స్తోత్రాలకు తెలుగులో అర్థం » దేవీ స్తోత్రాలు » లక్ష్మీ స్తోత్రాలు » శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 61-70 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 61 నుండి 70 శ్లోకాల తెలుగు అర్థాలు

శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 61-70 శ్లోకాలు

లక్ష్మీ సహస్రనామ స్తోత్రం మహాలక్ష్మీ దేవి యొక్క వెయ్యి దివ్య నామాలను స్తుతించే పవిత్రమైన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని భక్తితో పారాయణం చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం, ఐశ్వర్యం, సుఖశాంతులు మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు లభిస్తాయని విశ్వాసం. ఈ పేజీలో లక్ష్మీ సహస్రనామ స్తోత్రానికి సరళమైన తెలుగులో అర్థం మరియు ప్రతి నామం యొక్క విశిష్టతను తెలుసుకుందాం.

కేతకీ మల్లికాఽశోకా వారాహీ ధరణీ ధ్రువా |
నారసింహీ మహోగ్రాస్యా భక్తానామార్తినాశినీ || 61 ||
కేతకీ – మొగలి పూవులయందు మక్కువ కలది
మల్లికా – మల్లెపూల యందు ప్రీతి కలది
అశోకా – దుఃఖం లేనిది
వారాహీ – శ్రీమహావిష్ణువు యొక్క వరాహావతారం యొక్క శక్తి
ధరణీ – భూమి
ధ్రువా – స్థిరమైనది
నారసింహీ – మహావిష్ణువు యొక్క నరసింహ అవతారం యొక్క శక్తి
మహోగ్రాస్యా – భయంకరమైన ముఖము కలది
భక్తానామార్తినాశినీ – భక్తుల దుఃఖాలను నశింపజేసేది

అంతర్బలా స్థిరా లక్ష్మీర్జరామరణనాశినీ |
శ్రీరంజితా మహాకాయా సోమసూర్యాగ్నిలోచనా || 62 ||
అంతర్బలా – మానసికంగా దృఢంగా ఉన్నది
స్థిరా – శాశ్వతమైనది
లక్ష్మీః – మంచి లక్షణాలను కలిగి ఉన్నది
జరామరణనాశినీ – వృద్ధాప్యాన్ని, మరణాన్ని నిరోధించునది
శ్రీరంజితా – శోభ, అలంకారములు, కీర్తి చేత భక్తులను రంజింపజేయునది
మహాకాయా – గొప్ప తేజస్సుతో కూడిన శరీరము కలది
సోమసూర్యాగ్నిలోచనా – చంద్రుడు, సూర్యుడు, అగ్ని కన్నులుగా కలిగినది

అదితిర్దేవమాతా చ అష్టపుత్రాఽష్టయోగినీ |
అష్టప్రకృతిరష్టాష్టవిభ్రాజద్వికృతాకృతిః || 63 ||
అదితిః దేవమాతా – దేవతలందరికీ తల్లి అయిన అదితి
అష్టపుత్రా – అష్టదిక్కులు పుత్రులుగా గల భూదేవీ స్వరూపిణి
అష్టయోగినీ – యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే అష్టాంగ యోగ స్వరూపిణి
అష్టప్రకృతిః – పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను అష్టవిధ ప్రకృతుల స్వరూపము
అష్టాష్టవిభ్రాజద్వికృతాకృతిః – కళలలో ప్రకాశించేది, యోగినుల స్వరూపము

దుర్భిక్షధ్వంసినీ దేవీ సీతా సత్యా చ రుక్మిణీ |
ఖ్యాతిజా భార్గవీ దేవీ దేవయోనిస్తపస్వినీ || 64 ||
దుర్భిక్షధ్వంసినీ దేవీ – కరువు కాటకాలను నాశనం చేయు తల్లి
సీతా – శ్రీరాముని భార్య
సత్యా – శ్రీకృష్ణుని భార్యలలో ఒకరైన సత్య, పరబ్రహ్మ స్వరూపిణి
రుక్మిణీ – శ్రీకృష్ణుని భార్య రుక్మిణి
ఖ్యాతిజా – భృగు మహర్షి, ఖ్యాతి దంపతులకు పుట్టినది
భార్గవీ దేవీ – భృగు మహర్షి కుమార్తె
దేవయోనిః – దేవతలందరికీ జన్మనిచ్చినది
తపస్వినీ – తపస్సు చేయునది

