స్తోత్రాలకు తెలుగులో అర్థం » దేవీ స్తోత్రాలు » లక్ష్మీ స్తోత్రాలు » శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 51-60 శ్లోకాలు
Sri Lakshmi Sahasranamam Slokas 51-60 with Telugu Meaning

శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 51-60 శ్లోకాలు

లక్ష్మీ సహస్రనామ స్తోత్రం మహాలక్ష్మీ దేవి యొక్క వెయ్యి దివ్య నామాలను స్తుతించే పవిత్రమైన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని భక్తితో పారాయణం చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం, ఐశ్వర్యం, సుఖశాంతులు మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు లభిస్తాయని విశ్వాసం. ఈ పేజీలో లక్ష్మీ సహస్రనామ స్తోత్రానికి సరళమైన తెలుగులో అర్థం మరియు ప్రతి నామం యొక్క విశిష్టతను తెలుసుకుందాం.

సత్తాజాతిః ప్రమాఽమేయాఽప్రమితిః ప్రాణదా గతిః |
అవర్ణా పంచవర్ణా చ సర్వదా భువనేశ్వరీ || 51 ||
సత్తా – పరబ్రహ్మ స్వరూపము
జాతిః – భిన్నమైన వస్తువులయందు ఉండునది
ప్రమా – యథార్థ జ్ఞానము కలిగించునది
అమేయా – హద్దులు లేనిది
అప్రమితి – వేదాలు, సిద్ధాంతాల ద్వారా కాక అనుభూతియందు మాత్రమే తెలియదగినది
ప్రాణదా – జీవితాన్ని ఇచ్చేది
గతిః – భక్తులకు గమ్యం, సద్గతిని ప్రసాదించునది
అవర్ణా – అక్షరములతో కూడిన మాటలచేత వర్ణించుటకు వీలులేనిది
పంచవర్ణా – ఐదు రంగులు కలిగిన ముఖములు కలిగినది, గాయత్రీ దేవి
సర్వదా – సర్వులకు సర్వమును ప్రసాదించునది
భువనేశ్వరీ – విశ్వానికి దేవత

త్రైలోక్యమోహినీ విద్యా సర్వభర్త్రీ క్షరాఽక్షరా |
హిరణ్యవర్ణా హరిణీ సర్వోపద్రవనాశినీ || 52 ||
త్రైలోక్యమోహినీ – మూడు లోకాలను మంత్రముగ్ధులను చేయునది
విద్యా – జ్ఞాన స్వరూపిణి
సర్వభర్త్రీ – సమస్తమును భరించునది
క్షరా – నశింపచేయునది
అక్షరా – నాశనము లేనిది
హిరణ్యవర్ణా – బంగారు రంగులో ఉండునది
హరిణీ – దుఃఖములను నశింపజేయునది
సర్వోపద్రవనాశినీ – అన్ని సమస్యలను నాశనం చేయునది

కైవల్యపదవీరేఖా సూర్యమండలసంస్థితా |
సోమమండలమధ్యస్థా వహ్నిమండలసంస్థితా || 53 ||
కైవల్యపదవీరేఖా – మోక్షానికి మార్గము అయినది
సూర్యమండలసంస్థితా – సౌరమండలంలో ఉండునది
సోమమండలమధ్యస్థా – చంద్రమండలము మధ్యలో ఉండునది
వహ్నిమండలసంస్థితా – మూలాధార చక్రమునందు ఉండునది

వాయుమండలమధ్యస్థా వ్యోమమండలసంస్థితా |
చక్రికా చక్రమధ్యస్థా చక్రమార్గప్రవర్తినీ || 54 ||
వాయుమండలమధ్యస్థా – వాయుమండలము మధ్యలో ఉండునది
వ్యోమమండలసంస్థితా – ఆకాశంలో నిలిచి ఉండునది
చక్రికా – దివ్య చక్రము కలిగినది
చక్రమధ్యస్థా – శ్రీచక్రం మధ్యలో ఉండునది
చక్రమార్గప్రవర్తినీ – శరీర చక్రాల మార్గంలో ప్రయాణించేది

