ్రావణ మాస విశిష్టత

రెండవ అధ్యాయం: వ్రత నియమాలు, విశేషాలు

మూడవ అధ్యాయం: నక్త వ్రత పూజా విశేషాలు

నాలుగవ అధ్యాయం: విశేష వ్రతాలు, రుద్ర వర్తి వ్రత మహిమ

ఐదవ అధ్యాయం: కోటి లింగాల మహిమ, ఆదివార వ్రతం

ఆరవ అధ్యాయం: సోమవార వ్రత విశిష్టత

ఏడవ అధ్యాయం: మంగళగౌరీ వ్రత మహిమ, శ్రుతకీర్తి రాజు కథ

ఎనిమిదవ అధ్యాయం: బుధ, గురువార వ్రత విశిష్టత

తొమ్మిదవ అధ్యాయం: జీవంతికా దేవి వ్రత మహిమ

పదవ అధ్యాయం: శనివార వ్రత విశేషాలు

పదకొండవ అధ్యాయం: రోటక వ్రతం, ఔదుంబర వ్రత విశిష్టత

పన్నెండవ అధ్యాయం: స్వర్ణ గౌరీ వ్రత విశిష్టత

పదమూడవ అధ్యాయం: దూర్వా గణపతి వ్రత విశిష్టత

పదునాలుగవ అధ్యాయం: నాగ పంచమి వ్రత విశేషాలు

పదిహేనవ అధ్యాయం: సూపోదన వ్రతం, నాగ పంచమి విశేషాలు

పదహారవ అధ్యాయం: శీతలాష్టమి వ్రత విశిష్టత

పదిహేడవ అధ్యాయం: పవిత్రారోపణ వ్రతం, కుమారి పూజా మహిమ

పద్దెనిమిదవ అధ్యాయం: ఆషాఢ శుక్ల దశమి వ్రత మహిమ

పంతొమ్మిదవ అధ్యాయం: ఏకాదశీ వ్రతం, పవిత్రారోపణ వ్రత విశేషాలు

ఇరవయ్యవ అధ్యాయం: త్రయోదశీ మన్మథ పూజ, చతుర్దశి వ్రత విశేషాలు

ఇరవై ఒకటవ అధ్యాయం: త్రిమోదకి వ్రతం, రక్షాబంధన విశిష్టత

ఇరవై రెండవ అధ్యాయం: సంకష్టహరణ చతుర్థీ వ్రత మహిమ

ఇరవై మూడవ అధ్యాయం: శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రత విశేషాలు

ఇరవై నాలుగవ అధ్యాయం: శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రత మహిమ – ముగింపు

“శ్రావణ మాస మహాత్మ్యం ద్వారా మనం ఎన్నో వ్రతాల విశిష్టతలను, వాటి ఆధ్యాత్మిక ప్రయోజనాలను తెలుసుకున్నాం. ఈ పవిత్ర మాసంలో భక్తితో ఆచరించే ప్రతి వ్రతం మన జీవితంలో సుఖసంతోషాలను నింపుతుంది.

ఈ అద్భుతమైన సిరీస్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా Bharatiya Samskruthi YouTube ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ!”

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top