స్తోత్రాలకు తెలుగులో అర్థం » దేవీ స్తోత్రాలు » లక్ష్మీ స్తోత్రాలు » శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 41-50 శ్లోకాలు
Sri Lakshmi Sahasranamam 41-50 Slokalu with Telugu Meaning

శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 41-50 శ్లోకాలు

లక్ష్మీ సహస్రనామ స్తోత్రం మహాలక్ష్మీ దేవి యొక్క వెయ్యి దివ్య నామాలను స్తుతించే పవిత్రమైన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని భక్తితో పారాయణం చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం, ఐశ్వర్యం, సుఖశాంతులు మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు లభిస్తాయని విశ్వాసం. ఈ పేజీలో లక్ష్మీ సహస్రనామ స్తోత్రానికి సరళమైన తెలుగులో అర్థం మరియు ప్రతి నామం యొక్క విశిష్టతను తెలుసుకుందాం.

బిందునాదకళాతీతా బిందునాదకళాత్మికా |
దశవాయుజయాకారా కళాషోడశసంయుతా || 41 ||

బిందునాదకళాతీతా – బీజాక్షరాలలో ఉండు బిందువు, నాదము, కళ మొదలైన వాటికి అతీతమైనది
బిందునాదకళాత్మికా – నాదము, బిందువు, కళలతో కూడిన ‘ఓం ఐం హ్రీం’ అను బీజాక్షరములే తన రూపముగా కలది
దశవాయుజయాకారా – పంచప్రాణములు (ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము) మరియు పంచ ఉపవాయువులు (నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనంజయము) జయించిన యోగిలో ప్రేరేపించబడే కుండలినీ శక్తి రూపము
కళాషోడశసంయుతా – చంద్రుని పదహారు కళల స్వరూపము

కాశ్యపీ కమలాదేవీ నాదచక్రనివాసినీ |
మృడాధారా స్థిరా గుహ్యా దేవికా చక్రరూపిణీ || 42 ||

కాశ్యపీ – కశ్యపునికి దానం చేయబడిన భూదేవి స్వరూపమైన తల్లి
కమలాదేవీ – కమలములు చేతియందు కలది
నాదచక్రనివాసినీ – నాదచక్రమైన ఓంకారము నివాసముగా కలది
మృడాధారా – భక్తులకు సంతోషమును కలిగించునది
స్థిరా – శాశ్వతమైనది
గుహ్యా – అతి రహస్యమైనది, హృదయాకాశములో ఉన్న చిచ్ఛక్తి స్వరూపిణి
దేవికా – దేవత
చక్రరూపిణీ – శ్రీచక్ర స్వరూపిణి

అవిద్యా శార్వరీ భుంజా జంభాసురనిబర్హిణీ |
శ్రీకాయా శ్రీకళా శుభ్రా కర్మనిర్మూలకారిణీ || 43 ||

అవిద్యా – సృష్టిలోని వైవిధ్యాన్ని తెలుసుకోగల విద్య
శార్వరీ – రాత్రి స్వరూపం
భుంజా – ప్రళయకాలమున సర్వమును భుజించునది, లయకారిణి
జంభాసురనిబర్హిణీ – ఇంద్రుని రూపంలో జంభాసురుడిని సంహరించినది
శ్రీకాయా – సంపదగా జన్మించినది
శ్రీకళా – మంగళకరమైన రూపము కలది
శుభ్రా – తెల్లనిది, పవిత్రమైనది
కర్మనిర్మూలకారిణీ – కర్మలను నశింపజేసి మోక్షము కలిగించునది

ఆదిలక్ష్మీర్గుణాధారా పంచబ్రహ్మాత్మికా పరా |
శ్రుతిర్బ్రహ్మముఖావాసా సర్వసంపత్తిరూపిణీ || 44 ||

ఆదిలక్ష్మీ – లక్ష్మీ స్వరూపము
గుణాధారా – సమస్త సద్గుణములకు ఆధారమైనది
పంచబ్రహ్మాత్మికా – సకల దేవతా స్వరూపిణి
పరా – అన్నింటికంటే ఉన్నతమైనది
శ్రుతిః – వేద స్వరూపిణి
బ్రహ్మముఖావాసా – వేదాల స్వరూపమైన బ్రహ్మ ముఖములలో నివసించే సరస్వతి
సర్వసంపత్తిరూపిణీ – సకల సంపదల స్వరూపిణి

మృతసంజీవనీ మైత్రీ కామినీ కామవర్జితా |
నిర్వాణమార్గదా దేవీ హంసినీ కాళికా క్షమా || 45 ||

