శ్రావణ మాస మహాత్మ్యం – 21 వ అధ్యాయం
సనత్కుమారుడు తన గురువైన పరమేశ్వరుడిని “స్వామీ! త్రిమోదకి వ్రతం ఎలా చేయాలో నాకు వివరంగా చెప్పండి” అని అడిగాడు. అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెప్పసాగాడు:
“ఈ వ్రతంలో మనం మన్మథుడిని పదహారు రకాల ఉపచారాలతో పూజించాలి. ఆయనకు ఇష్టమైన పూలు సమర్పించాలి – మల్లె పూలు, తామర పూలు, కుంకుమ పూలు, రకరకాల సువాసనగల పూలు. వాటితో పాటు మంచిగంధం, పన్నీరు లాంటి సుగంధ ద్రవ్యాలు కూడా ఇవ్వాలి. తర్వాత నైవేద్యం పెట్టాలి. ఆఖరున తాంబూలం సమర్పించాలి – అందులో వక్క, పోక చెక్క, కర్పూరం, జాజికాయ, లవంగాలు, యాలకులు అన్నీ కలిపి ఇవ్వాలి. ఇలా భక్తిగా, శుభ్రమైన మనసుతో పూజ చేస్తే మన్మథుడు సంతోషిస్తాడు.”
“మన్మధుడిని ఎన్నో పేర్లతో పిలుస్తారు – మీనకేతనుడు, కందర్పుడు, అనంగుడు, మనోభవుడు అని. ఆయన బాణం పువ్వులతో చేసినదే అయినా, దాని శక్తి చాలా గొప్పది. ఆ బాణం తగిలితే పెద్ద పెద్ద దేవతలు కూడా తట్టుకోలేరు. విష్ణుమూర్తి బృందాదేవి కోసం ఎంతో తపించాడు. ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అహల్య మీద మోహం పెంచుకుని పెద్ద తప్పు చేశాడు. చంద్రుడు తన గురువు బృహస్పతి భార్యనే కోరుకున్నాడు. విశ్వామిత్రుడు లాంటి గొప్ప ముని కూడా ఎన్నోసార్లు తపోభంగం అయ్యాడు. ఇంత శక్తిగల మన్మథుడిని శాంతపరచడానికే ఈ పూజ చేస్తారు. ఇలా భక్తితో పూజిస్తే మంచి జీవిత భాగస్వామి దొరుకుతాడు, కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.”
“ఈ వ్రతాన్ని శుక్ల పక్షంలో త్రయోదశి నాడు చేయాలి. అష్టమి నాడు దేవి పూజ చేసుకున్నవారు, చేయలేకపోతే చతుర్దశి నాడైనా చేసుకోవచ్చు. ఇలా భక్తిగా చేసినవారికి మంచి ఆరోగ్యం, మంచి సంతానం, దీర్ఘాయుష్షు లభిస్తాయి” అని చెప్పాడు.
సనత్కుమారుడు మళ్ళీ “స్వామీ! ఇప్పుడు రక్షాబంధనం ఎలా చేయాలో చెప్పండి” అని అడిగాడు.

ఈశ్వరుడు నవ్వుతూ ఇలా చెప్పాడు. “శ్రావణ మాసం పౌర్ణమి రోజు పొద్దున్నే స్నానం చేసి, తర్పణాలు వదిలి, పితృదేవతలను తలచుకోవాలి. తర్వాత బంగారు జరీతో, ముత్యాలతో, రంగురంగుల పట్టు దారాలతో అలంకరించిన ఒక అందమైన రక్ష (రాఖీ) తయారు చేయించాలి. తర్వాత బంధువులు, స్నేహితులు అందరూ చేరి, వేదమంత్రాలు చదువుతూ, సంగీతం వాయిస్తూ సంతోషంగా ఆ రాఖీని చేతికి కట్టుకోవాలి. కడుతున్నప్పుడు “బలి చక్రవర్తిని ఏ రక్ష కట్టి కాపాడారో, అదే రక్ష ఇప్పుడు నన్ను కూడా కాపాడుగాక!” అనుకోవాలి.
“బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు – అందరూ తమ తమ ఆచారం ప్రకారం బ్రాహ్మణులతో రక్ష కట్టించుకోవచ్చు. ఇలా భక్తిగా రక్షాబంధనం చేసుకున్నవారికి ఏడాది పొడవునా కష్టాలు రావు, సుఖంగా ఉంటారు. పిల్లలు, మనవళ్ళతో కలిసి అన్ని సంపదలూ పొందుతారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి – భద్రా తిథి రోజు రక్ష కట్టుకోకూడదు. ఆ రోజు కడితే మంచికి బదులు కీడు జరుగుతుంది” అని ఈశ్వరుడు, రక్షాబంధన కథను కూడా సనత్కుమారుడికి వివరంగా చెప్పాడు.
