శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 111-120 శ్లోకాలు
లక్ష్మీ సహస్రనామ స్తోత్రం మహాలక్ష్మీ దేవి యొక్క వెయ్యి దివ్య నామాలను స్తుతించే పవిత్రమైన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని భక్తితో పారాయణం చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం, ఐశ్వర్యం, సుఖశాంతులు మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు లభిస్తాయని విశ్వాసం. ఈ పేజీలో లక్ష్మీ సహస్రనామ స్తోత్రానికి సరళమైన తెలుగులో అర్థం మరియు ప్రతి నామం యొక్క విశిష్టతను తెలుసుకుందాం.
సుగృహా రక్తబీజాంతా హతకందర్పజీవికా |
సముద్రవ్యోమమధ్యస్థా సమబిందుసమాశ్రయా || 111 ||
సుగృహా – మంచి గృహము కలిగినది
రక్తబీజాంతా – రక్తబీజుడను రాక్షసుణ్ణి చంపినది
హతకందర్పజీవికా – శివుని మూడో కంటిచే చంపబడిన మన్మధుణ్ణి బ్రతికించినది
సముద్రవ్యోమమధ్యస్థా – ఆకాశం, సముద్రాల మధ్య ఉండునది
సమబిందుసమాశ్రయా – శ్రీచక్రంలోని బిందువులో నివసించునది
సౌభాగ్యరసజీవాతుః సారాసారవివేకదృక్ |
త్రివళ్యాదిసుపుష్టాంగా భారతీ భరతాశ్రితా || 112 ||
సౌభాగ్యరసజీవాతుః – స్త్రీలకు సుమంగళీత్వమును ప్రసాదించు దేవత
సారాసారవివేకదృక్ – జ్ఞానదృష్టి గల తల్లి
త్రివళ్యాదిసుపుష్టాంగా – తుంటిలో మూడు మడతలతో ఆరోగ్యకరమైన శరీరాన్ని కలిగి ఉన్నది
భారతీ – సరస్వతి
భరతాశ్రితా – భరతుని ఆశ్రయించినది
నాదబ్రహ్మమయీవిద్యా జ్ఞానబ్రహ్మమయీపరా |
బ్రహ్మనాడీ నిరుక్తిశ్చ బ్రహ్మకైవల్యసాధనమ్ || 113 ||
నాదబ్రహ్మమయీ – సర్వత్రా వ్యాపించియున్న శబ్దజ్ఞానము
విద్యా – విద్యా స్వరూపిణి
జ్ఞానబ్రహ్మమయీ – బ్రహ్మము యొక్క దివ్య జ్ఞానము
పరా – పరావాక్కు స్వరూపిణి
బ్రహ్మనాడీ – కుండలినీ శక్తి సంచరించు బ్రహ్మనాడి, దేవీ స్వరూపము
నిరుక్తిః – నిరుక్తమనగా వైదిక సంస్కృత భాషా నిఘంటువు. ఆ నిరుక్తి శాస్త్ర స్వరూపిణి అమ్మ
బ్రహ్మకైవల్యసాధనా – బ్రహ్మకైవల్యం అంటే మోక్షమును పొందుటకు సాధనమైనది
కాలకేయమహోదారవీర్యవిక్రమరూపిణీ |
బడబాగ్నిశిఖావక్త్రా మహాకబళతర్పణా || 114 ||
కాలకేయమహోదారవీర్యవిక్రమరూపిణీ – ఎంతో పరాక్రమశాలురైన కాలకేయులకు శక్తి సామర్థ్యాలు ప్రసాదించినది
బడబాగ్నిశిఖావక్త్రా – బడబాగ్ని వంటి ముఖము కలిగి, ప్రళయకాలమున సృష్టిని లయము చేయునది
మహాకబళతర్పణా – ప్రళయకాలములో సమస్తమును లయము చేసి తృప్తి పొందునది
మహాభూతా మహాదర్పా మహాసారా మహాక్రతుః |
పంచభూతమహాగ్రాసా పంచభూతాధిదేవతా || 115 ||
మహాభూతా – పంచభూతములకు కారణమైనది
మహాదర్పా – దర్పమునకు కారణమైన మాయా స్వరూపిణి
మహాసారా – సృష్టియందలి అన్ని పదార్థములలోని సారము అమ్మే
మహాక్రతుః – యజ్ఞ, యాగ స్వరూపిణి
పంచభూతమహాగ్రాసా – పంచభూతములు ఆహారముగా కలది
పంచభూతాధిదేవతా – పంచభూతములకు అధినేత
సర్వప్రమాణా సంపత్తిః సర్వరోగప్రతిక్రియా |
బ్రహ్మాండాంతర్బహిర్వ్యాప్తా విష్ణువక్షోవిభూషిణీ || 116 ||
సర్వప్రమాణా – అన్నింటికీ ప్రమాణమైన పరబ్రహ్మ స్వరూపిణి
సంపత్తిః – భక్తుల దారిద్ర్యమును తొలగించి, ఐశ్వర్యమును ప్రసాదించునది
సర్వరోగప్రతిక్రియా – అన్ని వ్యాధులను నయం చేయునది
బ్రహ్మాండాంతర్బహిర్వ్యాప్తా – బ్రహ్మాండమంతటా నిండి ఉన్నది
