శ్రావణ మాస మహాత్మ్యం – 22 వ అధ్యాయం
ఒకసారి సనత్కుమారుడు ఈశ్వరుడిని “స్వామీ, శ్రావణ మాసంలో బహుళ చవితి రోజున చేసే సంకష్టహరణ వ్రతం గురించి చెప్పండి” అని అడిగాడు
దానికి ఈశ్వరుడు “శ్రావణ బహుళ చవితి రోజున ఈ వ్రతం చేస్తే, మనుషులకు ఉన్న అన్ని కోరికలు తీరుతాయి. ఇది అన్ని కష్టాలనూ పోగొట్టే వ్రతం” అని చెప్పాడు. అప్పుడు సనత్కుమారుడు “స్వామీ! ఈ వ్రతం ఎలా చెయ్యాలి? ఏ సమయంలో స్నానం చెయ్యాలి? పూజ ఎలా చెయ్యాలి? ఉద్యాపన ఎప్పుడు చెయ్యాలి? ఇదంతా వివరంగా చెప్పండి” అని అడిగాడు. అప్పుడు శివుడు ఇలా చెప్పసాగాడు:
శ్రావణ బహుళ చవితి రోజు ఉదయాన్నే లేచి, పళ్ళు తోముకొని, స్నానం పూర్తి చేసుకోవాలి. ఈ రోజు చాలా పుణ్యమైన రోజు. ఈ రోజు సంకష్టహరణ వ్రత కథ చదవాలి, చంద్రుడు ఉదయించే వరకూ ఏమీ తినకుండా ఉండాలి. ఇలా నియమంగా ఉండి, “నా కష్టాలన్నీ తొలగించు” అని కోరుకోవాలి. ప్రొద్దున్నే సంకల్పం చెప్పుకొని, నువ్వులు వేసిన నీళ్ళతో స్నానం చేసి, సంధ్యావందనం, అగ్నిహోత్రం, వైశ్యదేవం లాంటి రోజువారీ పూజా కార్యక్రమాలు చేసుకున్న తర్వాత వినాయకుడిని పూజించాలి.
వినాయకుడి ప్రతిమను బంగారంతో గానీ, వెండితో గానీ, రాగితో గానీ చేయించుకోవచ్చు. బంగారం, వెండి, రాగి ఏమీ లేకపోతే, కనీసం మట్టితో గానీ ఆకులతో గానీ ఒక చిన్న ప్రతిమ చేసుకున్నా చాలు. డబ్బు లేదని వ్రతం మానకూడదు — ఎవరి శక్తికి తగ్గట్టు వాళ్ళు, ఉన్నదాంట్లోనే భక్తిగా చెయ్యాలి.

ఒక కలశంలో నీళ్ళు నింపి, దానికి పూజ చేసి, గణపతిని అందులో ఆవాహన చేసి, పదహారు రకాల ఉపచారాలతో పూజించాలి. మనకు ఎంత చేతనైతే అంతే భక్తితో పూజ చెయ్యాలి — ఖర్చు పెద్దగా చెయ్యలేకపోయినా పర్వాలేదు, మనసు పెట్టి చెయ్యడమే ముఖ్యం. తర్వాత కుడుములు (మోదకాలు) చేసి, కొన్నింటిని నువ్వులతో కలిపి, వాటిలో కొన్నింటిని దేవుడికి నివేదన చేసి, మిగతావి బ్రాహ్మణులకు లేదా పండితులకు పంచిపెట్టాలి. ఆ బ్రాహ్మణుడిని దేవుడిలానే భావించి పూజించి, తనకు తోచిన దక్షిణ ఇచ్చి, నమస్కరించి, “నా వ్రతం పూర్తయ్యేలా చూడు, నా కోరిక తీర్చు” అని మనసారా ప్రార్థించాలి. తర్వాత అందరికీ భోజనం పెట్టాలి.
చివరగా చంద్రుడికి కూడా అర్ఘ్యం ఇచ్చి నమస్కరించి, ఏదైనా పొరపాటు జరిగితే క్షమించమని కోరుకోవాలి.
ఈ వ్రతాన్ని ఆచరిస్తే విద్య, ధనం, సంతానం, ఆరోగ్యం, కార్యసిద్ధి, మోక్షం వంటి అనేక శుభఫలితాలు లభిస్తాయి. అన్ని కష్టాలు తొలగి, సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయి.
చంద్రుడు ఒకసారి తప్పు చేసి, దానికి పరిహారంగా ఈ వ్రతాన్నే చేశాడని, దాంతో అతని దోషం తొలగిపోయిందని కథ చెబుతోంది. ఇంకో భాగంలో బాణాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం జరిగిన సందర్భం, బలరామ కృష్ణులు, ఇతర దేవతలు కూడా ఈ వ్రతాన్నే ఆచరించి తమ కోరికలు తీర్చుకున్నారని చెబుతుంది.
