జయదేవ అష్టపది ప్రబంధః – 14 | గీత గోవిందం తెలుగులో అర్థం
జయదేవ అష్టపది భారతీయ భక్తి సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దివ్య కవితా సంపద. దీనిని 12వ శతాబ్దానికి చెందిన మహాకవి జయదేవుడు సంస్కృతంలో రచించారు. ఈ అష్టపదులు ఆయన అమర గ్రంథమైన గీత గోవిందంలో భాగంగా ఉన్నాయి.
“అష్టపది” అంటే ఎనిమిది పాదాలతో కూడిన గీతం. మొత్తం 24 అష్టపదులు గీత గోవిందంలో ఉన్నాయి. ప్రతి అష్టపది శ్రీకృష్ణుడు మరియు శ్రీరాధాదేవి మధ్యనున్న దివ్య ప్రేమ, విరహం, కలయిక, భక్తి, శరణాగతి వంటి ఆధ్యాత్మిక భావాలను అద్భుతమైన కవిత్వంతో చిత్రిస్తుంది.
జయదేవుని కవిత్వంలో శృంగారరసం కేవలం భౌతిక ప్రేమను సూచించదు. అది జీవాత్మ పరమాత్మను చేరుకోవాలనే ఆత్మీయ తపనకు ప్రతీక. రాధా జీవాత్మకు, శ్రీకృష్ణుడు పరమాత్మకు ప్రతిరూపంగా భావించబడతారు. అందువల్ల గీత గోవిందం భక్తి, సంగీతం, నృత్యం మరియు సాహిత్య రంగాల్లో అపూర్వమైన స్థానం సంపాదించింది.
ఈ అష్టపదులను భారతదేశంలోని అనేక దేవాలయాల్లో, ముఖ్యంగా శ్రీకృష్ణ ఆలయాలలో, భక్తితో ఆలపిస్తారు. ఒడిస్సీ, భరతనాట్యం, కూచిపూడి, కథక్ వంటి భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాలలో కూడా వీటికి విశిష్టమైన ప్రాధాన్యం ఉంది.
ఈ శ్రేణిలో ప్రతి అష్టపదిని సంస్కృత శ్లోకంతో పాటు పదచ్ఛేదం, పదార్థం, తాత్పర్యం మరియు సులభమైన తెలుగు వివరణతో తెలుసుకుందాం. జయదేవ మహాకవి ఆవిష్కరించిన రాధాకృష్ణుల దివ్య ప్రేమ రహస్యాన్ని, భక్తి తత్వాన్ని మరియు గీత గోవిందం యొక్క ఆధ్యాత్మిక సౌందర్యాన్ని కలిసి ఆస్వాదిద్దాం.
॥ ప్రబంధః – 14 ॥
(హరి రమిత చంపకశేఖరః)
(సారంగ – త్రిపుట) (వసంత – యతి)

వసంత రాగ యతి తాళాభ్యాం గీయతే ।
స్మర సమరోచిత విరచిత వేశా ।
గళిత కుసుమ దర విలుళిత కేశా ॥
కాఽపి మధురిపుణా
విలసతి యువతిరధిక గుణా ॥ (ధ్రువమ్) ॥
హరి పరిరంభణ వలిత వికారా ।
కుచ కలశోపరి తరళిత హారా ॥
విచలదలక లలితానన చంద్రా ।
తదధర పాన రభస కృత తంద్రా ॥
చంచల కుండల దలిత కపోలా ।
ముఖరిత రశన జఘన గతి లోలా ॥
దయిత విలోకిత లజ్జిత హసితా ।
బహువిధ కూజిత రతి రస రసితా ॥
విపుల పులక పృథు వేపథు భంగా ।
శ్వసిత నిమీలిత వికసదనంగా ॥
శ్రమ జల కణ భర సుభగ శరీరా ।
పరిపతితోరసి రతి రణధీరా ॥
శ్రీ జయదేవ భణిత హరి రమితం ।
కలి కలుషం జనయతు పరిశమితమ్ ॥
విరహ పాండు మురారి ముఖాంబుజ
ద్యుతిరయం తిరయన్నపి వేదనాం ।
విధురతీవ తనోతి మనో భువః
సుహృదయే హృదయే మదన వ్యథామ్ ॥ 5 ॥
భావము:
శ్రీకృష్ణుడు లేకుండా సఖి మాత్రమే ఒంటరిగా వస్తుండటం చూచిన రాధ, జనార్దనుడు వేరొక స్త్రీతో క్రీడిస్తున్నాడని భావించింది. నాకన్నా సుగుణశీలియైన మరొక స్త్రీ మంచి వస్త్రాలను ధరించి, జడలో పూలతో శ్రీకృష్ణునితో మన్మథ క్రీడలో ఆనందిస్తున్నది. చంద్రుని లాంటి ఆమె ముఖంపై ముంగురులు నాట్యం చేస్తుండగా, శ్రీకృష్ణుని అధరామృతం గ్రోలి పారవశ్యంలో పులకరించిపోతున్నది. కృష్ణుని చూచి సిగ్గుపడుతోంది. రతి క్రీడలో ఆనందిస్తూ చిరునవ్వులు చిందిస్తోంది. స్వేదంతో తడిసి, పులకరింతలతో ఆమె శరీరం వణుకుతోంది. అలసిపోయిన ఆమె శ్రీకృష్ణుని వక్షస్థలంపై శయనించింది. ఓ చెలీ! ఈ చంద్రుడు నా ప్రియుని ముఖం వంటి వాడు కావడంవలన తన సౌందర్యంతో నాకు కొంత ఉపశమనం కలిగిస్తున్నాడు, కానీ నాకు విరోధి అయిన మన్మథునికి చెలికాడు కావటంచేత నాపై కక్షకట్టి నన్ను బాధిస్తున్నాడు.
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.









