శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 11-20 శ్లోకాలు
లక్ష్మీ సహస్రనామ స్తోత్రం మహాలక్ష్మీ దేవి యొక్క వెయ్యి దివ్య నామాలను స్తుతించే పవిత్రమైన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని భక్తితో పారాయణం చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం, ఐశ్వర్యం, సుఖశాంతులు మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు లభిస్తాయని విశ్వాసం. శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 11-20 శ్లోకాలు ఈ పేజీలో లక్ష్మీ సహస్రనామ స్తోత్రానికి సరళమైన తెలుగులో అర్థం మరియు ప్రతి నామం యొక్క విశిష్టతను తెలుసుకుందాం.
కాళికా పంచికా వాగ్మి హవిః ప్రత్యధిదేవతా |
దేవమాతా సురేశానా వేదగర్భా అంబికా ధృతిః || 11 ||
కాళికా – నల్లనిది, కాలరాత్రి స్వరూపిణి
పంచికా – పంచభూతాల ద్వారా వ్యాపించినది
వాగ్మి – వేద వాక్కులచే స్తుతించబడునది
హవిః – అగ్నిహోత్రములో ప్రేల్వబడిన ఆజ్యము
ప్రత్యధిదేవతా – మంత్రములకు అధిదేవత
దేవమాతా – దేవతలకు తల్లి
సురేశానా – దేవతలందరినీ పాలించు పరాశక్తి
వేదగర్భ – వేదములనుండి పుట్టినది / వేద స్వరూపిణి
అంబిక – తల్లి
ధృతిః – ధైర్యం
సంఖ్యా జాతిః క్రియాశక్తిః ప్రకృతిర్మోహినీ మహీ |
యజ్ఞవిద్యా మహావిద్యా గుహ్యవిద్యా విభావరీ || 12 ||
సంఖ్యా – సంఖ్యాజ్ఞాన స్వరూపిణి
జాతిః – ప్రతి జీవ జాతిలో ఉండే శక్తి స్వరూపిణి
క్రియాశక్తిః – ఆలోచనలను ఆచరణలో పెట్టగల శక్తి
ప్రకృతి – సృష్టికి కారణభూతమైనది
మోహినీ – సమస్త జగత్తును మోహింపజేయునది
మహీ – భూమి
యజ్ఞవిద్యా – యజ్ఞములకు సంబంధించిన జ్ఞానం
మహావిద్యా – గొప్ప జ్ఞానం
గుహ్యవిద్యా – రహస్య తాంత్రిక విద్య
విభావరీ – అజ్ఞానాన్ని తొలగించునది
జ్యోతిష్మతీ మహామాతా సర్వమంత్రఫలప్రదా |
దారిద్ర్యధ్వంసినీ దేవీ హృదయగ్రంథిభేదినీ || 13 ||
జ్యోతిష్మతీ – కాంతివంతమైనది
మహామాతా – గొప్ప తల్లి
సర్వమంత్రఫలప్రదా – అన్ని మంత్రాల ఫలాన్ని ఇచ్చేది
దారిద్ర్యధ్వంసినీ – పేదరికాన్ని నాశనం చేసేది
దేవీ – దేవత
హృదయగ్రంథిభేదినీ – హృదయ బంధాలను తొలగించేది
సహస్రాదిత్యసంకాశా చంద్రికా చంద్రరూపిణీ |
గాయత్రీ సోమసంభూతిః సావిత్రీ ప్రణవాత్మికా || 14 ||
సహస్రాదిత్యసంకాశా – వేయి సూర్యుల తేజస్సు కలది
చంద్రికా – చంద్రుని కాంతి కలది
చంద్రరూపిణీ – చంద్రుని స్వరూపం