కోకిలాకులచక్రేశా పక్షతిః పంక్తిపావనా |
సర్వసిద్ధాంతమార్గస్థా షడ్వర్ణావరవర్జితా || 55 ||
కోకిలా – శోభిల్లునది
పక్షతిః – చంద్రుని దశల ప్రారంభమైన పాడ్యమి తిథి
పంక్తిపావనా – తన భక్తుల పాపములను పోగొట్టి శుద్ధి చేయునది
సర్వసిద్ధాంతమార్గస్థా – సమస్త జ్ఞానానికి మార్గం అయినది
షడ్వర్ణా – ఆరు వర్ణములు కల ముఖములు కలది
అవరవర్జితా – పాపాత్ములచేత విడువబడినది

శతరుద్రహరా హంత్రీ సర్వసంహారకారిణీ |
పురుషా పౌరుషీ తుష్టిః సర్వతంత్రప్రసూతికా || 56 ||
శతరుద్రహరా – రుద్ర రూపిణి
హంత్రీ – దుష్టులైన రాక్షసులను సంహరించునది
సర్వసంహారకారిణీ – ప్రళయకాలమునందు సమస్తమును లయము చేయునది
పురుషా – ఈశ్వర స్వరూపిణి
పౌరుషీ – పురుషశక్తి స్వరూపిణి
తుష్టిః – అందరికీ సంతృప్తి కలిగించునది
సర్వతంత్రప్రసూతికా – సర్వ తంత్రములకు మూలమైనది

అర్ధనారీశ్వరీ దేవీ సర్వవిద్యాప్రదాయినీ |
భార్గవీ యాజుషీవిద్యా సర్వోపనిషదాస్థితా || 57 ||
అర్ధనారీశ్వరీ దేవీ – అర్ధనారీశ్వర స్వరూపము
సర్వవిద్యాప్రదాయినీ – సమస్త విద్యలనూ ప్రసాదించునది
భార్గవీ – భృగు మహర్షి కుమార్తె
యాజుషీవిద్యా – యజుర్వేద విద్యా స్వరూపిణి
సర్వోపనిషదాస్థితా – సర్వ ఉపనిషత్తులలో ఉన్నది

వ్యోమకేశాఽఖిలప్రాణా పంచకోశవిలక్షణా |
పంచకోశాత్మికా ప్రత్యక్పంచబ్రహ్మాత్మికా శివా || 58 ||
వ్యోమకేశాఽఖిలప్రాణా – వ్యోమకేశుడైన శివుని యొక్క అఖిల ప్రాణములు జగదంబే
పంచకోశవిలక్షణా – అన్నమయ కోశము మొదలైన పంచకోశాలకు అతీతమైనది
పంచకోశాత్మికా – పంచకోశముల లోపలి భాగమునందున్న తల్లి
ప్రత్యక్ – పంచకోశములకు వేరైన ఆత్మయే అమ్మ
పంచబ్రహ్మాత్మికా – పంచబ్రహ్మల, పంచప్రాణముల స్వరూపం
శివా – శివుని భార్య

జగజ్జరాజనిత్రీ చ పంచకర్మప్రసూతికా |
వాగ్దేవ్యాభరణాకారా సర్వకామ్యస్థితాస్థితిః || 59 ||
జగజ్జరాజనిత్రీ – లయకారిణి
పంచకర్మప్రసూతికా – సృష్టి, నిర్వహణ, విలీనం, అదృశ్యం, అనుగ్రహం అనే ఐదు కర్మలకు కారణమైనది
వాగ్దేవ్యాభరణాకారా – వాక్కును ఆభరణముగా కలది
సర్వకామ్యస్థితా – సర్వ పుణ్యకార్యములలో ఉన్నది
స్థితిః – స్థిరంగా ఉన్నది

అష్టాదశచతుష్షష్టిపీఠికా విద్యయాయుతా |
కాలికాకర్షణశ్యామా యక్షిణీ కిన్నరేశ్వరీ || 60 ||
అష్టాదశచతుష్షష్టిపీఠికా – అష్టాదశ పీఠములు, చతుఃషష్టి పీఠములు నివాసములుగా గల తల్లి
విద్యయాయుతా – శ్రీవిద్యతో కూడినది
కాలికాకర్షణశ్యామా – ఆకర్షణీయమైన నల్లని వర్ణము గల శ్యామలాదేవి
యక్షిణీ – యక్ష స్త్రీ
కిన్నరేశ్వరీ – మానవ శరీరం, గుర్రపు తల కలిగిన కిన్నర జాతికి అధిష్ఠాత్రి దేవి

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

 ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top