జయదేవ అష్టపది ప్రబంధః – 7 | గీత గోవిందం తెలుగులో అర్థం
జయదేవ అష్టపది భారతీయ భక్తి సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దివ్య కవితా సంపద. దీనిని 12వ శతాబ్దానికి చెందిన మహాకవి జయదేవుడు సంస్కృతంలో రచించారు. ఈ అష్టపదులు ఆయన అమర గ్రంథమైన గీత గోవిందంలో భాగంగా ఉన్నాయి.
“అష్టపది” అంటే ఎనిమిది పాదాలతో కూడిన గీతం. మొత్తం 24 అష్టపదులు గీత గోవిందంలో ఉన్నాయి. ప్రతి అష్టపది శ్రీకృష్ణుడు మరియు శ్రీరాధాదేవి మధ్యనున్న దివ్య ప్రేమ, విరహం, కలయిక, భక్తి, శరణాగతి వంటి ఆధ్యాత్మిక భావాలను అద్భుతమైన కవిత్వంతో చిత్రిస్తుంది.
జయదేవుని కవిత్వంలో శృంగారరసం కేవలం భౌతిక ప్రేమను సూచించదు. అది జీవాత్మ పరమాత్మను చేరుకోవాలనే ఆత్మీయ తపనకు ప్రతీక. రాధా జీవాత్మకు, శ్రీకృష్ణుడు పరమాత్మకు ప్రతిరూపంగా భావించబడతారు. అందువల్ల గీత గోవిందం భక్తి, సంగీతం, నృత్యం మరియు సాహిత్య రంగాల్లో అపూర్వమైన స్థానం సంపాదించింది.
ఈ అష్టపదులను భారతదేశంలోని అనేక దేవాలయాల్లో, ముఖ్యంగా శ్రీకృష్ణ ఆలయాలలో, భక్తితో ఆలపిస్తారు. ఒడిస్సీ, భరతనాట్యం, కూచిపూడి, కథక్ వంటి భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాలలో కూడా వీటికి విశిష్టమైన ప్రాధాన్యం ఉంది.
ఈ శ్రేణిలో ప్రతి అష్టపదిని సంస్కృత శ్లోకంతో పాటు పదచ్ఛేదం, పదార్థం, తాత్పర్యం మరియు సులభమైన తెలుగు వివరణతో తెలుసుకుందాం. జయదేవ మహాకవి ఆవిష్కరించిన రాధాకృష్ణుల దివ్య ప్రేమ రహస్యాన్ని, భక్తి తత్వాన్ని మరియు గీత గోవిందం యొక్క ఆధ్యాత్మిక సౌందర్యాన్ని కలిసి ఆస్వాదిద్దాం.
అష్టపది – 7
తృతీయః సర్గః – ముగ్ధ మధుసూదనః
కంసారిరపి సంసార వాసనాబద్ధ శృంఖలామ్ ।
రాధామాధాయ హృదయే తత్యాజ వ్రజసుందరీః ॥ 1॥
ఇతస్తతస్తా మనుసృత్య రాధికా
మనంగ బాణ వ్రణ ఖిన్న మానసః ।
కృతానుతాపః స కళింద నందినీ
తటాంత కుంజే విషసాద మాధవః ॥ 2 ॥
॥ ప్రబంధః – 7 ॥
(ముగ్ధమధుసూదన హంసక్రీడనమ్)
(భూపాళ – ఆది)

ఘూర్జరీ రాగ యతి తాళాభ్యాం గీయతే ।
మా మియం చలితా విలోక్య వృతం వధూ నిచయేన ।
సాపరాధతయా మయాఽపి న వారితాఽతిభయేన ॥
హరి హరి హతాదరతయా గతా సా కుపితేవ ॥ (ధ్రువమ్) ॥
కిం కరిష్యతి కిం వదిష్యతి సా చిరం విరహేణ ।
కిం ధనేన జనేన కిం మమ జీవితేన గృహేణ ॥
చింతయామి తదాననం కుటిల భ్రూ కోప భరేణ ।
శోణ పద్మమివోపరి భ్రమతాఽఽకులం భ్రమరేణ ॥
తామహం హృది సంగతామనిశం భృశం రమయామి ।
కిం వనేఽనుసరామి తామిహ కిం వృథా విలపామి ॥
తన్వి ఖిన్నమసూయయా హృదయం తవాకలయామి ।
తన్న వేద్మి కుతో గతాఽసి న తేన తేఽనునయామి ॥
దృశ్యసే పురతో గతాగతమేవ మే విదధాసి ।
కిం పురేవ ససంభ్రమం పరిరంభణం న దదాసి ॥
క్షమ్యతామపరం కదాపి తవేదృశం న కరోమి ।
దేహి సుందరి! దర్శనం మమ మన్మథేన దునోమి ॥
వర్ణితం జయదేవకేన హరేరిదం ప్రవణేన ।
