శ్రావణ మాస మహాత్మ్యం – పదమూడవ అధ్యాయం
ఒక రోజు సనత్కుమారుడు పరమేశ్వరుడిని వినయంగా అడిగాడు—
“స్వామీ! దూర్వా గణపతి వ్రతం గురించి నాకు వివరంగా చెప్పండి. ఈ వ్రతాన్ని మహర్షులు, దేవతలు, మనుష్యులు కూడా ఆచరించారని విన్నాను. ఎంతో మంగళకరమైన ఈ పవిత్ర వ్రత మహిమను పూర్తిగా వినాలనుకుంటున్నాను.”
అప్పుడు ఈశ్వరుడు సంతోషంగా ఇలా చెప్పడం ప్రారంభించాడు “ఓ సనత్కుమారా! దూర్వా గణపతి వ్రతం గురించి ఇప్పుడు నీకు చెబుతాను, శ్రద్ధగా విను.
పూర్వకాలంలో పార్వతీదేవి, సరస్వతీదేవి, ఇంద్రుడు, శ్రీమహావిష్ణువు, కుబేరుడు మాత్రమే కాదు, అనేకమంది దేవతలు, మహర్షులు, గంధర్వులు, కిన్నరులు కూడా ఈ మహత్తరమైన వ్రతాన్ని ఆచరించారు. శ్రావణ మాసంలోని శుక్ల పక్ష చతుర్థి రోజున ఈ దూర్వా గణపతి వ్రతాన్ని చేయాలి. ఈ పవిత్ర చవితి తిథి సమస్త పాపాలను నశింపజేసే శక్తి కలది” అని ఈశ్వరుడు వ్రత విధానాన్ని ఈ విధంగా వివరించాడు.
“ఏకదంతుడైన విఘ్నేశ్వరుని ప్రతిమ బంగారంతో చేయించాలి. ఆ ప్రతిమకు బంగారు పీఠం తయారు చేసి, బంగారు గరికలపై ఆసీనుడిగా ఉండేలా ఏర్పాటు చేయాలి. ఆ విఘ్నేశ్వరుని ప్రతిమను ఎర్రని వస్త్రాలతో అలంకరించిన రాగి కలశంలో ప్రతిష్ఠించాలి. ఆ కలశం కింద ‘సర్వతోభద్ర’ మండలాన్ని లిఖించి, దానిపై స్థాపించాలి. తర్వాత ఎర్రని పుష్పాలు, ఉత్తరేణి ఆకులు, జమ్మి, గరిక, తులసీ దళాలు సువాసనగల ఇతర పుష్పాలతో గణపతిని భక్తితో పూజించాలి.

పళ్ళు, ఉండ్రాళ్లు, భక్ష్యములు మొదలైన నైవేద్యాలను సమర్పించి, షోడశోపచారాలతో గిరిజాసుతుడైన వినాయకుడిని ఆరాధించాలి. రత్నాలతో అలంకరించిన బంగారు సింహాసనాన్ని ఆసనంగా సమర్పించాలి.
‘ఓ విఘ్నేశ్వరా! నా జీవితంలోని సమస్త విఘ్నాలను తొలగించు. నీ పవిత్ర పాదాలను నా గృహంలో స్థిరపరచుము’ అని ప్రార్థించాలి.గంగాది సమస్త పవిత్ర నదుల జలములను భావించి స్నానార్ధం సమర్పించాలి.సిందూరం, కుంకుమతో అలంకరించిన వస్త్రాలను సమర్పించి నమస్కరించాలి.
‘ఓ వినాయకా! ఈ సుగంధ గంధాన్ని స్వీకరించు. ఎర్రని గంధంతో కలిపిన అక్షతలను భక్తితో సమర్పిస్తున్నాను’ అని చెప్పాలి. సంపంగి, మల్లె, దాసాని వంటి పుష్పాలతో పార్వతీదేవి కుమారుడిని పూజించాలి.
‘లోకాల రక్షణకై అవతరించిన దేవా! ఈ పుష్పాలను ఆనందంగా స్వీకరించు’ అని ప్రార్థించాలి. తర్వాత పరమాన్నం, అప్పాలు మరియు నాలుగు విధాల అన్నాలను నైవేద్యంగా సమర్పించాలి. కర్పూరం, లవంగాలు, ఏలకులు, పోకచెక్కలు, తమలపాకులతో కూడిన తాంబూలాన్ని సమర్పిస్తూ—
‘ఇది నీకు సుఖాన్ని కలిగించుగాక’ అని ప్రార్థించాలి. తర్వాత బంగారు దక్షిణను సమర్పిస్తూ— ‘ఓ గణనాథా! నాకు శాంతిని ప్రసాదించు’ అని ప్రార్థించాలి.”
ఇలా పూజ పూర్తయ్యాక ఉద్యాపన విధానం గురించి కూడా ఈశ్వరుడు వివరించాడు. “తన శక్తికి తగ్గట్టుగా విఘ్నేశ్వరుని పూజించి, ఆచార్యునికి దానంతో సమర్పించాలి. ఈ విధంగా ఐదు సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించి, తరువాత ఉద్యాపన చేసినవాడు భూలోకంలో సమస్త కోరికలను అనుభవించి, దేహాంతంలో కైలాసాన్ని పొందుతాడు.
కానీ ఉద్యాపన చేయకుండా కేవలం వ్రతం మాత్రమే చేస్తే ఆ వ్రత ఫలం పూర్తిగా లభించదు. అందువల్ల ఉద్యాపన రోజున ఉదయం నూనెతో తలస్నానం చేయాలి. బంగారంతో విఘ్నేశ్వరుని ప్రతిమ చేయించి, పంచగవ్యాలతో స్నానం చేయించి, గరిక మొదలైన వాటితో పూజించాలి.
