శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 81-90 శ్లోకాలు
లక్ష్మీ సహస్రనామ స్తోత్రం మహాలక్ష్మీ దేవి యొక్క వెయ్యి దివ్య నామాలను స్తుతించే పవిత్రమైన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని భక్తితో పారాయణం చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం, ఐశ్వర్యం, సుఖశాంతులు మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు లభిస్తాయని విశ్వాసం. ఈ పేజీలో లక్ష్మీ సహస్రనామ స్తోత్రానికి సరళమైన తెలుగులో అర్థం మరియు ప్రతి నామం యొక్క విశిష్టతను తెలుసుకుందాం.
పాశాంకుశాన్వితా దివ్యా వీణావ్యాఖ్యాక్షసూత్రభృత్ |
ఏకమూర్తిస్త్రయీమూర్తిర్మధుకైటభభంజినీ || 81 ||
పాశాంకుశాన్వితా – రాగమనే పాశమును, క్రోధమనే అంకుశమును రెండు చేతులలో ధరించినది
దివ్యా – దివ్యమైనది, శక్తివంతమైనది
వీణావ్యాఖ్యాక్షసూత్రభృత్ – వీణ, పుస్తకం మరియు జపమాల పట్టుకున్నది
ఏకమూర్తి – పరాశక్తి స్వరూపిణి
త్రయీమూర్తి – లక్ష్మీ, పార్వతి, సరస్వతి అనే మూడు రూపాలు కలిగినది
మధుకైటభభంజినీ – మధు కైటభులను రాక్షసులను సంహరించినది
సాంఖ్యా సాంఖ్యవతీ జ్వాలా జ్వలంతీ కామరూపిణీ |
జాగ్రంతీ సర్వసంపత్తిః సుషుప్తా స్వేష్టదాయినీ || 82 ||
సాంఖ్యా – సాంఖ్య యోగస్వరూపిణి
సాంఖ్యవతీ – సాంఖ్యమునందు తెలుపబడిన తత్త్వములకు కారణమైనది
జ్వాలా – జ్వాలా స్వరూపిణి
జ్వలంతీ – ప్రకాశించేది
కామరూపిణీ – తనకు నచ్చిన రూపాన్ని ధరించేది
జాగ్రంతీ – ఎప్పుడూ మెలకువగా ఉండునది, స్థూల శరీరాభిమాని అయిన జీవునితో అభేదము కలది
సర్వసంపత్తిః – సర్వ సంపత్తులనూ కలిగినది
సుషుప్తా – గాఢ నిద్రలో ఉన్నది, కారణ శరీరాభిమాని అయిన జీవునితో అభేదము కలది
స్వేష్టదాయిని – కోరికలను తీర్చునది
కపాలినీ మహాదంష్ట్రా భ్రుకుటీకుటిలాననా |
సర్వావాసా సువాసా చ బృహత్యష్టిశ్చ శక్వరీ || 83 ||
కపాలినీ – కాళికా దేవి రూపంలో మెడలో కపాలములు ధరించినది, శివుని భార్య
మహాదంష్ట్రా – పెద్ద దంతములు కలిగినది
భ్రుకుటీకుటిలాననా – వంగిన మరియు దట్టమైన కనుబొమ్మలను కలిగినది
సర్వావాసా – జడచేతనములు ఆవాసముగా కలది
సువాసా – మంచి వ్యక్తులతో ఉండునది, మంచి వస్త్రము ధరించినది
బృహతీ – అందరికంటే గొప్పది
అష్టీ – ఎనిమిది రూపాలు గలది
శక్వరీ – శక్వరీ ఛందోరూపిణి
ఛందోగణప్రతిష్ఠా చ కల్మాషీ కరుణాత్మికా |
చక్షుష్మతీ మహాఘోషా ఖడ్గచర్మధరాఽశనిః || 84 ||
ఛందోగణప్రతిష్ఠా – వేదములందు సుప్రతిష్టురాలై ఉన్న తల్లి
కల్మాషీ – అనేక వర్ణములు కలిగి ఉన్నది
కరుణాత్మికా – దయగలది
చక్షుష్మతీ – అందరినీ రక్షించునది
మహాఘోషా – వేద మంత్రోచ్ఛారణ చేసేది/ ఘోషించునది
