శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 121-130 శ్లోకాలు
లక్ష్మీ సహస్రనామ స్తోత్రం మహాలక్ష్మీ దేవి యొక్క వెయ్యి దివ్య నామాలను స్తుతించే పవిత్రమైన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని భక్తితో పారాయణం చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం, ఐశ్వర్యం, సుఖశాంతులు మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు లభిస్తాయని విశ్వాసం. ఈ పేజీలో లక్ష్మీ సహస్రనామ స్తోత్రానికి సరళమైన తెలుగులో అర్థం మరియు ప్రతి నామం యొక్క విశిష్టతను తెలుసుకుందాం.
సర్వమంగళసంపన్నా సాక్షాన్మంగళదేవతా |
దేహహృద్దీపికా దీప్తిర్జిహ్మపాపప్రణాశినీ || 121 ||
సర్వమంగళ సంపన్నా – సకల ఐశ్వర్యాలతో నిండినది
సాక్షాన్మంగళ దేవతా – మంగళకరమైన దేవత
దేహహృద్దీపికా – హృదయమునందు ప్రకాశించు దీపిక
దీప్తి – కాంతితో ప్రకాశించునది
జిహ్మ పాప ప్రణాశినీ – కుటిల బుద్ధిని, పాపములను నాశనం చేసేది
అర్ధచంద్రోల్లసద్దంష్ట్రా యజ్ఞవాటీవిలాసినీ |
మహాదుర్గా మహోత్సాహా మహాదేవబలోదయా || 122 ||
అర్ధచంద్రోల్లసదంష్ట్రా – అర్ధచంద్రుని వలె మెరిసే దంతాలు కలిగినది
యజ్ఞవాటీ విలాసినీ – యజ్ఞవాటికయందు ఉండునది
మహాదుర్గా – దుర్గముడను రాక్షసుడిని సంహరించినది
మహోత్సాహా – గొప్ప కార్యములు చేయుటకు ఉత్సాహము కలది
మహాదేవ బలోదయా – మహాదేవుని బలమునకు కారణమైనది
డాకినీడ్యా శాకినీడ్యా సాకినీడ్యా సమస్తజుట్ |
నిరంకుశా నాకివంద్యా షడాధారాధిదేవతా || 123 ||
డాకినీడ్యా – విశుద్ధి చక్రానికి దేవత అయిన డాకినిచే పూజించబడునది
శాకినీడ్యా – బందిన్యాది శక్తులతో కూడిన శాకినీచే స్తుతింపబడునది
సాకినీడ్యా – మూలాధార దేవత అయిన సాకినిచే స్తుతింపబడునది
సమస్త జుట్ – సమస్త సృష్టిని లయము చేయునది
నిరంకుశా – స్వతంత్రురాలు, దుష్టులను అణచివేయునది
నాకివంద్యా – సకల దేవతలచే పూజింపబడునది
షడాధారాధి దేవతా – షట్చక్రాలకు అధిదేవత
భువనజ్ఞానినిఃశ్రేణీ భువనాకారవల్లరీ |
శాశ్వతీ శాశ్వతాకారా లోకానుగ్రహకారిణీ || 124 ||
భువన జ్ఞానినిశ్రేణి – లోకాలలోని జనులు జ్ఞానమును పొందుటకు నిచ్చెన వంటిది
భువనాకార వల్లరీ – సమస్త భువనములు అమ్మ రూపములు
శాశ్వతీ – శాశ్వతమైనది
శాశ్వతాకారా – ఎప్పటికీ నశించని ఆకారము కలది
లోకానుగ్రహకారిణీ – లోకాలను అనుగ్రహించునది
సారసీ మానసీ హంసీ హంసలోకప్రదాయినీ |
చిన్ముద్రాలంకృతకరా కోటిసూర్యసమప్రభా || 125 ||
సారసీ – సారసము అనగా తామరపువ్వు. సారసములు గల తల్లి సారసి
మానసీ – మంచి మనస్సు కలిగినది
హంసీ – హంసరూపంలో నివసించేది, యోగిని స్వరూపిణి
హంసలోక ప్రదాయినీ – యోగులకు సూర్యలోకమును ప్రసాదించునది
చిన్ముద్రాలంకృతకరా – చిన్ముద్రతో కూడిన అరచేయి కలిగినది
కోటిసూర్య సమప్రభా – కోటి సూర్యుల కాంతితో సమానమైన కాంతి కలది
సుఖప్రాణిశిరోరేఖా సదదృష్టప్రదాయినీ |
సర్వసాంకర్యదోషఘ్నీ గ్రహోపద్రవనాశినీ || 126 ||
సుఖప్రాణి శిరోరేఖా – సుఖముగా నివసించే ప్రాణుల నొసటిమీద రేఖ అమ్మ
సదదృష్ట ప్రదాయినీ – భక్తులకు అదృష్టమును ప్రసాదించునది
సర్వసాంకర్య దోషఘ్నీ – అన్ని దోషాలను తొలగించునది
గ్రహోపద్రవ నాశినీ – గ్రహాల వల్ల ఏర్పడే సమస్యలను తొలగించునది
