జయదేవ అష్టపది ప్రబంధః – 6 | గీత గోవిందం తెలుగులో అర్థం
జయదేవ అష్టపది భారతీయ భక్తి సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దివ్య కవితా సంపద. దీనిని 12వ శతాబ్దానికి చెందిన మహాకవి జయదేవుడు సంస్కృతంలో రచించారు. ఈ అష్టపదులు ఆయన అమర గ్రంథమైన గీత గోవిందంలో భాగంగా ఉన్నాయి.
“అష్టపది” అంటే ఎనిమిది పాదాలతో కూడిన గీతం. మొత్తం 24 అష్టపదులు గీత గోవిందంలో ఉన్నాయి. ప్రతి అష్టపది శ్రీకృష్ణుడు మరియు శ్రీరాధాదేవి మధ్యనున్న దివ్య ప్రేమ, విరహం, కలయిక, భక్తి, శరణాగతి వంటి ఆధ్యాత్మిక భావాలను అద్భుతమైన కవిత్వంతో చిత్రిస్తుంది.
జయదేవుని కవిత్వంలో శృంగారరసం కేవలం భౌతిక ప్రేమను సూచించదు. అది జీవాత్మ పరమాత్మను చేరుకోవాలనే ఆత్మీయ తపనకు ప్రతీక. రాధా జీవాత్మకు, శ్రీకృష్ణుడు పరమాత్మకు ప్రతిరూపంగా భావించబడతారు. అందువల్ల గీత గోవిందం భక్తి, సంగీతం, నృత్యం మరియు సాహిత్య రంగాల్లో అపూర్వమైన స్థానం సంపాదించింది.
ఈ అష్టపదులను భారతదేశంలోని అనేక దేవాలయాల్లో, ముఖ్యంగా శ్రీకృష్ణ ఆలయాలలో, భక్తితో ఆలపిస్తారు. ఒడిస్సీ, భరతనాట్యం, కూచిపూడి, కథక్ వంటి భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాలలో కూడా వీటికి విశిష్టమైన ప్రాధాన్యం ఉంది.
ఈ శ్రేణిలో ప్రతి అష్టపదిని సంస్కృత శ్లోకంతో పాటు పదచ్ఛేదం, పదార్థం, తాత్పర్యం మరియు సులభమైన తెలుగు వివరణతో తెలుసుకుందాం. జయదేవ మహాకవి ఆవిష్కరించిన రాధాకృష్ణుల దివ్య ప్రేమ రహస్యాన్ని, భక్తి తత్వాన్ని మరియు గీత గోవిందం యొక్క ఆధ్యాత్మిక సౌందర్యాన్ని కలిసి ఆస్వాదిద్దాం.
॥ ప్రబంధః – 6 ॥
(అక్లేశకేశవ మంజరీతిలకమ్)
(గుణక్రియ – ఏక)