ఖడ్గచర్మధరా – కత్తి మరియు డాలు ధరించినది
అశనిః – ఇంద్రుని వజ్రాయుధమునందలి శక్తి
శిల్పవైచిత్ర్యవిద్యోతా సర్వతోభద్రవాసినీ |
అచింత్యలక్షణాకారా సూత్రభాష్యనిబంధనా || 85 ||
శిల్పవైచిత్ర్యవిద్యోతా – శిల్ప నిర్మాణ పరిజ్ఞానం కలది
సర్వతోభద్రవాసినీ – అన్ని ప్రదేశాలలో సురక్షితంగా ఉండునది
అచింత్యలక్షణాకారా – శుభ లక్షణములు కలిగినది
సూత్రభాష్యనిబంధనా – వేదాలకు వివరణలు వ్రాసే వ్యక్తుల రూపంలో ఉండునది
సర్వవేదార్థసంపత్తిః సర్వశాస్త్రార్థమాతృకా |
అకారాదిక్షకారాంతసర్వవర్ణకృతస్థలా || 86 ||
సర్వవేదార్థసంపత్తిః – సర్వ స్మృతులు సంపదగా కలిగినది
సర్వశాస్త్రార్థమాతృకా – అన్ని శాస్త్రాలకు తల్లి వంటిది, వేద మాత
అకారాదిక్షకారాంతసర్వవర్ణకృతస్థలా – “అ” నుండి “క్ష” వరకు వర్ణమాలలోని అన్ని అక్షరాల స్వరూపం
సర్వలక్ష్మీః సదానందా సారవిద్యా సదాశివా |
సర్వజ్ఞా సర్వశక్తిశ్చ ఖేచరీరూపగోచ్ఛ్రితా || 87 ||
సర్వలక్ష్మీః – లక్ష్మీ స్వరూపిణి
సదానందా – ఎప్పుడూ సంతోషంగా ఉండేది
సారవిద్యా – జ్ఞానం యొక్క సారాంశం
సదాశివా – సదాశివుని భార్య
సర్వజ్ఞా – అన్నీ తెలిసినది
సర్వశక్తిః – సర్వ శక్తి స్వరూపిణి
ఖేచరీరూపగోచ్ఛ్రితా – ఎగిరే అన్ని ప్రాణుల రూపంలో ఉన్న ఆమె
అణిమాదిగుణోపేతా పరా కాష్ఠా పరా గతిః |
హంసయుక్తవిమానస్థా హంసారూఢా శశిప్రభా || 88 ||
అణిమాదిగుణోపేతా – అణిమాది అష్ట సిద్ధి స్వరూపిణి
పరాకాష్ఠా – అంతటా వ్యాపించి ఉండు తల్లి
పరాగతిః – మోక్షమును పొందుటకు గొప్ప మార్గమైనది
హంసయుక్తవిమానస్థా – హంసలతో నిండిఉన్న సౌధమునందు ఉండునది
హంసారూఢా – హంసపై ప్రయాణించేది
శశిప్రభా – చంద్రునిలా ప్రకాశించేది
భవానీ వాసనాశక్తిరాకృతిస్థాఖిలాఽఖిలా |
తంత్రహేతుర్విచిత్రాంగీ వ్యోమగంగావినోదినీ || 89 ||
భవానీ – శివుని భార్య
వాసనాశక్తిః – సకల ప్రాణుల ప్రతిభలో ఉండు వాసనాశక్తి
ఆకృతిస్థా – అన్ని ఆకృతులుగా రూపుదిద్దుకొన్నది
ఖిలా – సకల జీవరాశి స్వరూపము
అఖిలా – ప్రతిచోటా ఉండునది
తంత్రహేతుః – మొత్తం తంత్రాలకు కారణం అయినది
విచిత్రాంగీ – ప్రకృతి శరీరముగా కలది
వ్యోమగంగావినోదినీ – ఆకాశ గంగ తీరమున వినోదించునది
వర్షా చ వార్షికా చైవ ఋగ్యజుస్సామరూపిణీ |
మహానదీ నదీపుణ్యాఽగణ్యపుణ్యగుణక్రియా || 90 ||
వర్షా – వర్షమునకు కారణమైనది
వార్షికా – సంవత్సరమునకు పూజలందుకొని భక్తులను కరుణించేది
ఋగ్యజుస్సామరూపిణీ – ఋక్, యజుర్, సామ వేదాల స్వరూపము
మహానదీ – గొప్ప నదీ స్వరూపిణి
నదీపుణ్యా – నదులు ప్రసాదించే పుణ్య స్వరూపము
గణ్యపుణ్యగుణక్రియా – పుణ్య సుగుణాల వలన ముల్లోకాలలోనూ కీర్తిని పొందినది
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.




