శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 151-154 శ్లోకాలు
లక్ష్మీ సహస్రనామ స్తోత్రం మహాలక్ష్మీ దేవి యొక్క వెయ్యి దివ్య నామాలను స్తుతించే పవిత్రమైన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని భక్తితో పారాయణం చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం, ఐశ్వర్యం, సుఖశాంతులు మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు లభిస్తాయని విశ్వాసం. ఈ పేజీలో లక్ష్మీ సహస్రనామ స్తోత్రానికి సరళమైన తెలుగులో అర్థం మరియు ప్రతి నామం యొక్క విశిష్టతను తెలుసుకుందాం.
నిఃశ్రేయసపదప్రాప్తిసాధనం ఫలమేవ చ |
శ్రీమంత్రరాజరాజ్ఞీ చ శ్రీవిద్యా క్షేమకారిణీ || 151 ||
నిఃశ్రేయసపదప్రాప్తిసాధనఫలమేవచ – మోక్షప్రాప్తికి సాధనమైనది, మోక్షమును కలిగించునది
శ్రీమంత్రరాజరాజ్ఞీ – శ్రీమంత్రరాజమునకు ప్రధాన దేవత
శ్రీవిద్యా – శ్రీ విద్యా స్వరూపిణి
క్షేమకారిణీ – సౌఖ్యాన్ని అనుగ్రహించేది
శ్రీంబీజజపసంతుష్టా ఐం హ్రీం శ్రీం బీజపాలికా |
ప్రపత్తిమార్గసులభా విష్ణుప్రథమకింకరీ || 152 ||
శ్రీంబీజజపసంతుష్టా – శ్రీం అనే మూలబీజాన్ని జపించడం వల్ల సంతోషించునది
ఐం హ్రీం శ్రీం బీజపాలికా – ఐం, హ్రీం, శ్రీం బీజములకు పాలకురాలు
ప్రపత్తిమార్గసులభా – భక్తిమార్గంలో శరణాగతి చేయువారిని అనుగ్రహించునది
విష్ణుప్రథమకింకరీ – శ్రీమహావిష్ణువుకు మొదటి సేవకురాలు
క్లీంకారార్థసవిత్రీ చ సౌమంగల్యాధిదేవతా |
శ్రీషోడశాక్షరీవిద్యా శ్రీయంత్రపురవాసినీ || 153 ||
క్లీంకారార్థసవిత్రీ – క్లీంకారము యొక్క అర్థరూపిణి
సౌమంగల్యాధిదేవతా – స్త్రీలకు సుమంగళీత్వమును ప్రసాదించు దేవత
శ్రీషోడశాక్షరీవిద్యా – 16 అక్షరముల విద్యా జ్ఞాన స్వరూపిణి
శ్రీయంత్రపురవాసినీ – శ్రీచక్రపురమున నివసించు లలితాంబ
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే |
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోఽస్తు తే || 154 ||
సర్వమంగళమాంగళ్యే – అన్ని మంగళములకంటే మంగళమైనది
శివే – శివుని శక్తి స్వరూపిణి
సర్వార్థసాధికే – సమస్త ప్రయోజనములను సాధించిపెట్టువారు
శరణ్యే – అందరికీ రక్షణనిచ్చు తల్లి
త్ర్యంబకే – మూడు కన్నులు కలది
గౌరీ – గౌరవర్ణము గలది
నారాయణీ – నారాయణుని శక్తి స్వరూపిణి
నమోస్తుతే – నీకు నమస్కారములు
లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని అర్థంతో చదవడం వల్ల దైవభక్తి మరింత పెరిగి, మహాలక్ష్మీ దేవి కటాక్షం పొందవచ్చని భక్తులు నమ్ముతారు. ఈ పవిత్ర స్తోత్రం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే, ఇతర లక్ష్మీ స్తోత్రాలు మరియు వాటి తెలుగులో అర్థాలను కూడా మా వెబ్సైట్లో చదివి సనాతన ధర్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి.
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 1-10 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 11-20 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 21-30 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 31-40 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 41-50 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 51-60 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 61-70 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 71-80 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 81-90 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 91-100 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 101-110 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 111-120 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 121-130 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 131-140 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 141-150 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 151-154 శ్లోకాలు
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.




