శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 101-110 శ్లోకాలు
లక్ష్మీ సహస్రనామ స్తోత్రం మహాలక్ష్మీ దేవి యొక్క వెయ్యి దివ్య నామాలను స్తుతించే పవిత్రమైన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని భక్తితో పారాయణం చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం, ఐశ్వర్యం, సుఖశాంతులు మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు లభిస్తాయని విశ్వాసం. ఈ పేజీలో లక్ష్మీ సహస్రనామ స్తోత్రానికి సరళమైన తెలుగులో అర్థం మరియు ప్రతి నామం యొక్క విశిష్టతను తెలుసుకుందాం.
జాలంధరీ మృడానీ చ భవానీ భవభంజనీ |
త్రైకాలికజ్ఞానతంతుస్త్రికాలజ్ఞానదాయినీ || 101 ||
జాలంధరీ – మాయను ధరించునది / మహావిష్ణువు యొక్క మాయాశక్తి
మృడానీ – శివుని భార్య
భవానీ – శివుని భార్య
భవభంజనీ – జన్మదుఃఖాన్ని పోగొట్టునది
త్రైకాలిక జ్ఞాన తంతుః – మూడు కాలాలలోనూ జ్ఞానమును ప్రసాదించునది
త్రికాల జ్ఞానదాయినీ – మూడు కాలములకు సంబంధించిన జ్ఞానాన్ని ప్రసాదించునది
నాదాతీతా స్మృతిః ప్రజ్ఞా ధాత్రీరూపా త్రిపుష్కరా |
పరాజితా విధానజ్ఞా విశేషితగుణాత్మికా || 102 ||
నాదాతీతా – నాదమునకు అతీతమైనది
స్మృతిః – వేదాలలో భాగమైనది, వేద స్వరూపము
ప్రజ్ఞా – జ్ఞాన స్వరూపిణి
ధాత్రీరూపా – భూస్వరూపిణి
త్రిపుష్కరా – తామరపువ్వును నివాసముగా కలది
పరాజితా – ఇతరులచే జయింపబడనిది
విధానజ్ఞా – సృష్టి చేయు విధానమును ఎరిగినది
విశేషితగుణాత్మికా – విశేషమైన శుభగుణాలు కలది
హిరణ్యకేశినీ హేమబ్రహ్మసూత్రవిచక్షణా |
అసంఖ్యేయపరార్ధాంతస్వరవ్యంజనవైఖరీ || 103 ||
హిరణ్యకేశినీ – హిరణ్య స్వరూపిణి
హేమా – బంగారు శరీరవర్ణము కలది
బ్రహ్మసూత్ర విచక్షణా – బ్రహ్మసూత్రాలలో పాండిత్యము కలది
అసంఖ్యేయ పరార్థాంత స్వరవ్యంజన వైఖరీ – అసంఖ్యాకమైన వర్ణమాలలు, హల్లులు మరియు అచ్చులన్నియూ తన స్వరూపాలే
మధుజిహ్వా మధుమతీ మధుమాసోదయా మధుః |
మాధవీ చ మహాభాగా మేఘగంభీరనిస్వనా || 104 ||
మధుజిహ్వా – మధురముగా మాట్లాడునది
మధుమతీ – మధురమైనది, ఆహ్లాదకరమైన మనస్సు కలది
మధుమాసోదయా – ఆహ్లాదకరమైన వసంతశోభ, వసంతలక్ష్మి
మధుః – మధురమైనది
మాధవీ – మాధవుని భార్య
మహాభాగా – గొప్ప భాగ్యము, కీర్తి కలది
మేఘగంభీర నిస్వనా – ఉరుము, మెరుపు అమ్మ స్వరూపాలు
బ్రహ్మవిష్ణుమహేశాదిజ్ఞాతవ్యార్థవిశేషగా |
నాభౌ వహ్నిశిఖాకారా లలాటే చంద్రసన్నిభా || 105 ||
బ్రహ్మ విష్ణు మహేశాది జ్ఞాతవ్యార్థ విశేషగా – బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల చేత కూడా తెలుసుకొనదగిన మహిమా విశేషములు కలది
నాభౌ వహ్నిశిఖాకారా – నాభిస్థానమందు అగ్నిశిఖాకారముగా ఉండు తల్లి
లలాటే చంద్రసన్నిభా – నుదురు నందు చంద్రునితో సమానమైన సౌందర్యము కలది
భ్రూమధ్యే భాస్కరాకారా సర్వతారాకృతిర్హృది |
కృత్తికాదిభరణ్యంతనక్షత్రేష్ట్యర్చితోదయా || 106 ||
భ్రూమధ్యే భాస్కరాకారా – కనుబొమ్మల మధ్యలో సూర్యుని వంటి కాంతి కలిగినది
సర్వతారాకృతి హృది – అమ్మ హృదయము సర్వ నక్షత్రములకు స్థానము
కృత్తికాది భరణ్యంత నక్షత్రేష్ట్యర్చితోదయా – కృత్తికా నక్షత్రము నుండి భరణీ నక్షత్రము వరకు గల నక్షత్రములందు అర్చింపబడి అనుగ్రహించునది
