స్తోత్రాలకు తెలుగులో అర్థం » దేవీ స్తోత్రాలు » లక్ష్మీ స్తోత్రాలు » శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 91-100 శ్లోకాలు
Sri Lakshmi Sahasranamam Stotram 91 to 100 slokas devotional representation

శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 91-100 శ్లోకాలు

లక్ష్మీ సహస్రనామ స్తోత్రం మహాలక్ష్మీ దేవి యొక్క వెయ్యి దివ్య నామాలను స్తుతించే పవిత్రమైన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని భక్తితో పారాయణం చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం, ఐశ్వర్యం, సుఖశాంతులు మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు లభిస్తాయని విశ్వాసం. ఈ పేజీలో లక్ష్మీ సహస్రనామ స్తోత్రానికి సరళమైన తెలుగులో అర్థం మరియు ప్రతి నామం యొక్క విశిష్టతను తెలుసుకుందాం.

సమాధిగతలభ్యార్థా శ్రోతవ్యా స్వప్రియా ఘృణా |
నామాక్షరపదా దేవీ ఉపసర్గనఖాంచితా || 91 ||
సమాధిగత లభ్యార్థా – అష్టాంగ యోగ సమాధి స్థితియందు దర్శనమిచ్చు తల్లి
శ్రోతవ్యా – వినతగినది
స్వప్రియా – తన స్వరూపమే అయిన సర్వసృష్టిని ప్రేమించు తల్లి
ఘృణా – తన భక్తుల యెడల మిక్కిలి కరుణ కలది
నామాక్షరపదా దేవీ – తన నామాక్షరములే తనకు స్థానముగా కలది
ఉపసర్గనఖాంచితా – సరస్వతి స్వరూపిణి

నిపాతోరుద్వయీజంఘా మాతృకా మంత్రరూపిణీ |
ఆసీనా చ శయానా చ తిష్ఠంతీ ధావనాధికా || 92 ||
నిపాతోరుద్వయీ – సరస్వతి స్వరూపిణి
జంఘా మాతృకా – అకారము మొదలుకొని క్షకారము వరకుగల మాతృకలు అమ్మ కాలిపిక్కలుగా కలది
మంత్రరూపిణీ – వేదమంత్రాల స్వరూపిణి
ఆసీనా – ఆసనమునందు కూర్చుని ఉన్నది
శయానా – పానుపు మీద పడుకొని ఉన్నది
తిష్ఠంతీ – స్థిరముగా కూర్చుని ఉన్నది
ధావనా – అమ్మ యొక్క చైతన్య శక్తి
అధికా – అందరికంటే అధికురాలు

లక్ష్యలక్షణయోగాఢ్యా తాద్రూప్యగణనాకృతిః |
సైకరూపా నైకరూపా సేందురూపా తదాకృతిః || 93 ||
లక్ష్యలక్షణయోగాఢ్యా – శాస్త్రములందు లక్ష్య లక్షణ యోగములను కలిగించునది
తాద్రూప్యగణనాకృతిః – విభిన్నమైన అనేక రూపాలను కలిగి ఉన్నది
సైకరూపా – ఒకే రూపాన్ని కలిగిన పరమాత్మ యొక్క శక్తి స్వరూపిణి
నైకరూపా – సర్వ శక్తి స్వరూపిణి
సేందురూపా – చంద్రుని రూపము గలది
తదాకృతిః – చంద్రుని వంటి ప్రసన్నమైన ఆకారము కలది

సమాసతద్ధితాకారా విభక్తివచనాత్మికా |
స్వాహాకారా స్వధాకారా శ్రీపత్యర్ధాంగనందినీ || 94 ||
సమాసతద్ధితాకారా – సరస్వతీ స్వరూపిణి
విభక్తివచనాత్మికా – వ్యాకరణ వాక్యంలో ఉన్నది
స్వాహాకారా – అగ్నికి భార్య అయిన స్వాహా స్వరూపిణి
స్వధాకారా – పితృదేవతలకు కవ్యాన్ని సమర్పించేటప్పుడు ఉచ్చరించే స్వధా స్వరూపిణి
శ్రీపత్యర్ధాంగనందినీ – విష్ణువు యొక్క అర్ధాంగి

