శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 131-140 శ్లోకాలు
లక్ష్మీ సహస్రనామ స్తోత్రం మహాలక్ష్మీ దేవి యొక్క వెయ్యి దివ్య నామాలను స్తుతించే పవిత్రమైన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని భక్తితో పారాయణం చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం, ఐశ్వర్యం, సుఖశాంతులు మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు లభిస్తాయని విశ్వాసం. ఈ పేజీలో లక్ష్మీ సహస్రనామ స్తోత్రానికి సరళమైన తెలుగులో అర్థం మరియు ప్రతి నామం యొక్క విశిష్టతను తెలుసుకుందాం.
పీతాంబరమయీ చంచత్కౌస్తుభా హరికామినీ |
నిత్యా తథ్యా రమా రామా రమణీ మృత్యుభంజనీ || 131 ||
పీతాంబరమయీ – పసుపురంగు పట్టు వస్త్రాలను ధరించింది
చంచత్కౌస్తుభా – ప్రకాశిస్తున్న కౌస్తుభ రత్నాన్ని ధరించినది
హరికామినీ – మహావిష్ణువు భార్య
నిత్యా – ఎన్నటికీ నాశనము లేనిది, స్థిరమైనది
తథ్యా – సత్య స్వరూపిణి
రమా – లక్ష్మీదేవి
రామా – సకల స్త్రీ స్వరూపిణి
రమణీ – సౌందర్యవతి
మృత్యుభంజనీ – జననమరణ రూపమైన సంసారమును తొలగించి, ముక్తినిచ్చునది
జ్యేష్ఠా కాష్ఠా ధనిష్ఠాంతా శరాంగీ నిర్గుణప్రియా |
మైత్రేయా మిత్రవిందా చ శేష్యశేషకలాశయా || 132 ||
జ్యేష్ఠా – పెద్దది, జ్యేష్ఠా నక్షత్ర స్వరూపిణి
కాష్ఠా – ఉన్నతమైనది, కాల స్వరూపిణి
ధనిష్ఠాంతా – ధనమును, సిరిని ఇచ్చు నక్షత్రము ధనిష్ఠా
శరాంగీ – విల్లు వంటి శరీరాన్ని కలిగినది
నిర్గుణప్రియా – మూడు గుణాలకు అతీతమైన వ్యక్తులను ఇష్టపడునది
మైత్రేయా – స్నేహశీలి
మిత్రవిందా – కృష్ణుని భార్య మిత్రవింద, లక్ష్మీ స్వరూపిణి
శేష్యశేషకలాశయా – భగవంతుని పొందుటకు అనుగ్రహమును కలిగించునది
వారాణసీవాసలభ్యాచార్యావర్తజనస్తుతా |
జగదుత్పత్తిసంస్థానసంహారత్రయకారణమ్ || 133 ||
వారాణసీవాసలభ్యా – కాశీలో నివసించే ప్రజలు పొందదగినది
ఆర్యావర్తజనస్తుతా – ఆర్యావర్తులచే స్తుతింపబడునది
జగదుత్పత్తిసంస్థానసంహారత్రయకారణా – విశ్వం యొక్క సృష్టి, నిర్వహణ మరియు నాశనానికి కారణమైనది
త్వమంబ విష్ణుసర్వస్వం నమస్తేఽస్తు మహేశ్వరి |
నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే || 134 ||
త్వమంబ విష్ణుసర్వస్వం – విష్ణువునకు సర్వస్వమూ అమ్మే
మహేశ్వరీ – మహేశ్వరుని భార్య
సర్వలోకానాం జననీ – అన్ని లోకములకు తల్లి
పుణ్యమూర్తి – పుణ్య స్వరూపిణి
సిద్ధలక్ష్మీర్మహాకాళి మహాలక్ష్మి నమోఽస్తు తే |
సద్యోజాతాదిపంచాగ్నిరూపా పంచకపంచికా || 135 ||
సిద్ధలక్ష్మీ – కార్యసిద్ధిని, ప్రయోజనసిద్ధిని ప్రసాదించు లక్ష్మి
మహాకాళీ – ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుని భార్య
మహాలక్ష్మి – మహాలక్ష్మి స్వరూపిణి
సద్యోజాతాదిపంచాగ్నిరూపా – శివుని ఐదు ముఖాలు, ఐదు అగ్నుల స్వరూపము
పంచకపంచికా – పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచప్రాణములు అన్నీ అమ్మ రూపములే
యంత్రలక్ష్మీర్భవత్యాదిరాద్యాద్యే తే నమో నమః |
సృష్ట్యాదికారణాకారవితతే దోషవర్జితే || 136 ||
యంత్రలక్ష్మీ – సర్వయంత్ర స్వరూపిణి
భవతీ – సర్వకాలములయందు ఉండునది