ఇదే స్కాంద పురాణంలోని కాశీ ఖండంలో పరమశివుడు సనత్కుమారునికి బోధించిన త్రిమోదకి వ్రత మహిమ మరియు రక్షాబంధన విధానాన్ని వివరించే ఇరవై ఒకటవ అధ్యాయం.
📥 ఈ అధ్యాయానికి సంబంధించిన తెలుగు PDF
ఈ అధ్యాయానికి సంబంధించిన పూర్తి తెలుగు PDFను డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా?
మా Bharatiya Samskruthi YouTube Channelలో చాలా తక్కువ మొత్తంతో Membershipలో చేరి, ఈ అధ్యాయంతో పాటు రాబోయే శ్రావణ మాస మహాత్మ్యం అన్ని అధ్యాయాల PDFలను,ఇతర స్తోత్రాల తెలుగు అర్థం pdf లను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
🙏 ఈరోజే Memberగా చేరి అన్ని PDFలను పొందండి.
ఓం నమః శివాయ! 🕉️
శ్రావణ మాస మహాత్మ్యం
మొదటి అధ్యాయం: శ్రావణ మాస విశిష్టత
రెండవ అధ్యాయం: వ్రత నియమాలు, విశేషాలు
మూడవ అధ్యాయం: నక్త వ్రత పూజా విశేషాలు
నాలుగవ అధ్యాయం: విశేష వ్రతాలు, రుద్ర వర్తి వ్రత మహిమ
ఐదవ అధ్యాయం: కోటి లింగాల మహిమ, ఆదివార వ్రతం
ఆరవ అధ్యాయం: సోమవార వ్రత విశిష్టత
ఏడవ అధ్యాయం: మంగళగౌరీ వ్రత మహిమ, శ్రుతకీర్తి రాజు కథ
ఎనిమిదవ అధ్యాయం: బుధ, గురువార వ్రత విశిష్టత
తొమ్మిదవ అధ్యాయం: జీవంతికా దేవి వ్రత మహిమ
పదవ అధ్యాయం: శనివార వ్రత విశేషాలు
పదకొండవ అధ్యాయం: రోటక వ్రతం, ఔదుంబర వ్రత విశిష్టత
పన్నెండవ అధ్యాయం: స్వర్ణ గౌరీ వ్రత విశిష్టత
పదమూడవ అధ్యాయం: దూర్వా గణపతి వ్రత విశిష్టత
పదునాలుగవ అధ్యాయం: నాగ పంచమి వ్రత విశేషాలు
పదిహేనవ అధ్యాయం: సూపోదన వ్రతం, నాగ పంచమి విశేషాలు
పదహారవ అధ్యాయం: శీతలాష్టమి వ్రత విశిష్టత
పదిహేడవ అధ్యాయం: పవిత్రారోపణ వ్రతం, కుమారి పూజా మహిమ
పద్దెనిమిదవ అధ్యాయం: ఆషాఢ శుక్ల దశమి వ్రత మహిమ
పంతొమ్మిదవ అధ్యాయం: ఏకాదశీ వ్రతం, పవిత్రారోపణ వ్రత విశేషాలు
ఇరవయ్యవ అధ్యాయం: త్రయోదశీ మన్మథ పూజ, చతుర్దశి వ్రత విశేషాలు
ఇరవై ఒకటవ అధ్యాయం: త్రిమోదకి వ్రతం, రక్షాబంధన విశిష్టత
ఇరవై రెండవ అధ్యాయం: సంకష్టహరణ చతుర్థీ వ్రత మహిమ
ఇరవై మూడవ అధ్యాయం: శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రత విశేషాలు
ఇరవై నాలుగవ అధ్యాయం: శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రత మహిమ – ముగింపు
“శ్రావణ మాస మహాత్మ్యం ద్వారా మనం ఎన్నో వ్రతాల విశిష్టతలను, వాటి ఆధ్యాత్మిక ప్రయోజనాలను తెలుసుకున్నాం. ఈ పవిత్ర మాసంలో భక్తితో ఆచరించే ప్రతి వ్రతం మన జీవితంలో సుఖసంతోషాలను నింపుతుంది.
ఈ అద్భుతమైన సిరీస్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం 👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link సబ్‌స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ!”
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.