ప్రతి మనిషి శ్రద్ధతో ఈ పూజ చేయాలి. దూడ కలిగిన ఆవును గోదానంగా ఇవ్వాలి. తన శక్తికి తగ్గట్టుగా ఇతర దానాలు కూడా చేయాలి. ఇలా వ్రతం చేసినవాడు తన కోరికలన్నీ పొందుతాడు” అని చెప్పి ఈశ్వరుడు ఈ వ్రత ఫలాన్ని మరింత స్పష్టంగా ఇలా వివరించాడు.
“గణపతి నా ప్రియమైన కుమారుడు. అతని వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారిపై నేను ఎంతో సంతోషిస్తాను. వారికి భూలోకంలో ఉన్నంతకాలం సమస్త భోగాలను ప్రసాదించి, అంత్యకాలంలో కైలాసప్రాప్తి కలిగిస్తాను. గరికలు కాలక్రమంలో ఎలా విస్తరించి పెరుగుతాయో, అదే విధంగా దూర్వా గణపతి వ్రతాన్ని ఆచరించిన వారి వంశం కూడా పుత్రులు, పౌత్రులతో అభివృద్ధి చెందుతుంది. ఓ మునీశ్వరా! కష్టసమయాలలో రక్షణనిచ్చే, అత్యంత శ్రేష్ఠమైన దూర్వా గణపతి వ్రత మహిమను నీకు వివరంగా చెప్పాను. సుఖసంపదలు, శాంతి, సంతానం, విజయాలు కోరుకునే వారందరూ ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి.” ఇలా ఈశ్వరుడు సనత్కుమారునికి దూర్వా గణపతి వ్రత మహిమను వివరించాడు.
📥 ఈ అధ్యాయానికి సంబంధించిన తెలుగు PDF
ఈ అధ్యాయానికి సంబంధించిన పూర్తి తెలుగు PDFను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా?
మా Bharatiya Samskruthi YouTube Channelలో చాలా తక్కువ మొత్తంతో Membershipలో చేరి, ఈ అధ్యాయంతో పాటు రాబోయే శ్రావణ మాస మహాత్మ్యం అన్ని అధ్యాయాల PDFలను,ఇతర స్తోత్రాల తెలుగు అర్థం pdf లను సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
🙏 ఈరోజే Memberగా చేరి అన్ని PDFలను పొందండి.
ఓం నమః శివాయ! 🕉️
శ్రావణ మాస మహాత్మ్యం
మొదటి అధ్యాయం: శ్రావణ మాస విశిష్టత
రెండవ అధ్యాయం: వ్రత నియమాలు, విశేషాలు
మూడవ అధ్యాయం: నక్త వ్రత పూజా విశేషాలు
నాలుగవ అధ్యాయం: విశేష వ్రతాలు, రుద్ర వర్తి వ్రత మహిమ
ఐదవ అధ్యాయం: కోటి లింగాల మహిమ, ఆదివార వ్రతం
ఆరవ అధ్యాయం: సోమవార వ్రత విశిష్టత
ఏడవ అధ్యాయం: మంగళగౌరీ వ్రత మహిమ, శ్రుతకీర్తి రాజు కథ
ఎనిమిదవ అధ్యాయం: బుధ, గురువార వ్రత విశిష్టత
తొమ్మిదవ అధ్యాయం: జీవంతికా దేవి వ్రత మహిమ
పదవ అధ్యాయం: శనివార వ్రత విశేషాలు
పదకొండవ అధ్యాయం: రోటక వ్రతం, ఔదుంబర వ్రత విశిష్టత
పన్నెండవ అధ్యాయం: స్వర్ణ గౌరీ వ్రత విశిష్టత
పదమూడవ అధ్యాయం: దూర్వా గణపతి వ్రత విశిష్టత
పదునాలుగవ అధ్యాయం: నాగ పంచమి వ్రత విశేషాలు
పదిహేనవ అధ్యాయం: సూపోదన వ్రతం, నాగ పంచమి విశేషాలు
పదహారవ అధ్యాయం: శీతలాష్టమి వ్రత విశిష్టత
పదిహేడవ అధ్యాయం: పవిత్రారోపణ వ్రతం, కుమారి పూజా మహిమ
పద్దెనిమిదవ అధ్యాయం: ఆషాఢ శుక్ల దశమి వ్రత మహిమ
పంతొమ్మిదవ అధ్యాయం: ఏకాదశీ వ్రతం, పవిత్రారోపణ వ్రత విశేషాలు
ఇరవయ్యవ అధ్యాయం: త్రయోదశీ మన్మథ పూజ, చతుర్దశి వ్రత విశేషాలు
ఇరవై ఒకటవ అధ్యాయం: త్రిమోదకి వ్రతం, రక్షాబంధన విశిష్టత
ఇరవై రెండవ అధ్యాయం: సంకష్టహరణ చతుర్థీ వ్రత మహిమ
ఇరవై మూడవ అధ్యాయం: శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రత విశేషాలు
ఇరవై నాలుగవ అధ్యాయం: శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రత మహిమ – ముగింపు
“శ్రావణ మాస మహాత్మ్యం ద్వారా మనం ఎన్నో వ్రతాల విశిష్టతలను, వాటి ఆధ్యాత్మిక ప్రయోజనాలను తెలుసుకున్నాం. ఈ పవిత్ర మాసంలో భక్తితో ఆచరించే ప్రతి వ్రతం మన జీవితంలో సుఖసంతోషాలను నింపుతుంది.
ఈ అద్భుతమైన సిరీస్పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం 👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ!”
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.