గ్రహవిద్యాత్మికా జ్యోతిర్జ్యోతిర్విన్మతిజీవికా |
బ్రహ్మాండగర్భిణీ బాలా సప్తావరణదేవతా || 107 ||
గ్రహవిద్యాత్మికా – గ్రహాలకు సంబంధించిన విద్య కూడా అమ్మ స్వరూపమే
జ్యోతిః – వెలుగునిచ్చునది
జ్యోతిర్విత్ – జ్యోతిష్యశాస్త్రమును ఎరిగినది
మతిజీవికా – అన్ని జీవులకు వారి జీవితాన్ని నడిపించడంలో సహాయం చేయునది
బ్రహ్మాండగర్భిణీ – విశ్వాన్ని తన గర్భంలో ఉంచుకునేది
బాలా – ఆడపిల్ల, బాలా త్రిపురసుందరి
సప్తావరణ దేవతా – శ్రీచక్రంలోని ఏడు ఆవరణల దేవతల స్వరూపం
వైరాజోత్తమసామ్రాజ్యా కుమారకుశలోదయా |
బగలా భ్రమరాంబా చ శివదూతీ శివాత్మికా || 108 ||
వైరాజోత్తమ సామ్రాజ్యా – ప్రపంచాన్ని పాలించునది
కుమార కుశలోదయా – జనులకు క్షేమమును కలిగించునది
బగళా – దశమహావిద్యలలోని దేవత, శత్రునాశిని
భ్రమరాంబా – శ్రీశైల మల్లిఖార్జున స్వామి భార్య
శివదూతీ – శివుడిని దూతగా పంపినది
శివాత్మికా – శివుని ఆత్మ, శివస్వరూపము
మేరువింధ్యాదిసంస్థానా కాశ్మీరపురవాసినీ |
యోగనిద్రా మహానిద్రా వినిద్రా రాక్షసాశ్రితా || 109 ||
మేరువింధ్యాదిసంస్థానా – మేరు మరియు వింధ్య వంటి పర్వతాలలో ఉండునది
కాశ్మీరపురవాసినీ – కాశ్మీర దేశములోని శారదా పీఠములో ఉండునది
యోగనిద్రా – యోగనిద్రా స్వరూపిణి
మహానిద్రా – మహానిద్రా స్వరూపిణి
వినిద్రా – సృష్టి నిలిచి ఉన్నంత వరకు కన్ను మూయనిది
రాక్షసాశ్రితా – రాక్షసులు కూడా ఆశ్రయించునది
సువర్ణదా మహాగంగా పంచాఖ్యా పంచసంహతిః |
సుప్రజాతా సువీరా చ సుపోషా సుపతిః శివా || 110 ||
సువర్ణదా – బంగారం, సంపదను ప్రసాదించునది
మహాగంగా – పుణ్యగంగా స్వరూపిణి
పంచాఖ్యా – పంచభూతముల స్వరూపిణి
పంచసంహతి – పంచభూతములతో కూడిన ప్రకృతి స్వరూపిణి
సుప్రజాతా – మంచి పుట్టుక కలది
సువీరా – గొప్ప పరాక్రమం కలది
సుపోషా – జనులను పోషించునది
సుపతిః – మంచి భర్త కలది
శివా – శివుని భార్య
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 1-10 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 11-20 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 21-30 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 31-40 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 41-50 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 51-60 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 61-70 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 71-80 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 81-90 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 91-100 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 101-110 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 111-120 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 121-130 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 131-140 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 141-150 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 151-154 శ్లోకాలు
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.