గంభీరా గహనా గుహ్యా యోనిలింగార్ధధారిణీ |
శేషవాసుకిసంసేవ్యా చపలా వరవర్ణినీ || 95 ||
గంభీరా – గంభీర హృదయము కల తల్లి
గహనా – నిగూఢమైనది, తెలుసుకొనరానిది
గుహ్యా – రహస్యమైనది
యోనిలింగార్ధధారిణీ – అర్ధనారీశ్వరిగా సమస్త సృష్టికి కారణమైనది
శేషవాసుకిసంసేవ్యా – ఆదిశేషుడు, వాసుకిచే సేవింపబడినది
చపలా – నిలకడ లేనిది
వరవర్ణినీ – శ్రేష్ఠమైన రూపము కలది

కారుణ్యాకారసంపత్తిః కీలకృన్మంత్రకీలికా |
శక్తిబీజాత్మికా సర్వమంత్రేష్టా అక్షయకామనా || 96 ||
కారుణ్యాకారసంపత్తిః – కారుణ్యము అనే సంపద కలిగినది
కీలకృత్ – జీవులలో జఠరాగ్నిని కలిగించునది
మంత్రకీలికా – మంత్రములతో పూజింపబడునది
శక్తిబీజాత్మికా – మంత్రశక్తి, మంత్రబీజ స్వరూపిణి
సర్వమంత్రేష్టా – అన్ని మంత్రాలను ఇష్టపడేది
అక్షయకామనా – ఎప్పటికీ తరిగిపోని కామన స్వరూపిణి

ఆగ్నేయీ పార్థివా ఆప్యా వాయవ్యా వ్యోమకేతనా |
సత్యజ్ఞానాత్మికానందా బ్రాహ్మీ బ్రహ్మ సనాతనీ || 97 ||
ఆగ్నేయీ – అగ్ని స్వరూపిణి
పార్థివా – భూమి స్వరూపిణి
ఆప్యా – జల స్వరూపిణి
వాయవ్యా – వాయు స్వరూపిణి
వ్యోమకేతనా – ఆకాశ స్వరూపిణి
సత్యజ్ఞానాత్మికానందా – సత్య, జ్ఞాన, ఆనంద స్వరూపిణి
బ్రాహ్మీ – బ్రహ్మశక్తి స్వరూపిణి
బ్రహ్మ – వేదస్వరూపిణి
సనాతనీ – నిత్యమైనది, నాశనం లేనిది

అవిద్యావాసనా మాయాప్రకృతిః సర్వమోహినీ |
శక్తిర్ధారణశక్తిశ్చ చిదచిచ్ఛక్తియోగినీ || 98 |
అవిద్యావాసనా – అవిద్య వాసనలను కలిగించునది
మాయా – మాయాస్వరూపిణి
ప్రకృతిః – పంచభూతాత్మక ప్రకృతి
సర్వమోహినీ – అందరినీ మోహింపజేయునది
శక్తిః – శక్తిస్వరూపిణి
ధారణశక్తిః – స్మృతిశక్తి
చిదచిచ్ఛక్తియోగినీ – చిత్-అచిత్ శక్తి యోగినీ

వక్త్రారుణా మహామాయా మరీచిర్మదమర్దినీ |
విరాట్ స్వాహా స్వధా శుద్ధా నిరూపాస్తిః సుభక్తిగా || 99 ||
వక్త్రారుణా – ఎర్రని ముఖము కలది
మహామాయా – మహామాయా స్వరూపిణి
మరీచిః – సూర్యకిరణ శక్తి
మదమర్దినీ – అహంకార నాశిని
విరాట్ – సర్వోన్నత స్వరూపిణి
స్వాహా – అగ్నిదేవుని స్వరూపిణి
స్వధా – పితృదేవత స్వరూపిణి
శుద్ధా – శుద్ధస్వరూపిణి
నిరూపాస్తిః – పూజింపబడునది
సుభక్తిగా – మంచి భక్తులను ప్రేమించేది

నిరూపితాద్వయీ విద్యా నిత్యానిత్యస్వరూపిణీ |
వైరాజమార్గసంచారా సర్వసత్పథదర్శినీ || 100 ||
నిరూపితాద్వయీ విద్యా – అద్వైత విద్యను నిరూపించునది
నిత్యానిత్యస్వరూపిణీ – నిత్య మరియు అనిత్య స్వరూపిణి
వైరాజమార్గసంచారా – వైరాజ మార్గంలో సంచరించునది
సర్వసత్పథదర్శినీ – అందరికీ సత్య మార్గాన్ని చూపునది

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

 ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top