శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 141-150 శ్లోకాలు
లక్ష్మీ సహస్రనామ స్తోత్రం మహాలక్ష్మీ దేవి యొక్క వెయ్యి దివ్య నామాలను స్తుతించే పవిత్రమైన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని భక్తితో పారాయణం చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం, ఐశ్వర్యం, సుఖశాంతులు మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు లభిస్తాయని విశ్వాసం. ఈ పేజీలో లక్ష్మీ సహస్రనామ స్తోత్రానికి సరళమైన తెలుగులో అర్థం మరియు ప్రతి నామం యొక్క విశిష్టతను తెలుసుకుందాం.
కోటిబ్రహ్మాదిసంసేవ్యే కోటిరుద్రాదికీర్తితే |
మాతులుంగమయం ఖేటం సౌవర్ణచషకం తథా || 141 ||
కోటిబ్రహ్మాది సంసేవ్యా – కోట్ల కొలది బ్రహ్మాది దేవతలచే సేవింపబడు తల్లి
కోటి రుద్రాది కీర్తితా – కోట్లాది రుద్రులచే కీర్తింపబడునది
మాతులుంగ మయం ఖేటం బిభ్రతీ – మాదీఫల వృక్షములుండే స్థలములో నివాసముండునది
సౌవర్ణ చషకం తథా – బంగారు పానపాత్రను పట్టుకున్నది
పద్మద్వయం పూర్ణకుంభం కీరం చ వరదాభయే |
పాశమంకుశం శంఖం చక్రం శూలం కృపాణికామ్ || 142 ||
పద్మద్వయం బిభ్రతీ – రెండు చేతులలో రెండు తామరపువ్వులను ధరించినది
పూర్ణ కుంభం బిభ్రతీ – పూర్ణ కుంభమును ధరించినది
కీరం బిభ్రతీ – చేతిలో చిలుకను ధరించినది
వరదాభయే బిభ్రతీ – వరద హస్తమును, అభయ హస్తమును ధరించినది
పాశమంకుశం శంఖం చక్రం శూలం కృపాణికాం – పాశం, అంకుశం, శంఖం, చక్రం, త్రిశూలం మరియు ఖడ్గాన్ని ధరించినది
ధనుర్బాణౌ చాక్షమాలాం చిన్ముద్రామపి బిభ్రతీ |
అష్టాదశభుజే లక్ష్మీర్మహాష్టాదశపీఠగే || 143 ||
ధనుర్బాణౌ చ అక్షమాలాం చిన్ముద్రా మపి భిభ్రతి – విల్లు, బాణం, రుద్రాక్షమాల, జ్ఞానముద్రను ధరించినది
అష్టాదశ భుజాలక్ష్మి – పద్దెనిమిది చేతులు గల లక్ష్మి
మహాష్టాదశ పీఠగా – పద్దెనిమిది శక్తిపీఠాలలో వెలసిన తల్లి
భూమినీళాదిసంసేవ్యే స్వామిచిత్తానువర్తిని |
పద్మే పద్మాలయే పద్మి పూర్ణకుంభాభిషేచితే || 144 ||
భూమినీళాది సంసేవ్యే – భూదేవి, నీళాదేవిచే సేవించబడునది
స్వామి చిత్తానువర్తినీ – భర్త కోరిక మేరకు నడుచుకునేది
పద్మా – కమలములో ఉన్న లక్ష్మిదేవి
పద్మాలయా – కమలములో నివసించేది
పద్మీ – పద్మములను ఇష్టపడునది
పూర్ణకుంభాభిషేచితా – బంగారు కలశములోని ఆకాశగంగచే అభిషేకించబడునది
ఇందిరేందీవరాభాక్షి క్షీరసాగరకన్యకే |
భార్గవి త్వం స్వతంత్రేచ్ఛా వశీకృతజగత్పతిః || 145 ||
ఇందిరా – గొప్ప ఐశ్వర్యవంతురాలు
ఇందీవరాభాక్షి – తుమ్మెదరెక్కల వంటి నల్లని కనురెప్పలు కలది
క్షీరసాగరకన్యకా – పాలసముద్రం నుండి ఉద్భవించిన కన్యకా
భార్గవీ – భృగు మహర్షి కుమార్తె
స్వతంత్రేఛ్చా – స్వతంత్రమైన ఇచ్ఛాశక్తి కలది
వశీకృత జగత్పతి – తన ప్రేమతో జగత్పతిని వశీకరించుకున్నది
మంగళం మంగళానాం త్వం దేవతానాం చ దేవతా |
త్వముత్తమోత్తమానాం చ త్వం శ్రేయః పరమామృతమ్ || 146 ||
మంగళం మంగళానాం – శుభములలోకెల్లా శుభమైనది