విష్ణువక్షోవిభూషిణీ – మహావిష్ణువు వక్షస్థలమునందు ఉండునది
శాంకరీ నిధివక్త్రస్థా ప్రవరా వరహేతుకీ |
హేమమాలా శిఖామాలా త్రిశిఖా పంచలోచనా || 117 ||
శాంకరీ – శంకరుని భార్య
నిధివక్త్రస్థా – నిధులయందు, జ్ఞానమునందు ఉండునది
ప్రవరా – శ్రేష్టురాలు, గొప్పవరుని పొందినది
వరహేతుకీ – వరములను ప్రసాదించునది
హేమమాలా – బంగారు ఆభరణములను ధరించునది
శిఖామాలా – శిరస్సులో పూలదండను ధరించినది
త్రిశిఖా – త్రివేద స్వరూపిణి
పంచలోచనా – అమ్మ మూడు నేత్రములు కాక మనోనేత్రము, జ్ఞాననేత్రము కలిపి ఐదు కన్నులు కలది
సర్వాగమసదాచారమర్యాదా యాతుభంజనీ |
పుణ్యశ్లోకప్రబంధాఢ్యా సర్వాంతర్యామిరూపిణీ || 118 ||
సర్వాగమసదాచారమర్యాదా – ఆగమములలోని సదాచార స్వరూపము
యాతుభంజనీ – రాక్షసులను నాశనం చేయునది
పుణ్యశ్లోకప్రబంధాఢ్యా – పుణ్య శ్లోకాల రూపంలో ఉన్న సరస్వతి స్వరూపము
సర్వాంతర్యామిరూపిణీ – సర్వ ప్రాణుల యందు అంతర్యామి రూపమున ఉన్నది
సామగానసమారాధ్యా శ్రోత్రకర్ణరసాయనమ్ |
జీవలోకైకజీవాతుర్భద్రోదారవిలోకనా || 119 ||
సామగానసమారాధ్యా – సామవేదం గానం చేస్తూ పూజింపబడేది
శ్రోత్రకర్ణరసాయనా – చెవులకు మిక్కిలి ప్రీతిని కలిగించునది
జీవలోకైకజీవాతుః – ప్రాణులన్నింటికీ జీవనౌషధము
భద్రోదారవిలోకనా – మంగళకరమైన దయతో కూడిన చూపులు గల తల్లి
తటిత్కోటిలసత్కాంతిస్తరుణీ హరిసుందరీ |
మీననేత్రా చ సేంద్రాక్షీ విశాలాక్షీ సుమంగళా || 120 ||
తటిత్కోటిలసత్కాంతిః – కోట్లాది మెరుపుల వలె అందంగా ఉన్నది
తరుణీ – నిత్య యవ్వనవతి
హరిసుందరీ – హరికి భార్య అయినటువంటి సౌందర్యవతి
మీననేత్రా – చేపల వంటి కన్నులు గలది
ఇంద్రాక్షీ – ఇంద్రుని వలె కన్నులు కలది, శ్రీలంకలో వెలసి ఉన్న అమ్మవారి పేరు ఇంద్రాక్షి
విశాలాక్షీ – విశాలమైన కన్నులు కలది, కాశీ క్షేత్రంలో వెలసిన విశ్వనాథుని భార్య
సుమంగళా – సువాసిని అయిన స్త్రీ
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 1-10 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 11-20 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 21-30 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 31-40 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 41-50 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 51-60 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 61-70 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 71-80 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 81-90 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 91-100 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 101-110 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 111-120 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 121-130 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 131-140 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 141-150 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 151-154 శ్లోకాలు
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.