మాళవగౌడ రాగేన ఏకతాళీ తాళేన చ గీయతే ।
నిభృత నికుంజ గృహం గతయా నిశి రహసి నిలీయ వసంతం ।
చకిత విలోకిత సకల దిశా రతి రభస భరేణ హసంతమ్ ॥
సఖి! హే కేశిమథన ముదారం
రమయ మయా సహ మదన మనోరథ భావితయా స వికారమ్ ॥ (ధ్రువమ్) ॥
ప్రథమ సమాగమ లజ్జితయా పటు చాటు శతైరనుకూలం ।
మృదు మధుర స్మిత భాషితయా శిథిలీకృత జఘన దుకూలమ్ ॥
కిసలయ శయన నివేశితయా చిరమురసి మమైవ శయానం ।
కృత పరిరంభణ చుంబనయా పరిరభ్య కృతాధర పానమ్ ॥
అలస నిమీలిత లోచనయా పులకావలి లలిత కపోలం ।
శ్రమ జల సకల కళేబరయా వర మదన మదాదతిలోలమ్ ॥
కోకిల కలరవ కూజితయా జిత మనసిజ తంత్ర విచారం ।
శ్లథ కుసుమాకుల కుంతలయా నఖ లిఖిత ఘన స్తన భారమ్ ॥
చరణ రణిత మణి నూపురయా పరిపూరిత సురత వితానం ।
ముఖర విశృంఖల మేఖలయా సకచ గ్రహ చుంబన దానమ్ ॥
రతి సుఖ సమయ రసాలసయాదర ముకుళిత నయన సరోజం ।
నిస్సహ నిపతిత తనులతయా మధుసూదన ముదిత మనోజమ్ ॥
శ్రీ జయదేవ భణిత మిదమతిశయ మధు రిపు నిధువన శీలం ।
సుఖముత్కంఠిత గోప వధూ కథితం వితనోతు సలీలం ॥
హస్త స్రస్త విలాస వంశమనృజు భ్రూవల్లి మద్వల్లవీ
వృందోత్సారి దృగంత వీక్షిత మతిస్వేదార్ద్ర గండస్థలమ్ ।
మాముద్వీక్ష్య విలజ్జితం స్మిత సుధా ముగ్ధాననం కాననే
గోవిందం వ్రజ సుందరీ గణ వృతం పశ్యామి హృష్యామి చ ॥ 3॥
దురాలోక స్తోక స్తబక నవకాశోక లతికా
వికాసః కాసారోపవన పవనోఽపి వ్యథయతి ।
అపి భ్రామ్యద్భృంగీ రణిత రమణీయా న ముకుళ
ప్రసూతిశ్చూతానాం సఖి! శిఖరిణీయం సుఖయతి ॥ 4 ॥
సాకూత స్మితమాకులాకుల గళద్ధమ్మిల్లముల్లాసిత
భ్రూవల్లీ కమలీక దర్శిత భుజా మూలోర్ధ్వ హస్త స్తనం ।
గోపీనాం నిభృతం నిరీక్ష్య గమితాకాంక్షశ్చిరం చింతయ
న్నంతర్ముగ్ధ మనోహరం హరతు వః క్లేశం నవః కేశవః ॥ 5 ॥
ఇతి శ్రీ జయదేవకృతౌ గీతగోవిందే
అక్లేశకేశవోనామ ద్వితీయస్సర్గః॥
భావము:
రాధ మన్మథునిచే పీడింపబడి తన చెలికత్తెతో తనకోరికలను వెల్లడిస్తోంది. “చెలీ! నా మనస్సు వింత వింత భావాలతో ముప్పిరిగొంటున్నది. కృష్ణుడు నన్ను విడిచి ఎంతో ఇష్టంతో ఇతర గోపికలతో క్రీడిస్తున్నాడు. అయినప్పటికి నాకు కోపం రావడం లేదు. నా మనస్సు అతణ్ణే మరల మరల కోరుకొంటూ ఉంది. పైన సంతోషం, లోన దుఃఖం కలుగుతోంది. ఏం చేయాలి?
ఒక సాయం సమయంలో పొదరింట్లో మా మొదటి కలయికలో సిగ్గుపడుతున్న నన్ను ఏవేవో మధురమైన మాటలు చెప్పి అలరించారు. తియ్యతియ్యని చిరునవ్వుతో నన్ను మాటల్లో దింపి, కొంటె పనులేన్నో చేసి నన్ను పరవశింపజేసేవాడు.
కృష్ణుని రాసక్రీడల్లో నా శరీరం తడిసి ముద్దయింది. కోకిలలు కిలకిలారావాలు చేస్తుండగా, శ్రీకృష్ణుడు మన్మథ క్రీడతో నన్ను మైమరపించేవాడు. అటువంటి ఆ మధుసూదనునితో నన్ను రమింప చేయవే, సఖీ! బృందావనంలో కృష్ణుడు గోపికాస్రీలతో యథేచ్ఛగా క్రీడిస్తూ ఉండగా, నేను తటాలున ఆ ప్రదేశానికి పోవడం జరిగింది. హఠాత్తుగా నన్ను చూచిన వెంటనే, కృష్ణుని చేతిలోని పిల్లనగ్రోవి జారి క్రిందపడింది. తన చుట్టూ చుట్టుకొని ఉండే గొల్లభామల్ని దూరంగా పొమ్మని కనుసైగ చేశాడు. సిగ్గుపడిన ముగ్ధగోవిందుని చూచి సంతోషించాలా? కోపగించాలా? తెలియడంలేదు. సుందర పుష్పాలతో శోభిల్లే ఉద్యానవనంలో నుండి వచ్చే చల్లని గాలి సైతం నన్ను బాధిస్తోంది. తుమ్మెదల సుస్వరాలతో రమణీయ శిఖరాలు గల మామిడి చెట్ల మొగ్గలు సైతం నాకు సుఖాన్నివ్వడం లేదు.
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
జయదేవుని అష్టపదులు
ప్రథమః సర్గః – సామోద దామోదరః
జయదేవ అష్టపది ప్రబంధః – 1 | దశావతారకీర్తి ధవళమ్
జయదేవ అష్టపది ప్రబంధః – 2 | హరివిజయ మంగళాచారమ్
జయదేవ అష్టపది ప్రబంధః – 3 | మాధవోత్సవ కమలాకరమ్
జయదేవ అష్టపది ప్రబంధః – 4 | సామోద దామోదర భ్రమర పదమ్
ద్వితీయః సర్గః – అక్లేశ కేశవః
జయదేవ అష్టపది ప్రబంధః – 5 | మధురిపు రత్నకంఠిక
జయదేవ అష్టపది ప్రబంధః – 6 | అక్లేశకేశవ మంజరీతిలకమ్
తృతీయః సర్గః – ముగ్ధ మధుసూదనః
జయదేవ అష్టపది ప్రబంధః – 7 |ముగ్ధమధుసూదన హంసక్రీడనమ్