ఈ వ్రతంతో సమానమైనది వేరే ఏ దానం కానీ, తీర్థయాత్ర కానీ, ఉపవాసం కానీ లేదు. భక్తితో, నమ్మకంతో దీన్ని చేసేవాళ్ళకు భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉండి, వాళ్ళు కోరుకున్నవన్నీ తీరుస్తాడు. నువ్వు అందరికీ మేలు చేసేవాడివి కాబట్టి, ఈ వ్రత విధానాన్ని నీకు వివరంగా చెప్పాను. దీన్ని అందరికీ తెలియజేసి, అందరూ దీన్ని ఆచరించేలా చూడు” అని ఈశ్వరుడు సనాత్కుమారుడితో వివరించాడు.
ఇదే స్కాంద పురాణంలోని కాశీ ఖండంలో పరమశివుడు సనత్కుమారునికి బోధించిన సంకష్టహరణ చతుర్థీ వ్రత మహిమ మరియు దాని ఆచరణ విధానాన్ని వివరించే ఇరవై రెండవ అధ్యాయం.
📥 ఈ అధ్యాయానికి సంబంధించిన తెలుగు PDF
ఈ అధ్యాయానికి సంబంధించిన పూర్తి తెలుగు PDFను డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా?
మా Bharatiya Samskruthi YouTube Channelలో చాలా తక్కువ మొత్తంతో Membershipలో చేరి, ఈ అధ్యాయంతో పాటు రాబోయే శ్రావణ మాస మహాత్మ్యం అన్ని అధ్యాయాల PDFలను,ఇతర స్తోత్రాల తెలుగు అర్థం pdf లను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
🙏 ఈరోజే Memberగా చేరి అన్ని PDFలను పొందండి.
ఓం నమః శివాయ! 🕉️
శ్రావణ మాస మహాత్మ్యం
మొదటి అధ్యాయం: శ్రావణ మాస విశిష్టత
రెండవ అధ్యాయం: వ్రత నియమాలు, విశేషాలు
మూడవ అధ్యాయం: నక్త వ్రత పూజా విశేషాలు
నాలుగవ అధ్యాయం: విశేష వ్రతాలు, రుద్ర వర్తి వ్రత మహిమ
ఐదవ అధ్యాయం: కోటి లింగాల మహిమ, ఆదివార వ్రతం
ఆరవ అధ్యాయం: సోమవార వ్రత విశిష్టత
ఏడవ అధ్యాయం: మంగళగౌరీ వ్రత మహిమ, శ్రుతకీర్తి రాజు కథ
ఎనిమిదవ అధ్యాయం: బుధ, గురువార వ్రత విశిష్టత
తొమ్మిదవ అధ్యాయం: జీవంతికా దేవి వ్రత మహిమ
పదవ అధ్యాయం: శనివార వ్రత విశేషాలు
పదకొండవ అధ్యాయం: రోటక వ్రతం, ఔదుంబర వ్రత విశిష్టత
పన్నెండవ అధ్యాయం: స్వర్ణ గౌరీ వ్రత విశిష్టత
పదమూడవ అధ్యాయం: దూర్వా గణపతి వ్రత విశిష్టత
పదునాలుగవ అధ్యాయం: నాగ పంచమి వ్రత విశేషాలు
పదిహేనవ అధ్యాయం: సూపోదన వ్రతం, నాగ పంచమి విశేషాలు
పదహారవ అధ్యాయం: శీతలాష్టమి వ్రత విశిష్టత
పదిహేడవ అధ్యాయం: పవిత్రారోపణ వ్రతం, కుమారి పూజా మహిమ
పద్దెనిమిదవ అధ్యాయం: ఆషాఢ శుక్ల దశమి వ్రత మహిమ
పంతొమ్మిదవ అధ్యాయం: ఏకాదశీ వ్రతం, పవిత్రారోపణ వ్రత విశేషాలు
ఇరవయ్యవ అధ్యాయం: త్రయోదశీ మన్మథ పూజ, చతుర్దశి వ్రత విశేషాలు
ఇరవై ఒకటవ అధ్యాయం: త్రిమోదకి వ్రతం, రక్షాబంధన విశిష్టత
ఇరవై రెండవ అధ్యాయం: సంకష్టహరణ చతుర్థీ వ్రత మహిమ
ఇరవై మూడవ అధ్యాయం: శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రత విశేషాలు
ఇరవై నాలుగవ అధ్యాయం: శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రత మహిమ – ముగింపు
“శ్రావణ మాస మహాత్మ్యం ద్వారా మనం ఎన్నో వ్రతాల విశిష్టతలను, వాటి ఆధ్యాత్మిక ప్రయోజనాలను తెలుసుకున్నాం. ఈ పవిత్ర మాసంలో భక్తితో ఆచరించే ప్రతి వ్రతం మన జీవితంలో సుఖసంతోషాలను నింపుతుంది.
ఈ అద్భుతమైన సిరీస్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం 👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link సబ్‌స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ!”
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.