దేవతానాం చ దేవతా – దేవతలందరికీ దేవత
ఉత్తమోత్తమా – ఉత్తమమైన వారిలో ఉత్తమమైనది
శ్రేయ – శ్రేష్ఠమైనది, గొప్ప కీర్తి కలది
పరమామృతమ్ – అమృత స్వరూపిణి, మోక్షలక్ష్మి
ధనధాన్యాభివృద్ధిశ్చ సార్వభౌమసుఖోచ్ఛ్రయా |
ఆందోళికాదిసౌభాగ్యం మత్తేభాదిమహోదయః || 147 ||
ధనధాన్యాభివృద్ధి – ధనధాన్యములను వృద్ధి చేయునది
సార్వభౌమ సుఖోఛ్చ్రయా – సార్వభౌములకు సుఖసంతోషములను ఇచ్చు తల్లి
ఆందోళికాది సౌభాగ్యా – సౌభాగ్యమును సూచించునది
మత్తేభాది మహోదయా – మదించిన దిగ్గజములపై ఆధిపత్యము గలది
పుత్రపౌత్రాభివృద్ధిశ్చ విద్యాభోగబలాదికమ్ |
ఆయురారోగ్యసంపత్తిరష్టైశ్వర్యం త్వమేవ హి || 148 ||
పుత్రపౌత్రాభివృద్ధి విద్యాభోగబలాధికా – పుత్రులను, పౌత్రులను అభివృద్ధి గావించి, విద్య, భోగము, బలము ప్రసాదించునది
ఆయురారోగ్య సంపత్తి – దీర్ఘాయువు, ఆరోగ్యం, సంపదలను ప్రసాదించునది
అష్టైశ్వర్యా – అష్టైశ్వర్యములను ప్రసాదించునది
పరమేశవిభూతిశ్చ సూక్ష్మాత్సూక్ష్మతరా గతిః |
సదయాపాంగసందత్తబ్రహ్మేంద్రాదిపదస్థితిః || 149 ||
పరమేశ విభూతి – పరమేశ్వరుని శక్తి, సంపద
సూక్ష్మాత్సూక్ష్మతరా – సూక్ష్మం కన్నా సూక్ష్మమైనది
గతిః – భక్తులకు తానే గతి అయినది
సదయాపాంగసందత్త బ్రహ్మేంద్రాదిపదస్థితి – తన దయాదృష్టితో బ్రహ్మేంద్రాదులకు పదవులను ప్రసాదించినది
అవ్యాహతమహాభాగ్యం త్వమేవాక్షోభ్యవిక్రమః |
సమన్వయశ్చ వేదానామవిరోధస్త్వమేవ హి || 150 ||
అవ్యాహత మహాభాగ్యా – తరగని సంపద కలిగినది
అక్షోభ్య విక్రమా – ఎప్పటికీ తగ్గని పరాక్రమం కలది
సమన్వయా వేదానామవిరోధా – వేదములకు సమన్వయమును కూర్చునది, వైదిక సారాన్ని కలిగినది
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 1-10 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 11-20 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 21-30 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 31-40 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 41-50 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 51-60 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 61-70 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 71-80 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 81-90 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 91-100 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 101-110 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 111-120 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 121-130 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 131-140 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 141-150 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 151-154 శ్లోకాలు
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.