బిందుబిల్వ సముద్ర సంభవ రోహిణీ రమణేన ॥
హృది బిసలతా హారో నాయం భుజంగమ నాయకః
కువలయ దళ శ్రేణీ కంఠే న సా గరళ ద్యుతిః ।
మలయజ రజో నేదం భస్మ ప్రియా రహితే మయి
ప్రహరసి హర భ్రాంత్యాఽనంగ! క్రుధా కిము ధావసి ॥ 3 ॥
పాణౌ మా కురు చూత సాయకమముం మా చాపమారోపయ
క్రీడానిర్జిత విశ్వ! మూర్ఛిత జనాఘాతేన కిం పౌరుషమ్ ।
తస్యా ఏవ మృగీదృశో మనసిజ ప్రేంఖత్కటాక్షాశుగ
శ్రేణీ జర్జరితం మనాగపి మనో నాద్యాపి సంధుక్షతే ॥ 4 ॥
భ్రూ పల్లవం ధనురపాంగ తరంగితాని
బాణా గుణః శ్రవణపాళి రితి స్మరేణ ।
తస్యామనంగ జయ జంగమ దేవతాయా
మస్త్రాణి నిర్జిత జగంతి కిమర్పితాని ॥ 5 ॥
భ్రూ చాపే నిహితః కటాక్ష విశిఖో నిర్మాతు మర్మ వ్యథాం
శ్యామాత్మా కుటిలః కరోతు కబరీ భారోఽపి మారోద్యమం ।
మోహం తావదయం చ తన్వి! తనుతాం బింబాధరో రాగవాన్
సద్వృత్తః స్తనమండల స్తవకథం ప్రాణైర్మమ క్రీడతి ॥ 6 ॥
తాని స్పర్శ సుఖాని తే చ సరళాః స్నిగ్ధా దృశోర్విభ్రమాః
తద్వక్త్రాంబుజ సౌరభం స చ సుధా స్యందీ గిరాం వక్రిమా ।
సా బింబాధర మాధురీతి విషయాసంగేఽపి చేన్మానసం
తస్యాం లగ్న సమాధిహంత! విరహ వ్యాధిః కథం వర్ధతే ॥ 7 ॥
తిర్యక్కంఠ విలోల మౌళితరళోత్తంసస్య వంశోచ్చర
ద్దీప్తిస్థాన కృతావధాన లలనా లక్షైర్న సంలక్షితాః ।
సమ్ముగ్ధే మధుసూదనస్య మధురే రాధా ముఖేందౌ సుధా
సారే కందళితాశ్చిరం దదతు వః క్షేమం కటాక్షోర్మయః ॥ 8 ॥
ఇతి శ్రీ జయదేవకృతౌ గీతగోవిందే
ముగ్ధమధుసూదనో నామ తృతీయస్సర్గః॥
శ్రీకృష్ణుడు కూడా రాధను మనస్సులో తలుస్తూ ఇతర గోపికలనందరినీ వదలిపెట్టాడు. రాధావియోగాన్ని సహించలేక మన్మథబాధతో, మనస్సులో ఎంతో దుఃఖించి, రాధను కోపగించుకున్నందుకు పశ్చాత్తాపం పొందుతూ, ఆమె కోసం బృందావనంలో ఎంతో వెదకి అలసిపోయి, ఆమెను కనుక్కోలేక యమునా నదీ తీరంలో ఒక పొదరింటిలో కూర్చుని ఉన్నాడు.
తనలో తాను ఇలా అనుకున్నాడు. “గోపికా సమూహం నన్ను చుట్టుముట్టి ఉండటం చూచి రాధ బాధపడి, కోపంతో వెళ్లిపోయింది. నా రాధ లేకుంటే, ఇంక నాకీ జీవితంతో ఏం పని? “రాధా! నేను చేసిన అపచారంవల్ల నువ్వు అసూయతో దుఃఖితురాలివై నన్ను విడిచి వెళ్ళిపోయావు. నన్ను క్షమించు. ఇలాంటి తప్పు మళ్ళీ చేయను. మన్మథ బాధ తాళలేకున్నాను. నాకు దర్శనమివ్వు. నిరంతర ఆరాధనతో నా మనస్సు నీపైనే ఉన్నప్పటికీ నా విరహ వేదన పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. ఓ మన్మధా! ప్రియురాలిని కోల్పోయిన నన్ను శివుడనుకొని భ్రమతో బాణాలను నాపైకి విసరకు. నన్నెందుకు తాపంతో బాధిస్తున్నావు? నా ప్రియురాలి కోసం గాయపడిన నా మనస్సును బాధించడం నీకు పౌరుషమేనా” అని విరహ వేదనతో రాధానురక్తుడై, చంచలచిత్తుడై, ఆమెనే ధ్యానిస్తూ కూర్చొని ఉన్నాడు.
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.