మృతసంజీవనీ – సంజీవనీ మంత్ర స్వరూపిణి
మైత్రీ – సమస్త జీవులపట్ల మైత్రి కలది
కామినీ – కోరికలు నెరవేర్చునది
కామవర్జితా – ఏ కోరికలూ లేనిది
నిర్వాణమార్గదా దేవీ – మోక్షానికి మార్గం చూపించు తల్లి
హంసినీ – హంస స్థితిలో ఉన్నది, సూర్యుని తేజస్సు
కాళికా – ఉగ్ర స్వరూపిణి, పార్వతీ దేవి అవతారము
క్షమా – ఓర్పు కలిగినది

సపర్యా గుణినీ భిన్నా నిర్గుణాఖండితాఽశుభా |
స్వామినీ వేదినీ శక్యా శాంబరీ చక్రధారిణీ || 46 ||

సపర్యా – సేవింపదగినది
గుణినీ – మంచి గుణాలు కలది
భిన్నా – అనేక రూపములు కలది
నిర్గుణా – గుణరహితమైనది, మాయాశక్తి స్వరూపిణి
అఖండితా – శత్రువులచేత ఖండింపబడనిది
శుభా – మంగళకరమైనది
స్వామినీ – యజమాన స్వరూపిణి
వేదినీ – యజ్ఞవేది స్వరూపిణి
శక్యా – భక్తులను సులభముగా అనుగ్రహించునది
శాంబరీ – మాయా స్వరూపిణి
చక్రధారిణీ – చక్రాయుధమును ధరించినది

దండినీ ముండినీ వ్యాఘ్రీ శిఖినీ సోమసంహతిః |
చింతామణిశ్చిదానందా పంచబాణప్రబోధినీ || 47 ||

దండినీ – దుష్టులను శిక్షించునది
ముండినీ – శివుని శక్తి స్వరూపిణి
వ్యాఘ్రీ – శక్తివంతమైనది
శిఖినీ – శివుని శక్తి
సోమసంహతిః – చంద్రుని సోదరి, చంద్రుని వలె కాంతివంతమైనది
చింతామణిః – కోరికలు తీర్చునది, చింతామణులతో నిర్మించిన గృహములో నివసించునది
చిదానందా – దివ్య ఆనంద స్థితిలో ఉండునది
పంచబాణప్రబోధినీ – పంచ పూలబాణములు కల మన్మథుణ్ణి బ్రతికించినది

బాణశ్రేణిః సహస్రాక్షీ సహస్రభుజపాదుకా |
సంధ్యా బలిస్త్రిసంధ్యాఖ్యా బ్రహ్మాండమణిభూషణా || 48 ||

బాణశ్రేణిః – బాణాల వరుసను కలిగి ఉన్నది
సహస్రాక్షీ – వేయి కన్నులు కలది
సహస్రభుజపాదుకా – అనంతమైన భుజములు, పాదములు కలది
సంధ్యాబలిః – త్రికాల సంధ్యలలో పూజలు అందుకొనేది
త్రిసంధ్యాఖ్యా – ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పూజించదగినది
బ్రహ్మాండమణిభూషణా – బ్రహ్మాండములనే మణులతో కూడిన ఆభరణములు కలది

వాసవీ వారుణీసేనా కుళికా మంత్రరంజనీ |
జితప్రాణస్వరూపా చ కాంతా కామ్యవరప్రదా || 49 ||

వాసవీ – ఇంద్రుని శక్తి స్వరూపిణి
వారుణీ – వరుణ సంబంధమైన శక్తి స్వరూపిణి
సేనా – సేన కలది
కుళికా – సృష్టి రచనలో సమర్థురాలు
మంత్రరంజనీ – వేదమంత్రముల వలన సంతోషించు తల్లి
జితప్రాణస్వరూపా – ఆత్మను గెలుచుకున్న రూపం కలిగినది
కాంతా – అందరినీ ఆకర్షించునది
కామ్యవరప్రదా – కోరుకున్న వరాలు ఇచ్చేది

మంత్రబ్రాహ్మణవిద్యార్థా నాదరూపా హవిష్మతీ |
ఆథర్వణిః శ్రుతిః శూన్యా కల్పనావర్జితా సతీ || 50 ||

మంత్రబ్రాహ్మణవిద్యార్థా – వేద విద్యలకు ప్రయోజనమును కలిగించునది
నాదరూపా – శబ్ద స్వరూపిణి
హవిష్మతీ – అగ్నియందు ప్రేల్వదగిన హవిస్సులు కలది
ఆథర్వణిః – అథర్వణ వేదమంత్ర స్వరూపిణి
శ్రుతిః – వేద స్వరూపిణి
శూన్యా – ఆది, మధ్య, అంతములు లేనిది
కల్పనా – సమస్త సృష్టికి కారణభూతమైనది
వర్జితా – సంకల్ప, వికల్పములు విడిచిన పరబ్రహ్మ స్వరూపిణి
సతీ – పతివ్రతా స్వరూపిణి

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

 ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top