చతుర్థః సర్గః – స్నిగ్ధ మధుసూదనః
జయదేవ అష్టపది ప్రబంధః – 8 | హరివల్లభాశోక పల్లవః
జయదేవ అష్టపది ప్రబంధః – 9 | స్నిగ్ధ మధుసూదన రాసావలయః
పంచమః సర్గః – సాకాంక్ష పుండరీకాక్షః
జయదేవ అష్టపది ప్రబంధః – 10 | హరిసముదయ గరుడపదః
జయదేవ అష్టపది ప్రబంధః – 11 | సాకాంక్ష పుండరీకాక్షోత్కంఠా మధురః
షష్ఠః సర్గః – సోత్కంఠ వైకుంఠః
జయదేవ అష్టపది ప్రబంధః – 12 | ధన్య వైకుంఠ కుంకుమమ్

సప్తమః సర్గః – నాగర నారాయణః
జయదేవ అష్టపది ప్రబంధః – 13 | నాగర నారాయణ రాసావలయః
జయదేవ అష్టపది ప్రబంధః – 14 | హరి రమిత చంపకశేఖరః
జయదేవ అష్టపది ప్రబంధః – 15 | హరిరస మన్మథతిలకః
జయదేవ అష్టపది ప్రబంధః – 16 | నారాయణ మదనాయాసః
అష్టమః సర్గః – విలక్ష్య లక్ష్మీపతిః
జయదేవ అష్టపది ప్రబంధః – 17 | లక్ష్మీపతి రత్నావళీ
నవమః సర్గః – ముగ్ధ ముకుందః
జయదేవ అష్టపది ప్రబంధః – 18 | అమందముకుందః

దశమః సర్గః – చతుర చతుర్భుజః
జయదేవ అష్టపది ప్రబంధః – 19 | చతురచతుర్భుజ రాగరాజి చంద్రోద్యోతః
ఏకాదశః సర్గః – సానంద దామోదరః
జయదేవ అష్టపది ప్రబంధః – 20 | శ్రీహరితాళరాజి జలధరవిలసితః
జయదేవ అష్టపది ప్రబంధః – 21 | సానందదామోదర ప్రేమద్రుమపల్లవః
జయదేవ అష్టపది ప్రబంధః – 22 | సానందగోవింద రాగశ్రేణి కుసుమాభరణః

ద్వాదశః సర్గః – సుప్రీత పీతాంబరః
జయదేవ అష్టపది ప్రబంధః – 23 | మధురిపు విద్యాధరలీలః
జయదేవ అష్టపది ప్రబంధః – 24| సుప్రీతపీతాంబర తాళశ్రేణీ
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.