గాయత్రీ – గాయత్రీ మంత్ర అధిష్టాన దేవత
సోమసంభూతిః – చంద్రుని శక్తి
సావిత్రీ – సూర్య తేజస్సు కలది
ప్రణవాత్మికా – ఓంకార స్వరూపిణి
శాంకరీ వైష్ణవీ బ్రాహ్మీ సర్వదేవనమస్కృతా |
సేవ్యదుర్గా కుబేరాక్షీ కరవీరనివాసినీ || 15 ||
శాంకరీ – శివ శక్తి
వైష్ణవీ – విష్ణు శక్తి
బ్రాహ్మీ – బ్రహ్మ శక్తి
సర్వదేవనమస్కృతా – దేవతలచే నమస్కరింపబడినది
సేవ్యదుర్గా – దుర్గాదేవిచే సేవించబడేది
కుబేరాక్షీ – అందమైన కన్నులు కలది
కరవీరనివాసినీ – పుష్పాలలో నివసించేది
జయా చ విజయా చైవ జయంతీ చాపరాజితా |
కుబ్జికా కాళికా శాస్త్రీ వీణాపుస్తకధారిణీ || 16 ||
జయా – జయం ఇచ్చేది
విజయా – విజయాన్ని ఇచ్చేది
జయంతీ – మంగళప్రదమైనది
అపరాజితా – ఓడించలేనిది
కుబ్జికా – బాల స్వరూపిణి
కాళికా – పార్వతి రూపం
శాస్త్రీ – శాస్త్ర జ్ఞానం కలది
వీణాపుస్తకధారిణీ – వీణ, పుస్తకం ధరించేది
సర్వజ్ఞశక్తిః శ్రీశక్తిర్బ్రహ్మవిష్ణుశివాత్మికా |
ఇడాపింగళికామధ్యమృణాళీతంతురూపిణీ || 17 ||
సర్వజ్ఞశక్తిః – అన్ని జ్ఞానం కల శక్తి
శ్రీశక్తి – సంపద శక్తి
బ్రహ్మవిష్ణుశివాత్మికా – త్రిమూర్తుల శక్తి
ఇడా పింగళి మధ్యమృణాళీ తంతురూపిణీ – కుండలినీ శక్తి రూపం
యజ్ఞేశానీ ప్రథా దీక్షా దక్షిణా సర్వమోహినీ |
అష్టాంగయోగినీ దేవీ నిర్బీజధ్యానగోచరా || 18 ||
యజ్ఞేశానీ – యజ్ఞాల అధిదేవత
ప్రథా – ప్రసిద్ధి
దీక్షా – నియమ శీలత
దక్షిణా – తల్లి స్వరూపిణి
సర్వమోహినీ – అందరిని ఆకర్షించేది
అష్టాంగయోగినీ దేవీ – యోగినీ రూపం
నిర్బీజధ్యానగోచరా – నిర్బీజ ధ్యానంలో దర్శనమిచ్చేది
సర్వతీర్థస్థితా శుద్ధా సర్వపర్వతవాసినీ |
వేదశాస్త్రప్రమా దేవీ షడంగాదిపదక్రమా || 19 ||
సర్వతీర్థస్థితా – అన్ని తీర్థాలలో ఉండేది
శుద్ధా – పవిత్రమైనది
సర్వపర్వతవాసినీ – అన్ని పర్వతాలలో నివసించేది
వేదశాస్త్రప్రమా దేవీ – వేద జ్ఞానం కలది
షడంగాదిపదక్రమా – వేదాంగాల స్వరూపిణి
శివా ధాత్రీ శుభానందా యజ్ఞకర్మస్వరూపిణీ |
వ్రతినీ మేనకాదేవీ బ్రహ్మాణీ బ్రహ్మచారిణీ || 20 ||
శివా – శివ శక్తి
ధాత్రీ – సర్వమును ధరించేది
శుభానందా – శుభం, ఆనందం ఇచ్చేది
యజ్ఞకర్మస్వరూపిణీ – యజ్ఞ కర్మ స్వరూపం
వ్రతినీ – వ్రతధారిణి
మేనకాదేవీ – మేనక కుమార్తె
బ్రహ్మాణీ – బ్రహ్మ శక్తి
బ్రహ్మచారిణీ – తపస్సు చేసే రూపం
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.