క్షుద్రజంతుభయఘ్నీ చ విషరోగాదిభంజనీ |
సదాశాంతా సదాశుద్ధా గృహచ్ఛిద్రనివారిణీ || 127 ||
క్షుద్ర జంతు భయఘ్నీ – దుష్ట జంతువుల వల్ల కలిగే భయాన్ని పోగొట్టునది
విషరోగాది భంజనీ – విషం వల్ల కలిగే వ్యాధులను దూరం చేయునది
సదాశాంతా – ఎప్పుడూ ప్రశాంతంగా ఉండునది
సదాశుద్ధా – ఎప్పుడూ శుద్ధురాలై ఉండునది
గృహఛ్ఛిద్ర నివారిణీ – గృహములో కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడు కలతలను నివారించునది
కలిదోషప్రశమనీ కోలాహలపురస్థితా |
గౌరీ లాక్షణికీ ముఖ్యా జఘన్యాకృతివర్జితా || 128 ||
కలిదోష ప్రశమనీ – కలికాలమునందలి దోషములను ఉపశమింపచేయునది
కోలాహలపుర స్థితా – కొల్హాపురమునందు కొలువై ఉన్నది
గౌరీ – తెల్లని శరీర వర్ణం కలది
లాక్షణికీ – ప్రత్యేక లక్షణాలను కలిగినది
ముఖ్యా – దేవతలలో ప్రధానమైనది
జఘన్యాకృతి వర్జితా – సర్వ శుభ లక్షణములతో కూడిన ఆకృతి కలది
మాయావిద్యా మూలభూతా వాసవీ విష్ణుచేతనా |
వాదినీ వసురూపా చ వసురత్నపరిచ్ఛదా || 129 ||
మాయా – జగత్తును నడిపించే మాయాశక్తి
అవిద్యా – దేహాత్మ భ్రాంతి తొలగించునది
మూలభూతా – సమస్త సృష్టికి ప్రారంభమున ఉండి, ఆధారభూతమైనది
వాసవీ – ఇంద్రుని శక్తి
విష్ణుచేతనా – విష్ణువు యొక్క చైతన్యశక్తి
వాదినీ – వీణా వాయిద్యములను పలికించునది
వసురూపా – సంపద స్వరూపిణి
వసు రత్న పరిచ్ఛదా – బంగారు జరీతో, రత్నములు తాపించబడిన పట్టుచీరను ధరించినది
ఛాందసీ చంద్రహృదయా మంత్రాస్వచ్ఛందభైరవీ |
వనమాలా వైజయంతీ పంచదివ్యాయుధాత్మికా || 130 ||
ఛాందసీ – ఛందశ్శాస్త్ర స్వరూపిణి
చంద్రహృదయా – చంద్రుని వంటి మనస్సు గలది
మంత్రా – వైదిక మంత్ర స్వరూపిణి
స్వచ్ఛంద భైరవీ – భైరవ స్వరూపిణి
వనమాలా – వనపుష్పాలతో చేసిన మాలలను ధరించినది
వైజయంతీ – వైజయంతీ మాల ధరించింది
పంచదివ్యాయుధాత్మికా – ఐదు దివ్య ఆయుధాలను ధరించినది
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 1-10 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 11-20 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 21-30 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 31-40 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 41-50 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 51-60 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 61-70 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 71-80 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 81-90 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 91-100 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 101-110 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 111-120 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 121-130 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 131-140 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 141-150 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 151-154 శ్లోకాలు
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.