ఆది – సృష్టికి ముందు కూడా ఉన్నటువంటిది
ఆద్యాద్యా – మొదటి నుండి ఉన్నది, ఎప్పటికీ ఉండునది
సృష్ట్యాదికారణాకారవితతా – సృష్టికి ఆదికారణము, సృష్టి యొక్క విస్తారరూపము
దోషవర్జితా – ఎటువంటి దోషములు లేనిది
జగల్లక్ష్మీర్జగన్మాతర్విష్ణుపత్ని నమోఽస్తు తే |
నవకోటిమహాశక్తిసముపాస్యపదాంబుజే || 137 ||
జగల్లక్ష్మి – జగత్తునంతటికీ శోభనిచ్చు లక్ష్మి
జగన్మాతా – లోకములకు తల్లి
విష్ణుపత్నీ – శ్రీమహావిష్ణువు భార్య
నమోస్తుతే – నీకు నమస్కారములు
నవకోటిమహాశక్తిసముపాస్యపదాంబుజా – తొమ్మిది కోట్ల మహాశక్తులచే సేవించబడుతున్న పాదపద్మములు గల తల్లి
కనత్సౌవర్ణరత్నాఢ్యే సర్వాభరణభూషితే |
అనంతనిత్యమహిషీ ప్రపంచేశ్వరనాయకి || 138 ||
కనత్సౌవర్ణరత్నాఢ్యసర్వాభరణభూషితా – ప్రకాశించుచున్న రత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలను ధరించినది
అనంతనిత్యమహిషీ – అనంతునికి శాశ్వతమైన పట్టపు రాణి
ప్రపంచేశ్వరనాయకి – ప్రపంచంలోని దేవతలందరికీ నాయకురాలు
అత్యుచ్ఛ్రితపదాంతస్థే పరమవ్యోమనాయకి |
నాకపృష్ఠగతారాధ్యే విష్ణులోకవిలాసిని || 139 ||
అత్యుచ్ఛ్రితపదాంతస్థా – మిక్కిలి ఉన్నతమైన నామములతో విలసిల్లునది
పరమవ్యోమనాయకీ – నక్షత్రములతో కూడినది
నాకపృష్ఠగతారాధ్యా – శుభమును కలిగించు యజ్ఞసంబంధ మంత్రములందు ఆరాధింపబడు తల్లి
విష్ణులోకవిలాసిని – విష్ణులోకాన్ని ప్రకాశింపజేసేది
వైకుంఠరాజమహిషి శ్రీరంగనగరాశ్రితే |
రంగనాయకి భూపుత్రి కృష్ణే వరదవల్లభే || 140 ||
వైకుంఠరాజమహిషి – వైకుంఠమునకు రాణి
శ్రీరంగనగరాశ్రితా – శ్రీరంగ పట్టణంలో నివసించునది
రంగనాయకీ – శ్రీరంగనాథ స్వామి భార్య
భూపుత్రీ – భూమాత పుత్రికయగు సీతాదేవి స్వరూపిణి
కృష్ణా – అందరినీ ఆకర్షించునది, ద్రౌపదీ స్వరూపిణి
వరదవల్లభా – కంచి వరదరాజస్వామికి భార్య
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 1-10 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 11-20 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 21-30 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 31-40 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 41-50 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 51-60 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 61-70 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 71-80 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 81-90 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 91-100 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 101-110 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 111-120 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 121-130 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 131-140 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 141-150 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 151-154 శ్లోకాలు
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.