శాకంబరీ మహాశోణా గరుడోపరిసంస్థితా |
సింహగా వ్యాఘ్రగా దేవీ వాయుగా చ మహాద్రిగా || 65 ||
శాకంబరీ – శాకంబరీ అవతారము దాల్చినది
మహాశోణా – మిక్కిలి ఎర్రనైనది
గరుడోపరిసంస్థితా – గరుడ వాహనముపై కూర్చున్నది
సింహగా – సింహం మీద ప్రయాణించేది
వ్యాఘ్రగా దేవీ – పులిని వాహనముగా కలది
వాయుగా – వాయువును కదిలేలా చేయునది
మహాద్రిగా – గొప్ప పర్వతములందు సంచరించునది

అకారాదిక్షకారాంతా సర్వవిద్యాధిదేవతా |
మంత్రవ్యాఖ్యాననిపుణా జ్యోతిఃశాస్త్రైకలోచనా || 66 ||
అకారాదిక్షకారాంతా – అ నుండి క్ష వరకు అక్షరముల రూపమై ఉన్నది
సర్వవిద్యాధిదేవతా – అన్ని విద్యలకు అధిదేవత
మంత్రవ్యాఖ్యాననిపుణా – మంత్రాలను వివరించడంలో నిపుణురాలు
జ్యోతిఃశాస్త్రైకలోచనా – భవిష్యత్తును తెలుసుకోగల తల్లి

ఇడాపింగళికామధ్యసుషుమ్నా గ్రంథిభేదినీ |
కాలచక్రాశ్రయోపేతా కాలచక్రస్వరూపిణీ || 67 ||
ఇడాపింగళికామధ్యసుషుమ్నా గ్రంథిభేదినీ – ఇడా, పింగళ నాడుల మధ్యనున్న సుషుమ్నా నాడిలో కుండలినీ శక్తి రూపముగా ఉండునది
కాలచక్రాశ్రయోపేతా – కాలచక్రముతో కూడుకొని ఉన్న శక్తి
కాలచక్రస్వరూపిణీ – కాలచక్రమే ఆమె స్వరూపము

వైశారదీ మతిశ్రేష్ఠా వరిష్ఠా సర్వదీపికా |
వైనాయకీ వరారోహా శ్రోణివేలా బహిర్వళిః || 68 ||
వైశారదీ – గొప్ప పాండిత్యము కలది
మతిశ్రేష్ఠా – అత్యంత తెలివైనది
వరిష్ఠా – ఉత్తమమైనది
సర్వదీపికా – ప్రతి ఒక్కరికీ వెలుగునిచ్చేది
వైనాయకీ – వినాయకుని శక్తి
వరారోహా – గొప్ప ఔన్నత్యము కలది
శ్రోణివేలా – అనాయాసమైన మరణములకు మార్గమైనది
బహిర్వళిః – ఉదరమునందు మూడు ముడుతలు కలది

జంభినీ జృంభిణీ జృంభకారిణీ గణకారికా |
శరణీ చక్రికాఽనంతా సర్వవ్యాధిచికిత్సకీ || 69 ||
జంభినీ – ధనుర్బాణములు కలది
జృంభిణీ – శత్రువులపై పరాక్రమమును చూపించునది
జృంభకారిణీ – బాగుగా నోరు తెరిచి ఉండునది, కాళికా దేవి
గణకారికా – ప్రమథ గణములను ఏర్పరచినది
శరణీ – పోషించి, రక్షించునది
చక్రికా – దివ్య చక్రము కలిగినది
అనంతా – అంతం లేనిది
సర్వవ్యాధిచికిత్సకీ – సర్వ వ్యాధులనూ నయం చేయునది

దేవకీ దేవసంకాశా వారిధిః కరుణాకరా |
శర్వరీ సర్వసంపన్నా సర్వపాపప్రభంజినీ || 70 ||
దేవకీ – కృష్ణుని తల్లి
దేవసంకాశా – దేవతలకు సమీపముగా ఉండి కష్టములను తీర్చునది
వారిధిః – పంచభూతములలో రెండవదైన జలము, అనగా సముద్రము, అమ్మ స్వరూపమే
కరుణాకరా – కరుణా స్వరూపిణి
శర్వరీ – రాత్రి స్వరూపిణి, ప్రజలలోని చీకటిని (అజ్ఞానాన్ని) తొలగించునది
సర్వసంపన్నా – అన్ని రకాల సంపదలను కలిగి ఉన్నది
సర్వపాపప్రభంజినీ – సర్వ పాపములను పోగొట్టునది

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top